నరేంద్రమోదీ

21:24 - August 31, 2018

ఢిల్లీ : 1991లో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య తరహాలోనే ప్రధాని మోదిని హత్య చేసేందుకు మావోయిస్టులు కుట్ర పన్నారని మహారాష్ట్ర అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్ పరమ్‌బీర్‌ సింగ్‌ తెలిపారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆధారాలతోనే పౌర హక్కుల నేతలను అరెస్ట్‌ చేసినట్లు మీడియా సమావేశంలో ఎడిజి స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించడం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు వారు కుట్ర పన్నారని, మావోయిస్టులు వేసిన ప్రణాళికలకు పౌర హక్కుల నేతలు సహకరించారని ఎడిజి వెల్లడించారు. ఈ కుట్రలో ఓ ఉగ్రవాద సంస్థకు కూడా ప్రమేయం ఉందని చెప్పారు. మానవ హక్కుల నేతలు మావోలతో సంభాషణలు జరిపిన కొన్ని లేఖలను ఏడీజి మీడియా ముందు ప్రదర్శించారు. గ్రనేడ్లు కొనేందుకు డబ్బులు ఇవ్వాల్సిందిగా ఆ లేఖలో ఉంది. భీమా-కోరేగావ్‌లో జరిగిన అల్లర్లతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో పౌర హక్కుల నేతలు వరవరరావు, సుదా భరద్వాజ్, గౌతమ్ నవలక, అరుణ్ ఫెరిరా, వెర్నన్ గొంజాలెజ్‌లను ఆగస్టు 28వ తేదీన పుణె పోలీసులు అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాళ్లను గృహనిర్బంధంలో ఉంచారు.

08:40 - August 15, 2018

ఢిల్లీ : భారతదేశం ఓ సానుకూల దృక్పథంతో ముందుకెళ్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఎర్రకోటపై నిర్వహించిన 72వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో మోదీ పాల్గొన్నారు. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం దేశ ప్రజలకు ఉద్ధేశించి ప్రధాని ప్రసంగించారు. భారతదేశం ఒక ఆత్మవిశ్వసంతో ముందుకెళ్తోంది. స్వప్నాన్ని సాకారం చేసే దిశగా దేశం నిరంతరం పరిశ్రమిస్తోంది.

నీలగిరి పుష్పంలా భారత్ వికసిస్తోంది : మోదీ
నవ చైతన్యం, నూతనోత్తేజంతో దేశం పురోగమిస్తోంది. 12 ఏళ్లకోసారి పుష్పించే నీలగిరి పుష్పాల మాదిరిగా దేశం వికసిస్తోంది. ఏపీ, తెలంగాణ, మిజోరాం, ఉత్తరాఖండ్‌ బాలికలు దేశ గౌరవాన్ని ఇనుమడింపజేశారు. ఎవరెస్టుపై మన బాలికలు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఆత్మవిశ్వాసాన్ని చాటారు. పార్లమెంటు సమావేశాలు అత్యంత ఫలప్రదమయ్యాయి. పేదలు, దళితులు, వెనుకబడి వర్గాల సమస్యలపై సుదీర్ఘ చర్చ సాగింది. సామాజిక న్యాయం దిశగానూ సమావేశాలు ఫలప్రదమయ్యాయి. దేశ రక్షణలో త్రవిధ దళాలు ఆత్మార్పణ చేస్తున్నాయి. త్యాగధనులందరికీ దేశ ప్రజల పక్షాన ప్రణామం చేస్తున్నానన్నారు.

ఎంతోమంది త్యాగాల ఫలితమే ఈ స్వాతంత్ర్యం : మోదీ
పూజ్య బాపూజీ నేతృత్వంలో ఎందరో దేశం కోసం ప్రాణ త్యాగం చేశారని ప్రధాని గుర్తు చేశారు. వారి త్యాగాల ఫలితంగా దేశంలో పన్నెండేళ్లకోసారి నీలగిరి పుష్పంలా దేశం వికసిస్తోంని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి పథంలో భారత్ దూసుకుపోతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రపంచ దేశాల్లో భారత ప్రతిష్ట పెరుగుతోందన్నారు.

