న్యూస్ మార్నింగ్

07:32 - September 1, 2018

ఉమ్మడి హైకోర్టు విభజనపై ఏపీ ప్రభుత్వానికి, హైకోర్టుకు దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టుల ఏర్పాటుపై కేంద్రం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎకె సిక్రీ, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరురాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా వున్న హైదరాబాద్‌లో వేరే భవనంలో వేర్వేరుగా హైకోర్టుల ఏర్పాటుపై కేంద్రం ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా ఎందుకు హైకోర్టులను ఏర్పాటు చేయకూడదని కేంద్రం ఈ పిటిషన్‌లో పేర్కొంది. హైకోర్టు విభజన ఎంతమాత్రం జాప్యం చేయటం వీలులేదని తెలంగాణ తరపున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి, రెండు రాష్ట్రాలకు వేర్వేరు హైకోర్టులు ఏర్పాటు చేయాల్సిందేనని కేంద్ర న్యాయశాఖ తరపున అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌లు వాదించారు. కేంద్రం వాదనలతో తెలంగాణ ఏకీభవించింది. దీనిపై ఏపిలో హైకోర్టు భవన నిర్మాణాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా..దీనికి సంబంధించిన నిర్మాణాలు పూర్తి కాలేదని కేంద్రం న్యాయస్థానానికి తెలిపింది. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు రెండు ప్రతిపాదనలు పెట్టింది. ప్రస్తుత హైకోర్టు భవనంలో ఖాళీగా ఉన్న 24 హాళ్లలో ఏపికి వేరుగా హైకోర్టు ఏర్పాటు చేయవచ్చునని, లేదంటే రెండో ప్రత్యామ్నాయంగా ప్రస్తుత హైకోర్టు భవనాన్ని తాము ఖాళీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. చట్టసభలు, అధికారుల విభజన జరిగిందని, కానీ న్యాయవ్యవస్థ విభజన జరగలేదని ముకుల్‌ రోహత్గి కోర్టుకు విన్నవించారు. హైకోర్టు విభజన ఆలస్యం కావడం వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, న్యాయమూర్తుల్లో 40 శాతం ఉండాల్సిన తెలంగాణ వాటా కూడా లేదని కోర్టుకు తెలిపింది. కేసు వాదనల సమయంలో ఏపి ప్రభుత్వం తరపు న్యాయవాది గైర్హాజయ్యారు. దీంతో ఏపి ప్రభుత్వానికి, హైకోర్టుకు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను సుప్రీం కోర్టు ధర్మాసనం రెండు వారాలపాటు వాయిదా వేసింది. ఈ అంశంపై 10టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఏపీ బీజేపీ అధికార ప్రతినిథి ఆర్.డి. విల్సన్, కాంగ్రెస్ మాజీ ఎంపీ, తులసిరెడ్డి, టీఆర్ఎస్ నేత రాకేశ్ , టీడీపీ నేత లాల్ వజీర్ పాల్గొన్నారు. 

