పెట్రోల్

18:06 - September 17, 2018

తమిళనాడు : పెట్రోల్ ధరలు చుక్కలనంటుతు..సామాన్యులకు చుక్కలు చూపెడుతున్నాయి. దీంతో ఏ రోజు పెట్రోలు ఎంత పెరిగిందో చూసుకుని వాహనాలను బైటకు తీస్తున్న పరిస్థితులు నేడు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వివాహాలు జరుపుకునే ఇండ్లల్లో కూడా పెట్రోలు ధరలను చూసుకుని ఖర్చులు లెక్క వేసుకోవాల్సి వస్తోంది. ఇలా ప్రతీ విషయంలోను పెట్రోలు ధరలను బట్టి ట్రెండ్ ను మార్చుకుంటున్న క్రమంలో ఓ స్నేహితుడు వినూత్నంగా ఆలోచించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు ఈ ఫోటో వైరల్ గా మారింది. 
సాధారణంగా వివాహాలలో కానుకలుగా అప్పట్లో వధూవరులకు బంధువులు బట్టలు పెట్టేవారు అది కాస్త క్రమంగా... వస్తువుల్ని కానుకలు ఇచ్చేలా మారిపోయింది. అలా మారుతు..మారుతు..ట్రెండ్ కు తగినట్లుగా గిఫ్ట్ లు మారిపోతున్నాయి. మరి ప్రస్తుతం గిఫ్ట్ ల ట్రెండ్ ఏమిటో తెలుసా?.. రోజురోజుకూ పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న పెట్రోల్‌ను స్నేహితుడికి బహుమతిగా ఇచ్చాడో స్నేహితుడు. తమిళనాడు రాష్ట్రం కడలూరులో జరిగిన తన స్నేహితుడి పెళ్లికి హాజరైన మిత్రులు... 5 లీటర్ల పెట్రోలు క్యాన్‌ను పెళ్లికానుకగా నూతన దంపతులకు అందించాడు. దీంతో పెండ్లికి వచ్చినవారితో సహా వధూ వరులు కూడా నవ్వుతు పెట్రోల్ క్యాన్ ను అందుకున్నారు. 

09:51 - September 17, 2018

పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడెప్పుడు ధరలు తగ్గుతాయని సామాన్య, మధ్య తరగతి ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. రోజుకో రేట్లు పెరుగుతూ రికార్డులను సృష్టిస్తున్నాయి. తాజాగా లీటర్ పెట్రోల్ పై 15 పైసలు, డీజిల్ పై 6 పైసలు ధరను పెంచుతున్నట్లు ప్రభుత్వం రంగ చమురు కంపెనీలు ప్రకటించాయి. మళ్లీ ధర పెరగడంతో పలువురు బెంబేలెత్తుతున్నారు. 

  • న్యూఢిల్లీలో పెట్రోలు ధర రూ. 82.06కు, డీజిల్ ధర రూ. 73.78. 
  • ముంబైలో లీటరు పెట్రోలు ధర రూ. 89.44 డీజిల్ ధర రూ. 78.33. 
  • కోల్ కతాలో లీటరు పెట్రోలు ధర రూ. 83.76 డీజిల్ ధర రూ. 75.57
  • చెన్నైలో లీటరు పెట్రోలు ధర రూ. 85.15 డీజిల్ ధర రూ. 77.94
  • హైదరాబాద్ లీటరు పెట్రోలు ధర రూ. 86.85 డీజిల్ ధర రూ. 80.19.

అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు పెరుగుతుండడంతో ధరలను పెంచక తప్పడం లేదని చమురు కంపెనీలు పేర్కొంటున్నాయి. వెంటనే సుంకాలను తగ్గించి, ప్రజలకు మేలు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

07:52 - September 17, 2018

ఢిల్లీ : యోగా గురు బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీజిల్, పెట్రోలును జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న రావాలన్న బాబా రాందేవ్....పెట్రో ధరలు మోడీని ముంచుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం పన్నుల్లో వెసులుబాటు కల్పిస్తే లీటరు పెట్రోలు, డీజిల్‌ను కేవలం 35 రూపాయలకే విక్రయిస్తానన్నారు. పెట్రో ధరల పెరుగుదలతో జనాలకు మోడీ మరింత ప్రియమయ్యే అవకాశం ఉందన్నారు. పెట్రో ధరలపై నరేంద్ర మోడీ స్పందించి...ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

16:12 - September 14, 2018

ఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్నాయి. వారం రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న స్వల్పంగా పెరిగిన ధరలు ఇవాళ ఇంకాస్త పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 28పైసలు, డీజిల్‌ పై 22పైసలు ధర పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 81.28 రూపాయలు, లీటర్ డీజిల్ ధర 77.82 రూపాయలకు చేరింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 88.39 రూపాయలు కాగా, లీటర్ డీజిల్ 77.82 రూపాయలు పెరిగింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ. 84.49, డీజిల్ రూ.77.49 లకు పెరిగాయి. కోల్‌కత్తాలో పెట్రోల్ రూ. 83.14, డీజిల్ రూ. 75.15లకు పెరిగింది. పెట్రో ధరలపై వాహనదారులు  భగ్గుమంటున్నారు. 

