పాకిస్థాన్

15:32 - September 21, 2018

ఢిల్లీ : భారత క్రికెట్స్‌పై వివాదాస్ప వ్యాఖ్యలు చేయటం సర్వసాధారణంగా మారిపోయింది. టీమిండియా గెలుపులను చూసి ఓర్వలేని పాక్ క్రికెటర్స్ వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు పిచ్చి పిచ్చి వ్యాఖలు చేస్తుంటారు. ఈ క్రమంలో పాక్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై వెటకారపు మాటలు మాట్లాడాడు. ఆసియా క‌ప్‌లో పాకిస్థాన్‌తో ఫైన‌ల్స్‌తో స‌హా భార‌త్ మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఇది ముందే ఊహించి కోహ్లీ ఆసియా కప్ నుంచి ఎస్కేప్ అయ్యాడు. పాకిస్థాన్ జ‌ట్టుతో ఆడ‌డానికి కోహ్లీ భ‌య‌ప‌డి ఉంటాడు. ఇంగ్లండ్‌తో అన్ని మ్యాచ్‌లూ ఆడిన‌వాడు ఆసియా క‌ప్ నుంచి ఎందుకు నిష్క్ర‌మించాడని త‌న్వీర్ విమ‌ర్శించాడు. త‌న్వీర్ వ్యాఖ్య‌ల‌పై టీమిండియా క్రికెట‌ర్ గౌత‌మ్ గంభీర్ ఘాటుగా స్పందించాడు. విరాట్ కోహ్లీ ఇప్ప‌టికే 35-36 సెంచ‌రీలు చేశాడు. అలాంటి అట‌గాడికి మ‌రో సెంచ‌రీ చేయ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. కానీ, త‌న్వీర్ అనే ఆట‌గాడు క‌నీసం 36 అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా ఆడ‌లేక‌పోయాడు. అది గుర్తుపెట్టుకుంటే మంచిది` అని గంభీర్ రిప్లై ఇచ్చాడు.

18:08 - September 19, 2018

పాకిస్థాన్ : ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం వస్తే దేశంలో భారీగా మార్పులు జరుగుతాయని నమ్మిన పాక్ ప్రజలకు ఇమ్రాన్ ఖాన్ ఝలక్ ఇచ్చాడు. దీంతో వంట గ్యాస్ సెగకు పాక్ ప్రజలు అంతకంటే ఎక్కువగా మండిపతున్నారు. పాక్ ప్రజలకు కొత్త పాకిస్థాన్ ను చూపిస్తానంటు భీరాలు పలికి ఇమ్రాన్ ఖాన్ పై ప్రజలు మండిపడుతున్నారు. ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం చెబుతున్న ‘నయా పాకిస్థాన్‌’ను ఆ దేశ ప్రజలు  ప్రశ్నిస్తున్నారు. గ్యాస్‌ ధరలను ఏకంగా 143 శాతం మేర పెంచుతున్నట్లు పిడుగులాంటి నిర్ణయాన్ని సర్కారు ప్రకటించటంతో అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. వినియోగదారుల నుంచి రూ.9400 కోట్లను వసూలు చేసే చర్యలో భాగంగా ఈ చర్యను చేపట్టింది. సబ్సిడీలకు మంగళం పలికే దిశగా అడుగులు మొదలుపెట్టింది. గృహ, వాణిజ్య వినియోగదారులందరిపైనా పెంపు భారాన్ని ప్రభుత్వం మోపింది. క్యాబినెట్‌ ఆర్థిక సమన్వయ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పెట్రోలియం శాఖ మంత్రి గులాం సర్వార్‌ ఖాన్‌ తాజాగా పేర్కొన్నారు. గృహ వినియోగదారుల్లోని దిగువ శ్లాబ్‌లో 10 శాతం మేర, ఎగువ శ్లాబ్‌లో 143 శాతం మేర పెంచినట్లు  వివరించారు. అక్టోబర్‌ నెల గ్యాస్‌ బిల్లుల్లో ఈ పెంపు అమల్లోకి వస్తుందన్నారు. ఈ నిర్ణయం వల్ల 94 లక్షల మంది గృహ వినియోగదారులపై పెను భారం పడుతుంది. వీరిలో 36 లక్షల మంది దిగువ ఆదాయ శ్లాబ్‌లో ఉన్నారు. వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులపై 30 నుంచి 57 శాతం మేర వడ్డింపు జరిగింది. దీనివల్ల ఎరువులు, విద్యుదుత్పత్తి, సిమెంట్‌, సీఎన్‌జీ తదితరాల ధరలకు రెక్కలు రానున్నాయి. ప్రభుత్వ రంగ గ్యాస్‌ కంపెనీలు ఆదాయ లోటుతో నడుస్తున్నాయని మంత్రి గులాం సర్వార్‌ చెప్పారు. ప్రస్తుత ధరలను కొనసాగించడం సాధ్యం కాదన్నారు.

