దాడులు

16:26 - September 12, 2018

ఫూణే: పాకిస్థాన్ భూభాగంలోని 15 కి.మీ అవతల భారత ఆర్మీ విజయవంతంగా పూర్తి చేసిన సర్జికల్ స్ట్రైక్ లో సైనికులు చిరుత పులుల మల, మూత్రాలను ఉపయోగించి అక్కడ ఉన్న కుక్కల దాడులనుంచి తప్పించుకున్నట్టు మాజీ సైనికాధికారి ఒకరు బుధవారం తెలిపారు. 

నగ్రొటా  కార్ప్స్ కమాండర్ గా లెఫ్టినెంట్ జనరల్ రాజేంద్ర నిమ్ బోర్కర్ సర్జికల్ స్ట్రైక్ లో పాల్గొన్నారు. సర్జికల్ స్ట్రైక్ లో ఆయన చేసిన సేవలకు గాను పూణేలోని థొర్లే బాజీరావు పేష్వే ప్రతిష్టాన్ అనే సంస్థ రాజేంద్ర నింబోర్కర్ ను సన్మానించింది. ఆ సమావేశంలో ముఖ్య అతిధిగా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషీ పాల్గొన్నారు.

నౌషేరా సెక్టార్ ప్రాంతంలో జీవ వైవిధ్యాన్ని కూలంకుషంగా పరిశీలించిన బ్రిగేడర్ కమాండర్ రాజేంద్ర కుక్కలను తరచూ చిరుతలు వేటాడం గమనించారు. చిరుతల దాడి నుంచి తప్పించుకోవడానికి రాత్రివేళల్లో మాత్రమే శునకాలు ఆ ప్రాంతంలో సంచరించేవి. 

సర్జికల్ స్ట్రైక్ చేసేందుకు సైనికులు గ్రామాలు దాటి వెళ్లేందుకు కుక్కలు అరిచి గోలచేసే ప్రమాదం ఉందని గమనించి భారత సైనికులు చిరుత పులుల మల, మూత్రాలను తమతోపాటుగా తీసుకువెళ్లి.. వాటిని గ్రామ పొలిమారల్లో చల్లి కుక్కలు తమవైపు రాకుండా జాగ్రత్తపడ్డారని రాజేంద్ర చెప్పారు. ఈ ప్రయోగం చక్కటి ఫలితాలను ఇచ్చిందని కమాండర్ రాజేంద్ర వెల్లడించారు.

ఈ దాడి అత్యంత గోప్యంగా ఉంచారని.. తమకు ఒక వారం క్రితమే ఈ సమాచారం అప్పటి రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారిక్కర్ తెలియచేశారని రాజేంద్ర వెల్లడించారు. ఈ విషయాన్ని తమ ట్రూప్ సభ్యులకు ఒక వారం ముందుగా తెలియచేసినా.. ఏ ప్రాంతమో ఒక రోజు ముందు చెప్పినట్టు రాజేంద్ర గుర్తుచేసుకున్నారు.

09:35 - September 11, 2018

సెప్టెంబర్ 11...అందరికీ ఈ తేదీన ఏం జరిగిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే ఇదే రోజున దాడి జరిగింది. ఈ దాడిలో ప్రజలు ఉలిక్కి పడ్డారు. నాలుగు విమానాలాతో అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ దాడికి పాల్పడడంతో మూడు వేల మంది దుర్మరణం చెందగా మరో ఆరు వేల మంది ఇప్పటికీ అక్కడి వాసులు ఈ దారుణ ఘటనను మరిచిపోవడం లేదు. అమెరికన్లే కాదు...ప్రపంచ ప్రజలు కూడా ఈ విషాద ఘటనను మరిచిపోలేరు. గాయాలపాలయ్యారు. డబ్యూటీవో పై జరిగిన దాడిని అమెరికా తీవ్రంగా పరిగణించింది. 

2001 సెప్టెంబర్ 11వ తేదీన అల్ ఖైదా ఉగ్రవాదులు ఈ మారణ హోమానికి తెగబడ్డారు. ఈ దాడికి నేటితో 17 ఏళ్లు. అందుకే సెప్టెంబర్ 11 అంటే చాలు అమెరికన్లు ఉలిక్కి పడుతుంటారు. ఈ సందర్భంగా తమ వారిని కోల్పోయిన వారిని తలుచుకుంటూ కుటుంబసభ్యులు నివాళులర్పిస్తుంటారు. అక్కడి ప్రభుత్వం కూడా పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. 

ఈ భీకర విధ్వంసం ఘటన నుండి తేలుకోవడానికి అమెరికాకు చాలా ఏళ్లే పట్టంది. అనంతరం ఉగ్రవాద ఏరివేత చర్యలకు అమెరికా ఉపక్రమించింది. అమెరికా బలగాలు ఉగ్రమూకలను హతమార్చింది. కానీ అల్ ఖైదా కీలక నేత ఒసామా బిన్ లాడెన్ ను తుదముట్టించేందుకు అమెరికా తీవ్ర ప్రయత్నాలు జరిపింది. సరిగ్గా న్యూయార్కు పై దాడులు జరిగిన పదేళ్లకు లాడెన్ ను అమెరికా తుదముట్టించింది. 

10:14 - September 8, 2018

తూర్పుగోదావరి : జిల్లాలో రేవ్ పార్టీ నిర్వహిస్తున్న ఓ రిసార్ట్స్ పై పోలీసులు దాడి చేశారు. రంపచోడవరం మండలంలోని ఏ1 రిసార్ట్స్ లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో రంపచోడవరం పోలీసులు రిసార్ట్స్ పై దాడి చేశారు. 29 మందిని అరెస్టు చేశారు. వీరిలో 22 మంది పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు.

