పేదోడు

20:52 - August 15, 2018

దేశమంత స్వాతంత్ర్య దినం సంబురాలు...డెబ్బై రెండేండ్లైనా పేదోనికి అందని ఫలాలు, అమరవీరుల స్థూపంతోని రాజకీయాలు...ఓపెనింగ్ కు నోచుకోని స్థూపంతోని ఆటలు, బీపి వెంచుకున్న మంత్రి సోమిరెడ్డి సారు...ఇర్వైకోట్ల అవినీతి చర్చ పక్కదారి వట్టిచ్చి, కోర్టు తీర్పును గౌరవించరా స్పీకర్ గారు...కోమటి రెడ్డి సంపత్ ముచ్చట్ల హైకోర్టు, దళిత గూడాల పొంట నీళ్ల గోసలు...మెదక్ జిల్లాల రోడ్డెక్కిన అమ్మలక్కలు, వేములవాడ గుడిలె తిర్గిన హోం సారు...
పూలదండ మేయజూశిన రాజన్న ఎద్దు.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

06:44 - June 18, 2018

హైదరాబాద్ : ఇళ్లు లేని పేదవారి ఇంటి కలను సాకారం చేసేందుకు డబుల్‌ బెడ్రూం ఇళ్ల పంపిణీని చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకోసం గ్రేటర్‌లో చాలా చోట్ల నిర్మాణాలు చేపట్టింది. దీంతో తమకు గూడు వస్తుందని ఆశపడ్డారు పేదవారు. కలెక్టరేట్‌లో దరఖాస్తు కూడా పెట్టుకున్నారు. రోజులు...నెలలు...సంవత్సరాలు గడుస్తున్నాయి. ఫైలు కదలడం లేదు,.. లబ్దిదారుల ఎంపిక జరగడం లేదు. దరఖాస్తు చేసుకున్న పేదలు మాత్రం తమకు ఎప్పుడు ఇళ్లు కేటాయిస్తారా అని ఎదురుచూస్తున్నారు. పేదవారి ఇళ్ల కలను సాకారం చేస్తూ లక్ష డబుల్‌ బెడ్రూం ఇల్లు నిర్మాణం చేపడుతామని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకోసం ప్రభుత్వ ఖాళీ స్థలాలతోపాటు మురికివాడలు, బస్తీలలో ఇళ్ల నిర్మాణం చేపట్టింది. మురికివాడల్లో నిర్మించిన ఇళ్లను అక్కడి పేదవారికే కేటాయించనున్నారు. అయితే ఓపెన్‌ ల్యాండ్స్‌తో పాటు సిటీ అవతల నిర్మిస్తున్న ఇళ్ల కేటాయింపులపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు ప్రభుత్వం. ఈ ఏడాది చివరి నాటికి 40వేల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఎన్నికల నాటికి లక్ష ఇళ్లను నిర్మిస్తామని ప్రకటించిన ప్రభుత్వం లబ్దిదారుల ఎంపికను మాత్రం ఇప్పటికీ చేపట్టలేదు.

ఇక ఎన్నో ఏళ్లుగా సొంత ఇళ్లు లేని సిటీజన్స్‌ లక్షల్లో ఉన్నారు. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో రెండు లక్షల 50వేల మంది ఈ జాబితాలో ఉన్నట్లు గుర్తించింది. అయితే ఇల్లు కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో కార్పొరేషన్‌ పరిధిలో 7 లక్షల మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇళ్ల కేటాయింపు విషయంలో ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు.

అయితే గ్రేటర్‌లో ఇప్పటివరకు అధికారికంగా పూర్తయిన ఇళ్లు 572 మాత్రమే. వందకు పైగా ప్రాంతాల్లో చేపట్టిన ఇళ్ల నిర్మాణంలో కొన్ని కోర్టు కేసులతో, మరికొన్ని కాంట్రాక్టర్లు, అధికారుల చర్యల కారణంగా పనులు ప్రారంభం కాలేదు. బోయగూడలో 396, సిగం చెరువు తండాలో 176 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. 2017లో బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా డిసెంబర్‌ నాటికి లక్ష ఇళ్లు నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి కేటీఆర్‌ ఈ ఏడాది చివరి నాటికి 40 వేల ఇళ్లు పూర్తి చేసి ఇస్తామని వచ్చే జూన్‌ నాటికి లక్ష ఇళ్లు పూర్తి చేస్తామన్నారు. దీంతో ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.

