పవన్‌ కళ్యాణ్

22:57 - September 12, 2018

హైదరాబాద్ : ఉత్తరాంధ్రలో పర్యటనతో సెగ పుట్టించిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ .. చల్లబడ్డారు. పశ్చిమలో భారీ బహిరంగ సభ నిర్వహించి కాక రేపిన జనసేనాని.. మళ్లీ కనుమరుగైపోయారు. సీరియస్‌గా పాలిటిక్స్ మొదలుపెట్టారని అనుకున్నంతలోనే.. తన తీరు మారలేదని నిరూపించుకుంటున్నారు. ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం వేడెక్కుతున్న సమయంలో పవన్‌ తెరమరుగు అవడం సంచలనం కలిగిస్తోంది. 

మే 20న ఇచ్ఛాపురం నుంచి పోరాట యాత్ర మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్‌.. రెండు విడతల్లో దాదాపు 40 రోజుల పాటు జనం మధ్యే గడిపారు. మధ్యలో రంజాన్‌ పేరుతో కొన్ని రోజులు, కంటి సమస్య పేరుతో మరికొన్ని రోజులు విరామం తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ పర్యటించిన పవన్.. ఆ తర్వాత మాత్రం అనూహ్యంగా మౌనం దాల్చారు. పవన్ కళ్యాణ్‌పై చాలా ఆశలు పెట్టుకున్న ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు  తీవ్ర నిరాశకు గురవుతున్నారు. 

19:29 - August 1, 2018

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో.. ఐదు జిల్లాలను సైబరాబాద్‌లుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు. విశాఖ, ఉభయగోదావరి, చిత్తూరు, అమరావతిలతో పాటు.. అనంతపురం జిల్లాలనూ ఐటీ పరిశ్రమలను స్థాపింప చేస్తామన్నారు. 2019 నాటికి ఐటీ రంగంలో లక్ష, ఎలెక్ట్రానిక్స్‌ మానుఫ్యాక్చరింగ్‌లో రెండు లక్షలు చొప్పున ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 
మరో పది ఐటీ కంపెనీలు ప్రారంభం 
నవ్యాంధ్రప్రదేశ్‌లో సరికొత్తగా మరో పది ఐటీ కంపెనీలు ప్రారంభమయ్యాయి. అమరావతిలోని ఏపీ ఎన్నార్టీ పార్క్‌లో.. ఒకేసారి పది ఐటీ సంస్థలను.. రాష్ట్ర ఐటీ మంత్రి నారాలోకేశ్‌ ప్రారంభించారు. వీటి ద్వారా వెయ్యిమందికి ఉద్యోగావకాశాలు కలగనున్నాయి. ఎన్నికల నాటికి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు మూడు లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో అహర్నిశలూ కృషిచేస్తున్నామని లోకేశ్‌ చెప్పారు. ఈ దిశగా.. ఐదు జిల్లాలను సైబరాబాద్‌లుగా తీర్చిదిద్దాలని నిర్ణయించామన్నారు.
ఎంఓయూలు వాస్తవరూపం 
ఎంఓయూలను వాస్తవరూపంలోకి తేవడంలో.. ఏపీ దేశంలోనే అగ్రభాగాన ఉందని లోకేశ్‌ వెల్లడించారు. సీఐఐ సదస్సులో ఐటీ శాఖ కుదుర్చుకున్న ఎంఓయూలు దాదాపుగా వాస్తవరూపం దాల్చాయన్నారు. జియో కంపెనీకి చెందిన ఎలెక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల్లో 80శాతం ఏపీలోనే చేస్తామని రిలయన్స్‌ సంస్థతో ఒప్పందం కుదిరిందని.. తిరుపతిలో 125 ఎకరాలు దీనికోసం సిద్ధం చేస్తున్నామని లోకేశ్‌ తెలిపారు. ప్రభుత్వం రూపొందించుకున్న విధానం వల్లే.. ఇది సాధ్యపడుతోందని లోకేశ్‌ చెప్పారు. 
పవన్‌ వ్యాఖ్యలపై స్పందించిన లోకేశ్‌  
తనను అవినీతిపరుడని ఆరోపించిన పవన్‌ వ్యాఖ్యలపై లోకేశ్‌ స్పందించారు. తాను అవినీతిపరుడైతే ఇన్ని సంస్థలు రాష్ట్రానికి వచ్చేవా అని ప్రశ్నించారు. తనపై ఆరోపణలను నిరూపించాల్సిన బాధ్యత కూడా వారిపైనే ఉంటుందని అన్నారు. రాజధాని నిర్మాణంపై ఆరోపణలు చేస్తూ.. పనులను అడ్డుకుంటామనడాన్ని తప్పుబట్టిన లోకేశ్‌.. పది మంది కోసం 35వేల ఎకరాలిచ్చిన రైతులను ఇబ్బందిపెట్టలేమని అన్నారు. విపక్షాలు అడ్డుకుంటే.. పెట్టుబడులు రావని, ఇది సరైంది కాదని లోకేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 

