పోలీసులు

19:16 - September 12, 2018

కోచ్చి: మహిళా సంఘాల ఉద్యమాల వత్తిడితో కదిలిన కేరళ పోలీసులు బలత్కార కేసులో నిందితుడైన బిషప్ ఫ్రాంకో ములక్కల్ ను విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. 

నలభై ఏళ్ల క్రిష్టయన్ సన్యాసినిని బిషప్ ఫ్రాంకో రెండేళ్లలో (2014-16 సంవత్సరాల మధ్య) తనను 13 సార్లు మానభంగం చేశారని వ్యాటికన్ సిటీలోని మత పెద్దలకు ఫిర్యాదు చేశారు. దీంతో మహిళా సంఘాలు ఉద్యమాలు చేపట్టి బిషప్ ను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆందోళనలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పోలీసులు ఈ నెల 19న బిషప్ ను ప్రశ్నించేందుకు రావాలని ఆదేశించారు. ప్రజా సంఘాల వత్తిడి తెచ్చినప్పటికీ పోలీసులు కేసును నీరుగార్చే విధంగా వ్యవహరిస్తున్నారని.. తక్షణం బిషప్ అరెస్టుకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.  

13:16 - September 12, 2018

హైదరాబాద్ : టి.టిడిపి నేత రేవంత్ రెడ్డిని అరెస్టు చేస్తారా ? అనే చర్చ జరుగుతోంది.  తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఫీవర్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం కలకలం రేపింది. రాజకీయ కుట్రలో భాగంగా అరెస్టులు చేశారని టీ.పీసీసీ ఆరోపించింది. మరో నేత గండ్ర వెంకటయ్య వీరయ్యకు పోలీసులు ఓ కేసు నిమిత్తం నోటీసులు జారీ చేశారు. తాజాగా టి.టిడిపి నుండి కాంగ్రెస్ లో జంప్ అయిన రేవంత్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 

బుధవారం జూబ్లీహి ల్స్ హౌజింగ్ సొసైటీ కేసులో రేవంత్ కు నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లోగా విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. తప్పుడు డ్యాక్యుమెంట్లతో సొసైటీ సొసైటీలో అక్రమంగా లబ్ది పొందారనే ఆరోపణలతో నోటీసులు జారీ చేశారు. ఆయనతో పాటు 13 మంది సభ్యులకు కూడా నోటీసులు జారీ చేశారు. తాను ఎన్నికల ప్రచారంలో తాను బిజీగా ఉన్నట్లు ప్రస్తుతం రాలేనని రేవంత్ స్పష్టం చేశారు. 

10:14 - September 8, 2018

తూర్పుగోదావరి : జిల్లాలో రేవ్ పార్టీ నిర్వహిస్తున్న ఓ రిసార్ట్స్ పై పోలీసులు దాడి చేశారు. రంపచోడవరం మండలంలోని ఏ1 రిసార్ట్స్ లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో రంపచోడవరం పోలీసులు రిసార్ట్స్ పై దాడి చేశారు. 29 మందిని అరెస్టు చేశారు. వీరిలో 22 మంది పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు.

 

14:24 - September 4, 2018

రంగారెడ్డి : కేశంపేట సాజీదా ఫామ్ హౌస్ లో ఎస్ వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ముజ్రపార్టీ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించారు. ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. 25240 రూపాయల నగదుతోపాటు రెండు కార్లు, ఒక బైక్, 25 సెల్ ఫోన్ లను  స్వాధీనం చేసుకున్నారు. యువతుల్లో ఇద్దరు ముంబాయి, ఇద్దరు హైదరాబాద్ చెందిన వారుగా గుర్తించారు.

 

11:34 - August 31, 2018

హైదరాబాద్‌ : నగర పోలీస్‌ కమిషనరేట్‌లో పోలీసుల మామూళ్ల దందా మితిమీరిపోతోంది. కుల్సుంపురా సీఐ డ్రైవర్‌ కాశిరెడ్డి, హోంగార్డు శ్రీరాములు వసూళ్ల దందాకు పాల్పడుతున్నారు. మేకలమండిలో వాహనాల డ్రైవర్ల నుండి వీరిద్దరూ డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రతిరోజు వీరిద్దరూ ఇదేవిధంగా వ్యవహరిస్తుండడంతో సహనం కోల్పోయిన డ్రైవర్లు.. ఆ దృశ్యాలను వీడియోలో చిత్రీకరించారు.

09:12 - August 30, 2018

 

చిత్తూరు : ఎర్రచందనం దుంగల అక్రమ రవాణాకు ప్రభుత్వం..పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అక్రమ రవాణా ఆగడం లేదు. తమిళనాడు, ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తున్నారు. పలు సందర్భాల్లో పోలీసులపైకి దాడులు చేస్తున్నారు. తాజాగా మరో ఎర్రచందనం దుంగల అక్రమ రవాణాకు చెక్ పెట్టారు. తిరుపతి - చెన్నై రహదారిపై ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారని టాస్క్ ఫోర్స్ పోలీసులకు విశ్వసనీయంగా సమాచారం అందింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు సినీ ఫక్కీలో ఛేజ్ చేశారు. కొద్ది కిలో మీటర్ల మేర వెంబడించిన అనంతరం లారీని పట్టుకున్నారు. అందులో ఉన్న 120 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 2కోట్ల విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమకు విషయం తెలియదని ఇద్దరు వ్యక్తులు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. 

