పాదయాత్ర

06:52 - September 12, 2018

హైదరాబాద్ : సచివాలయంలో సాయంత్రం 5.30గంటలకు సీఈసీ బృందం ప్రెస్ మీట్ నిర్వహించనుంది. 
హైదరాబాద్ : నేడు పైలెట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారు. 
విశాఖపట్టణం : జగన్ చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది. 261వ రోజు ఎంవీపీ కాలనీ, వెంకోజీపాలెంలో జగన్ పాదయాత్ర జరుగనుంది. సాయంత్రం మైనార్టీ ఆత్మీయ సమావేశంలో పాల్గొననున్నారు. 
హైదరాబాద్ : నేడు కొండగట్టు బస్సు ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను టిడిపి నేతలు పరామర్శించనున్నారు. 
హైదరాబాద్ : నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సీపీఎం నేత తమ్మినేని భేటీ కానున్నారు. పొత్తుల అంశంపై పవన్ తో చర్చించనున్నారు. 
హైదరాబాద్ : జలమండలిలో ఉదయం 10.గంటలకు 31 జిల్లాల అధికారులతో సీఈసీ బృందం భేటీ కానుంది. ఎస్పీలు, ఐజీ, డీఈఓలు పాల్గొననున్నారు. 

11:25 - September 2, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్ నిర్వహిస్తున్న 'ప్రగతి నివేదన' సభలో పాల్గొనేందుకు తాము పాదయాత్రగా వెళుతున్నామని హస్తినాపురం కార్పొరేటర్ పేర్కొన్నారు. టెన్ టివి నేతలతో మాట్లాడింది. ఇక్కడి నుండి పది కిలో మీటర్ల దూరం ఉందని..అందుకే పాదయాత్ర ద్వారా సభకు వెళుతున్నామన్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా కేసీఆర్ ఏం చెబుతారని ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. మరిన్ని విషయాలకు వీడియో క్లిక్ చేయండి. 

20:23 - August 9, 2018

సూస్తిరా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలు ఎట్లైనయో.. మనం ఈడ అంగీలు శింపుకుంటం.. అభిమానం ఉండాలేగని.. అది బానిసత్వానికి ప్రతిరూపంగ మారొద్దు.. కరుణానిధి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమన్న ఉన్నదా..? జగన్ మోహన్ రెడ్డిగారు పాదయాత్ర జేస్తున్నడు.. ఎందుకు..?అభిమానం ఉండాలేగని.. అది బానిసత్వానికి ప్రతిరూపంగ మారొద్దు.. జగన్ మోహన్ రెడ్డిగారు పాదయాత్ర జేస్తున్నడు.. ఎందుకు..? రేపు పొద్దుగాళ్ల పేపర్ల పొంట వస్తయ్ తాటికాయంత అచ్చరాలతోని.. ఘనంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలు.. రాజకీయాలు ఎంత దిగజారిపోయినయో సూడుండ్రి మొన్న ఒకనాడు ఒక బాండు బైటవడెనా..? డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం కేసీఆర్ రాజకీయ కొంప కొల్లేరు జేస్తట్టే గొడ్తున్నది..వర్దన్నపేట ఎమ్మెల్యేగారు.. మీరు రాజీనామా జేయవల్చిన ఎమ్మెల్యేల లిస్టుల ఫస్టు ప్లేస్ల ఉంటరేమో... పదో తర్గతి పోరడు ఉరివెట్టుకోని సచ్చిపోయిండు.. ఎందుకు..? గీ గరం గరం ముచ్చట్ల కోసం వీడియో క్లిక్ చేయండి. 

16:37 - August 5, 2018

కడప : సోమశిల బ్యాక్‌ వాటర్స్‌ను కడప జల్లా బద్వేల్‌కు తరలించాలన్న డిమాండ్‌తో అఖిలపక్ష నాయకులు పాదయాత్ర చేపట్టారు. గోపవరం మండలం బ్రాహ్మణపల్లి  నుంచి ప్రారంభమైన పాదయాత్ర సోమవారం బద్వేల్‌ చేరుకుంటుంది.  బద్వేల్‌, గోపవరం, అట్లూరు, బి.కోడూరు మండలాకు లిఫ్ట్‌ ద్వారా సోమశిల బ్యాక్‌ వాటర్స్‌  తరలించాలని నాయకులు కోరారు. ఈ పాదయాత్రకు రైతులు, మహిళలు సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సోమశిల బ్యాక్‌ వాటర్స్‌ను బద్వేల్‌ తరలించేందుకు చర్యలు తీసుకోపోతే ఉధ్యమాన్ని ఉధృతం చేస్తామని అఖిలపక్ష నేతల హెచ్చరించారు.