16:24 - September 19, 2018

ఇస్లామాబాద్ : పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్..అతని కూతురులను జైలు నుండి విడుదల చేయాలని పాక్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవినీతి కేసులో నవాజ్ షరీఫ్‌కు పదేళ్లు, కుమార్తె మరియమ్‌కు ఏడేళ్ల జైలు శిక్షను కోర్టు విధించిన విషయం విదితమే. లండన్ నుంచి అబుదాబీ ద్వారా లాహోర్‌కు విమానంలో చేరుకున్న నవాజ్, ఆయన కూతురు మరియమ్‌ను రావల్పిండి వద్ద ఆదియాల జైలుకు తరలించారు. పనామాపత్రాల కుంభకోణానికి సంబంధించి అవెన్‌ఫీల్డ్‌ హౌస్‌ అక్రమాస్తుల కేసులో జవాబుదారీ న్యాయస్థానం వారిని దోషులుగా ప్రకటించడంతో వారిని అరెస్టు చేశారు.
కానీ ఇటీవలే నవాజ్ షరీఫ్ సతీమణి కన్నుమూయడంతో అంత్యక్రియలకు హాజరయ్యేందుకు పెరోల్ మీద వారు విడుదలయ్యారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

11:42 - September 19, 2018

ఢిల్లీ : చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య ప్రతిష్టాత్మక పోరుకు రంగం సిద్ధమైంది. ప్రపంచ క్రికెట్ ను తన వైపు తిప్పుకునే మ్యాచ్ పై అంతటా ఉత్కంఠ రేపుతోంది. క్రికెట్ ప్రేమికులను కనువిందు చేయడానికి దాయాది జట్లు రెడీ అయ్యాయి. ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాక్‌ చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్...ఓటమికి బదులు తీర్చుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏడాది తర్వాత భారత్‌, పాకిస్థాన్‌ క్రికెట్‌ పోరుకు రంగం సిద్ధమైంది. ఆసియా కప్‌లో భాగంగా గ్రూప్‌-ఎ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థులు మరోసారి తలపడనున్నాయి. రెండు జట్లు తలపడే అరుదైన మ్యాచ్‌లనూ ఏ క్రికెట్‌ అభిమానీ చూడకుండా ఉండలేడు. కేవలం రెండు దేశాల అభిమానులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ ప్రేమికులందరూ ఈ మ్యాచ్‌పై ఆసక్తి చూపిస్తారు. గత ఏడాది ఛాంపియన్స్‌ ట్రోఫీలో రెండు జట్లూ తలపడగా.. భారత్‌పై పాక్‌ భారీ విజయం సాధించింది. దీంతో ఇప్పుడు పాక్‌ను ఓడించడం భారత్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది.

పటిష్టమైన బౌలింగ్ ఉన్న పాకిస్తాన్ భారత్ బ్యాట్స్ మెన్లు ఎలా ఎదుర్కొంటారన్న ఆసక్తికరంగా మారింది. ఓపెనర్లు రోహిత్‌, ధావన్‌ ఎలాంటి ఆరంభాన్నిస్తారన్నది కీలకంగా మారింది. హాంకాంగ్ పై రాణించిన ధావన్, అంబటి రాయుడుతో పాటు ఇతర బ్యాట్స్ మెన్లు రాణిస్తే...భారత్ జట్టు సునాయసంగా గెలుస్తుంది. బౌలింగ్ లో భువీ, కుల్దీప్, చాహల్ రాణిస్తే పాకిస్తాన్ కు కష్టాలు తప్పవు. 

