పూజలు

09:14 - September 3, 2018

హైదరాబాద్ : నేడు కృష్ణాష్టమి. ఈ సందర్భంగా వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న కృష్ణుడి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయాలను పూలు..విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా భక్తులు ఆలయాల్లో బారులు తీరారు. తిరుమల, యాదాద్రిలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కృష్ణాష్టమి సందర్భంగా చిన్నారులు కృష్ణుడి వేషాలు వేస్తు అలరించారు. 

12:08 - August 24, 2018

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో వరలక్ష్మి శోభ సందరించుకుంది. ఇవాళ శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయాలకు భక్తులు పొటెత్తుతున్నారు. అన్ని ఆలయాలకు ఉదయం నుంచే మహిళలు భారీగా తరలివచ్చి.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అన్ని అమ్మవారి ఆలయాల్లో శ్రావణ శుక్రవారం శోభ నెలకొంది. నగరంలోని కొత్తపేట అష్టలక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

11:57 - August 17, 2018

విజయవాడ : తొలి శ్రావణ శుక్రవారం కావడంతో ఏపీలోని అన్ని అమ్మవారి దేవాలయాల్లో భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామున నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఆలయాల వద్ద పండుగ శోభ నెలకొంది. దీంతో విజయవాడ కనకదుర్గ ఆలయంలో అమ్మవారి దర్శనార్థం భక్తులు బారులు తీరారు. దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:10 - July 25, 2018

సూస్తున్నరా ఆంధ్ర రాష్ట్రంల రాజకీయం ఎట్లైతున్నదో.. జగనాలు ప్రెస్ మీటింగు వెట్టి.. పవన్ కళ్యాణ్ను ఎన్నిమాటలన్నడు.. ఏదన్న ఉంటే రాజకీయంగ ఎదుర్కోవాలెగని.. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలు ఎందుకు జగన్కు..? అంటే ఓ ఆంధ్రా ప్రజలారా..? జగన్ మోహన్ రెడ్డి జేశ్న తిక్కపని ఏం తెల్వక జేశిండేమో అనుకుంటున్నరా..? తప్పు.. దీని ఎన్క అత్యంత పెద్ద కుట్ర దాగున్నది.. నేను జెప్త సూడుండ్రి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే.. తెలంగాణకు గూడ ఇయ్యాలే అని డిమాండ్ జేస్తున్నడు పార్టీ మారి పదవి దక్కిచ్చుకున్న పూజ్యులు శ్రీ గుత్త సుఖేందర్ రెడ్డిగారు.. తెలంగాణల గూడ.. హైద్రావాదు, వరంగల్ తప్ప అంత ఎన్కబడిన ప్రాంతమే మా ప్రాంతానికి గూడ ప్రత్యేక హోదా ఇస్తెనే మంచిది అనుకొచ్చిండు ప్రెస్ మీటింగు వెట్టి..

తెలంగాణ రాష్ట్రంల కేసీఆర్ పరిపాలన అంత దరిద్ర్యమైన పరిపాలన నేను ఏడ జూడలే అంటున్నడు సీపీఎం పెద్ద ముత్తైదువు తమ్మినేని వీరభద్రం సారు.. గుర్రానికి ముంగట గడ్డిగట్టి ఉర్కిచ్చినట్టు ఉంటది కేసీఆర్ పరిపాలన.. ఆ గుర్రానికి గడ్డి అందది అది తినది.. సేమ్ ఈన పథకాలు ఈన ఏశాలు గూడ అట్లనే ఉంటయనుకొచ్చిండు..

పొయ్యిన ఊరుకు మళ్ల వొయ్యేది లేదు.. చెప్పిన మాట మళ్ల జెప్పేది లేదు.. రోజు రొక్కం బలాదూర్.. ఇది తెలంగాణ ప్రభుత్వం యవ్వారం.. మీరు జూడుండ్రి హరీష్ రావుగారు ఎప్పుడు జూడు కొబ్బరు కాయలు గొట్టి రిబ్బన్లు కట్ జేశేకాడనే గనిపిస్తడుగని.. సమస్యలు ఉన్నకాడికి వోడు.. ఎందుకంటె జనం నుంచి రియాక్షన్ ఉంటదని.. ఇగ ఒకతాన మళ్లేందో చెప్తున్నడు అక్కడి పబ్లీకుకు..