14:22 - August 28, 2018

హైదరాబాద్ : నగరంలో మరోసారి కలకలం రేగింది. విరసం నేత వరవరరావు నివాసంపై పూణె పోలీసులు సోదాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హత్య కుట్ర కేసుకు సంబంధించి పూణె పోలీసులు ఈ తనిఖీలు నిర్వహించారు. సుమారు ఎనిమిది గంటల పాటు విచారణ అనంతరం వరవరరావును అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న ప్రజా సంఘాలు ఆయన నివాసం వద్దకు భారీగా చేరుకున్నాయి. పాలకుల వైఖరిని తీవ్రంగా నిరసించాయి. ఈ దాడిని ఖండిస్తున్నట్లు, మహారాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. మోడీని హత్య చేసేందుకు వరవరరావు ఫండింగ్ చేశారని అంటే నవ్వుతారని సంధ్య విమర్శించారు.

ఇదిలా ఉంటే వరవరరావును ఇంటి నుండి గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించనున్నారు. అనంతరం నాంపల్లి పీఎస్ లేదా పూణె పీఎస్ కు తరలించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే వరవరరావు కూతుళ్ల నివాసాలపై కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆయన అల్లుడు ఇఫ్లూ ప్రోఫెసర్ సత్యనారాయణ నివాసంలో సోదాలు చేశారు. అలాగే జర్నలిస్టు క్రాంతి నివాసంపై కూడా సోదాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. ల్యాప్ టాప్, పుస్తకాలు, సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి మూడు నెలల క్రితం మావోయిస్టుల కుట్ర బయటపడింది. గతంలో అరెస్ట్ చేసిన రోనాల్డ్ విల్సన్ ల్యాప్ టాప్ లో దొరికి లేఖ ఆధారంగా.. ప్రధాని హత్యకు మావోయిస్టులు కుట్ర చేసినట్టు పూణే పోలీసులు దర్యాప్తులో తేల్చారు.  ప్రస్తుతానికి సంబంధించిన ఈ ఘటనలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

16:51 - August 21, 2018

పెద్దపల్లి : కమాన్‌ వద్ద ట్రాఫిక్‌ పోలీసుల ఓవరాక్షన్‌తో ఓ కుటుంబం ఇబ్బందులు పాలైంది. బెల్లంపల్లి నుండి హైదరాబాద్‌ వెళ్తున్న ఓ కుటుంబం... టిఫిన్‌ చేసేందుకు కమాన్‌ వద్ద వాహనాన్ని నిలిపింది. అక్కడకు చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు వాహనంలోని ముందు టైర్‌లో గాలి తీసేశారు. పిల్లలు ఉన్నారు.. వాహనాన్ని తీస్తామన్నా వినకుండా టైర్లలో గాలి తీశారు. అంతేకాకుండా... మాతో వాగ్వాదానికి దిగుతారా అంటూ పురుషులను పీఎస్‌ తీసుకెళ్లారు. ఎంత బ్రతిమిలాడినా పోలీసులు కనికరించకపోవడంతో మహిళలు కంటతడి పెట్టుకున్నారు. 

11:48 - August 16, 2018

విజయవాడ : పాతబస్తీలో పెళ్లికొడుకు అదృశ్యమన ఘటన చోటు చేసుకుంది. ఈనెల 14వ తేదీన బంధువులకు శుభలేఖలు ఇవ్వడానికి వెళ్లాడు. కానీ తిరిగి ఇంటికి చేరుకోలేదు. గొపాలపాలెం గట్టుపాడుకు చెందిన నాగేంద్రకు పాత రాజేశ్వరిపేటకు చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. 16వ తేదీన వివాహాన్ని నిశ్చయించారు. కానీ నాగేంద్ర అదృశ్యం కావడంతో వివాహం రద్దయ్యింది. తమ కుమారుడు ఎక్కడున్నాడో సమాచారం తెలియక కుటుంబసభ్యులు, అమ్మాయి తరపు వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. 

12:16 - August 10, 2018

హైదరాబాద్‌ : కూకట్‌పల్లి మూసాపేట జనతానగర్‌లో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. మాదాపూర్‌ జోన్‌ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అదనపు డీసీపీ గంగిరెడ్డి, కూకట్‌పల్లి ఏసీపీ బుహాంగరావు, 8మంది ఇన్‌స్పెక్టర్లు, 16మంది ఎస్సైలతో 607 ఇళ్ళలో తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 20 ద్విచక్రవాహనాలు, 2 ఆటోలు, 29 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రజలకు మెరుగైన భద్రత కల్పించేందుకే  తనిఖీలు నిర్వహిస్తున్నామని డీసీపీ వెంకటేశ్వరరావు అన్నారు.  

 

Pages

Don't Miss

Subscribe to RSS - పోలీసులు