భారత వీరుల బలిదానానికి జలియన్ ఘటన నిదర్శనం: మోదీ
మన దేశ వీరుల బలిదానానికి బలియన్ వాలా బాగ్ ఘటన నిదర్శనంగా నిలుస్తోందనీ..జలియన్ వాలా బాగ్ ఘటనకు వందేళ్లు కావస్తోందని ఎర్రకోటలో జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం ప్రధాని ప్రసంగంలో తెలిపారు. దేశ రక్షణలో మన సైనికులు అనునిత్యం ప్రాణాలకు తెగించి పరిరక్షిస్తున్నారని వారందరికి..దేశానికి సేవలందిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నామన్నారు.

టీమిండియా స్వప్నం సాకారమే లక్ష్యంగా నిరంతరం కృషి..
పేద, మధ్య తరగతి ప్రజలు ముందడుగు వేసేందుకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు కృషి చేస్తున్నాం. గిరిజనులు, దళితులు దేశ ప్రగతిలో భాగస్వాములను చేసేందుకు కృషి చేస్తున్నాం. 125 కోట్ల భారతీయులను ఒక్కటి చేసేందుకు కృషి చేస్తున్నాం. టీమిండియా స్వప్నం సాకారమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నాం. ఇంటింటికీ మరుగుదొడ్లు నిర్మించాలన్న స్వప్నాన్ని సాకారం చేశాం. ప్రతి ఇంటికీ గ్యాస్‌ కనెక్షన్లు, ఆప్టికల్‌ ఫైబర్‌ లక్ష్యాలు నెరువేరుతున్నాయి.

నవ చైతన్యం, ఆత్మవిశ్వాసంతో దేశం పురోగమిస్తోంది : మోదీ
నవ చైతన్యం, ఆత్మవిశ్వాసంతో దేశం పురోగమిస్తోందన్నారు. సాహసాన్ని సాకారం చేసే దిశగా దేశం నిరంతరం శ్రమిస్తోందన్నారు. 12 ఏళ్లకు ఓసారి పుష్పించే నీలగిరి పూలలా దేశం వికసిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మిజోరం, ఉత్తరాఖండ్ బాలికలు దేశ గౌరవాన్ని ఇనుమడింపజేశారని ప్రశంసించారు. మన బాలికలు ఎవరెస్ట్‌ను అధిరోహించి ఆత్మవిశ్వాసాన్ని నలుదిశలా చాటారన్నారు.

08:21 - August 15, 2018

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బాలికలు దేశ గౌరవాన్నిఇనుమడింపజేశారని ప్రధాని నరేంద్రమోదీ 72వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రకోటపై మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం తన ప్రసంగంలో పేర్కొన్నారు. నవ చైతన్యం, ఆత్మవిశ్వాసంతో దేశం పురోగమిస్తోందన్నారు. సాహసాన్ని సాకారం చేసే దిశగా దేశం నిరంతరం శ్రమిస్తోందన్నారు. 12 ఏళ్లకు ఓసారి పుష్పించే నీలగిరి పూలలా దేశం వికసిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మిజోరం, ఉత్తరాఖండ్ బాలికలు దేశ గౌరవాన్ని ఇనుమడింపజేశారని ప్రశంసించారు. మన బాలికలు ఎవరెస్ట్‌ను అధిరోహించి ఆత్మవిశ్వాసాన్ని నలుదిశలా చాటారని ప్రధాని మోదీ ప్రశంసించారు.

స్వంత్ర్య వేడుకల్లో ప్రముఖులు..
ఎర్రకోటలో 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కేంద్రం ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రధాని మోదీ ఐదవసారి జాతీయ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఈ వేడుకల్లో రక్షణ శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు పలువురు మంత్రులు, మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవెగౌడ, ప్రముఖులు పాల్గొన్నారు. జెండాను ఆవిష్కరించిన అనంతరం దేశ ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతికవితను ప్రస్తావించారు. 

