ప్రత్యేకహోదా

09:17 - September 18, 2018

కర్నూలు : గతంలో ప్రత్యేక తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు అయ్యాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకహోదా కోసం ఆత్మబలిదానాలు చేసుకుంటున్నారు. జిల్లాలో విషాదం నెలకొంది. ఏపీకి ప్రత్యేకహోదా కోసం ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్నూలు జిల్లా జలదుర్గంలో 10 వతరగతి చదువుతున్నమహేందర్ అనే విద్యార్థి తన అన్నకు ఉద్యోగం రాకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు చేసుకున్నాడు. ప్రత్యేక హోదా వస్తే తన అన్నకు ఉద్యోగం వచ్చేందని సూసైడ్ లో పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. 

 

16:52 - August 3, 2018

ఢిల్లీ : వైసీపీ అధినేత జగన్‌మోహన్‌ రెడ్డితోనే ఏపీకి ప్రత్యేకహోదా సాధ్యమవుతుందని వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్‌ అన్నారు. తాము ఎంపీలుగా రాజీనామా చేసినప్పటికీ ప్రజలతో కలిసి రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతున్నామన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రులను, అధికారులను కలిశామన్నారు.

 

15:36 - August 3, 2018

ఢిల్లీ : హస్తినలో టీడీపీ ఎంపీలు ఆందోళన కొనసాగుతోంది. పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం దగ్గర ఎంపీలు ధర్నా చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచి పార్లమెంట్ లోపల, వెలుపల టీడీపీ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. 

08:37 - July 24, 2018

ఏపీకి ప్రత్యేకహోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా వైసీపీ రాష్ట్ర బంద్ కు పిలుపు ఇచ్చింది. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీడీపీ నేత గురుమూర్తి, కాంగ్రెస్ నేత రామ్మోహన్, వైసీపీ నేత రౌతు సూర్యప్రకాశ్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

12:13 - July 23, 2018

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేకహోదా కల్పించే పార్టీకే తమ మద్దతు ఉంటుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన ఢిల్లీలో టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. టీడీపీ ఇప్పటికైనా ప్రత్యేకహోదా కోసం పోరాడాలని సూచించారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఎక్కడికిపోయిందని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేకహోదా రావాలంటే హైకోర్టులో వ్యాజ్యం వేయాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలు ఏపీకి అన్యాయం చేశాయని విమర్శించారు. ఏపీకి జరిగిన అన్యాయంపై రాజ్యసభలో ప్రస్తావిస్తామని చెప్పారు.

08:27 - July 22, 2018

ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో టీడీపీ నేత నాగుల్ మీరా, కాంగ్రెస్ నేత మీసాల రాజేశ్వరరావు, బీజేపీ నేత షేక్ బాజీ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:03 - July 21, 2018

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే శక్తి కాంగ్రెస్ కు మాత్రమే ఉందని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. చిత్తశుద్ధితో పని చేయాలనుకుంటే పార్టీలు కాంగ్రెస్ తో కలిసిరావాలని కోరారు. బీజేపీ, టీడీపీ, వైసీపీలు మోసాకారి పార్టీలని విమర్శించారు.

 

15:46 - July 21, 2018

ఢిల్లీ : ఏపీకి జరిగిన అన్యాయం తెలియజేసేందుకకే అవిశ్వాసం పెట్టామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈమేరకు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మెజారిటీ వర్సెస్ మొరాలిటీకి మధ్య పోరాటం జరిగిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని మోదీ చాలా సార్లు చెప్పారని గుర్తు చేశారు. ఢిల్లీ చిన్నబోయేలా ఏపీ రాజధానిని నిర్మస్తామన్నారని తెలిపారు. 15 ఏళ్ల తర్వాత తాము అవిశ్వాసం పెట్టామని పేర్కొన్నారు. అవిశ్వాసానికి మద్దతు తెలిపిన పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే ఆనాడు బీజేపీతో కలిశామన్నారు. విభజన హామీలు నెరవేర్చాలని 29 సార్లు ఢిల్లీకి వచ్చామని పేర్కొన్నారు. హోదా విషయంలో 14వ ఆర్థిక సంఘం పేరు చెప్పి తప్పుదోవపట్టిస్తున్నారని పేర్కొన్నారు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే బాధ్యత లేదా? నిలదీశారు. ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తున్న రాయితీలు తమకు ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నించారు. 'నాపై మోదీ చేసిన వ్యాఖ్యలు నన్ను బాధించాయి' అని అన్నారు. 

