పాకిస్తాన్

15:57 - September 24, 2018

క్రికెట్ అంటేనే రికార్డుల పుట్ట. ఈ రోజు ఉన్న రికార్డు కాసేపట్లోనే చెరిగిపోతుంది. రికార్డులు బద్దలవడం చాలా కామన్. ఇప్పటికే ఎన్నో రికార్డులు క్రియేట్ అయ్యాయి, అవి బ్రేక్ అయ్యాయి. తాజాగా మరో రికార్డు బద్దలైంది. క్రికెట్ గాడ్ గా చెప్పుకునే సచిన్ టెండూల్కర్ రికార్డును భారత జట్టు వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ బద్దలుకొట్టాడు.
ఆసియా కప్‌ లో భాగంగా ఆదివారం భారత్‌-పాక్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన సునాయాస విజయం సాధించిన విషయం తెలిసిందే. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ పాక్‌ బౌలర్ల మీద విరుచుకు పడి 225 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో పాక్ నిర్దేశించిన 237పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించగలిగారు. కెప్టెన్‌ రోహత్‌ శర్మ(111 నాటౌట్‌; 119 బంతుల్లో 7×4, 4×6), శిఖర్‌ ధావన్‌ (114; 100 బంతుల్లో 16×4, 2×6) ఆడి భారత్‌కు ఫైనల్‌ బెర్తును ఖరారు చేశారు.
ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరో అరుదైన రికార్డు సాధించాడు. దుబాయ్‌ గడ్డమీద టీమిండియా సారథి స్థాయిలో శతకం బాదిన తొలి బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. గతంలో కెప్టెన్‌ హోదాలో దుబాయ్‌ మైదానంలో అత్యధిక పరుగులు(83) చేసిన రికార్డు కూడా రోహిత్‌దే. ఇప్పుడు తన రికార్డును తానే అధిగమించాడు. ఇప్పటివరకు దుబాయ్‌ వేదికగా హాంగ్‌కాంగ్‌ సారథి అన్షుమాన్‌ రత్‌ (73), ఇంగ్లాండ్‌ సారథి కుక్‌(80), దక్షిణాఫ్రికా సారథి జీసీ స్మిత్‌ (92)లు అత్యధిక పరుగుల సాధించారు.
దీంతోపాటు ఇండియా-పాకిస్థాన్‌ మధ్య జరిగిన వన్డేల్లో అత్యధికంగా 111 పరుగులు చేసిన రెండో సారథి రోహిత్‌ కావడం విశేషం. ఇంతకు ముందు ఈ రికార్డు సచిన్‌ టెండూల్కర్‌(93), మహమ్మద్‌ అజారుద్దీన్‌(100, 101), మహేంద్ర సింగ్‌ ధోనీ(113)లపై ఉంది. రోహిత్‌ ఇదే జోరు కొనసాగిస్తే ధోనీని అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదని సీనియర్‌ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. నిన్న జరిగిన మ్యాచ్‌లో 19వ శతకాన్ని నమోదు చేసిన రోహిత్‌.. వన్డేల్లో ఏడు వేల పరుగుల మైలురాయిని దాటాడు. ఈ ఘనత సాధించిన తొమ్మిదో భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ నిలిచాడు.

06:43 - September 17, 2018

ఢిల్లీ : ఆసియా కప్ లో పాకిస్తాన్ అదిరగొట్టింది. ఆదివారం హాంగ్ కాంగ్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ అద్భుత విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుగ బ్యాటింగ్ చేసిన హాంగ్‌కాంగ్ జట్టు బ్యాట్స్ మెన్లు....పాక్ బౌలింగ్‌ ముందు విలవిలలాడిపోయారు. 37.1 ఓవర్లలో 116 పరుగులకే ఆ జట్టు ఆలౌట్ అయింది. హాంగ్‌కాంగ్ జట్టులో ఐజాజ్ ఖాన్ 27, కించిత్ షా 26 పరుగులు సాధించారు. మిగతా బ్యాట్స్ మెన్లు రెండంకెల స్కోరు సాధించలేకపోయారు. స్వల్ప విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు....లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించింది. 23.4 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి....120 పరుగులు చేసి సుపర్ విక్టరీ కొట్టింది. పాకిస్థాన్ బ్యాట్స్ మెన్లలో ఇమామ్ ఉల్ హక్ 50, బాబర్ ఆజాం 33, ఫకార్ జమాన్ 24 పరుగులు చేశారు. హాంగ్‌‌కాంగ్ బౌలర్లు ఈశాన్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు. 

16:26 - September 12, 2018

ఫూణే: పాకిస్థాన్ భూభాగంలోని 15 కి.మీ అవతల భారత ఆర్మీ విజయవంతంగా పూర్తి చేసిన సర్జికల్ స్ట్రైక్ లో సైనికులు చిరుత పులుల మల, మూత్రాలను ఉపయోగించి అక్కడ ఉన్న కుక్కల దాడులనుంచి తప్పించుకున్నట్టు మాజీ సైనికాధికారి ఒకరు బుధవారం తెలిపారు. 