07:45 - August 14, 2018

తెలంగాణాలో అధికార పార్టీ అడుగులు ఎన్నికల వైపు పడుతున్నాయా? అనే సంకేతాలను సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లుగా సంకేతాలిస్తున్నారు. ఆర్నెళ్లు ముందుగా జరిగేవి ముందుస్తు ఎన్నికలు కాదన్నారు. కేంద్రం ముందు ఉంచాల్సిన డిమాండ్లను మరోసారి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించారు. సీఎం కేసిఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో 9 తీర్మానాలను ఆమోదించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తేల్చేశారు. సెప్టెంబర్‌ 2న ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో 20 లక్షలమందితో.. ప్రగతి నివేదన పేరిట బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. నాలుగేళ్లలో ఏం చేసిందీ అక్కడే చెబుతామన్నారు. పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లు సైతం సెప్టెంబర్‌లోనే ప్రకటిస్తామన్నారు. అభ్యర్థుల ఎంపిక బాధ్యతను పార్టీ అధ్యక్షుడికి కట్టబెడుతూ సమావేశం నిర్ణయించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అవకాశం దక్కుతుందంటూ మరోసారి భరోసా కల్పించే యత్నం చేశారు కేసీఆర్. దీన్ని బట్టి చూస్తే గులాబీ బాస్ ముందస్తు ఎన్నికలకు సంకేతమిస్తున్నట్లే కనిపిస్తోంది. ఇదే అంశంపై 10టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చ, ఈ చర్చలో కాంగ్రెస్ నేత కత్తి వెంకటస్వామి, టీఆర్ఎస్ నేత రాజమోహన్, బీజేపీ నేత కుమార్, నవ తెలంగాణ దినపత్రిక ఎడిటర్ వీరయ్య పాల్గొన్నారు. 

08:25 - August 11, 2018

ఈడీ ఛార్జీషీట్ లో భారతి పేరుందని వచ్చిన కథనాలపై వైసీపీ అధ్యక్షుడు జగన్ తీవ్రస్థాయిలో స్పందించారు. రఘురాం సిమెంట్స్ వ్యవహారంలో ఈడీ దాఖలు చేసిన ఫిర్యాదులో జగన్ సతీమణి వైఎస్ భారతిని 5వ నిందితురాలిగా పేర్కొంది. దీనిపై శుక్రవారం ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఛార్జీషీట్ ను సీబీఐ న్యాయస్థానం పరిగణలోకి తీసుకోకముందే పత్రికల్లో వార్తలు ఎలా ప్రచురిస్తారని ప్రశ్నించారు. సీబీఐ విచారణలో లేని అంశాలు ఇన్నేళ్ల తరువాత ఈడీ ఛార్జీషీట్ లోకి ఎందుకొచ్చాయని, వైఎస్ భారతికి ఈ కేసులతో సంబంధం ఏంటీ ? ప్రశ్నించారు. ఇదే అంశంపై నిర్వహించిన 
చర్చా కార్యక్రమంలో వైసీపీ నేత కొండారాఘవరెడ్డి, టీడీపీ నేత పట్టాభి రామ్ పాల్గొని, మాట్లాడారు. టీడీపీ, వైసీపీ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

08:47 - August 10, 2018

ఏపీలో టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఇదే ఏపీ రాజకీయాలపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు లక్ష్మీనారాయణ, టీడీపీ నేత సూర్యప్రకాశ్, వైసీపీ కిలారి రోశయ్య పాల్గొని, మాట్లాడారు. ఏపీలోని  విపక్షాల మధ్య ఐక్యత లోపించదన్నారు. రాష్ట్ర హక్కుల కోసం కేంద్రంపై పోరాడాల్సింది పోయి పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారని తెలిపారు. అందరూ ఐక్యంగా హక్కుల సాధన కోసం కేంద్రంపై పోరాడాలని సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

07:39 - July 31, 2018

గ్రామ పంచాయతీ సర్పంచ్‌ల పదవీకాలం మంగళవారంతో ముగియనుంది. దీంతో వీరి స్థానంలో ప్రత్యేకాధికారులను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోర్టు కేసుల కారణంగానే పంచాయితీ ఎన్నికలను వాయిదా వేశామని నిన్న గవర్నర్ భేటీలో కూడా తెలంగాణ ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ క్రమంలో ఆగస్టు 2వ తేదీ నుంచి పంచాయతీలు ప్రత్యేకాధికారులు ఏలుబడిలోకి వెళ్తాయి. కొత్తగా ఏర్పాటు చేసిస పంచాయతీలు కలుపుకుని మొత్తం 12,751 పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమిస్తున్నారు. దీన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. కానీ దీనిపై ముందుకే వెళ్లేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. కచ్చితంగా ప్రత్యేక అధికారులకే పంచాయితీల ఏలుబడులు వుంటాయని..అందుకనే కార్యదర్శుల సంఖ్య పెంచామని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. తెలిపారు. మరి ఇది గులాబీ బాస్ ఎత్తుగడగా చూడాలా? లేక టెక్నికల్ గా ప్రత్యేక అధికారుల చేతిలో పంచాయితీలు వుండటం కరక్టేనా? వంటి అంశంపై 10టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చ చేపట్టింది. ఈ చర్చలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకట్, కాంగ్రెస్ నేత శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నేత విద్యాసాగర్ పాల్గొన్నారు.