15:58 - September 9, 2018

ముంబై : చమురు ధరల పెరుగుదలపై మహారాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. రాష్ట్ర ప్రజలపై భారం పడకుండా చూస్తామని సీఎం పేర్కొన్నారు. ఓ జాతీయ ఛానెల్ తో ఆయన మాట్లాడారు. జీఎస్టీ కిందకు పెట్రోల్, డీజిల్ తీసుకురావడం వల్ల ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు. ధరల పెరుగుదలపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్షిస్తోందని..ధరలు తగ్గే మార్గాలను చూస్తున్నట్లు వెల్లడించారు. జీఎస్టీలోకి తీసుకొస్తే మహారాష్ట్ర ప్రభుత్వం మద్దతిస్తుందని, ఎన్డీయే ప్రభుత్వ హాయాంలో 13 సార్లు ధరలు పెరిగాయన్నారు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం ధరల పెరుగుదల ఉంటుందన్నారు.

 

15:26 - September 9, 2018

హైదరాబాద్ : చమురు ధరలు పెరుగుతున్నాయి...రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో వాటిపై ఆధారపడుతున్న వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. వీటిపై వివిధ పార్టీలు దృష్టి సారించాయి. పాలకులపై విమర్శలు గుప్పిస్తున్నాయి. కాంగ్రెస్ తో సహా పలు పార్టీలు సోమవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలని ఆయా పార్టీలు నిర్ణయించాయి. ఇందుకు ప్రజలు స్వచ్చందంగా సహకరించాలని విజ్ఞప్తి చేశాయి. బంద్ కు ఇతర పార్టీలు మద్దతివ్వాలని కోరుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో స్వచ్చందంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేయాలని టి.కాంగ్రెస్ పిలుపునిచ్చింది. బంద్ కు మద్దతివ్వాలని వివిధ పార్టీలను విజ్ఞప్తి చేశాయి. ఇక ఏపీ రాష్ట్రంలో వామపక్షాలతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం బంద్‌కు మద్దతు తెలిపారు. శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చాయి. కానీ వైసీపీ మాత్రం బంద్ కు మద్దతివ్వలేదని తెలుస్తోంది. మరి సోమవారం బంద్ విజయవంతమవుతుందా ? లేదా ? అనేది చూడాలి. 

18:27 - September 4, 2018

న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడి నడ్డి విరిచేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం తారాస్థాయికి చేరుకున్నాయి. పెట్రోల్ పై 16 పైసలు, డీజిల్ పై 19 పైసలు పెరిగాయి. హైదరాబాద్ లో పెట్రోలు లీటరు ధర రూ.84.09 కు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించుకోకపోతే లీటరు ధర వంద రూపాయలకు చేరుకొన్నా ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు. ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎటవంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. పైగా బీజేపీ నేతలు పెట్రో ధరల పెరుగుదలపై వ్యంగ వ్యాఖ్యలు చేయడం విమర్శలకు తావిస్తోంది.  
పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న ప్రతిపాదన ముందుకు కదలడం లేదు. పిల్లికి ముందుగా ఎవరు గంట కడతారు అన్న చందంగా కేంద్రం రాష్ట్రాల వైపు చూస్తోంది. ఈ ధరల భారాన్ని మోయలేక సామాన్యడు కుదేలవుతున్నాడు. 

20:43 - August 31, 2018

పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతుండటం పరిపాటిగా మారిపోయింది. ఈ విషయంలో సామాన్యుడు ఎంతగా మెత్తుకున్నా కేంద్రం ఏమాత్రం పట్టించుకోవటంలేదు. గత కొంతకాలం నుండి వరుసగా పెరుగతునే వున్నాయి. ముంబైలో రై.85.78 పైసలుగా వుంటే హైదరాబాద్ లో రూ.83.02 పైసలుగా వుంది. రికార్డులో స్థాయిలో పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యుడి నడి విరుస్తున్నాయి. దీంతో నిత్యావసర వస్తువులు ధరలు కూడా పెరుగుతున్నాయి. ధరలు నియంత్రణలో ప్రభుత్వాలు ఎందుకు విఫలం అవుతున్నాయి? డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ కూడా అంతకంతకు దిగజారుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రభావం చూపుతోంది. ఈ అంశంపై ప్రముఖ ఆర్థిక నిపుణులు పాపారావు విశ్లేషణతో..

17:06 - July 13, 2018

హైదరాబాద్ : పెట్రోల్ బంకుల్లో మోసాలు చేస్తున్నారంటూ ఆరోపణలు రావడంతో తూనికలు..కొలతల శాఖ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు పోలీసులు..అధికారులు పలు పెట్రోలు బంకుల్లో దాడులు చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మూడు బృందాలు సోదాలు నిర్వహించింది. రామంతాపూర్ హెచ్ పి పెట్రోల్ బంక్ లో తనిఖీలు నిర్వహించగా ఐదు లీటర్ల డీజిల్ లో 300 మిల్లిమీటర్ల డీజిల్ తక్కువగా ఉందని తేలింది. బంకు యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. 

06:43 - June 24, 2018

కరీంనగర్ : పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలో చేర్చాలన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌లో జరిగిన సీపీఐ సమావేశంలో పాల్గొన్న నారాయణ... డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెరగడంతో నిత్యావసర ధరలు పెరుగుతున్నాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కేసీఆర్‌ నెరవేర్చాలన్నారు నారాయణ. ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొన్న చాడ వెంకటరెడ్డి... 2019 ఎన్నికల్లో హుస్నాబాద్‌లో సీపీఐ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - పెట్రోల్