పార్లమెంట్

15:48 - November 20, 2018

ఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ఈరోజు ఓ సంచలన ప్రకటన చేశారు. పాలిటిక్స్ లో అపార అనుభవమున్న సుష్మా స్వరాజ్య వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో తాను పోటీ చేయడం లేదని  మీడియా సమావేశంలో ప్రకటించారు. వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలా.. వద్దా.. అనేది పార్టీ నిర్ణయిస్తుందని కానీ, ఆరోగ్య పరమైన కారణాల వలన పోటీ చేయకూడదని ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఆమె ఈ సందర్భంగా తెలిపారు. కాగా, ప్రస్తుతం సుష్మా విదిషా లోక్ సభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కాగా భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళా నేతలలో అగ్రగణ్యురాలైన సుష్మాస్వరాజ్ 1952, ఫిబ్రవరి 14న హర్యానా లోని అంబాలా కంటోన్మెంటులో జన్మించారు. కేంద్రమంత్రిగాను, ఢిల్లీ ముఖ్యమంత్రిగాను పనిచేసిన సుష్మాస్వరాజ్ వర్తమాన భారతదేశపు మహిళా రాజకీయ నేతలలో ప్రముఖురాలు. 1970లో రాజకీయ రంగప్రవేశం చేసిన సుష్మా విద్యార్థి సంఘం నాయకురాలిగా ఉంటూ ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టి 1977లో తొలిసారిగా హర్యానా రాష్ట్ర శాసనసభలో కాలుపెట్టారు. అదే సంవత్సరంలో కేంద్రంలో ఏర్పాటైన జనతా ప్రభుత్వంలో స్థానం సంపాదించారు. 1996, 98లలో వాజపేయి మంత్రివర్గంలలో కూడా ఈమెకు చోటు లభించింది. 1998లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014 మే 26 నాడు నరేంద్రమోడి కేబినెట్‌లో కేంద్రమంత్రిగా నియమితులైనారు. సుష్మాస్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్‌ ప్రముఖ న్యాయవాది మరియు మిజోరాం గవర్నరుగా పనిచేశారు. ప్రస్తుతం ఎన్డీయే కేబినెట్ లో విదేశాంగశాఖామంత్రిగా పనిచేస్తున్న సుష్మా స్వరాజ్ నిర్ణయం బీజేపీలో సంచలన నిర్ణయమనే చెప్పవచ్చు.
 

11:10 - November 15, 2018

parliament winter session on december 11 2018 -10TV తెలంగాణ రాష్ట్రంతో పాటు మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుండే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 11 నుండి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమావేశాలు జనవరి 8వ తేదీ వరకు నిర్వహించాలని సర్కార్ యోచిస్తోందని తెలుస్తోంది. దీనితో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల వేడి నెలకొనే పరిస్థితి ఉంటే అక్కడ సమరం ప్రారంభం కానుంది. 
తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 11న విడుదల కానున్న సంగతి తెలిసిందే. మోడీ ప్రభుత్వానికి ఈ ఎన్నికలు సెమీఫైనల్ గా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ ఈసారి ఎన్నికలో గెలిస్తే ఆ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఉంటుందని అంచనా. 
మొత్తంగా పార్లమెంట్ సమావేశాల్లో 20 పనిదినాలు ఉండనున్నాయి. ఈసారి జరిగే సమావేశాలు పూర్తి స్థాయి సమావేశాలని..తరువాత లోక్ సభ ఎన్నికలు ఉండే అవకాశాలుండడంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈసారి కీలక బిల్లుల మీద ఆర్డినెన్స్‌లు తేవాలని మోడీ ప్రభుత్వం యోచిస్తోందని..అందులో ట్రిపుల్ తలాక్ బిల్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సమావేశాల్లో ప్రభుత్వాన్ని కడిగిపారేయాలని విపక్షలు వ్యూహ రచన చేస్తున్నాయి. 