07:27 - July 28, 2018

అధికార, ప్రతిపక్షాలను జనసేన అధినేత తీవ్రంగా విమర్శలు సంధించారు. దీంతో ఏపీలో రాజకీయాలు మరింతగా వేడెక్కాయి. పవన్ కళ్యాణ్ సంధించిన ప్రశ్నలకు ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీ ప్రతి కౌంటర్ ఇవ్వకుండా..వ్యక్తిగతంగా వివర్శలు చేయటం సరికాదని రాజకీయ విశ్లేషకులు సైతం ఖండిస్తున్నారు. ఇవి జనసేనకు మేలు చేస్తాయా? జనసేన అధికారంలోకి వస్తుందా? అధికార ప్రతిపక్షాల పార్టీలను ఎదుర్కొని అధికారంలోకి వస్తారా? రాజకీయాలలో అపర చాణుక్యుడిగా పేరొందిన చంద్రబాబు వ్యూహాలను..ప్రతిపక్ష నేత జగన్ లను తట్టుకుని జనసేన నిలబడగలదా?..ఏపీ రాజకీయాల్లో విమర్శ ప్రతివిమర్శలతో వేడెక్కాయి. ఈ అంశంపై 10టీవీ న్యూస్ మర్నింగ్ లో చర్చ. ఈ చర్చలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వినయ్ కుమార్, జనసేన అధికార ప్రతినిథి అద్దేపల్లి శ్రీధర్, వైసీపీ నేత మధుసూధన్ రెడ్డి పాల్గొన్నారు. 

07:35 - July 19, 2018

విభజన హామీల అమల్లో ఏపీకి జరిగిన అన్యాయాన్నినిరసిస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై లోక్‌సభలో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం శుక్రవారం చర్చకు రానుంది. స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అధ్యక్షతన జరిగిన లోక్‌సభ కార్యకలాపాల కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం అంటే 20.07.2018వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రశ్నోత్తరాలను రద్దుచేసి..సాయంత్ర వరకు అవిశ్వాసంపై చర్చ కొనసాగిస్తామని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో అవిశ్వాసం చర్చలో టీడీపీని కడిపారేస్తామని బీజేపీ భీరాలు పలుకుతోంది. మరోవైపు టీడీపీ కూడా ఏపీ విషయంలో కేంద్రం తీరును, నిర్లక్ష్యాన్ని, రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని ఎండగడతామని ధీమా వ్యక్తంచేస్తోంది. మరి శుక్రవారం అవిశ్వాసంపై పార్లమెంట్ లో ఏం జరగనుంది? బీజేపీ నమ్మకమేంటి? టీడీపీ ధీమా ఏమిటి? ఎవరిని ఎవరు అడిగేస్తారు? ఎవరిని ఎవరు కడిగేస్తారు?  ఈ అంశంపై 10టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చ.  ఈ చర్చలో బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి, టీ.కాంగ్రెస్ అధికార ప్రతినిథి ఇందిరా శోభన్, టీడీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పాల్గొన్నారు.  ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