ప్రస్తుతం నిర్మిస్తున్న ఇళ్లలో ఎక్కువ భాగం శివారు ప్రాంతాల్లోనూ లేక జీహెచ్‌ఎమ్సీ పరిధి అవతల ఉన్నాయి. కొన్ని నియోజక వర్గాల్లో మాత్రం ఇళ్ల నిర్మాణమే జరగడంలేదు. అలాంటి ప్రాంతాల్లో ఇళ్ల కేటాయింపులు చేపట్టడంలో ఎలాంటి ప్రమాణాలు పాటిస్తారు అనే ప్రశ్నను లేవనెత్తుతున్నారు ప్రజా సంఘాలు. ఆయా బస్తీల్లోనే సభలు పెట్టి లబ్దిదారులను గుర్తించాలని అప్పుడే నిజమైన లబ్ది దారులకు న్యాయం జరుగుతుందంటున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్‌ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం వాటి కేటాయింపులో మాత్రం అలసత్వం ప్రదర్శిస్తోంది. ముందుగానే లబ్దిదారులను గుర్తిస్తే తప్పా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ లోగా ఎన్నికలు సమీపిస్తే మాత్రం ఇళ్ల కేటాయింపులో గందరగోళం నెలకొనే అవకాశం ఉంది. 

15:15 - November 14, 2017

విజయవాడ : రాష్ట్రంలోని పేదోడికి ఇళ్లు కట్టించాలనేది ఏపీ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏపీ శాసనభలో మంగళవారం ఇళ్ల నిర్మాణంపై చంద్రబాబు చర్చించారు. పేదలకు సొంత ఇళ్లు నిర్మించడంలో తనకు ఆనందం ఉందని..ఇళ్ల నిర్మాణానికి సిమెంట్..ఇసుక కొరత లేదన్నారు. పేదల ఇళ్ల నిర్మాణాన్ని స్థానిక ఎమ్మెల్యేలు పర్యవేక్షించాలని సూచించారు. ఒక్క పైసా అవినీతి చేస్తే తిరిగి డబ్బులు ఇప్పించే వరకు 'పరిష్కార వేదిక' కృషి చేస్తుందని, ఇంతకు ముందు జరిగిన తప్పులు పునరావృతం కావద్దని పేర్కొన్నారు. నెలకు ఒకసారి ఎమ్మెల్యేలు ఆ ఇంటికి వెళ్లాలని..ఇళ్లు కట్టే సమయంలో లబ్దిదారులను ప్రభుత్వం సొంత ఖర్చుతో తీసుకెళుతామని..అక్కడ వారికి టీ..టిఫిన్ కూడా అందచేస్తామన్నారు.

విశాఖలో 50 వేల మంది ఇళ్ల స్థలాలకు పట్టాలిచ్చామని, రాష్ట్రంలో 15 లక్షల నుండి 20 లక్షల మందికి ఇంటి స్థలం ఇచ్చి క్రమబద్దీకరించాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ పాలనలో 14.40 లక్షల ఇళ్లు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ఇళ్ల నిర్మాణంలో అక్రమాలపై దర్యాప్తు చేయించి చర్యలు తీసుకుంటామని, తిరుపతిలో 2,388 ఇళ్లు నాలుగు బ్లాక్ ల కింద పూర్తి చేసినట్లు, మరో 4,500 ఇళ్లు జనవరిలో పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు. తిరుపతిలో అదనంగా రూ. 100 కోట్లు ఖర్చు పెట్టి ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు. 

10:16 - November 12, 2017

కర్నూలు : ఓ పేదోడి కుటుంబాన్ని పోలీసు అధికారి రోడ్డున పడేశాడు. ఐదు మంది పిల్లలు..భార్యతో భర్త నడి రోడ్డుపై కాలం వెళ్లదీస్తున్నాడు. గత నాలుగు రోజులుగా ఇలాగే ఉంటున్నా ఏ అధికారి స్పందించడం లేదనే విమర్శలున్నాయి. అల్లా బకాస్..రజియా దంపతులు ఐదు మంది పిల్లలతో నివాసం ఉంటున్నాడు. ప్రభుత్వం ఇచ్చిన పట్టాతో అప్పులు చేసి ఇళ్లు కట్టుకున్నాడు. ఈ ఇంటిపై డీఎస్పీ ఆఫీసులో పనిచేస్తున్న ఏఎస్ఐ గౌడ్ బంధువుల కన్ను పడింది. దీనితో బకాస్ కుటుంబాన్ని తరిమివేయాలని ఏఎస్ఐ ప్రయత్నించాడని తెలుస్తోంది. 

తాలూకా పోలీసు అధికారులతో మాట్లాడి ఇంటిని కూల్చివేసేందుకు ప్రయత్నించారు. అల్లా బకాష్ ఇంటి స్థలం అప్పగించేందుకు తాలుకా సీఐ మహేశ్వర్ రెడ్డి, ఏఎస్ఐ భాస్కరరాజులు ప్రయత్నించారు. అందులో భాగంగా ఈనెల 7వ తేదీన అల్లా బకాస్ ను పీఎస్ కు పిలిపించారు. ఈ సమయంలో పోలీసులు జేసీబీలతో ఇంటిని కూల్చివేశారు. దీనితో ఐదు మంది పిల్లలతో దంపతులు రోడ్డుపైనే కాలం గడుపుతున్నాడు. 

