న్యాయం

18:22 - November 13, 2018

హైదరాబాద్: 65మంది అభ్యర్థులతో విడుదల చేసిన తొలి జాబితా తెలంగాణ కాంగ్రెస్‌లో కాక రేపిన సంగతి తెలిసిందే. టికెట్ల కేటాయింపుపై పలువురు సీనియర్లు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీలకు అన్యాయం జరిగిందని వాపోయారు. ఇలా అయితే కాంగ్రెస్‌కు నష్టం తప్పదని హెచ్చరించారు. టికెట్ల కేటాయింపులపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా స్పందించారు. అన్ని సామాజికవర్గాలకు న్యాయం చేసేలా తొలి జాబితా ఉందన్నారాయన. టికెట్లు రాని వారు అసంతృప్తికి లోను కావొద్దన్నారు. అందరికీ పార్టీలో తగిన ప్రాధాన్యత ఉంటుందన్నారు. అసంతృప్త నేతలతో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని చెప్పారు. టీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు బీసీలకు కేటాయించినట్టు వివరించారు. ఈ నెల 14 లేదా 15న రెండో జాబితా విడుదల చేస్తామని కుంతియా వెల్లడించారు.

17:59 - October 31, 2018

ఒడిశా : ప్రజాప్రతినిధులంటే ప్రజలకు సేవ చేసేవారని అర్థం. కానీ నేటి ప్రజా ప్రతినిధులు మాత్రం తమ స్వార్థం కోసమే రాజకీయాలలోకి వచ్చేవారే ఎక్కువగా వున్నారు. ఓట్ల కోసం ప్రజల వద్దకు వచ్చే నాయకులు వారి సంక్షేమం కోసం కట్టుబడి వున్నామనీ..మీ సేవల కోసమే మేము వచ్చామనీ..మీకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు మేమున్నామనీ వాగ్ధానాలు చేస్తుంటారు. కానీ అధికారం లోకి వచ్చాక ఆ మాటే గుర్తుండదు. కానీ ఈ మాత్రం తన నియోజక వర్గంలో జరిగిన ఓ దారుణానికి బాధితులకు న్యాయం చేయలేకపోతున్నానని తీవ్ర మనస్థాపానికి గురై తన పదవికి రాజీనామా చేశారు.  ఆయనే ఎమ్మెల్యే కృష్ణ చంద్ర సగారియా.

Related image2017 అక్టోబర్ 10న ఒడిశా కోరాపూట్ జిల్లాలోని ముసగుడా గ్రామంలో 14 ఏళ్ల బాలిక.. మార్కెట్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా.. నలుగురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ కేసులో పోలీసులు నిందితులను అరెస్టు చేయకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు.. ఈ ఏడాది జనవరి 22న ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో ఎన్నిసార్లు నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేసినప్పటికీ నిందితులను పోలీసులు అరెస్టు చేయలేదు. తాను కూడా ఈ కేసు విషయంలో పోరాడారు. కానీ న్యాయం జరగలేదు సరికదా నిందితులను కనీసం అరెస్ట్ కూడా చేయలేదు. 

Image result for krushna chandra sagaria mlaతన సొంత నియోజకవర్గంలో ఈ ఘటన జరిగి ఏడాది పూర్తయిన్నప్పటికీ.. నిందితులను అరెస్టు చేయకపోవడంపై కోరాపూట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కృష్ణ చంద్ర సగారియా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తాను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఏం లాభం? ఒక బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయలేనప్పుడు ఎమ్మెల్యే పదవిలో ఉండటం సరికాదని భావించిన కృష్ణ చంద్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఘటనకు నిరసనగానే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు కృష్ణ చంద్ స్పష్టం చేశారు.

13:46 - July 23, 2018

ఢిల్లీ : రాజ్యసభలో ఏపీకి న్యాయం చేసేందుకు రాజీపడకుండా ప్రయత్నిస్తామని కాంగ్రెస్‌ నేత కేవీపీ అన్నారు. ఏపీ ప్రజలకు రాహుల్‌గాంధీ విశ్వాసాన్ని కల్పించారని తెలిపారు. 2019లో బీజేపీ ఇంటికి వెళ్లక తప్పదని కేవీపీ విమర్శించారు.  రాజ్యసభలో ఏపీ విభజన చట్టం అమలుపై చర్చకు ఆయన నోటిసులిచ్చారు.

 

21:32 - June 6, 2018

బాధిత మహిళలు పోలీసు స్టేషన్లు, కోర్టులకు ఎలా వెళ్లాలి ? ఎవరిని అప్రోచ్ అవ్వాలి..? బాధిత మహిళలు న్యాయం పొందడం ఎలా ? ఇదే అంశంపై మావని మైరైట్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో అడ్వకేట్ పార్వతి పాల్గొని, పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

18:12 - May 8, 2018

సంగారెడ్డి : జిల్లాలోని పటాన్‌చెరు మండలం వెలిమలలో గాడియమ్‌ స్కూల్‌లో మట్టిపెల్లలు పడి మృతి చెందిన కార్మికులకు న్యాయం చేయాలని సీఐటీయూ నేతలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజయ్య జిల్లా కలెక్టర్‌లను కలిశారు. ఎలాంటి భద్రతా పరిమణాలు పాటించకుండా పాఠశాల యాజమాన్యం కార్మికులతో పని చేయిస్తుందని మండిపడ్డారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబీకులకు 30 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలన్నారు. 