07:31 - July 18, 2018

నేటి నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలలో కూడా టీడీపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. గత సమావేశాలలో తమిళనాడు, కర్ణాటకల మధ్య నెలకొన్న కావేరీ నదీ జలాల వివాదాన్ని వంకతో అవిశ్వాసంపై చర్చ చేపట్టకుండా తప్పించుకున్న బీజేపీ పార్టీ ఏపీకి చేస్తున్న అన్యాయాన్ని ఎత్తి చూపేందుకు ఈ సమావేశాలలో కూడా అవిశ్వాసంతో సిద్దమవుతోంది టీడీపీ. ఈ క్రమంలో పొరుగున వున్న మరో తెలుగు రాష్ట్రం అధికార పార్టీ గత సమావేశాలలో బీసీల రిజర్వేషన్ బిల్లు పేరుతో ఉభయసభల్లోను ఆందోళన చేపట్టింది. ఈ నేపథ్యంలో ఈ సమావేశాలలోనైనా ఏపీ విభజన హామీలపై టీడీపీ ఇచ్చే అవిశ్వాస తీర్మానానికి టీఆర్ఎస్ పార్టీ మద్దతునిస్తుందా? లేక గతంలో వలెనే తనదారి తనదే అనే తీరుగా వ్యవహరిస్తుందా? అనే అంశంపై 10టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చ. ఈ చర్చలో టీఆర్ఎస్ నేత రాకేశ్, బీజేపీ నుండి ఆచారి, టీడీపీ నుండి ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పాల్గొన్నారు. ఈ అంశంపై మరింత సమాచారానికి ఈ వీడియోను క్లిక్ చేయండి..

07:24 - July 17, 2018

ఒక పక్క జమిలి ఎన్నికల హంగామా కొనసాగుతోంది. మరోపక్క పార్టీల్లో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ లో సీట్ల కుమ్ములాటలు మొదలయ్యాయి. మాజీ ఎంపీ, క్రికెట‌ర్ అజారుద్దీన్ కామెంట్స్‌ కాంగ్రెస్‌ పార్టీలో కాక‌రేపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేస్తానన్న అజారుద్దీన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత అంజ‌న్‌కుమార్‌ యాదవ్‌ ఫైర్‌ అయ్యారు. సికింద్రాబాద్‌ నుండి పోటీ చేయడానికి అజారుద్దీన్‌ ఎవరని మండిపడ్డారు. మరి ప్రజాస్వామ్యంలో కుమ్ములాటలు కామనేనా? ఈ అంతర్గత కలహాలతో తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ టీఆర్ ఎస్ తో కాంగ్రెస్ ఎలా పోటీ పడనుంది? వంటి అంశాలతో ఈనాడు న్యూస్ మార్నింగ్ లో చర్చ. ఈ చర్చలో కాంగ్రెస్ నేత కైలాశ్ నాథ్, బీజేపీ నేత సుభాష్, టీఆర్ఎస్ నేత విద్యా సాగర్ పాల్గొన్నారు. ఈ అంశంపై మరింత సమాచారానికి ఈ వీడియోను క్లిక్ చేయండి.

11:40 - July 13, 2018

తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. పార్టీలన్నీ తమ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు హామీలు గుప్పిస్తున్నాయి. అన్ని పార్టీల నాయకులు ఒకరి తప్పులను మరొకరు ఎత్తి చూపుకుంటున్నారు. పరస్పర విమర్శలు, ఆరోపణలతో ఎన్నికల రాజకీయాలను రక్తికట్టిస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ రైతుబంధు, రైతు బీమా పథకాలను ఎన్నికల వేగం పెంచగా... ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా తామేమీ తక్కువ కాదన్నట్టు గులాబీ పార్టీకి దీటుగా తమ వ్యూహానికి పదును పెడుతోంది. ఓ వైపు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తూనే మరోవైపు కేసీఆర్‌ హామీలకు కౌంటర్‌ ఇస్తూ.. అన్నదాతలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ అంశంపై 10టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి, కాంగ్రెస్ నేత పేట రమేశ్, టీఆర్ఎస్ నేత సత్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - న్యూస్ మార్నింగ్