ధరలు

11:40 - November 10, 2018

ఢిల్లీ: దేశవ్యాప్తంగా గత కొద్దిరోజులుగా పెట్రో ధరలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ఈరోజు కూడా పెట్రోల్,డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీలో లీటర్ పెట్రల్ పై 17 పైసలు, డీజిల్ పై 16 పైసలు తగ్గింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.77.89,  డీజిల్  72.58.కు చేరింది. అక్టోబరు 30 నాడు ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.79.55కు, డీజిల్ రూ.73.78కి గా ఉంది, గత 10 రోజుల్లో  సుమారు రూ.1.66 తగ్గుతూ వచ్చింది.  ముంబైలో నేడు పెట్రోల్,డీజిల్ పై 17 పైసలు తగ్గింది. ముంబైలో పెట్రోల్  83.40 పైసలు కాగా డీజిల్  76.05 గా ఉఁది.

10:40 - November 8, 2018

ఢిల్లీ : దీపావళి పండుగ వేడుకల సందర్భంగా వాహనదారులకు శుభవార్త అందినట్లే. ఇప్పటివరకూ పెట్రోల్,డీజిల్ పెరుగతుపోయి సామాన్యుడికి చుక్కలు చూపిన పెట్రోల్ ధరలు గత 20 రోజుల నుండి తగ్గుముఖంపట్టాయి. దీనికి కారణం ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుతూ ఉండటమే. దీంతో  దేశంలోనూ పెట్రోలు, డీజిల్ ధరల తగ్గుదల కొనసాగుతోంది. నేడు లీటరు పెట్రోలుపై 21 పైసలు, డీజిల్ పై 18 పైసలు తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో పెట్రోలు ధర రూ. 78.21కి, డీజిల్ ధర రూ. 72.89కి తగ్గింది. దేశ ఆర్థిక రాజధానిగా పేరున్న ముంబైలో పెట్రోలు ధర లీటరుకు రూ. 83.72, డీజిల్ ధర రూ. 76.38కి చేరుకోగా మిగతా ప్రాంతాల్లోనూ ధరలు ఆ మేరకు తగ్గాయి.
 

12:23 - November 5, 2018

హైదరాబాద్ : దీపావళి సీజన్ లో కళకళలాడుతుండే టపాకాయల విక్రయ దుకాణాలు వెలవెలబోతున్నాయి. సాధారణ ధరకు, జీఎస్టీ కూడా అధనం కావడంతో, ప్రతియేటా 10 నుంచి 12 శాతం మేరకు పెరిగే ధరలు, ఈ సంవత్సరం 20 శాతానికి పైగా పెరగడమే ఇందుకు కారణం. ఇదే సమయంలో సుప్రీంకోర్టు ఆంక్షలు కూడా ఉండటంతో వ్యాపారం తక్కువగా సాగుతోంది. ఈ సంవత్సరం ఎన్నడూ లేనంత అధిక ధరలకు టపాకాయలను విక్రయించాల్సి వస్తోందని వ్యాపారులే అంటున్నారు. లక్షల రూపాయలు పెట్టి, సరుకు తెచ్చుకున్నామని, వాటిని కొనుగోలు చేసే వారు కనిపించడం లేదని వాపోతున్నారు.
 

15:35 - November 3, 2018

ఢిల్లీ : ఇప్పటి వరకూ పెట్రోల్ ధరలకు భయపడి వాహనాలను మూలన పెట్టేసిన వాహన ప్రియులకు మంచి రోజులొస్తున్నట్లుగా కనిపిస్తోంది పెట్రోల్ రేట్లు రోజు రోజుకు తగ్గుతుండటం చూస్తుంటే.రయ్ మంటు బైక్ పై దూసుకెళ్లిపోవచ్చు..జామ్ అంటు కారులో చక్కర్లు కొట్టొచ్చు. గత 20 రోజుల నుండి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. సామాన్యుడి మొములో మళ్లీ చిరునవ్వు కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరల రేట్లు ఆకాశాన్ని అంటుకునే పెరగుతు పోతుండంతో సామాన్యుడు విలవిలలాడిపోయాడు. కానీ 20 రోజుల నుండి ధరలు రోజు రోజుకు తగ్గుతుండంతో హాయి కొంతవరకూ ఊపిరి తీసుకునే పరిస్థితులు నెలకొంటున్నాయి. 
పెట్రోల్‌, డీజిల్‌ ధరలు శనివారం కూడా తగ్గాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్న నేపథ్యంలో కొద్ది రోజులుగా దేశీయంగా కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. దేశ రాజధాని దిల్లీ నగరంలో ఈరోజు లీటరు పెట్రోల్‌ 19 పైసలు తగ్గి రూ.78.99కి చేరింది. నిన్న రూ.79.18గా ఉంది. నేడు లీటరు డీజిల్‌ ధర 11 పైసలు తగ్గి రూ.73.53కు చేరింది. నిన్న డీజిల్‌ ధర రూ.73.64గా ఉంది. గత పదిహేను రోజుల్లో దిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.3.28గా తగ్గగా, డీజిల్‌పై రూ.1.84 తగ్గింది.
ముంబయి లో 19 పైసలు తగ్గి రూ.84.49కి చేరింది. డీజిల్‌ ధర 12 పైసలు తగ్గి రూ.77.06గా ఉంది. చెన్నై, కోల్‌కతా నగరాల్లో పెట్రోల్‌ ధరలు రూ.82.06, రూ.80.89గా ఉండగా, డీజిల్‌ ధరలు రూ.77.73గా, రూ.75.39గా ఉన్నాయి. హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ. 83.75గా ఉండగా.. డీజిల్‌ రూ.80కి చేరుకుంది. కొద్ది రోజులుగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నాయి. బ్యారెల్‌ ధర 86 డాలర్ల నుంచి 72.57డాలర్లకు పడిపోయింది. దీంతో దేశీయంగా కూడా రెండు నెలల పాటు విపరీతంగా పెరిగిపోయిన చమురు ధరలు ఇప్పుడు నెమ్మదిగా తగ్గుతూ వస్తున్నాయి.
 