రెవెన్యూ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసులే ఇంటిని కూల్చివేయడం సరికాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నారు. తమకు న్యాయం జరగకపోతే మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటామని, కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని బాధితులు హెచ్చరిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

16:35 - October 22, 2017

హైదరాబాద్ : రేషన్ షాపులను రద్దు చేసిన నగదు బదిలీ పథకాన్ని ప్రవేశ పెట్టాలన్న టీఆర్ఎస్ ప్రభుత్వ ఆలోచనను టి.టిడిపి నేత రావుల తప్పుబట్టారు. ప్రపంచ వ్యాప్తంగా ఆహార సబ్సిడీ పెరుగుతున్న రోజుల్లో రాష్ట్రంలో దీనిని తొలగించాలనడం సరికాదన్నారు. పౌరసరఫరాలో లోపాలున్నాయని పేర్కొంటూ రేషన్ షాపులను రద్దు చేయడం కరెక్టు కాదన్నారు. లోపాలుంటే సరిచేయాలి కానీ వ్యవస్థనే రద్దు చేస్తారా ? అని ప్రశ్నించారు. 

21:15 - October 21, 2017

హైదరాబాద్ : రేషన్ షాపుల్లో నిత్యవసర సరుకుల పంపిణీలో జరుగుతున్న అవకతవకలు, అక్రమాలపై సరైన విధానం అమలు చేయాలన్నారు సీఎం కేసీఆర్. బియ్యం, నిత్యావసరాలకు బదులు అంతే మొత్తం నగదును లబ్దిదారుల ఖాతాల్లో జమచేసే విధానంపై సీఎంకు అధికారులు వివరించారు. రేషన్ డీలర్లు సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు.

తెలంగాణ ప్రభుత్వం ఏటా 6వేల 500 కోట్లు ఖర్చుపెట్టి పేదల కోసం రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు అందిస్తోంది. అయితే లబ్దిదారులకు అందాల్సిన బియ్యం, ఇతర సరుకులు పక్కదారి పడుతున్నాయనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. పేదలకు అందాల్సిన పథకం దొడ్డిదారి పడుతుంటే ఆవేదన వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ సివిల్ సప్లై అధికారులతో... ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. పేదల కోసం ఖర్చుపెట్టే మొత్తం నూటికి నూరు శాతం ఉపయోగపడేలా ఓ మంచి విధానం అమలు చేయాలని కేసీఆర్ అధికారులకు సూచించారు.

సీఎం సూచన మేరకు అధికారులు స్పందించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ అమలులో వచ్చిన మార్పులను వివరించారు. ముఖ్యంగా రేషన్ షాపుల ద్వారా సరుకులు అందించే బదులు నగదునే నేరుగా లబ్దిదారులకు అందించే విధానం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ అమలులో ఉందని చెప్పారు. సరుకుకు బదులుగా నగదునే లబ్దిదారులకు అందించడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా వివరించారు. దీనిపై స్పందించిన కేసీఆర్ ఈ అంశంపై మరోసారి పునరాలోచన అధికారులను కోరారు. మరోవైపు రేషన్ డీలర్లు సమ్మెకు నోటీసు ఇచ్చిన నేపథ్యంలో లబ్దిదారులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేపట్టినట్లు అధికారుల సీఎంకు తెలిపారు.

11:34 - December 9, 2016

పెద్ద నోట్ల రద్దుతో పేదోడు..సామాన్యుడు ఇంకా కోలుకోలేదు. నెల రోజులవుతున్నా బ్యాంకులు..ఏటీఎంల ఎదుట ప్రజలు క్యూ కడుతున్నారు. కొన్ని సందర్భాల్లో తోపులాట జరగడంతో పలువురికి గాయాలవతున్నాయి. అంతేగాకుండా తీవ్ర వత్తిడికి గుఐ కొంతమంది మృతి చెందుతున్నారు కూడా. కానీ ప్రభుత్వాలు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కేవలం రెండు వేల రూపాయలు తీసుకోవడానికి గంటలు గంటలు నిలబడాలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా కొత్తనోట్లను పంపిణీ చరేస్తామని, కొత్త 500 రూపాయల నోట్లు పెద్ద సంఖ్యలో వస్తాయని ప్రకటనలు గుప్పిస్తున్నా పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు. ప్రకటన వచ్చిన తరువాత ఏటీఎంల్లో డబ్బులు వచ్చినా ఒకటి..రెండు వారాల నుండి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. నోట్లను తీసుకోవడానికి వస్తే ఏటీఎంలు వెక్కిరిస్తున్నాయి. నగరంలోని పలు ఏటీఎంలు మూతపడ్డాయి. దీనితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే బ్యాంకులకు వరుసగా సెలవులు రావడంతో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా తయారైంది. బ్యాంకుల సెలవులతో మరిన్ని కష్టాలు రానున్నాయి. శనివారం రెండో శనివారం కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవు. అలాగే ఆదివారం సాధారణ సెలవే. సోమవారం మహ్మదీయుల ప్రవక్త మహ్మద్ జన్మదినాన్ని పురస్కరించుకుని షిల్లార్ ఉల్ నబీ పండుగ కారణంగా బ్యాంకులకు సెలవు. దీనితో ఇప్పటికే కరెన్సీ కష్టాలతో మూలుగుతున్న ప్రజలు మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

Don't Miss

Subscribe to RSS - పేదోడు