ఇప్పుడేగాదు మన నీళ్ల మంత్రి హరీషు రావుగారు ముచ్చట జెప్పింది.. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చినంక ఐదువందల రెసిడెన్షియల్ హాస్టళ్లను ప్రారంభం జేశి సన్నబియ్యంతోని బువ్వవెడ్తున్న ప్రభుత్వం మాది అని.. ఇగ జూడుండ్రి ఆయన ముచ్చట ఎంత పచ్చి అవద్దమో ఈ ముచ్చట జూస్తె మీకే అర్థమైతది.. ఏమన్నడు మంత్రి హాస్టళ్ల పిల్లలు ఏమంటున్నరో ఇనుండ్రి..

ఊర్లె మోరీలు సక్కగలేవు ఏంలేవు ఎన్నిమాట్ల జెప్పినా సర్పంజి వట్టిచ్చుకుంటలేడు.. వార్డునెంబర్లు వట్టిచ్చుకుంటలేరు.. సెక్రటెరీ గూడ ఇంటలేడని ఏం జేశిండ్రు ఆ ఊరోళ్లంత.. పెద్దతాళం దీస్కపోయి గ్రామ పంచాది ఆఫీసుకు తాళమేశిండ్రు.. ఎమ్మార్వోను గల్చి వినతిపత్రం ఇచ్చిండ్రు.. తర్వాత ఎమ్మెల్యే కారు ఆడంగొస్తుంటే.. అడ్డం దల్గిండ్రు.. ఇగ జూడుండ్రి కథ ఎట్లున్నదో..

మనం గడ్కోపారి పోలీసోళ్లను అంటాఉంటం వాళ్లు ఎక్స్ ట్రా జేస్తుంటరు అని.. కని పోలీసోళ్ల తప్పుగాదు.. చట్టం తెల్సుకోకపోవడం ప్రజల తప్పు.. ప్రజలకు చట్టం ఏంది... న్యాయం ఏంది.?. పోలీసోళ్లు ఏం జేయాలే.. ఏం జేస్తున్నరు అన్న సోయి తెలిస్తె పోలీసోళ్లు ఓవరాక్షన్ జేయరు.. తోకముడుస్తరు.. ప్రజలకే సెల్యూట్ కొడ్తరు.. అమెరికా పోలీసోళ్లకు మనకు తేడా జూడుండ్రి..

జనం తల్చుకుంటే మంచోన్ని పిచ్చోన్ని జేస్తరు.. పిచ్చోన్ని దేవున్ని జేస్తరు... ఇద్వరకు చాలమాట్ల  జేశిండ్రు.. మనంగూడ ఎన్నోమాట్ల అసొంటియి జూపెట్టుకున్నం మన మల్లన్న ముచ్చట్లగని.. సేమ్ అసొంటిదే ఇంకోటొచ్చింది మనతానికి.. అదేందంటే.. రాత్రికి రాత్రే ఒక తాడిచెట్టును ఎల్లమ్మ తల్లిగ మల్చేశిండ్రు మన భక్తజనం.. నిన్నటిదాక కల్లువోశిన తాడిచెట్టు ఇయ్యాళటి సంది దీవెనార్తిలు వెట్టెస్తుందన్నట్టు..