09:20 - November 1, 2018

హైదరాబాద్ : మళ్లీ సామాన్యుడిపై పిడుగు పడింది. ఇప్పటికే చమురు ధరలు పెరగడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇటీవలే కొన్ని రోజుల నుండి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతూ వస్తుండడంతో కొంత ఊపిరిపీల్చుకున్నాడు. అంతలోనే గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 
గత జూన్‌ నెల నుంచి వరుసగా సిలిండర్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. బుధవారం సబ్సిడీ సిలిండర్‌పై రూ.2.94, నాన్ సబ్సిడీ సిలిండర్‌పై రూ.60 పెరిగింది. నవంబర్ మాసం నుండే అమల్లోకి వస్తాయని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ప్రకటించింది. ధరలు పెరగడానికి మళ్లీ అదే కారణం చెబుతోంది. అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు పెరగడం, విదేశీ మారకద్రవ్యంలో అస్థిరత పరిస్థితుల కారణంగా ధరలు పెరిగినట్లు వెల్లడిస్తోంది. జూన్ నెలకు ఇప్పటికీ సబ్సిడీ సిలిండర్‌పై మొత్తంగా రూ.14.13 ధర పెరిగినట్లు  అయ్యింది. 

09:15 - October 27, 2018

ఢిల్లీ : గత కొంతకాలం నుండి రోజుకో విధంగా పెరిగి సామాన్యుడికి చుక్కలు చూపిన పెట్రోల్ ధరలు గత 10 రోజుల నుండి తగ్గుతు వస్తున్నాయి. దీంతో సామాన్యుడు ఊపిరి పీల్చుకుంటున్నారు. సెంచరీకి చేరువవుతోందేమోనని సామాన్యడు బెంగపడుతున్న సమయంలో ధరలు తగ్గిన కాస్త ఉపశమనాన్ని ఇస్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో ముడి చమురు ధరలు పడిపోతున్న నేపథ్యంలో డాలర్ మారకపు విలువలో రూపాయి బలపడుతూ ఉండటంతో పెట్రోలు, డీజిల్ ధరలు దిగివస్తున్నాయి. వరుసగా పదో రోజూ పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి. శనివారం నాడు లీటరు పెట్రోలుపై 40 పైసలు, డీజిల్ పై 35 పైసల మేరకు ధరను తగ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది.
దీంతో న్యూఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 80.45, డీజిల్ ధర రూ. 74.38కు చేరుకున్నాయి. ఇదే సమయంలో ముంబైలో పెట్రోలు ధర రూ. 85.93, డీజిల్ ధర రూ. 77.96కు తగ్గాయి. విజయవాడలో పెట్రోలు రేటు రూ. 84.60, డీజిల్ రూ. 79.80కు చేరుకుంది. గుంటూరులో పెట్రోలు ధర రూ. 84.80కి, డీజిల్ రూ. 80కి తగ్గింది.
 

09:39 - October 17, 2018

హైదరాబాద్ : దసరా పండుగ సందర్బంగా పూల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. తెలంగాణలో సద్దుల బతుకమ్మ పండుగ ప్రసిద్ధి. దసరా పండుగకు ముందు రోజున సద్దుల బతుకుమ్మ పండుగ చేస్తారు. సద్దుల బతుకుమ్మను వివిధ రకాల పూలతో పేల్చుతారు. చాలా మంది భారీగా పూలను కొనుగోలు చేస్తారు. దీంతో మార్కెట్‌లో అన్ని రకాల పూల ధరలు భారీగా పెరిగాయి. ప్రత్యేకంగా హైదరాబాద్‌లో పూల ధరలు పెరిగాయి. పూల ధరలు ఆకాశాన్నంటాయి.  సామాన్యునికి అందని రీతిలో పెరిగాయి. వివిధ జిల్లాల నుంచి పూలను హైదరాబాద్‌కు తీసుకొస్తారు. ఇవాళ సద్దుల బతుకుమ్మ పండుగ నేపథ్యంలో పూల ధరలు మండిపోతున్నాయి. నిన్న కిలో చామంతి రూ.100 ఉండగా నేడు 200 రూపాయలు అయింది. కిలో బంతి పూల ధర 80 రూపాయలు అయింది. పూల ధరలు పెరగడంతో కొనుగోలుదారులు కొనలేకపోతున్నారు. ధరలను తగ్గించాలని కోరుతున్నారు. 