16:21 - August 4, 2018

తూర్పుగోదావరి : జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జగన్‌ చేపట్టిన పాదయాత్రకు కాపు సెగ తగిలింది. జగన్‌ తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర 228 రోజు పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో సాగింది. అయితే క్షేమాలు గ్రామం రామాలయం సెంటర్‌ వద్ద నల్లజెండాలు, ప్లాకార్డలుతో నిరసన తెలుపుతూ ముద్రగడ వర్గీయులు అడ్డుపడటంతో వైసీపీ వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది.... ఇరు వర్గీయులను అదుపు చేయడానికి  పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

 

13:32 - July 27, 2018

హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్ పాదయాత్రకు బ్రేక్ పడింది. ప్రతి శుక్రవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి ఆయన హాజరవుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. జగన్ పై మొత్తం 14 ఛార్జీషీట్లు నమోదయిన సంగతి తెలిసిందే. ఛార్జీషీట్ 9లో ఉన్న జగతి పబ్లికేషన్స్ డిశ్చార్జ్ పిటిషన్ పై.. ఛార్జీషీట్ 10లో రాంకీ సిమెంట్ కంపెనీపై జగన్ తరపు వాదనలు పూర్తయ్యాయి. రిజిష్టర్స్ ఆఫ్ కంపెనీ నిబంధనల ప్రకారం లావాదేవీలు జరిగాయని జగన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణనను శుక్రవారానికి వాయిదా వేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

06:40 - July 25, 2018

తూర్పుగోదావరి : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై.. వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పవన్‌పై వ్యక్తిగత విమర్శలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా పాదయాత్రలో ఉన్న జగన్‌... పవన్‌ మాటలు వినాల్సిరావడం మన ఖర్మ అన్నారు. విలువల గురించి పవన్‌ మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు. పవన్‌కు విలువలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. ఆయనకు నలుగురు భార్యలు ఉన్నారని... కొత్తకారు మార్చినట్టు పవన్‌ తన భార్యలను మార్చుతాడని ఆరోపించారు. నాలుగేళ్లు, ఐదేళ్లకోసారి భార్యను మారుస్తాడంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్‌లాంటి పని మరొకరు చేసి ఉంటే.. నిత్య పెళ్లికొడుకని జైల్లో వేసేవారు కాదా అన్నారు. పవన్‌ది బహు భార్యత్వం కాదా అని ప్రశ్నించారు. అందుకే పవన్‌ విలువల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

09:52 - July 21, 2018

కాకినాడ : బీజేపీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు యుద్ధం చేస్తున్నారా ? ఇది నమ్మలా అని వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రశ్నించారు. పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం వీగిపోవడం...పార్లమెంట్ లో జరిగిన పరిణామాలపై ఆయన స్పందించారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ...ఎక్కువ సాధించాము..ఆధారాలుంటే చెప్పండి అంటూ బాబు ప్రతిపక్షాలకు సవాల్ విసిరారని తెలిపారు. ఏపీకి అన్యాయం జరుగుతోందని...దేశం మొత్తం స్పందించాలని తెలియచేయడానికి...చేసిన అన్యాయాన్ని గట్టిగా తెలపడం కోసం వైసీపీ ఎంపీలు మొత్తం 2018 ఏప్రిల్ 6వ తేదీ చివరి బడ్జెట్ సమావేశాల రోజున రాజీనామాలు చేయడం జరిగిందన్నారు. అదే రోజున టిడిపి ఎంపీలు రాజీనామాలు చేసి నిరహార దీక్ష కు పూనుకుంటే దేశం మొత్తం చూసి ఉండేదని...కేంద్రం దిగొచ్చి హోదా ఇవ్వదా ? అని ప్రశ్నించారు. ఇదంతా తెలిసే వారిచేత రాజీనామాలు చేయించలేదన్నారు. ప్రస్తుతం బాబు ప్రవర్తన ఒకసారి చూడాలని, ఒకవైపు బిజెపితో యుద్ధం చేస్తున్నానని బాబు అంటున్నారని..కానీ నిజంగా బీజేపీతో యుద్ధం చేస్తున్నాడా ? అని సామాన్యుడు కూడా అనుమానాలు వ్యక్త పరిచే విధంగా బాబు ప్రవర్తన ఉంటోందన్నారు.