 

17:00 - April 17, 2018

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ సర్కారుకు హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఈ ఇద్దరు నేతల శాసనసభ్యత్వం రద్దు చెల్లదని తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడారు. న్యాయం గెలిచిందన్నారు. తన గన్ మెన్లను తొలగించి సీఎం కేసీఆర్ పైశాచిక అనందం పొందారని అన్నారు. తనను మానసిక వేదనకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

11:01 - February 9, 2018

ఢిల్లీ : పార్లమెంట్ లో టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ ఎంపీల ఆందోళన కొనసాగనుంది. టీడీపీ ఎంపీలు కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన కోరుతున్నారు. ఆందోళన కొనసాగించానలని చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ లో ఎంపీలకు సూచించారు. ఏపీ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. ఏపీ భవన్ అంబేద్కర్ విగ్రహం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీలు మాట్లాడుతూ ఏపీకి న్యాయం చేయాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

19:16 - January 11, 2018

హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్న సంగీత తన అత్తారింట్లోకి అడుగు పెట్టింది. భర్త శ్రీనివాస్ రెడ్డి ఇంటి ఎదుట 54 రోజులుగా ఆమె పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో మియాపూర్ కోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. అత్తింట్లోనే ఆమె ఉండవచ్చునని..సంగీత..ఆమె పాపను జాగ్రత్తగా చూసుకోవాలని పలు ఆదేశాలు జారీ చేసింది. దీనితో గురువారం సాయంత్రం సంగీత తన పాపతో ఇంటి తాళాన్ని పగులగొట్టి లోనికి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆమె టెన్ టివితో మాట్లాడారు.

‘54 రోజులుగా బయటే ఉంటున్నా. ఇది అందరికీ తెలిసిందే. కోర్టు ద్వారా తేల్చుకుంటానని తన భర్త చెప్పడంతో నేను కూడా కోర్టుకు వెళ్లాను. తనకు..పాపకు రక్షణ కల్పించాలని..తగిన సహాయం చేయాలని పిటిషన్ కోరాను. దీనితో ఇంట్లోకి వెళ్లవచ్చనని..మెంటెనెన్స్ కూడా ఇవ్వాలని కోర్టు పేర్కొనడం సంతోషంగా ఉంది. కోర్టుకు ధన్యవాదాలు. తనలాగే ఇతర మహిళలు ఇబ్బందులు పడవద్దు..పోరాటం చేయాలి..భర్త శ్రీనివాస్ రెడ్డి మొదటి నుండి వేధించాడు. ఏలాంటి నమ్మకం లేదు. హ్యాపీగా చూసుకుంటానని..చెప్పడం..తనకు నమ్మకం కలిగిన తరువాతే కేసులు ఉపసంహరించుకుంటాను. తనకు..తన పాప హక్కుల కోసం పోరాటం చేస్తా. తన వెంట ఉన్న మహిళా సంఘాలకు..స్థానికులకు..తనకు మద్దతిచ్చిన వారందరికీ కృతజ్ఞతలు' అని సంగీత తెలిపారు. 

17:56 - January 7, 2018

సిరిసిల్ల : నేరేళ్ల ఘటన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సిద్దిపేట నుండి చేపట్టిన పాదయాత్ర తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చేరింది. నేరేళ్ల బాధితులకు భరోసా కల్పించేందుకు పాదయాత్ర చేస్తున్నామంటున్న అఖిలపక్షం నాయకులతో 10 టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. ఆ వివరాలను వీడియలో చూద్దాం... 
 

11:49 - November 24, 2017

హైదరాబాద్ : తనకు న్యాయం చేయాలని కోరుతూ పోరాటం చేస్తున్న సంగీతకు మద్దతు పెరుగుతోంది. భర్త శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు ఆందోళన చేస్తున్న సంగీత పోరాటం ఆరో రోజుకు చేరుకుంది. ఆమెకు మహిళా సంఘాలు...వివిధ సంఘాలు మద్దతు తెలుపుతూ ఆందోళనలో పాల్గొంటున్నారు. ఆమెకు న్యాయం చేసేందుకు ఎంపీ మల్లారెడ్డి ముందుకొచ్చారు. సంగీత మామ అయిన బాల్ రెడ్డితో చర్చలు జరుపుతానని..ఆర్థిక సహాయం చేసేందుకు కృషి చేస్తానని ఎంపీ మల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సంగీత మామ...ఇతర వారితో ఎంపీ మల్లారెడ్డి..మహిళా సంఘాల ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా టెన్ టివితో సంగీత మాట్లాడారు. తన దగ్గరకు అత్తా..మామ. రావాలని, వారితో మాట్లాడిన తరువాతే..స్పష్టమైన హామీనిచ్చిన తరువాతే ఆందోళన విరమిస్తానని సంగీత ఖరాఖండిగా చెప్పింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Pages

Don't Miss

Subscribe to RSS - న్యాయం