 

12:11 - October 16, 2018

ఢిల్లీ : పసిడి ధరలు మళ్లీ పరుగు పెడుతున్నాయి. సోమవారం బంగారం ధర 200 రూపాయలు పెరిగింది. దీంతో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 32 వేల 250 రూపాయలకు చేరింది. అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు, పండగసీజన్‌, స్థానిక నగల వర్తకం తయారీదారుల దగ్గర నుంచి డిమాండ్‌ ఊపందుకోవడంతో బంగారం ధర పెరిగినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. పసిడి బాటలోనే వెండి కూడా పయనించింది. గత కొద్దిరోజుల నుంచి తగ్గుతూ వచ్చిన వెండి ధర.. అమాంతం 350 రూపాయలు పెరిగి 39 వేల 750 రూపాయలకు చేరింది. 

 

09:41 - October 6, 2018
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం చమురు ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఏమైనా ధరలు తగ్గాయా ? అంటే లేదనని అనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై పలు విమర్శలు..సెటైర్లు వినిపించాయి. సామాజిక మాధ్యమాల్లో పలు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రతి రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ ప్రజలకు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో కేంద్ర ప్రభుత్వం లీటరకు రూ. 2.50 తగ్గిస్తూ ప్రకటన చేసింది. ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి బర్నాల్ పూసిన చందంగా కేంద్రం నిర్ణయం తీసుకుందని శివసేన ఇటీవలే విమర్శించింది. 
ఇదిలా ఉంటే చమురు ధరలు శనివారం కూడా ఎగబాకాయి. లీటర్ పెట్రోల్ పై 18 పైసలు, డీజిల్ పై 29 పైసల మేరకు పెంచుతున్నట్లు ఐఓసీ ప్రకటించింది. దీనితో హస్తినలో పెట్రోల్ లీటర్ ధర రూ. 81.68, డీజిల్ రూ. 73.24కు చేరుకుంది. ముంబైలో లీటర్ పెట్రోలు రూ. 87.15, డీజిల్ రూ. 76.75...కాగా  హైదరాబాద్ లో లీటర్ పెట్రోలు రూ. 86.59, డీజిల్ రూ. 79.67కి చేరుకుంది.
16:30 - October 4, 2018

ఢిల్లీ : వాహనదారులకు గుడ్ న్యూస్..గత కొద్ది రోజులుగా చమురు ధరలు పెరుగుతూ..వాహనాదారులను బెంబేలెత్తిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అచ్చేదిన్ ఎప్పడూ పార్టీలు ఎద్దేవా చేస్తున్నాయి. దీనితో కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో పడింది. వచ్చే సంవత్సరంలో ఎన్నికలు ఉండడం..ప్రభావం చూపుతుందనే దానిపై సీరియస్‌గా ఆలోచించి ధరలు తగ్గించాలనే నిర్ణయానికి వచ్చింది. లీటర్‌పై రూ.2.50 తగ్గించింది. తగ్గించిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం ప్రకటించారు. చమురుపై రూ. 2.50 ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు, గతంలో పెట్రోల్ ధరలు పెరిగిన సమయంలో రూ. 2 ఎక్సైజ్ పన్ను తగ్గించామని గుర్తు చేశారు. ద్రవ్యలోటు తగ్గించేందుకు కృషి చేయడం జరుగుతోందని, ద్రవ్యలోటు మూడు శాతానికి మించకుండా చేశామని చెప్పుకొచ్చారు. ఓపెక్ దేశాలు పెట్రోలియం ఉత్పత్తులు పెంచడం లేదని, రూ. 5 తగ్గించాలని అనుకున్నా సాధ్యపడలేదని తెలిపారు. 

ధరలు పెరుగుతుండడంతో దేశంలోని పలు రాష్ట్రాలు పలు నిర్ణయాలు తీసుకున్నాయి. రూ. 2 మేర తగ్గిస్తున్నట్లు కొన్ని రాష్ట్రాలు ప్రకటించాయి కూడా. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తగ్గించిన ధరకు ఆయా రాష్ట్రాలు మరో రూ. లీటర్‌పై రూ.2.50 తగ్గిస్తే సుమారు రూ.5 వరకు వినియోగదారులకు లాభం జరుగుతుందని జైట్లీ సూచించారు. ప్రస్తుతం రూ.2.50 తగ్గించడం వల్ల కేంద్ర ప్రభుత్వం రూ.21,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోతుందని అరుణ్ జైట్లీ తెలిపారు.
గురువారం కూడా ధరలు పెరిగాయి ముంబైలో ఏకంగా లీటర్ పెట్రోల్ రూ.90 దాటడం గమనార్హం. ధరలు పెరుగుతుండడంతో వీటిపై ఆధారపడిన వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాహనదారులు..సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తగ్గించిన ధరలపై ప్రజలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

Pages

Don't Miss

Subscribe to RSS - ధరలు