నగ్రొటా  కార్ప్స్ కమాండర్ గా లెఫ్టినెంట్ జనరల్ రాజేంద్ర నిమ్ బోర్కర్ సర్జికల్ స్ట్రైక్ లో పాల్గొన్నారు. సర్జికల్ స్ట్రైక్ లో ఆయన చేసిన సేవలకు గాను పూణేలోని థొర్లే బాజీరావు పేష్వే ప్రతిష్టాన్ అనే సంస్థ రాజేంద్ర నింబోర్కర్ ను సన్మానించింది. ఆ సమావేశంలో ముఖ్య అతిధిగా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషీ పాల్గొన్నారు.

నౌషేరా సెక్టార్ ప్రాంతంలో జీవ వైవిధ్యాన్ని కూలంకుషంగా పరిశీలించిన బ్రిగేడర్ కమాండర్ రాజేంద్ర కుక్కలను తరచూ చిరుతలు వేటాడం గమనించారు. చిరుతల దాడి నుంచి తప్పించుకోవడానికి రాత్రివేళల్లో మాత్రమే శునకాలు ఆ ప్రాంతంలో సంచరించేవి. 

సర్జికల్ స్ట్రైక్ చేసేందుకు సైనికులు గ్రామాలు దాటి వెళ్లేందుకు కుక్కలు అరిచి గోలచేసే ప్రమాదం ఉందని గమనించి భారత సైనికులు చిరుత పులుల మల, మూత్రాలను తమతోపాటుగా తీసుకువెళ్లి.. వాటిని గ్రామ పొలిమారల్లో చల్లి కుక్కలు తమవైపు రాకుండా జాగ్రత్తపడ్డారని రాజేంద్ర చెప్పారు. ఈ ప్రయోగం చక్కటి ఫలితాలను ఇచ్చిందని కమాండర్ రాజేంద్ర వెల్లడించారు.

ఈ దాడి అత్యంత గోప్యంగా ఉంచారని.. తమకు ఒక వారం క్రితమే ఈ సమాచారం అప్పటి రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారిక్కర్ తెలియచేశారని రాజేంద్ర వెల్లడించారు. ఈ విషయాన్ని తమ ట్రూప్ సభ్యులకు ఒక వారం ముందుగా తెలియచేసినా.. ఏ ప్రాంతమో ఒక రోజు ముందు చెప్పినట్టు రాజేంద్ర గుర్తుచేసుకున్నారు.

12:46 - August 18, 2018

ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌ 22వ ప్రధానిగా మాజీ క్రికెటర్‌, పాకిస్తాన్‌ తెహ్రిక్‌-ఎ ఇన్సాఫ్‌ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రెసిడెంట్‌ హౌస్‌లోనే నిరాడంబరంగా ఇమ్రాన్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి నవజ్యోత్‌సింగ్‌ సిద్దు హాజరయ్యారు.

ప్రధాని పదవి కోసం ఇమ్రాన్‌ఖాన్‌, నవాజ్‌ షరీఫ్‌ సోదరుడు షాహబాజ్‌ షరీఫ్‌ పోటీ పడ్డారు. పాకిస్తాన్‌ నేషనల్‌ అసెంబ్లీలో ఇమ్రాన్‌కు 176 ఓట్లు రాగా...షాహబాజ్‌ షరీఫ్‌కు 96 ఓట్లు వచ్చాయి. ప్రధాని పదవికి ఇమ్రాన్‌ ఖాన్‌ ఎన్నికైనట్లు నేషనల్‌ అసెంబ్లీ ప్రకటించింది. పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీకి జూలై 25న జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పిటిఐ అతిపెద్ద పార్టీగా అవతరించింది. నవాజ్‌షరీఫ్‌ పార్టీ ముస్లిం లీగ్‌ రెండో స్థానంలో నిలిచింది. ఇతర పార్టీల సహకారంతో ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. సునీల్ గవాస్కర్, కపిల్‌దేవ్‌లకు కూడా ఇమ్రాన్ నుంచి ఆహ్వానాలు అందినప్పటికీ వ్యక్తిగత కారణాలతో వారు హాజరు కాలేకపోతున్నారు.

07:07 - August 3, 2018

ఢిల్లీ : పాకిస్తాన్‌ ప్రధానమంత్రిగా ఇమ్రాన్‌ఖాన్‌ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి విదేశీ నేతలను ఆహ్వానించడం లేదని పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ కార్యక్రమానికి ఇమ్రాన్‌కు అత్యంత సన్నిహత స్నేహితులైన విదేశీ వ్యక్తులను కొందరిని మాత్రమే ఆహ్వానించినట్లు తెలిపింది. పాకిస్థాన్ ప్రధాన మంత్రిగా మాజీ క్రికెటర్, 65 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ ఆగస్టు 11న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సార్క్ దేశాల అధినేతలతో పాటు ప్రధాని మోదీకి కూడా ఆహ్వానం పంపుతారని వార్తలు వెలువడ్డ నేపథ్యంలో పాక్‌ విదేశాంగ శాఖ ఈ ప్రకటన విడుదల చేసింది. పాక్ సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీకె ఇన్సాఫ్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత బలం లేకపోవడంతో చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతు కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు.