13:51 - November 14, 2018

కొలంబో: శ్రీలంక పార్లమెంట్ లో ప్రధాని మహింద రాజపక్స పై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని పార్లమెంట్ ఆమోదించింది. అంతకు ముందున్న ప్రధాని విక్రమ రాజసింఘెను దించి, రాజపక్సను ప్రధానిని చేస్తూ శ్రీలంక అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన ఇచ్చిన ఆదేశాలపై శ్రీలంక సుప్రీం కోర్టు స్టే విధించింది. వచ్చే ఏడాది జనవరి 5న ముందస్తు ఎన్నికలు నిర్వహించేందుకు శ్రీలంక అధ్యక్షుడు చేస్తున్న ఏర్పాట్లను కూడా నిలిపివేయాలని ఆదేశించింది. ఈకేసు పై తదుపరి విచారణ డిసెంబర్ 7కు వాయిదా వేస్తున్నట్లు తెలిపిన సుప్రీంకోర్టు, అప్పటిదాకా పార్లమెంట్ రద్దుపై స్టే విధిస్తున్నట్లు తెలిపింది.
బుధవారం పార్లమెంట్ లోజరిగిన అవిశ్వాస తీర్మానంలో మెజార్టీ సభ్యులు రాజపక్సకు వ్యతిరేకంగా ఓటు వేశారు. స్పీకర్ జయసూర్య గందరగోళ పరిస్ధితులమధ్య ఈరోజు ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్కు ముందే రాజపక్స, ఆయన కుమారుడు నమల్ పార్లమెంట్ నుంచి బయటకు వెళ్లిపోయారు. రాజపక్స మద్దతుదారులు ఓటింగ్ను అడ్డుకోవాలని ప్రయత్నించారు. అవిశ్వాస తీర్మానానికి మెజార్టీ సభ్యులు మద్దతు తెలిపినట్లు స్పీకర్ ప్రకటించారు. కాగా ...విక్రమ సింఘె నేతృత్వంలోని పార్టీయే ప్రస్తుతం పార్లమెంట్ లో అత్యధిక స్ధానాలు కలిగి ఉంది. తర్వాతి ప్రధానిని నియమించే అధికారం ఇప్పటికీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకే ఉంది.

10:59 - October 28, 2018

ఢిల్లీ : శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన...పార్లమెంటును వచ్చే నెల 16 వరకు సస్పెండ్ చేశారు. ప్రధాన మంత్రి పదవిని కోల్పోయిన రణిల్ విక్రమసింఘే పార్లమెంటును అత్యవసరంగా సమావేశపరచాలని, తాను తన బలాన్ని నిరూపించుకుంటానని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు సిరిసేన ప్రకటించారు. ప్రధానిగా మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మహీంద రాజపక్సే పార్లమెంటులో బలాన్ని కూడగట్టుకునేందుకు.... మరింత సమయం ఇచ్చేందుకు వీలుగా పార్లమెంటును సస్పెండ్ చేసినట్లు విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 225 మంది సభ్యులున్న శ్రీలంక పార్లమెంట్‌లో...రాజపక్ష, సిరిసేన కూటమికి 95 మంది సభ్యుల మద్దతుంది. రణిల్ విక్రమసింఘే నేతృత్వంలోని యునైటెడ్ నేషనల్ పార్టీకి సొంతంగా 106 మంది సభ్యులు ఉన్నారు. సాధారణ మెజారిటీకి కేవలం ఏడుగురు మాత్రమే తక్కువున్నారు. 2019 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు వచ్చే నెల 5న పార్లమెంటు సమావేశం జరగాల్సి ఉంది. ఇంతలోనే వచ్చే నెల 16 వరకు పార్లమెంటును దేశాధ్యక్షుడు సిరిసేన ప్రోరోగ్ చేశారు.

 

16:47 - October 10, 2018

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నేత, ఏఐసీసీ అధికార ప్రతినిధి, కేంద్ర మాజీ మంత్రి అయిన జైపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు చేయడం పార్టీలో చర్చానీయాంశమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరుగునున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జైపాల్ రెడ్డి విలేకరులతో మాట్లడారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని, పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తానని వెల్లడించారు. రాఫెల్ యుద్ధ విమానాల స్కామ్‌లో రక్షణ శాఖ ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురి చేసిందని తెలిపారు.
మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి జైపాల్ రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అసెంబ్లీకి పోటీ చేసే ఉద్దేశమే తనకు లేదని, ఊహాగానాలను నమ్మొద్దని గతంలో జైపాల్ రెడ్డి పేర్కొన్న సంగతి తెలిసిందే. వచ్చే లోకసభ ఎన్నికల్లో తాను మహబూబ్‌నగర్‌ పార్లమెంటు స్థానం నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

11:45 - October 5, 2018

విజయవాడ : త్వరలో ఏపీ రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్నాయి. మరి ప్రజల నాడి ఎలా ఉంది ? అధికారంలోకి ఏ పార్టీ వస్తుంది ? తదితర వాటిపై ప్రముఖ జాతీయ ఛానెల్ రిపబ్లిక్ టివీ సీ ఓటర్ సంయుక్తంగా పార్లమెంట్ స్థానాలపై సర్వే నిర్వహించింది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది వెల్లడించింది. దీనికి సంబంధించిన వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. 