15:16 - June 17, 2018

ఢిల్లీ : నీతి ఆయోగ్‌ పాలక మండలి భేటీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రసంగంలో అసత్యాలు వల్లెవేశారని బీజేపీ ఎంపీ జీవీల్‌ నరసింహారావు విమర్శించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై రెండు నెలులుగా ఓ ఒక్క అధికారి కానీ, మంత్రికానీ అడగకపోవడాన్ని జీవీఎల్‌ తప్పుపట్టారు. కనీసం లేఖలు కూడా రాకపోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర సమస్యల పరిష్కారాన్ని గాలికొదిలేసి.. కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని జీవీఎల్‌ నరసింహారావు మండిపడ్డారు. 

21:21 - June 16, 2018

ఢిల్లీ : రేపు ఉదయం నీతి అయోగ్ 4వ పాలక మండలి సమావేశం జరగనుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీకి చేరుకున్నారు. గతేడాది చేసిన అభివృద్ధి, భవిష్యత్‌లో చేపట్టాల్సిన అభివృద్ధిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు 15వ ఆర్ధిక సంఘం సిఫార్సులు, జీఎస్టీతో రాష్ట్రాలకు కలుగుతున్న ఇబ్బందులపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రులు లేవనెత్తనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఏపీకి జరిగిన అన్యాయంపై నీతి అయోగ్‌ సమావేశంలో ప్రస్తావించాలని చంద్రబాబు యోచిస్తున్నారు. మోదీ ముగింపు ఉపన్యాసాన్ని బహిష్కరించే అంశంపై పలు రాష్ట్రాల సీఎంలతో చర్చించిన అనంతరం బాబు నిర్ణయం తీసుకోనున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత నీతి అయోగ్‌ సమావేశం
ఆదివారం ఉదయం 10గంటలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత నీతి అయోగ్‌ సమావేశం కానుంది. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లు, సీనియర్‌ అధికారులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో గతేడాది చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్‌లో చేపట్టవలసిన అభివృద్ధిపై చర్చించనున్నారు. ఇక రైతుల రెట్టింపు ఆదాయం, ఆయుష్మాన్‌ భారత్‌, నేషనల్‌ న్యూట్రిషన్‌ మిషన్‌ పధకాలు.. 150వ మహాత్మాగాంధీ జయంతి సంబరాలలాంటి మొత్తం ఆరు అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

ఢిల్లీకి చేరుకున్న పలు రాష్ట్రాల సీఎంలు..
ఇదిలావుంటే.. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఇప్పటికే అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీకి చేరుకున్నారు. 15వ ఆర్ధిక సంఘం సిఫార్సులు, జీఎస్టీ వల్ల ఎదురైన ఇబ్బందులను ఈ సమావేశంలో ప్రస్తావించాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోచిస్తున్నారు.

ఏపీకి జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించే యోచనలో చంద్రబాబు
ఇక ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత మోదీ, చంద్రబాబులు తొలిసారి ఈ సమావేశంలో ఎదురుపడనున్నారు. ఈ సమావేశంలో చంద్రబాబు.. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై మాట్లాడే అవకాశం ఉంది. ప్రత్యేక హోదా, విభజన చట్టంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలు కేంద్రం అమలు చేయకపోవడం, వివిధ అంశాల్లో కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎత్తిచూపే అవకాశం ఉంది. చంద్రబాబు 20 పేజీల నివేదిక సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నీతి అయోగ్‌ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై చంద్రబాబు టీడీపీ ఎంపీలతో చర్చించారు. అలాగే... బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ చంద్రబాబు చర్చించారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు పశ్చిమబెంగాల్‌, కర్నాటక, కేరళ సీఎంలతో భేటీ అయ్యారు. అధికారాల కోసం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నివాసంలో ధర్నా చేస్తున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఇప్పటికే అండగా ఉంటానని హామీ ఇచ్చిన చంద్రబాబు... పలువురు సీఎంలతో పాటు వెళ్లి మద్దతు తెలిపారు.

