పోషకాలు

20:03 - September 4, 2018

ఆకుకూరల్ని రైతులు పడిస్తుంటారు. లేదా పెరట్లో పెంచుకుని వాటుకుంటుంటాం. మనం రోజు తినే..చూసే అకుకూరలు మనం పెంచకపోయినా..ఏమాత్రం శ్రద్ధ పెట్టకపోయినా అన్ని మొక్కల్లో కలిసిపోయి పెరుగుతుంటాయి. వాటి సంగతి మనకు తెలియదు. అసలు అవి ఆకుకూరలని కూడా మనకు తెలియదు. కొన్ని రకాల ఆకుకూరలు కలుపు మొక్కల్లో మొక్కలుగా పెరుగుతాయనే సంగతి మీకు తెలుసా? ఇలా పెరిగే ప్రతి మొక్కలోనూ ఔషధ, పోషక గుణాలు పుష్కలంగా వున్నాయని పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఈ ఆకు కూరల పంటల పట్ల గ్రామీణ ప్రజల్లో అవగాహన ఉన్నప్పటికీ పట్టణ ప్రజలకు వీటి పేర్లు కూడా చాలావరకూ తెలియవంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఖరీప్‌, రబీ సీజన్లలో పొలాల్లోను, పొలంగట్లు వెంబడి, ఆఖరికి మొక్క మొలవని బీడు భూముల్లోను, గుట్టల్లోను ఇలా వివిధ రకాల ఆకుకూరలు దొరుకుతాయి. వాటిలో ముఖ్యంగా దొగ్గలి, జొన్నచెంచలి, తెల్లగలిజేరు, సన్నపాయిలి, బర్రెపాయిలి, తలావావిలి, ఎలుకచెవికూర, ఎర్రదొగ్గలికూర, గునుగుకూర, తుమ్మికూరలను పాతతరం వారు ఆకుకూరల్లా వండుకు తినేవారు. వీటిల్లో ఆద్భుతమైన పోషకాలు వుండేవని పెద్దగా అవగాహన లేని పెద్దలు చెబుతుండేవారు. ఇప్పుడంటే న్యూట్రిషియనిస్ట్ లు చెబుతున్నారు గానీ పాతకాలంలో ఆనుభవమున్న పెద్దలే పెద్ద న్యూట్రిషియనిస్టులు అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు..మరి మీరేమంటారు? అవును కదా? పెద్దల మాట సద్ధన్నం మూట.

13:18 - September 4, 2017

సన్నని చినుకులు పడుతుంటే ఏదైనా వేడి వేడిగా తినాలనిపిస్తుంది. ఎప్పుడూ మిరపకాయ బజ్జీలు..పకోడీ..సమోసాలేనా..? అనుకుంటుంటారు. మొక్కజొన్న పొత్తు తింటే ఆ రుచే వేరు. రుచితో పాటు ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు శరీరానికి అందిస్తుంది. ఎర్రని నిప్పుల మీద పొత్తు కాలుస్తుంటే వచ్చే ఆ కమ్మటి వాసనకు చాలా మంది ఫిదా అయిపోతుంటారు.

మొక్కజొన్న సూప్ తాగినా సలాడ్ గా తిన్నా..ఏ రూపంలో తీసుకున్నా దాని రుచే వేరు. తాజాగా ఉడికించి తింటే ఏ రకం మొక్కజొన్న అయినా మంచిదే. ఇందులో శక్తివంతమైన ఎ, బి, సి, ఇ విటమిన్లు కొన్ని ఖనిజాలు కూడా లభ్యమౌతాయి. ఓ కప్పు కార్న్ లు తింటే అవసరమైన పీచు అందుతుంది. గర్భిణీలకు అవసరమైన ఫోలేట్ శాతం కూడా మొక్కజొన్నల్లో ఎక్కువగా లభిస్తుంది. ఫాస్పరస్ మూత్ర పిండాల పనితీరుకి తోడ్పడితే మెగ్నీషియం ఎముక బలాన్ని పెంచుతుంది. మొక్కజొన్న తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు మలబద్దకాన్ని నివారిస్తాయి. నీళ్ల విరేచనాలు, ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ (ఐబీఎస్‌) వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి. ఆల్జీమర్స్, మధుమేహం, బీపీ, హృద్రోగాలను నివారిస్తాయి. కార్న్ లోని ఐరన్ రక్త హీనతనీ తగ్గిస్తుంది. మెగ్నీషియమ్‌ మంచి గుండె ఆరోగ్యంతో, ఎముకలకు బలాన్నిస్తుంది.

