దేవదాస్

11:50 - September 19, 2018
టాలీవుడ్ లో భిన్నమైన కథలు ఎంచుకుంటూ ఇతర హీరోలతో టాలీవుడ్ మన్మథుడు నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. తాజాగా నేచురల్ స్టార్ నానితో కలిసి ఈ మన్మథుడు రోమాన్్స చేయబోతున్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆకాంక్ష సింగ్‌, రష్మిక మందన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. వైజయంతి మూవీస్‌, వయాకమ్‌ 18 మీడియా ప్రై.లి పతాకంపై అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేసేస్తున్నారు. 
ఇటీవలే చిత్ర టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. దీనికి అభిమానుల నుండి భారీ స్పందనే వస్తోంది. సినిమా వినోదాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలను 'దేవదాస్‌ ఆడియో పార్టీ' పేరుతో ఈ నెల 20న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా సినిమాను విడుదల చేయనున్నారు
13:51 - September 12, 2018

తెలుగు సినిమా రంగంలో మల్టీస్టారర్ సినిమాలు ట్రెండ్ కొనసాగుతోంది. తన వయస్సు..చూడకుండా జోరుగా సినిమాలు చేస్తున్న హీరోల్లో ఒకరు ’నాగార్జున’. టాలీవుడ్ లో మన్మథుడిగా పేరొందిన ఈ నటుడు చిన్న..పెద్ద హీరోలతో నటిస్తున్నాడు. తెలుగు సినిమాలో నాచురల్ స్టార్ గా పేరు గడించిన ‘నాని’తో ‘నాగ్’ నటిస్తున్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాను యువ దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘దేవదాస్’ పేరు ఖరారు చేశారు. ఈ చిత్ర టీజర్..లిరికల్ వీడియోలు సందడి చేస్తున్నాయి. 

'వినాయకచవితి' కావడంతో చిత్ర యూనిట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసింది. ఈ సాంగ్ దుమ్ముదుమ్ము రేపుతోంది. వినాయక నిమజ్జన ఉత్సవానికి సంబంధించిన పాటను వదిలారు."లక లక లకుమీకరా లంబోదరా .. జగ జగ జగదోద్ధారా విఘ్నేశ్వరా . . లక లక లకుమీకరా లంబోదరా .. రకరకముల రూపాలు నీవే దొరా .. వెళ్లి రారా .. మళ్లీ రారా .. ఏడాదికోసారి మాకై దిగిరారా .." అంటూ ఈ పాట కొనసాగుతోంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. 

Don't Miss

Subscribe to RSS - దేవదాస్