నీతి అయోగ్ సమావేశంపై ఉత్కంఠ..
ఇక ఈ సమావేశంలో 15వ ఆర్ధిక సంఘం సిఫార్సులు, జీఎస్టీ వల్ల ఎదురయ్యే ఇబ్బందులను ప్రస్తావించి.. అవసరమైతే ప్రధాని మోదీ ముగింపు ఉపన్యాసాన్ని చంద్రబాబు, బీజేపీయేతర రాష్ట్రాలు బహిష్కరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఆదివారం జరిగే నీతి అయోగ్‌లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న ఉత్కంఠ నెలకొంది. 

19:19 - June 15, 2018

ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షత నీతి అయోగ్ సమావేశం 17వ తేదీన జరుగనుంది. తెలుగు రాష్ట్రాలకు నిధుల విడుదల విషయంలో కేంద్రం అవలంభిస్తున్న తీరుపై తెలుగు రాష్ట్రాల సీఎంలు అసహనం వ్యక్తంచేస్తున్నాయి. ఈ క్రమంలో నీతి అయోగ్ సమావేశంలో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరయి విజయన్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, కర్ణాటక సీఎం కుమారస్వామిలతో మాట్లాడారు. కాగా ఈ సమావేశాన్ని కొందరు సీఎంలు బహిష్కరించాలనే యోచనలో వున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో నీతి అయోగ్ సమావేశం ఎలా జరగనుంది? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. 'న్యూ ఇండియా 2022' అనే ప్రధాన ఎజెండాతో ఈ నీతి అయోగ్ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో నీతి అయోగ్ సమావేశం ఎలా జరగనుంది? దీనిపై రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలా స్పందించనున్నారు? అనే అంశాలపై చర్చ. ఈచర్చలో సీపీఎం రాష్ట్రకమిటీ సభ్యులు నంద్యాల నర్శింహారెడ్డి,టీఆర్ఎస్ నేత శేఖర్ రెడ్డి, బీజేపీ అధికార ప్రతినిథి ప్రకాశ్ రెడ్డి, టీడీపీ నేత మాల్యాద్రి పాల్గొన్నారు. 

18:08 - May 12, 2018

ఉత్తరప్రదేశ్ : నేపాల్‌ జనకపురిలో ప్రధాని నరేంద్రమోది నిన్న ప్రారంభించిన బస్సు అయోధ్యకు చేరుకుంది. అయోధ్యలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ బస్సుకు స్వాగతం పలికారు. భారత్‌ నేపాల్‌ దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాల్లో కొత్త అధ్యయనం మొదలైందని ఈ సందర్భంగా యోగి అన్నారు. ప్రధాని మోది, నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ జనక్‌పురి-అయోధ్య నడుమ బస్సు సేవలను శుక్రవారం పచ్చ జెండా ఊపి ప్రారంభించిన విషయం తెలిసిందే. రామాయణ్‌ సర్కిట్ భారత్‌-నేపాల్‌ దేశాల మధ్య టూరిజం అభివృద్ధికి ఎంతో దోహద పడుతుందని ప్రధాని మోది అన్నారు. యాత్రీకులు జనక్‌పురిలో సీతాదేవి మందిరం, అయోధ్యలోని రామ మందిరాన్ని దర్శించుకునేందుకు ఈ బస్సును ప్రారంభించారు.