 

18:43 - July 8, 2018

విశాఖ : రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి లోకేశ్‌కు దమ్ముంటే ఎమ్మెల్సీగా రాజీనామాచేసి ఎమ్మెల్యేగా బరిలో దిగాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ సవాల్‌ విసిరారు. లోకేశ్‌ను దొడ్డిదారిన ముఖ్యమంత్రిని చేయాలని చూస్తే జనసేన సహించబోదని పవన్‌  హెచ్చరించారు. సమస్యలపై అవగాహన, విషయపరిజ్ఞానం లేని లోకేశ్‌.. ఉత్తరాంధ్ర సమస్యలపై తనతో చర్చకు రావాలని సవాల్‌ విసిరారు.

 

17:31 - July 7, 2018

విజయవాడ : జగన్‌, పవన్‌ కళ్యాణ్‌ కేంద్రం నడవమన్నట్లుగా నడుస్తున్నారని ఏపీ ప్రభుత్వ విప్‌ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నఆరోపించారు. పవన్‌ నటించిన సినిమాల్లో ఒక్క జాని సినిమా తప్ప మిగిలిన సినిమాలన్నీ వేరే డైరెక్టర్లు చేసినవే అని.. ఇప్పుడు రాజకీయం కూడా కేంద్రం డైరెక్షన్‌లోనే నడుపుతున్నాడన్నారు. చంద్రబాబును ఏపీ ముఖ్యమంత్రి పదవి నుంచి.. పవన్‌ రాజీనామా చేయమనడం హస్యాస్పదమన్నారు. ముఖ్యమంత్రిని రాజీనామా చేయమనే హక్కు పవన్‌కు లేదన్నారు. దీని వెనుక ఎవరున్నారనేది మోదీయా లేక జగనా అనేది పవన్‌ చెప్పలన్నారు.

 

22:13 - June 7, 2018

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌... పార్టీ మేనిఫెస్టోపై కసరత్తు స్టార్ట్ చేశారు. యాత్రలో తన దృష్టికి వచ్చిన అంశాలను ఒక్కొక్కటిగా నోట్ చేసుకుంటున్న పవన్ వాటినే ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టనున్నారు. స్థూలంగా జనసేన మేనిఫెస్టోలో ఏ కీలకాంశాలు ఉండబోతున్నాయన్నది ఆసక్తిగా మారింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌.. పార్టీ మేనిఫెస్టో రూపకల్పనపై దృష్టి సారించారు. ఆగస్టు 15 నాటికి మేనిఫెస్టో రిలీజ్‌ చేస్తానన్న పవన్‌.. ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే యాత్రలో తన దృష్టికి వచ్చిన అంశాలను పవన్‌ నోట్ చేసుకుంటున్నారు. ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులను పరిశీలించి వాటిని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని పవన్‌ భావిస్తున్నారు. 

యాత్రలో భాగంగానే పవన్‌, విద్యార్థులు, మహిళలు, రైతులు, మేధావులతోనూ భేటీ అవుతున్నారు. వారి సలహాలను తీసుకుంటున్నారు. వీటన్నింటినీ క్రోడీకరించి మేనిఫెస్టోలో చేర్చేందుకు ఏడుగురు సభ్యులతో ఓ కమిటీని నియమించాలని పవన్‌ యోచిస్తున్నారు. 

ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తోన్న పవన్‌ కల్యాణ్‌.. ఉద్దానం సమస్య పరిష్కారం అంశాన్ని మేనిఫెస్టోలో ప్రధానంగా చేరుస్తారన్న భావన కూడా వ్యక్తమవుతోంది. దీంతో పాటు.. రాబోయే రోజుల్లో తన పర్యటనల్లో భాగంగా వచ్చే సమస్యలనూ మేనిఫెస్టోలో చేరుస్తారని భావిస్తున్నారు. 

15:20 - May 26, 2018

శ్రీకాకుళం : ఉద్దానం కిడ్నీ బాధితులకు అండగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు సంఘీభావం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ దీక్ష ఒక హెచ్చరిక అని చెబుతున్న మధుతో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

15:12 - May 26, 2018

శ్రీకాకుళం : జిల్లా కేంద్రంలో ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు దీక్ష కొనసాగనుంది. పవన్‌ దీక్షకు మద్దతుగా అన్ని జిల్లా కేంద్రాల్లో జనసేన నాయకులు కూడా దీక్షలు చేస్తున్నారు. జనసేన అధినేత దీక్షకు వామపక్షాలు సంఘీభావం ప్రకటించాయి. 