అధికారంలోకి వచ్చేందుకు పలు పార్టీలు ఇప్పటి నుండే వ్యూహాలు రచిస్తున్నాయి. జనాలను ఆకర్షించేందుకు నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. గతంలో జరిగిన ఎన్నికల్లో కొద్ది తేడాతో అధికారంలోకి రాలేకపోయిన వైసీపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఆ పార్టీ నేత జగన్ గత కొన్ని రోజుల నుండి పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యలో జనసేన అధినేత పవన్ కూడా వచ్చేశారు. ఆయన పోరాట యాత్ర పేరిట జనాల్లోకి వెళుతున్నారు. వామపక్షాలతో కలిసి ఆయన కార్యచారణను రూపొందిస్తున్నారు. మరి ప్రజల నాడి ఎలా ఉంది ? ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ? 

పార్లమెంట్ స్థానాలకు జరిగే ఎన్నికల్లో మొత్తం 25 సీట్లకు గాను వైసీపీ ఏకంగా 21 సీట్లు నెగ్గుతుందని పేర్కొంది. మిగతా నాలుగు సీట్లు టీడీపీ గెలుస్తుందని సర్వేలో వెల్లడైందని తెలిపింది. అంతేగాకుండా వైసీపీ 41.9..టిడిపి 31.4 ఓట్ల శాతం ఉంటుందని వెల్లడించింది. బీజేపీ ఏ సీటు గెలవదని కానీ 12.5 ఓట్ల శాతం ఉంటుందని అంచనా వేసింది. కాంగ్రెస్ ది కూడా అదే పరిస్థితి ఉంటుందని కేవలం 7.2 ఓట్ల శాతం..సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీలకు 8.9 ఓట్ల శాతం ఉంటుందని అంచనా వేసింది. మరి ఇది నిజమా ? కాదా ? అనేది తెలియాలంటే ఎన్నికలు వచ్చే వరకు ఆగాల్సిందే. 

12:27 - August 17, 2018
20:27 - August 10, 2018
16:31 - August 10, 2018

ఢిల్లీ : ట్రిపుల్ తలాక్ ((ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు ఆగిపోయింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశ పెట్టడం లేదు. శుక్రవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టాలని కేంద్రం పలు ప్రయత్నాలు చేసింది. కానీ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీనితో ఈ బిల్లును ప్రవేశ పెట్టడం లేదని రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు ప్రకటించారు. బిల్లులో సవరణలకు ప్రతిపక్షాలు పట్టుబట్టినప్పటికీ కేంద్రం అందుకు అంగీకరించకుండానే లోక్‌సభలో బిల్లును పాస్ చేసిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం కీలక సవరణలు చేసింది.

ట్రిపుల్ తలాక్ ముసాయిదా బిల్లు 2017గా ప్రభుత్వం పేర్కొంది. ఈ బిల్లు ప్రకారం భార్యకు మాటల ద్వారా కానీ, రాత పూర్వకంగా కానీ, ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా కానీ ట్రిపుల్ తలాక్ చెప్పడం నేరం అవుతుందని పేర్కొంది. అందులో భాగంగా మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు. దీనిపై ముస్లిం సంఘాల నుండి వ్యతిరేకత వ్యక్తమైంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలను సోమవారం వరకు పొడిగించేందుకు కాంగ్రెస్, టీఎంసీ అంగీకరించలేదని సమాచారం.  

12:57 - August 10, 2018

ఢిల్లీ : కేంద్రానికి వ్యతిరేకంగా పార్లమెంటులో గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా, విభజన చట్టం అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. చిత్తూరు ఎంపీ డాక్టర్‌ శివప్రసాద్‌.. హిజ్రా వేషధారణలో శివప్రసాద్‌ నిరసన వ్యక్తం చేశారు. మోదీబాబా ప్రత్యేక హోదా ఇవ్వకుంటే నీ అంతం ఆరంభం అంటూ.. హాస్య గీతం ఆలపించారు. మాటలెన్నో చెప్పావో.. చేతల్లో ఏమీ చూపలేదంటూ ఛలోక్తులు విసిరారు. 
 

Pages

Don't Miss

Subscribe to RSS - పార్లమెంట్