18:06 - May 12, 2018

ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోది నేపాల్‌ పర్యటనపై కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓటర్లను ప్రభావితం చేసేందుకే మోది నేపాల్‌లోని ఆలయాలను దర్శనం చేసుకుంటున్నారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లాట్‌ ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నపుడు ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి విదేశీ పర్యటనలకు వెళ్లడమేంటని ప్రశ్నించారు. ఇది ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనని...మోది నిర్ణయం ప్రజాస్వామ్యంపై ప్రభావం చూపుతుందని అన్నారు. నేపాల్‌ రెండోరోజు పర్యటనలో ప్రధాని మోది ముక్తినాథ్‌, పశుపతి నాథ్‌ ఆలయాలను సందర్శించారు. ఈ రెండు ఆలయాలు శివుడివి కావడంతో లింగాయత్‌లను ప్రభావితం చేయవచ్చనే ఉద్దేశంతోనే మోది నేపాల్‌ వెళ్లినట్లు కాంగ్రెస్‌ ఆరోపించింది.

15:57 - May 11, 2018

నేపాల్ : ప్రధానమంత్రి నరేంద్రమోది, నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ జనక్‌పురి-అయోధ్య నడుమ బస్సు సేవలను పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. రామాయణ్‌ సర్కిట్ భారత్‌-నేపాల్‌ దేశాలకు ఎంతో ప్రశస్తమైనదని ఈ సందర్భంగా మోది అన్నారు. ఈ బస్సు సేవ టూరిజం అభివృద్ధికి ఎంతో దోహద పడుతుందని ప్రధాని పేర్కొన్నారు. నేపాల్‌ జనక్‌పురిలోని సీతాదేవి మందిరంలో ప్రధాని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం అక్కడ జరిగిన సభలో మోది మాట్లాడారు. జనక్‌పురిలో జానకిని దర్శించుకోవడం తన అదృష్టమని తెలిపారు. నేపాల్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు మోది చెప్పారు.

21:42 - May 4, 2018

కర్ణాటక : కర్నాటకలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంటోంది. వారం రోజుల్లో పోలింగ్‌ జరగనున్న కన్నడనాట.. అగ్రనేతల పర్యటనలు.. వారి వాగ్యుద్ధాలు.. రాజకీయ వాతావరణాన్ని పతాకస్థాయికి తీసుకు వెళుతున్నాయి. కాంగ్రెస్‌ నాయకత్వాన్ని ప్రధాని మోదీ.. ఆయన మాటలను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మరోవైపు.. సొంత జిల్లా బళ్లారిలో ఈ ఎన్నికల్లో ప్రత్యక్షంగా చక్రం తిప్పాలనుకున్న గాలి జనార్దనరెడ్డికి చుక్కెదురైంది.

కర్ణాటకలో ఎన్నికల వేడి
కర్నాటకలో ఎన్నికల వేడి.. మండువేసవిలోని భానుడి భగభగలను మించిపోయింది. ప్రధాని నరేంద్రమోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ.. తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సిలికాన్‌ వ్యాలీని పాపాల లోయగా మార్చేశారని గార్డెన్‌సిటీని గార్బేజీ సిటీగా మార్చారంటూ ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దీనిపై కాంగ్రెస్‌ అధినాయకత్వం మండిపడుతోంది.

మోదీ విమర్శలకు, ట్వీట్ల ద్వారా బదులిచ్చిన రాహుల్‌..
మోదీ విమర్శలకు, ట్వీట్ల ద్వారా బదులిచ్చిన రాహుల్‌.. కర్నాటక నగరాలకు బీజేపీ కన్నా కాంగ్రెస్‌ ప్రభుత్వమే 11 వందల శాతం అధిక నిధులు కేటాయించిందన్నారు. అంతేకాకుండా, కర్నాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నభాగ్య, క్షీరధారె, కృషియంత్రధారె, సూర్యరైత లాంటి పథకాలు రైతులకు ఎంతలా ఉపయోగపడ్డాయో కూడా ట్వీట్లలో వివరించారు. ప్రధాని మోదీకి అబద్ధాలు చెప్పడం సహజంగా అబ్బిన విద్య అంటూ ఎద్దేవా చేశారు.