 

11:09 - May 21, 2018

శ్రీకాకుళం : జనసేన అధినేత పవన్‌ కల్యాన్‌ ఇవాళ రెండోరోజూ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. పలాస నియోజకవర్గంలో పవన్‌ పోరాటయాత్ర కొనసాగనుంది. ఇచ్చాపురంలో జనసేన కార్యకర్తలతో భేటీ అయి అక్కడి సమస్యలను తెలుసుకుంటారు. అనంతరం సోంపేట థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ప్రాంతంలోని బీలా భూములను పరిశీలిస్తారు.

ఇచ్చాపురంలో ప్రారంభమైన పవన్ యాత్ర..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాత్ర ప్రారంభమయి సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులు, కార్యకర్తలతో కలిసి పవన్ కవాతు చేశారు. అనంతరం కవిటి మండలం కపాసుకుద్ది తీరపాత్రం వద్ద ఇచ్ఛాపురంలో సముద్రస్నానం ఆచరించి గంగమ్మకు పూజలు నిర్వహించి పనవ్ యాత్రను ప్రారంభించారు. ఈ క్రమంలో ప్రజల ఆశీస్సులు వుంటేనే ప్రజల సమస్యలపై జనసేన కృషి చేస్తుందన్నారు. వారి ఆశీస్సులు వుంటే వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందన్నారు. రెండవరోజు పలాసలో పర్యటిస్తున్న సందర్భంగా పవన్ ఎటువంటి పలుకులు పలకనున్నారు?అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

08:56 - May 16, 2018

చిత్తూరు : మీ సొంత జిల్లా వాసులకు న్యాయం చెయ్యలేరా అంటూ.. ముఖ్యమంత్రి చంద్రబాబును జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ప్రశ్నించారు. న్యాయం  జరిగే వరకూ హై రోడ్‌ బాధితుల పక్షాన అండగా నిలుస్తానని చిత్తూరు జిల్లా పర్యటనలో పవన్‌ చెప్పారు. నంద్యాల, విజయనగరం, శ్రీకాళహస్తిలో ఇచ్చిన నష్టపరిహారం చిత్తూరు జిల్లాలో ఎందుకివ్వలేదంటూ ముఖ్యమంత్రిని పవన్‌ ప్రశ్నించారు.

 

12:41 - April 24, 2018

చిత్తూరు : జననేత అధినేత పవన్‌ కల్యాణ్‌.. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా రాజకీయాలపై దృష్టి పెట్టారు. చిత్తూరు జిల్లాలో టీడీపీ ఆధిపత్యానికి తెరదించేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. దీనిలో భాగంగా చిత్తూరు జిల్లా పర్యటనకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు. 
చంద్రబాబు సొంత జిల్లాలో రాజకీయ పర్యటన 
గుంటూరులో నిర్వహించిన ఆవిర్భావ సభ తర్వాత జోష్‌ మీద ఉన్న పవన్‌ కల్యాణ్‌.. ఇప్పుడు జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో టూర్‌ చేసేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు.
పవన్‌ వ్యూహాత్మక అడుగులు
ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేసేందుకు పవన్‌ కల్యాణ్‌ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చి ప్రచారం చేసిన పవన్‌... చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకొంటున్నారని.. ఆయకు వ్యతిరేకంగా గళం విప్పారు. అటువంటి చంద్రబాబు సొంత జిల్లా నుంచి తన రాజకీయ పర్యటనను చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన కొందరు జనసేన నేతలు.. పవన్‌తో భేటీ అయ్యారు. వీరిలో భూబాధితులు కూడా ఉన్నారు.  జిల్లాలో చోటుచేసుకొంటున్న రాజకీయ పరిణామాలు, టీడీపీ నాయకల పోకడలు గురించి వపన్‌ దృష్టికి తెచ్చారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని టీడీపీ నేతలు సాగిస్తున్న భూందందాల ఆధారాలను పవన్‌కు అందచేసినట్టు సమాచారం. ఈ వ్యవహారంపై చలించిన పవన్‌ కల్యాణ్‌..  టీడీపీ నేతల భూదందాలను ఎట్టగట్టేందుకు చిత్తూరు జిల్లా పర్యటనకు ప్రణాళికు సిద్ధం చేసుకొంటున్నారు. 
పవన్‌ కల్యాణ్‌... నేరుగా విమర్శనాస్త్రాలు 
టీడీపీపై అప్పుడప్పుడూ ప్రత్యక్షంగా, ఎక్కువసార్లు ట్వీట్ల ద్వారా విరుచుకుపడుతున్న పవన్‌ కల్యాణ్‌... ఇప్పుడు నేరుగా విమర్శనాస్త్రాలను సంధించేందుకు సన్నద్ధమవుతున్నారు. హోదా పోరులో భాగంగా వామపక్షాలతో కలిసి... అనంతపురం, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ర్యాలీలు నిర్వహించాలని  ముందుగా నిర్ణయించినా... ఈనెల 16న హోదా సాధన సమితి బంద్‌తో ర్యాలీలను వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు జనసేన బలోపేతం కోసం జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - పవన్‌ కళ్యాణ్