15:31 - September 7, 2018

పాకిస్థాన్ : పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఇమ్రాన్ ఖాన్. పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీని స్థాపించి పాక్ లో అధికారంలోకి వచ్చారు. కాగా పాకిస్థాన్ లో అధ్యక్షుడు ఎవరైనా..ముఖ్యమంత్రి ఎవరైనా అధికారం మాత్రం సైన్యానిదే. సైన్యం కనుసన్నల్లోని అన్నీ జరుగుతుంటారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ అధికారంలోకి వచ్చాక పాక్ విధి విధానాలు మారతాయనే అందరు ఊహించారు. కానీ సదా మామూలుగానే పాత పద్ధతిలోనే పాక్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఆ దేశ సైన్యం తీరు మాత్రం మారలేదు. ఇండియాను రెచ్చగొట్టేలా పాక్ ఆర్మీ చీఫ్ జావెద్ బజ్వా వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో తమ సైనికులను చంపితే... అంతకంత ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న కశ్మీర్ ప్రజలకు శాల్యూట్ చేస్తున్నానని చెప్పారు. పాకిస్థాన్ లో జరిగిన డిఫెన్స్ డే ఫంక్షన్ లో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ ప్రజలకు తాము మద్దతుగా ఉంటామని చెప్పారు. కశ్మీర్ సోదరులు, సోదరీమణులు చేస్తున్న త్యాగాలు చాలా గొప్పవని అన్నారు. 

17:43 - August 20, 2018

పాకిస్థాన్ : ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్‌కు ప్రధాని నరేంద్రమోదీ లేఖ రాసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ లేఖలో ఇరుదేశాల చర్చలకు సంబంధించి మోది ప్రస్తావించలేదు. పొరుగు దేశాలతో మంచి సంబంధాలనే కోరుకుంటామని మోది లేఖలో తెలిపారు. ఇమ్రాన్‌ఖాన్‌కు మోదీ లేఖ రాసినట్లు పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ఎమ్ ఖురేషి తెలిపారు. ఇమ్రాన్‌ఖాన్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు మోదీ మర్యాదపూర్వకంగానే లేఖ రాసినట్లు సమాచారం. పాకిస్తాన్‌కు 22వ ప్రధానిగా పిటిఐ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. పొరుగు దేశాలతో సంబంధాలను మెరుగుపరచుకోవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

17:37 - August 20, 2018

పాకిస్తాన్‌ : ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టారు. ప్రధాని అధికారిక నివాసంలో తాను ఉండబోనని... మిలటరీ సెక్రటరీలో ఓ మూడు పడకల గదుల ఇంట్లో ఉంటానని తెలిపారు. తన సొంత ఇల్లు బెనిగలాలోనే ఉండాలనుకున్నప్పటికీ భద్రతా కారణాల వల్ల సెక్యూరిటీ ఏజెన్సీ ఒప్పుకోవడం లేదన్నారు. ప్రధాని అధికార నివాసంలో 524 మంది పనివాళ్లు, 80 కార్లు, 33 బుల్లెట్‌ ప్రూఫ్‌ కార్లతో పాటు హెలిక్యాప్టర్లు, విమానాలు, విలాసవంతమైన సౌకర్యాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. దారుణమైన పరిస్థితిలో ఉన్న ప్రజలకు వెచ్చించేందుకే నిధులు లేవన్నారు. దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తాను కేవలం ఇద్దరు సర్వెంట్లను మాత్రమే తనతో ఉంచుకుంటానని వెల్లడించారు. ప్రధాని అధికారిక నివాసాన్ని రీసెర్చి యూనివర్సిటీగా మార్చాలని ఆయన ఆదేశించారు. దేశ వ్యాప్తంగా అనవసర ఖర్చులు తగ్గించేందుకు ఇమ్రాన్‌ ఓ కమిటీని వేశారు. గత ప్రధానులు విదేశీ పర్యటనలకు విపరీతంగా ఖర్చు చేశారని ఇమ్రాన్‌ ఆరోపించారు. 650 మిలియన్‌ డాలర్లు ఏం చేశారని ప్రశ్నించారు. బుల్లెట్‌ ప్రూఫ్‌ కార్లు వేలంలో పెడతానని వీటిని కొనేందుకు వ్యాపారులు ముందుకు రావాలని ఆహ్వానించారు.