కీలకంగా మారిన జెడి(యు) అధినేత కుమారస్వామి
కాంగ్రెస్‌, బీజేపీ అగ్రనాయకత్వం వాగ్యుద్ధాలతో వాతావరణాన్ని వేడెక్కిస్తుంటే.. కీలకంగా మారిన జెడి(యు) అధినేత కుమారస్వామి చాపకింద నీరులా ప్రచారాన్ని నిర్వహించుకుంటూ వెళుతున్నారు. రాష్ట్రప్రజలు రెండు జాతీయ పార్టీలపై అసంతృప్తితో ఉన్నారని కుమారస్వామి విశ్వసిస్తున్నారు. ఎన్నికల రణక్షేత్రంలో.. కుమారస్వామి ఇప్పటికే రైతు రుణమాఫీ అస్త్రాన్ని ప్రయోగించారు. మహిళల ఓట్లను ఆకర్షించేందుకు.. స్త్రీశక్తి సంఘాలకు వడ్డీరహిత రుణాలు, ఐదువేల లోపు ఆదాయం ఉన్న కుటుంబాల్లోని ఆడపిల్లలకు నెలనెలా రెండు వేల ఆర్థిక సాయం అందిస్తామని హామీలు గుప్పిస్తున్నారు.

హామీల తాయిలాలు..
కుమారస్వామి సంధించిన రైతురుణమాఫీ అస్త్రం దెబ్బతో.. బీజేపీ కర్నాటక శాఖ కూడా ఈ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చింది. లక్షరూపాయల లోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని, పంటలకు సాధారణ ధరకంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువగా మద్దతు ధర అందిస్తామనీ హామీ ఇచ్చింది. ఈమేరకు బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప మేనిఫెస్టోను విడుదల చేశారు. రైతులే కాదు, చేనేత కార్మికుల రుణాలనూ మాఫీ చేస్తామన్నారు. మహిళల ఓట్లను ఆకర్షించేందుకు స్త్రీ ఉన్నతి నిధి పేరిట పదివేల కోట్లతో అతిపెద్ద సహకార సంఘాన్ని ఏర్పాటు చేస్తామనీ బీజేపీ మేనిఫెస్టోలో చేర్చింది. మహిళలకు శానిటరీ న్యాప్‌కిన్‌లను రూపాయికే అందిస్తామని మేనిఫెస్టోలో తెలిపారు.

ప్రచారానికి వెళ్లేందుకు అనుమతి నిరాకరించిన కోర్టు
మరోవైపు.. ఈసారి ఎన్నికల్లో సొంత జిల్లా బళ్లారిలో ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలని ఆశించిన గాలి జనార్దనరెడ్డికి భంగపాటు ఎదురైంది. గనుల అక్రమ తవ్వకాల కేసులో.. ఈయన్ను బళ్లారికి వెళ్లకుండా.. కోర్టు గతంలో ఆంక్షలు విధించింది. బళ్లారిలో తన సోదరుడి తరఫున ప్రచారం నిర్వహించేందుకు అనుమతించాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఇంకోవైపు.. గురువారం నాడు ప్రధాని నరేంద్రమోదీ పర్యటన సందర్భంగా.. వేదికపై గాలి జనార్దనరెడ్డి సోదరుడు సోమశేఖరరెడ్డి కూడా ఉండడంపై.. కర్నాటక సీఎం సిద్దరామయ్య ట్విట్టర్‌లో విమర్శించారు. మైనింగ్‌ మాఫియా సూత్రధారి సోదరుడికి ఓటేయమంటూ.. చెప్పిన ప్రధాని, కాంగ్రెస్‌ పార్టీ బళ్లారిని మకిలి పట్టించిందని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇంకోవైపు.. కర్ణాటకలోని జయనగర్‌కు చెందిన బీజేపీ అభ్యర్థి బి.ఎన్‌.విజయ్‌ కుమార్‌.. ప్రచారం చేస్తూ.. గుండెపోటుతో మరణించారు. ఈయన జయనగర నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. విజయకుమార్‌ మృతితో జయనగర స్థానానికి ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉంది. 

Pages

Don't Miss

Subscribe to RSS - నరేంద్రమోదీ