 

21:45 - June 10, 2018

విజయవాడ : ఏపీలో రాజకీయం హీటెక్కింది.. టీడీపీ ప్రభుత్వంపై విపక్షనేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ, వామపక్షాలతోపాటు బీజేపీ నేతలు కూడా విమర్శల దాడి పెంచారు. ఏపీకి అన్నీ ఇచ్చామని.. అయినా  కేంద్రంపై సీఎం చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ  విమర్శించారు. ప్రత్యేక హోదాపై గడియకో మాటమార్చిన చంద్రబాబు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని వైసీపీ ఆరోపించింది. ఇక  బీజేపీ, టీడీపీలు రాష్ట్రానికి జాయింట్‌గా ద్రోహం చేశాయని వామపక్షాలు మండిపడ్డాయి. ప్రత్యేక హోదా సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున యువతను కదిలిస్తామని వామపక్షాలు, ప్రత్యేక హోదా సాధన సమితి స్పష్టం చేశాయి. 

మిమర్శలు, ప్రతి విమర్శలతో ఏపీ పాలిటిక్స్‌ హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. టీడీపీపై బీజేపీ, వైసీపీ నేతలు విమర్శలు ఎక్కుపెట్టగా... బీజేపీ-టీడీపీలు జాయింట్‌గా రాష్ట్రానికి ద్రోహం చేశాయని  వామపక్షాలు  ఆరోపిస్తున్నాయి. సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాజధాని నిర్మాణం పేరుతో టీడీపీ అధినేత లక్షకోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పాలనను గాలికొదిలేసి.. చంద్రబాబు ప్రజాధనాన్ని దోపిడీ చేయడమే లక్ష్యంగా పెట్టున్నారని బొత్స విమర్శించారు. ఎయిర్‌ ఏషియాస్కామ్‌లో కేంద్ర మాజీ మంత్రి అశోక గజపతిరాజుపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని కేంద్రాన్ని కోరే దమ్ము చంద్రబాబుకు ఉందా అని బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. 

మరోవైపు ఈనెల 12 వైఎస్‌ జగన్‌ పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో టీడీపీ నేతలు కుట్రలకు పాల్పడుతున్నారని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి బ్రిడ్జిపై జగన్‌ పాదయాత్రకు షరతులు పెట్టడం ఏంటని వైవీ ప్రశ్నించారు. పాదయాత్రలో తొక్కిసలాట జరుగుతుందని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టిన చంద్రబాబు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. 

తప్పుడు లెక్కలతో తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని  బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. నాలుగేళ్ల కాలంలో కేంద్రంలోని మోడీ సర్కార్ ఏపీకి ఎంతో సహాయం చేసిందన్నారు.  తెలుగుదేశం ప్రభుత్వం అసత్య ప్రచారాలతో బీజేపీని దోషిగా నిలిపిందని కన్నా విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో  చంద్రబాబు మాటమార్చాని బీజేపీ నేత పురందేశ్వరి విమర్శించారు. 

విభజన హామీలను 85శాతం నెరవేర్చామంటున్న బీజేపీ నేతల ప్రకటనలను ప్రత్యేకహోదా సాధన సమితి, వామపక్షాలు ఖండించాయి. విజయవాడలో సమావేశమైన నేతలు బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రం విభజన హామీలు ఏ మేరకు నెరవేర్చిందో ఆ పార్టీ నాయకులు చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామ‌కృష్ణ సవాల్‌  చేశారు. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజి ఇస్తామని చెప్పి... 350 కోట్లు ఇచ్చి, మళ్లీ కేంద్రం వెనక్కి తీసుకుందని రామకృష్ణ  మండిపడ్డారు. నయవంచన మాటలతో బీజేపీ ప్రజలను మోసగిస్తోందని సీపీఎం నేత, వై. వెంకటేశ్వరరావు విమర్శించారు. 
    
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం విద్యార్థుల్లో చైతన్యం కలిగించేందుకు కార్యాచరణ రూపొందిస్తామని, ఉద్యమంలో కలిసి రాని వారిని రాష్ట్ర  ద్రోహులుగా ప్రకటిస్తామని ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌ హెచ్చరించారు. మొత్తానికి పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలతో ఏపీలో పాలిటిక్స్ ఆసక్తికరంగా సాగుతున్నాయి. హోదా సాధన కోసం వచ్చేనెల 15 నుంచి కార్యాచరణలోకి దిగుతామని వామపక్షాలు, ప్రత్యేక హోదా సాధన సమితి స్పష్టం చేసింది. 

18:03 - June 10, 2018

విజయవాడ : ప్రత్యేక హోదా ఉద్యమం పడిపోలేదని, ప్రజల గుండెల్లో సజీవంగా ఉందని హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్‌ అన్నారు. ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలు పోరాడుతున్నాయని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం పోరాడని పార్టీ ఆంధ్రా ద్రోహుల పార్టీ అని చలసాని శ్రీనివాస్‌ అన్నారు.  ప్రజలు తమకు జరిగిన అన్యాయన్ని మరిచిపోలేక పోతున్నారని అన్నారు. జూలై నుంచి రాష్ట్రవాప్తంగా పోరాటానికి ప్రణాళికలు సిద్దం చేశామంటున్న చలసాని శ్రీనివాస్‌తో టెన్ టివి ఫేస్ టూ ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

Pages

Don't Miss

Subscribe to RSS - ప్రత్యేకహోదా