16:15 - September 3, 2017

తాజా పండ్లు..కూరగాయలతో ఏం చేస్తారు ? పండ్లు జ్యూస్ గా లేదా అలాగే తినవచ్చు.. కూరగాయలతో వంటలు చేస్తాం అంటారు. కదా..కానీ వీటితో చర్మ సౌందర్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. కొన్ని కూరగాయలు..పండ్లతో ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం.

యాపిల్ పండులో ఏ, సీ విటమిన్లు, రాగి వంటి పోషకాలుంటాయి. ఒక చెంచా యాపిల్ తురుములో రెండు చెంచాల కొబ్బరి నీల్లు, మూడు చుక్కల నిమ్మ నూనె వేసుకోవాలి. ముద్దలా తయారు చేసుకుని ముఖానికి రాసుకోవాలి. ఇరవై నిమిషాల అనంతరం కడుక్కువాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ముతల ప్రభావాన్ని తగ్గిస్తుంది. మృతకణాలనూ నివారిస్తాయి. పైగా ఇది అన్నిరకాల చర్మతత్వాలవారికీ సరిపోతుంది.

టమాట సహజ సన్ స్ర్కీన్ లా ఉపయోగ పడుతుంది. టమాట రసాన్ని ముఖాకి పూతలా వేసి చేతి వెళ్లతో నెమ్మదిగా మర్దన చేయాలి. పదిహేను నిమిషాల అనంతరం చల్లటి నీటితో కడుక్కోవాలి. క్రమం తప్పకుండా చేసి ఫలితం తెలుసుకోండి. 

14:09 - June 23, 2017

శరీరానికి తగిన పోషకాలు అందుతున్నాయా ? లేదా ? తెలుసుకోవడం ఎలానో చదవండి..
పోషకాలు..ఇవి సమతుల్యంగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. కొన్ని ప్రత్యేకమైన పోషకాలు మాత్రం తప్పనిసరిగా అవసరం ఉంటుంది. గోర్లు ఆరోగ్యంగా కనపడట్లేదా? లేదా గోళ్లపై తెల్లటి మచ్చలు, చీలికలు వంటివి ఉంటే ఐరన్ అందలేదని అర్థం చేసుకోవాలి. ఐరన్‌ లోపం వలన చేతి గోళ్లపై చీలికలు.గీతలు ఏర్పడతాయి.
శరీర భాగాలపై మొటిమలు అధికంగా వస్తుంటాయి. ఇలా వస్తే విటమిన్ ‘ఇ’ లోపం ఉందని గ్రహించాలి. చర్మ రంధ్రాలు మూసుకపోయి..బ్యాక్టీరియా పేరుకపోవడం వల్ల మొటిమలు వస్తాయి.
శరీరానికి సరిపోయేంత అయోడిన్‌ను తీసుకోవాలి. అయోడిన్‌ను సరైన మోతాదులో తీసుకుంటే థైరాయిడ్‌ ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.
పొటాషియం అధికంగాగల అరటిపండు, స్పినాచ్‌, బ్రోకలీ, ద్రాక్ష పండ్లను తినాలి. ముఖం లేదా ఈ విటమిన్‌ అధికంగాగల క్యారెట్‌, చిలకడదుంపలని ఎక్కువగా తినాలి.

11:39 - June 21, 2017

గోంగూర...ఆహార పదార్థంగా కాకుండా అందానికి కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యం ఎంతో మేలుగా ఉంటుంది. పోటాషియమ్, క్యాల్షియం, ఫాస్పరస్, సోడియం, ఐరన్ లు సమృద్ధిగా ఉంటాయి.
అంతేగాకుండా ఏ, బి 1, బి 9, సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇక దీనిని తీసుకోవడం వల్ల శరీర బరువును తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. తద్వార రక్తపోటు అదుపులో ఉంటుంది. గోంగూర చర్మ సంబంధమైన సమస్యలను చెక్ పెడుతుంది. గోంగూరని క్రమంగా వాడితే రక్తహీనత, నిద్రలేమి, అధిక రక్తపోటు తగ్గిపోతుంది. గోంగూరను అందానికి కూడా ఉపయోగించుకోవచ్చు. గోంగూర పేస్టును తలకు పట్టించి ఉదయం..స్నానం చేస్తే జుట్టు తగ్గడం..బట్టతల రాకుండా కాపాడుతుంది.