12:21 - July 26, 2018

ఢిల్లీ : పాక్ జాతీయ అసెంబ్లీలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రావడం లేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా (ఇమ్రాన్ ఖాన్) పీటీఐ నిలిచింది. 115 స్థానాల్లో పీటీఐ ముందంజలో కొనసాగుతోంది. పీఎంఎల్‌ఎన్ పార్టీ 64, పీపీపీ పార్టీ 43 స్థానాలతో దూసుకెళుతున్నాయి. ఇతరులతో కలసి పీటీఐ అధికారం చేజిక్కించుకొనే అవకాశం కనిపిస్తోంది. జాతీయ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 137 సీట్లు అవసరం ఉంటుంది. లీడింగ్ లో కొనసాగుతున్న ఇమ్రాన్ పార్టీ...ప్రభుత్వ ఏర్పాటుకు చిన్న పార్టీలు..ఇండిపెండెంట్ల సాయం తీసుకొనే అవకాశం ఉంది.

జాతీయ అసెంబ్లీలో మొత్తం 342 స్థానాలుండగా.. 272 స్థానాలకు మాత్రమే ప్రత్యక్ష ఎన్నికల ద్వారా సభ్యులను ఎన్నుకుంటారు. మహిళలకు కేటాయించిన 60 సీట్లు, మైనారిటీలకు కేటాయించిన మరో 10 సీట్లకు పరోక్ష పద్ధతిలో సభ్యులను ఎన్నుకుంటారు. 

12:11 - July 26, 2018

ఢిల్లీ : పాక్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బుధవారం హింసాత్మక ఘటనల మధ్య జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అనంతరం కౌంటింగ్ నిర్వహించారు. 114 స్థానాల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ ముందంజలో కొనసాగుతోంది. 59 స్థానాల్లో నవాజ్ ఫరీఫ్ పార్టీ, 34 స్థానాల్లో పీపీపీ పార్టీలు కొనసాగుతున్నాయి.

దేశ 70 ఏళ్ల చరిత్రలో ప్రజాస్వామ్య బద్ధంగా ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. పాక్ లో ఆర్మీ కీలక పాత్ర పోషిస్తుంటుంది. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (పీటీఐ) కి ఆర్మీ మద్దతూ ఇస్తూ వస్తోంది. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) పార్టీకి నవాజ్ షరీఫ్ నాయకత్వం వహిస్తున్నారు. కానీ షరీఫ్ జైలుకు వెళ్లడంతో ఆయన సోదరుడు పార్టీకి నేతృత్వం వహిస్తున్నాడు.

పాక్ లో మొత్తం 342 స్థానాలున్నాయి. 272 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. మిగతా స్థానాలను రిజర్వుడు ఉంచుతారు. 172 స్థానాలు సాధిస్తే అధికారం చేపట్టే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పీటీఐ పార్టీ 114 స్థానాలు కైవసం చేసుకుని మ్యాజిక్ ఫిగర్ స్థానానికి చేరువవువతోంది. ఏకైక అతి పెద్ద పార్టీగా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 137 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు నేరుగా ఎన్నికై ఉండాల్సి ఉంటుంది. హంగ్ పార్లమెంట్ ఏర్పడితే పీపీపీ కింగ్ మేకర్ పాత్ర పోషించే పరిస్థితి కనిపిస్తోంది. 

08:59 - June 13, 2018

జమ్మూకాశ్మీర్ : పాకిస్తాన్ మరోసారి కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సాంబా జిల్లా చంబ్లియాల్ సెక్టార్ లో పాకిస్తాన్ బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో నలుగురు బీఎస్ ఎఫ్ జవాన్లు మృతి చెందారు, మరో ఐదుగురికి గాయాలయ్యాయి.

 

12:46 - May 29, 2018

ఢిల్లీ : పాకిస్తాన్‌ ఉగ్రవాదాన్ని వీడే వరకు ఆ దేశంతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌ స్పష్టం చేశారు. తాము పాకిస్తాన్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధంగానే ఉన్నామని... ఉగ్రవాదం, చర్చలు ఒకే ఒరలో ఇమడవని తేల్చి చెప్పారు. పాకిస్తాన్‌ సార్వత్రిక ఎన్నికల తర్వాత చర్చలు జరగాలన్నా ఉగ్రవాదాన్ని వీడాల్సిందేనని సుష్మా పేర్కొన్నారు. గిల్గిట్‌-బాల్టిస్టాన్‌ 2018 ఆర్డర్‌పై ఆమె మాట్లాడుతూ...పాకిస్తాన్‌ చరిత్రను వక్రీకరిస్తోందని...చట్టం మీద వారికి నమ్మకం లేదని మండిపడ్డారు. మోది నాలుగేళ్ల పాలనలో విదేశాంగ శాఖ సాధించిన విజయాలను సుష్మా ప్రస్తుతించారు.

 

21:29 - May 20, 2018

Pages

Don't Miss

Subscribe to RSS - పాకిస్తాన్