టిటిడి బోర్డు ఛైర్మన్ గా మహారాష్ట్ర బీజేపీ పార్టీకి చెందిన ఆర్థిక మంత్రి సతీమణిని టిడిపి ప్రభుత్వం నియమించిందని...ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ సెట్స్ లో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కనిపిస్తారని..ఇక్కడ చంద్రబాబు కొలువులో పరకాల ప్రభాకర్ అక్కడ...పరకాల సతీమణి నిర్మలా సీతారామన్ బీజేపీ ప్రభుత్వానికి మద్దతిస్తూ మాట్లాడుతారని...ఇది చాలదనట్లుగా బాబు..మంచి మిత్రుడు...ఈ బంధం ఎన్నటికీ విడిపోదు..అంటూ కేంద్ర మంత్రి రాజ్ నాథ్ మాట్లాడారని తెలిపారు. యుద్ధం కాదని..లోపాయికారీ ఒప్పందాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

నాలుగేండ్లు బీజేపీతో సంసారం చేసి హోదాకు తూట్లు పొడిచారని..ఎన్నికలకు ఆరు నెలల ముందు విడాకులు తీసుకుని పోరాటం చేస్తున్నానంటూ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఎంపీ గల్లా జయదేవ్ చూపించిన పేపర్లు..అభిజిత్ సింగ్ లేఖలు..తాము ఎన్నోసార్లు చూపించామన్నారు. కానీ దీనిపై టిడిపి పట్టించుకోలేదని..యువభేరీలో కరపత్రాలు పంపిణీ చేసి..పార్టీ వెబ్ సైట్ లో నాలుగేళ్లుగా క్యాంపెయిన్ చేయడం జరుగుతోందన్నారు. తాము పెట్టిన అవిశ్వాసాన్ని రాకుండా చేయగలిగారని...టిడిపి పెట్టిన అవిశ్వాసానికి వెంటనే చర్చకు చేపట్టారని, తీర్మానం వీగిపోయిందన్నారు. టిడిపి ఎంపీలు మొత్తం రాజీనామాలు చేయాలని జగన్ డిమాండ్ చేశారు. 

13:48 - July 12, 2018

సంగారెడ్డి : జహీరాబాద్‌ నియోజకవర్గంలో సీపీఎం, బీఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో దళితులు పాదయాత్ర చేపట్టారు. నాలుగు దశాబ్ధాల క్రితం దళితులకు కేటాయించిన ఇళ్ల స్థలాలను ప్రభుత్వం.. వేరే నిర్మాణాలకు కేటాయించడంతో దళితులు ఆందోళన చేపట్టారు. మొగుడంపల్లి మండల కేంద్రం నుండి జహీరాబాద్‌ వరకు పాదయాత్ర చేపట్టారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆ స్థలాల్లో గుడిసెలు వేసుకుంటామని దళితులంటున్నారు. వారి ఆందోళనపై మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి..

17:45 - July 11, 2018

సంగారెడ్డి : జిల్లా జహీరాబాద్‌ నియోజకవర్గంలో సీపీఎం, బీఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో దళితులు పాదయాత్ర చేపట్టారు. నాలుగు దశాబ్ధాల క్రితం దళితులకు కేటాయించిన ఇళ్ల స్థలాలను ప్రభుత్వం.. వేరే నిర్మాణాలకు కేటాయించడంతో దళితులు ఆందోళన చేపట్టారు. మొగుడంపల్లి మండల కేంద్రం నుండి ఆర్డీవో కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆ స్థలాల్లో గుడిసెలు వేసుకుంటామని దళితులంటున్నారు. వారి ఆందోళనపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

Pages

Don't Miss

Subscribe to RSS - పాదయాత్ర