 

14:24 - September 4, 2018

రంగారెడ్డి : కేశంపేట సాజీదా ఫామ్ హౌస్ లో ఎస్ వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ముజ్రపార్టీ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించారు. ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. 25240 రూపాయల నగదుతోపాటు రెండు కార్లు, ఒక బైక్, 25 సెల్ ఫోన్ లను  స్వాధీనం చేసుకున్నారు. యువతుల్లో ఇద్దరు ముంబాయి, ఇద్దరు హైదరాబాద్ చెందిన వారుగా గుర్తించారు.

 

15:13 - August 27, 2018

కర్నూలు : జిల్లాలో డీలర్లకు అందుతున్న బియ్యం సరఫరాలో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం జిల్లాలో ఐదారు చోట్ల విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. పలు గోదాములపై అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో పలువురు దళారులు గోదాములో ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. స్టాకు ఎంతుందనే దానిపై నోటీసు బోర్డులో పేర్కొనడం లేదని, లోడ్ లు చేసే సమయంలో పలువురు చేతి వాటం ప్రదర్శిస్తున్నారని అధికారులు గుర్తించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

19:58 - August 2, 2018

హైదరాబాద్‌ : నగరంలోని పలు మల్టీఫ్లెక్స్‌లు, సినిమా థియేటర్లలో తూనికలు కొలతలశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆగస్టు 1 నుంచి మల్టీఫ్లెక్స్‌లలో, సినిమా థియేటర్స్‌లో ఎమ్మార్పీ ధరలకే తినుబండరాలు అమ్మాలని ఆదేశాలు జారీ చేసినా.. నిర్వాహకులు నిబంధనలు పాటించడంలేదని అధికారులు అంటున్నారు. మొదటి రోజే 20కిపైగా కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

 

18:25 - August 2, 2018

హైదరాబాద్‌ : నగరంలోని పలు మల్టీఫ్లెక్స్‌లు, సినిమా థియేటర్లలో తూనికలు కొలతలశాఖ అధికారులు సోదాలు చేపట్టారు. ఆగస్టు 1 నుంచి మల్టీఫ్లెక్స్‌లలో, సినిమా థియేటర్స్‌లో ఎమ్మార్ఫీ ధరలకే తినుబండరాలు విక్రయించాలని లీగల్ మెట్రాలజీ డిపార్ట్ మెంట్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆదేశాలు జారీ చేసిన ఎమ్మార్పీ ధరల ప్రకారం ఇంకా తినుబండరాలు విక్రయించకపోవటంతో తూనికలు కొలతలు శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

 

15:40 - August 2, 2018

హైదరాబాద్ : మల్టీఫ్లెక్స్, సినిమా థియేటర్లలో తూనికలు, కొలతల శాఖ దాడులు కొనసాగుతున్నాయి. థియేటర్లు, మల్టీఫ్లెక్స్ యాజమాన్యాలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. తినుబండారాలను మల్టీఫ్లెక్స్ లు, సినిమా థియేటర్లు అధిక ధరలకు విక్రయిస్తున్నాయి. ఎమ్మార్పీ ధరల డిస్ ప్లే బోర్డులు కనిపించడం లేదు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

20:52 - July 17, 2018

గో సంరక్షణ పేరుతో జరుగుతున్న దాడులను సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించింది.. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకునే హక్కు లేదని చెప్పింది. గుంపుగా దాడి చేయడాన్ని ఆపాల్సిన బాధ్యత ఆయ రాష్ట్రాలదేనని తెలిపింది. దాడులకు పాల్పడే వారిపై తగిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక చట్టం తేవాలని సూచించింది. ఇదే అంశంపై నిర్వహించిన 'దాడులు ఆపండి' కార్యక్రమంలో ప్రముఖ అడ్వకేట్ సురేష్ పాల్గొని, మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకుని దాడులను అరికట్టాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

18:33 - July 17, 2018

ఢిల్లీ : దేశవ్యాప్తంగా గో సంరక్షణ పేరుతో  జరుగుతున్న దాడులను సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించింది. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకునే హక్కు లేదని దీనిపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించింది. గోరక్షణ పేరిట  గుంపుగా దాడి చేయాడాన్ని ఆపాల్సిన బాధ్యత ఆయా రాష్ట్రాలదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భయం, అరాచకత్వం వంటి ఘటనల్లో రాష్ట్రాలు సానుకూలంగా స్పందించాలి. హింసను అనుమతించకూడదని చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలో ముగ్గురు జడ్జిల ధర్మాసనం పేర్కొంది. దాడులకు పాల్పడే వారిపై తగిన చర్యలు తీసుకునేందుకు పార్లమెంట్‌లో ప్రత్యేక చట్టం తీసుకురావాలని కేంద్రాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. గోరక్షణ ఘటనలపై చర్యలు తీసుకోవాలంటూ సామాజిక కార్యకర్త తెహసిన్‌ పూనావాలా, మహాత్మగాంధీ మునిమనవడు తుషార్‌ గాంధీ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ అంశంలో బిజెపి పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, గుజరాత్‌, రాజస్థాన్, మహారాష్ట్ర, జార్ఖండ్‌తో పాటు కర్ణాటకకు  ఇదివరకే కోర్టు నోటీసులు జారీచేసింది. హింసాత్మక దాడులను ఆపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకోవాలని సూచించింది.

Pages

Don't Miss

Subscribe to RSS - దాడులు