13:49 - June 19, 2017

ఆరోగ్యానికి ఆలివ్ ఆయిల్ మంచిదే కానీ కొన్నిసార్లు చర్మ సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ ఆయిల్ చర్మానికి వాడడం వల్ల పలు దుష్రభావాలు వచ్చే అవకాశం ఉందంట. అలర్జీలున్న వారు ఆలివ్ ఆయిల్ కు దూరంగా ఉండడం మంచిది. అలర్జీ కలిగి ఉండి చర్మానికి రాయడం వల్ల పలు అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఇక అప్పుడే జన్మించిన శిశువుకు ఆలివ్ ఆయిల్ రాయకూడదంట. చిన్న పిల్లలకు ఆలివ్‌ ఆయిల్‌తో మసాజ్‌ చేయకూడదని, దీనివల్ల పలు సమస్యలు ఏర్పడుతాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. జిడ్డు చర్మం ఉన్నవారు ఆలివ్‌ ఆయిల్‌ ను వాడకూడదు. ఒకవేళ ఈ ఆయిల్‌ వాడినట్లయితే, సీబం ఉత్పత్తి అధికమవుతుంది.
పొడి చర్మం కలిగిన వారు ఆలివ్ ఆయిల్ ఉపయోగించకపోవడం మంచిది. మరి ఎలా ఉపయోగించాలి ? అంటే చర్మ వైద్య నిపుణుడిని కలిస్తే చర్మ రకాన్ని తెలుసుకుని తగిన ఉత్పత్తులు..ఏ ఆయిల్ లను ఉపయోగించాలో పలు జాగ్రత్తలు చెప్పే అవకాశం ఉంది.

13:43 - June 19, 2017

మీరు వంట చేస్తున్నారా ? ఒక్క నిమిషం ఆగండి..వంటలో వాడుతున్న పదార్థాలు బాగానే ఉంటున్నాయా ? అవి ఆరోగ్యానికి మేలు చేస్తున్నాయా ? లేక హానీ చేస్తున్నాయా ? అని ఆలోచించారా ? వాటిలోని పోషక విలువలు గుర్తించారా ? ఆ..ఇవన్నీ ఎక్కడ ఆలోచిస్తాం..వంట చేశామా...తిన్నామా అనే ఆలోచనలో ఉంటున్నారు..కానీ ఒక్కసారి వంటలో వాడుతున్న పదార్థాలు..వాటిలోని పోషక విలువలు ఆలోచించాలని పలువురు వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ప్రతి రోజు తినే ఆహారంలో ఆకుకూరలు..తాజా పళ్లు..రసాలు..పెరుగు..గుడ్డు..పాలు వంటివి ఉండేలా చూసుకోండి.
పెరుగును తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెంచుతుంది. ఇందులో మంచి చేసే బ్యాక్టీరియా ఉంటుంది.
వంట చేసే సమయంలో ఉపయోగించే నూనె ఆలివ్ ఆయిల్..ఆవనూనెలను వాడి చూడండి..
టీ..కాఫీలు..ఐస్ క్రీమ్..స్వీట్స్ వంటి అధికంగా తీసుకోకండి. మితిమీరిన తీపి పదార్థాలు తినకండి.
తీపి తినడం వల్ల ఊబకాయం..చక్కెర..కీళ్ల నొప్పులు వంటి అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది.
ఎక్కువ ప్రొటీన్స్‌ గల పదార్థాలు తీసుకుంటే దీర్ఘకాలంలో సైడ్‌ఎఫెక్ట్స్‌కి దారితీయొచ్చు.
వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. గాయాలకు, చర్మ వ్యాధులకు, ఫ్లూ, అల్సర్, రక్తపోటు, పెద్దపేగు క్యాన్సర్, జలుబు, మూత్రపిండాల వ్యాధులకు, బ్లాడర్ సమస్యలకు వెల్లుల్లి చక్కటి ఔషధంగా పనిచేస్తుంది.
గోధుమల్లో పిండి పదార్థాలతో పాటు ప్రోటీన్లు, పీచు, ఐరన్, విటమిన్లు, బీ కాంప్లెక్స్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇందులో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.

