నోటా

17:58 - October 27, 2018

విజయ్ దేవరకొండ నటించిన నోటా ఈ నెల 5న విడుదలైంది. తెలుగుతో పాటు తమిళ్‌లోనూ ఫ్లాప్‌టాక్ తెచ్చుకుంది.. ఫస్ట్‌డే టాక్‌తో సంబంధం లేకుండా, అడ్వాన్స్ బుకింగ్‌తో పాటు, ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చే సరికి, డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ అయ్యే చాన్స్ ఉంది అనుకున్నారు. కట్ చేస్తే, నోటా క్లోజింగ్ కలెక్షన్స్ మాత్రం ఊహించని షాక్ ఇచ్చాయి.. 23 కోట్లకి థియేట్రికల్ రైట్స్ అమ్మితే, ఫుల్‌రన్‌లో పది కోట్లు కూడా రాబట్టలేక పోయింది.. నోటా ఓవరాల్ డిస్ట్రిబ్యూటర్ షేర్ లెక్కలు ఇలా ఉన్నాయి..
నైజాం: 3.42 కోట్లు, సీడెడ్: 1.05 కోట్లు, నెల్లూరు:‌ 0.32 కోట్లు, కృష్ణ: 0.53 కోట్లు, గుంటూరు: 0.60 కోట్లు, తూర్పుగోదావరి: 0.58 కోట్లు, పశ్చిమగోదావరి: 0.37 కోట్లు, ఉత్తరాంధ్ర: 0.82 కోట్లు... టోటల్, ఏపీ+తెలంగాణ షేర్ 7.69 కోట్లు. మిగతా ఏరియాలు 0.83 కోట్లు. ఓవర్సీస్ 1.30 కోట్లు. టోటల్ వరల్డ్ వైడ్ షేర్  9.82 కోట్లు. ఈ లెక్కన నోటా డిస్ట్రిబ్యూటర్‌లకు 55 శాతానికి పైగా నష్టాలు వచ్చాయి..

 

10:45 - September 12, 2018

ఢిల్లీ : నోటా...ఎందుకు తీసేశారు..అయ్యో వచ్చే ఎన్నికల్లో ఆప్షన్ లేకపోతే ఎలా ? అంటూ కంగారు పడకండి. పూర్తిగా చదవండి. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు నచ్చకపోతే తిరస్కరణ ఓటు వేసే అధికారాన్ని కల్పిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటర్లకు అవకాశం కల్పించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో అభ్యర్థుల గుర్తుతోపాటు నోటా (నన్ ఆఫ్ ది ఎబవ్) ను ఏర్పాటు చేశారు.

కానీ ఈ నోటా ఆప్షన్ ఆ ఎన్నికల్లో ఉండదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్‌ పేపర్లలో నోటా గుర్తును తొలగిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) మంగళవారం ప్రకటించింది. ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్‌కు సవరణలు సూచిస్తూ సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ల బెంచ్‌ తీర్పు చెప్పింది. కేవలం రాజ్యసభ ఎన్నికలకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపింది. లోక్ సభ, శాసనభ వంటి ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రమే నోటా ఉంటందని వెల్లడించింది. 

 

10:47 - August 29, 2017

కాకినాడ : కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 7గంటల నుండి పోలింగ్ ప్రారంభమైంది. ఈవీఎంలలో నోటా ఆప్షన్ లేకపోవడంపై ఓటర్లు తీవ్ర అభ్యంతరం తెలియచేస్తున్నారు. స్థానిక ఎన్నికలు కావడంతో నోటా ఆప్షన్ పెట్టలేదని అధికారులు పేర్కొన్నారు.

ఉదయం వర్షం పడుతుండడంతో మందకొడిగా పోలింగ్ ప్రారంభమైందని చెప్పవచ్చు. ఉదయం 9గంటలకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలుతున్నారు. మున్సిపల్ స్కూల్ వద్ద ఓటర్లు బారులు తీరి నిలుచున్నారు. బూత్ నెంబర్ 36, 37లలో భద్రతను కట్టుదిట్టంగా ఏర్పాటు చేశామని టెన్ టివితో డీఎస్పీ పేర్కొన్నారు. మరోవైపు విద్యుత్ కోతతో పోలింగ్ కేంద్రాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వెబ్ కాస్టింగ్ కూడా నిలిచిపోయింది. 

21:45 - August 1, 2017

ఢిల్లీ : రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొనే ఓటర్లకు నోటా వినియోగించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై పార్లమెంట్‌లో దుమారం రేగింది. రాజ్యసభలో కాంగ్రెస్‌ నేత ఆనంద్‌ శర్మ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇవి సాధారణ ఎన్నికలు కావని... రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నోటా లేదని...అలాంటిది ఈ ఎన్నికల్లో నోటా తీసుకురావాలన్న నిర్ణయం రాజకీయ దురుద్దేశమేనని ఆనంద్‌శర్మ అన్నారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. నోటాను ఎన్నికల కమిషన్‌ జారీ చేసిందని, దీనిపై చర్చించడానికి రాజ్యసభ వేదిక కాదని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. విపక్షాల హంగామా మధ్య సభ పలుమార్లు వాయిదా పడింది. గుజరాత్‌ రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో నోటాను వినియోగించనుండడం గమనార్హం. 

 

Don't Miss

Subscribe to RSS - నోటా