07:59 - January 7, 2018

రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవాలయం కనుకదుర్గ ఆలయం ఉందని, ఈ గుడికి రెండు రాష్ట్రాల ప్రజలేకాకుండా దేశం మొత్తమీద భక్తులు వస్తారని, గత నెల 26 తేదీన అర్ధరాత్రి తాంత్రిక పూజలు జరిగాయని, ఈవో ఒక విధంగా చెబుతారని, పాలక మండలి మరోరకంగా చెబుతున్నారని, లోకేష్ సీఎం అవ్వడం కోసం తాంత్రిక పూజలు జరిగినట్టు తెలుస్తుందని వైసీపీ నాయకుడు కొనిజేటి రమేష్ అన్నారు. రాష్ట్రంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో బెజవాడ దుర్గమ్మ పవిత్రమైనదని, ఈ జరగడం బాధకరమని, వైసీపీ వారు గుడిని, బడిని కూడా రాజకీయం చేస్తున్నారని, లోకేష్ ను ప్రమోట్ చేయడానికి తాంత్రిక పూజలు చేయవాల్సిన అవసరం లేదని టీడీపీ నాయకురాలు అచంట సునీత అన్నారు. వాస్తవానికి ఇది కోట్ల మంది మనోభావాలకు చెందిన విషయమని, తప్పు జరిగిందని చెప్పడం కాదని అది ఎందుకు జరిగింది, ఎవరు చెయించారు అనే దానిపై విచారణ చేయాలని కేవలం ఈవోను బదిలీ చేస్తే సరిపోదని, దీని వెనక ఎవరు ఉన్నారో ప్రభుత్వం నిగ్గుతేల్చాలని సీపీఎం పార్టీ నాయకులు ఉమా మాహేశ్వరావు అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

12:11 - January 2, 2018

విజయవాడ : దుర్గగుడిలో తాంత్రిక పూజలు చేశారనే ఓ ప్రచారం కలకలం రేపుతోంది. అర్దరాత్రి మహిషాసుర మర్దిని అవతారంలో అలంకరించి పూజలు నిర్వహించారని పుకార్లు షికారవుతున్నాయి. పలు సమస్యలు ఏర్పడుతుండడంతో పూజలు నిర్వహించడం ఒక్కటే పరిష్కారమని పలువురు సూచించడంతో పూజారి భద్రినాథ్ ఇతరుల సహాయం తీసుకుని అర్ధరాత్రి పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది. దీనిపై ఆలయ అధికారులు కొట్టిపారేస్తున్నారు. రాష్ట్రపతి సతీమణి పర్యటన నేపథ్యంలో ఆలయాన్ని శుద్ధి చేయడం జరిగిందని పేర్కొంటున్నారు. ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఆలయంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

10:10 - December 9, 2017

గుజరాత్ : తమను మళ్లీ గెలిపించాలంటూ ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు దేవాలయానికి వెళ్లి పూజలు చేసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రత్యేక పూజలు చేసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో మొదటి దశ పోలింగ్ శనివారం ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఉదయం 10గంటల వరకు పది శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలుండగా.. తొలిదశలో సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లోని 89 శాసనసభ నియోజకవర్గాలకు పోలింగ్‌ జరగనుంది. మొత్తం 2.12 కోట్ల మంది ఓటర్లు ఈరోజు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కు 26వేల ఈవీఎంలను అధికారులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఈసీ పర్యవేక్షిస్తోంది. ఓటు వేసేందుకు యువత ముందుకు రావాలని ఈసీ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. 

07:10 - September 5, 2017

హైదరాబాద్ : హైదరాబాద్‌లో గణేశ్‌ ఉత్సవాలు ఎంత ప్రత్యేకమో... బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూ అంతే ఫేమస్‌... పదకొండు రోజుల పాటు భక్తులతో పూజలు అందుకున్న బాలాపూర్‌ వినాయకుడు నిమజ్జన మహోత్సవానికి సిద్ధం అవుతున్నాడు. అయితే ఇక్కడ లడ్డూను ఈసారి ఎవరు కైవశం చేసుకుంటున్నారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉదయం 5 గంటలకు వినాయక విగ్రహం కదిలించారు. ఆ తర్వాత బాలాపూర్‌ లడ్డూ వేలంపాట కార్యక్రమం కొనసాగనుంది. సుమారు గంట పాటు ఈ వేలం జరగనుంది. ఈ మేరకు ఉత్సవ కమిటీ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈసందర్భంగా గతంలో లడ్డూ దక్కించుకున్న వ్యక్తి..నిర్వాహక కమిటీ సభ్యులు..పోలీసు అధికారితో టెన్ టివి ముచ్చటించింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:00 - August 25, 2017
10:20 - August 25, 2017

Pages

Don't Miss

Subscribe to RSS - పూజలు