14:56 - June 12, 2017

ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ ఖచ్చితంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు..వైద్యులు సూచిస్తున్నారు. కానీ ఏదో ఒకటి అల్పాహారం కాకుండా విటమిన్స్..పోషకాలు అందించే టిఫిన్ తీసుకుంటే బెటర్. అందులో 'గోధుమరవ్వ' ఒకటి. దీనితో ఎన్నో రకాల వంటకాలు చేసుకోవచ్చు. ఇందులోని పోషకాలు పుష్కలమైన ఆరోగ్యాన్ని అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రోటీన్లు..పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే రోజాంతా ఉత్సాహంగా ఉంచుతుంది. చాలా సమయం పాటు ఆకలిని తగ్గిస్తుంది. షుగర్ ఉన్న వారికి ఇది సరైన ఆహారం అని చెప్పవచ్చు. దీన్లోని తక్కువ గ్లైసేమిక్‌ ఇండెక్స్‌, కాంప్లెక్స్‌ కార్బ్స్‌ శరీరం లోకి గ్లూకోస్‌ ను నియంత్రిస్తాయి. దీనితో షుగర్‌ లెవెల్స్‌ సమతూకంలో ఉంటాయి.

10:20 - May 22, 2017

అరటి పండు..పండ్లలో సంవత్సరం పాటు దొరికే పండు. దీనిని తీసుకోవడం వల్ల ఎన్నో పోషకాలు లభిస్తాయి. టిఫిన్ లో ఏదో ఒక ఆహారంతో పాటు అరటిపండును తీసుకొంటే బెటర్ అని పలువురు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చక్కెర స్థాయిలు తక్కువగా ఉండే ఈ అరిటపండు ముక్కలను ఉదయం మార్నింగ్ డైట్ లో తీసుకుంటే చాలా మంచిది. తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. అంతేగాకుండా మంచి యాంటీ ఆక్సిడెంట్. పోటాషియం..విటమిన్ బి ఉంటాయి. కొలెస్ట్రాల్ ఉండదు. కాబట్టి పండును ప్రతిరోజు డైట్ ను తీసుకుంటే బాగుంటుందని పేర్కొంటున్నారు. అరటి పండ్లను ఎప్పటికప్పుడు తాజాగా కట్ చేసుకుని తినాలి. లేదా కట్ చేసుకున్న వెంటనే ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే అరటి ముక్కలను బ్యాగ్ లో పెట్టి ఫ్రిజర్ లో పెడితే పోషకాలు కోల్పోకుండా ఉంటాయి.

15:37 - January 28, 2017

కొబ్బరి తినడం వల్ల దగ్గు..ఇతర సమస్యలు వస్తాయని చాలా మంది ఊహించుకుంటుంటారు. కానీ కొబ్బరి తినడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. కొబ్బరిలో మంచి గుణాలెన్నో ఉన్నాయి. కొబ్బరిలో పోషక పదార్థాల గని ఉందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటుంటారు.
కొబ్బరి నీళ్లు, లేత కొబ్బరి ముక్కలు, కొబ్బరితో చేసిన కుకీస్ ఇలా కొబ్బరితో చేసిన ప్రతీదీ బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
కొబ్బరిలో లభించే కొవ్వులు శక్తిని ఇస్తాయి.

  • కొబ్బరిలో లభించే మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్లు కేలరీలు కరిగించడంలో తోడ్పడతాయి.
  • వంద గ్రాముల కొబ్బరిని ఆహారంగా తీసుకుంటే శరీరానికి 354 కేలరీల శక్తి లభిస్తుంది.
  • 150 కేలరీల శక్తినిచ్చే మేర అంటే 50 గ్రాముల కొబ్బరిని మాత్రమే ఆహారంగా తీసుకోవాలి.
  • పచ్చికొబ్బరిని తింటే బరువు తగ్గడమే కాదు.. అది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
  • పాలు వచ్చే కొబ్బరిని రోజుకు ఒక కాయ చొప్పున తింటే ఎంతో మంచిది.
  • ప్రతి రోజు విడిగా తినడం కుదరని వారు కూరల్లో పొయ్యి మీద నుంచి దించే ముందు చల్లుకొని తినడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
  • శారీరకంగా ఎక్కువ అలసటకు గురయ్యేవారు పచ్చి కొబ్బరిని తినడం వల్ల శరీరానికి వెంటనే శక్తి లభిస్తుంది.
  • కొబ్బరి వల్ల థైరాయిడ్ సమస్యలు కూడా అదుపులో ఉంటాయి.

Pages

Don't Miss

Subscribe to RSS - పోషకాలు