13:43 - August 14, 2018
13:28 - August 1, 2018

ఢిల్లీ : బ్రిటిష్ పాలనకు మునుపు భారతదేశం చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేదని, బ్రిటిష్ పాలన తరువాత భారతదేశం చిన్న చిన్న రాజ్యాలన్నింటిని కలుపుకుని ఒక పరిపూర్ణ అఖండ భారతదేశంగా రూపాంతరం చెందిదని అభిప్రాయపడతారు. వారి ఈ అభిప్రాయానికి కారణం మనం చిన్నప్పుడు చదువుకున్న పాఠ్య పుస్తకాలు ఒక కారణం కావచ్చు. అంతే కాక భారత దేశం అంతటా వివిధ రకాల సంస్కృతులు ఉండేవని, రాజకీయపరంగా భారతదేశాన్ని ఒక్క గాటిన పెట్టటానికి వీటన్నటినీ సమ్మేళనం చేసి హిందుత్వం అన్న వాదనని తెరపైకి తెచ్చారని కూడా మార్కిస్టులూ మరియూ హిందువేతరులూ భావిస్తారు. ఏది ఏమైనా భారత ఉపఖండానికి ప్రపంచలోనే అత్యంత ప్రమాదకరమైన భూకంపాల ముప్పు పొంచి వుందని రీసెర్చర్లు హెచ్చరిస్తున్నారు.

దక్షిణాసియా దేశాలు..
భారత దేశం,పాకిస్థాన్,బంగ్లాదేశ్,ఆఫ్ఘనిస్థాన్,నేపాల్,భూటాన్,మాల్దీవులు,శ్రీ లంకలకు కలుపుకున్న భూభాగాన్ని అఖండ భారతావనిగా పిలుస్తారు. ఇప్పుడు వీటిని భారత ఉప ఖండంగా..దక్షిణాసియాగా పిలుస్తుంటాయరు. ఈ నేపథ్యంలో భారత ఉపఖండం అయిన దక్షిణాసియాకు భూ కంపాల ముప్పు పొంచి వుందని రీసెర్చర్లు హెచ్చరిస్తున్నారు.

5 లక్షల సంవత్సరాల క్రితం భూ అంతర్భాగాల్లో భీకొన్న టెక్టానిక్ ప్లేట్స్..
భారత ఉప ఖండానికి పెను భూకంపాల నుంచి ముప్పుందని రీసెర్చర్లు హెచ్చరించారు. టిబెట్ పీఠం కింద ఉన్న ఆసియన్ టెక్టానిక్ ప్లేట్లు ఢీకొట్టుకోనుండటమే ఇందుకు కారణమని..దాదాపు 5 లక్షల సంవత్సరాల క్రితం భూ అంతర్భాగాల్లో ఇవి ఢీకొట్టుకున్న సమయంలో పెను భూకంపాలు సంభవించాయని యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ జియోలజీ ప్రొఫెసర్ జియోడాంగ్ తెలిపారు.

తూర్పు ఆసియా స్వరూపాన్ని మార్చనున్న ఆసియన్ టెక్టానిక్ ప్లేట్స్..
ఇప్పుడు ఇండియన్, ఆసియన్ టెక్టానిక్ ప్లేట్లు తూర్పు ఆసియా స్వరూపాన్ని మార్చనున్నాయని, ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన భూకంపాలు సంభవించే ప్రమాదముందని తన తాజా అధ్యయనంలో తెలిపారు. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ నాలుగు ముక్కలుగా విడిపోనుందని తమ అధ్యయనంలో తేలినట్టు చెప్పారు. పలు మార్గాల నుంచి తాము భూ భౌతిక సమాచారాన్ని సేకరించామని, టిబెట్ పీఠభూమికి 160 కిలోమీటర్ల లోతున జరుగుతున్న పరిణామాలను టోమోగ్రాఫిక్ విధానంలో చిత్రాలు తీశామని ఆయన తెలిపారు.

14:41 - July 28, 2018

Pages

Don't Miss

Subscribe to RSS - పాకిస్థాన్