తెలంగాణ

20:25 - September 21, 2018

నల్లగొండ : నేలకు అభిమానులు వుండటం సహజమే. కానీ గుడి పట్టలేనంత అభిమానం వుంటే..ఇదిగో అటువంటి అభిమాని ఆపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అభిమానాన్ని చాటుకునేందుకు ఓ కానిస్టేబుల్ ఏకంగా గుడినే కట్టేసి వీరాభిమానాన్ని చాటుకున్నాడు. కేసీఆర్ పాలనకు జేజేలు పలుకుతు కానిస్టేబుల్ కేసీఆర్‌కు గుడిని కట్టేశాడు. నిడమనూరు మండల కేంద్రం శ్రీనివాస్ అనే వ్యక్తి పోలీసుశాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సీఎం కేసీఆర్ పాలనకు ముగ్ధుడైన శ్రీనివాస్ గుడి కట్టి తన అభిమానాన్ని చాటాడు. సీఎం కేసీఆర్ నాలుగున్నర ఏండ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి సాధించిందన్నారు. గత 60 ఏండ్ల పాలనలో జరగని అభివృద్ధి టీఆర్‌ఎస్ ప్రభుత్వ ఈ నాలుగున్నరేండ్ల పాలనలో జరిగిందన్నారు.

 

19:53 - September 21, 2018

ఖమ్మం : ముందస్తు ఎన్నికల్లో సీటు సంపాదించుకోవటం ఒక ఎత్తు అయితే..ఎన్నికల్లో గెలిచి కేబినెట్ లో మంత్రి పదవి సాధించుకోవటం మరొక ఎత్తు. అందునా కేసీఆర్ వంటి దిగ్గజం ప్రశంసలు పొందాలంటే సాధారణ విషయం కాదు. అందుకే ఆయన ప్రాపకం పొందాలని నేతలంతా నానా హైరానా పడుతుంటారు. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికల్లో సీటు ఖాయం చేసుకున్న నేతలంతా గెలుపుకోసం నానా తిప్పలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో  ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సత్తుపల్లిలో  టీఆర్ఎస్ అభ్యర్థి పిడమర్తి రవి అత్యధిక మెజార్టీతో విజయం సాధించాల్సిన అవసరం ఉందన్నారు.
ఖమ్మం జిల్లాలో సీట్లు గెలవడం ఒక ఎత్తు... సత్తుపల్లిలో గెలవడం ఒక ఎత్తు అని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పేర్కొన్నారు. ఈ ఎన్నికలను ఆషామాషీగా తీసుకొంటే వచ్చే కేబినెట్‌లో తాను ఉండకపోవచ్చని తుమ్మల నాగేశ్వర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 
ఈ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోకూడదని తుమ్మల నాగేశ్వర్ రావు  కార్యకర్తలకు సూచించారు. ఖమ్మం జిల్లాలో అన్ని సీట్లు గెలవడం ఒక ఎత్తైతే... సత్తుపల్లి సీటు గెలవడం మరో ఎత్తన్నారు.  ఈ ప్రాంత భవిష్యత్తు కోసం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని తుమ్మల నాగేశ్వర్ రావు సూచించారు.
సత్తుపల్లి సీటు గెలవడం ఎంత అవసరంగా చెబుతున్నానో  అర్థం చేసుకోవాలని తుమ్మల నాగేశ్వర్ రావు పార్టీ కార్యకర్తలను కోరారు. తాను అవకాశాల కోసం రాజకీయాలు చేయలేదని తుమ్మల చెప్పారు.

 

16:50 - September 21, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టీఆర్ఎస్ పాత్ర సూది మొనంతైనా లేదంటూ గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నుంచి కౌంటర్ మొదలైంది. ఈ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంపై గులాం నబీ ఆజాద్ తప్పుగా మాట్లాడుతున్నారనీ..అది సరికాదని మండిపడ్డారు.  ప్రాణాలకు తెగించి ప్రజలు పోరాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారని..కేసీఆర్ దీక్ష ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్రంపై బురద  చల్లేందుకు యత్నిస్తు లేనిపోని వ్యాఖ్యలు చేయటం సరికాదని మంత్రి హరీశ్ రావు ఆజాద్‌పై తీవ్రంగా మండిపడ్డారు. 
తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసింది కాంగ్రెస్ పార్టీయేనని, ప్రజలు తిరగబడితే, కేసీఆర్ దీక్ష చేయడం వల్లే కొత్త రాష్ట్రం ఏర్పాటుకు నాడు కాంగ్రెస్ అంగీకారం తెలిపిందని అన్నారు. టీఆర్ఎస్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చేవారా? అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా? ఈ ప్రశ్నకు ఆజాద్ సమాధానం చెప్పాలి? అంటూ హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

 

16:41 - September 21, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అధికారులు బిజి బిజీగా మారిపోయారు. ఓట్ల నమోదు..సమావేశాలతో నిమగ్నమవుతున్న అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి కేంద్ర ఎన్నికల సంఘం కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ ఎన్నికల సంయుక్త ప్రధానాధికారిగా ఆమ్రపాలి నియామకానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంపిన ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.

గతంలో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఆమెను ఇటీవల జీహెచ్‌ఎంసీలో సేవలకు బదిలీ చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ కు మరో ఇద్దరు అధికారులను సహాయకులుగా నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పటికే జ్యోతి బుద్ధ ప్రకాష్ ను ఎన్నికల అదనపు అధికారిగా నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలిని జాయింట్ సీఈఓగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం.
కలెక్టర్‌గా ఉన్న సమయంలో ఆమ్రపాలి పలు వివాదాల్లో చిక్కుకున్నారు. సీరియస్ . రిపబ్లిక్ డే వేడుకల సమయంలో ప్రసంగించేటప్పుడు నవ్వడం...

16:00 - September 21, 2018

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ లో ముందస్తు కుంపటి రాజేస్తోంది. నేతల మధ్య సమన్వయం కొరవడింది. ఈసారి ఎన్నికల్లో గెలవాలని టి.కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. కానీ ఎన్నికల సందర్భంగా నియమించే కమిటీ విషయాల్లో నేతల మధ్య విభేదాలు పొడచూపుతున్నాయి. ఇటీవలే కమిటీల కూర్పుపై సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్, వీహెచ్, పొంగులేటి వంటి నేతలు బాహాటంగానే విమర్శలు గుప్పించారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ కుంతియా, టిపిసిసి చీఫ్ ఉత్తమ్ లపై కోమటిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేయడం కలకలం రేగింది. శనిలా తయారయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు వీహెచ్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పొంగులేటి, ఇతర నేతలు కూడా గీత దాటితే చర్యలుంటాయని ఉత్తమ్ హెచ్చరించారు. 

ఇంకోవైపు విబేధాలు పక్కన పెట్టి అందరూ కలిసి కట్టుగా ఉంటూ విజయం కోసం ప్రయత్నించాలని టిపిసి చీఫ్ ఉత్తమ్ సూచించారు. క్రమశిక్షణ..సమిష్టి కృషితో ముందుకు వెళుదామని...విజయం సాధిద్దామని..ఇందులో నేతలు..కార్యకర్తలకు సముచిత స్థానం ఇస్తామని ఉత్తమ్ వెల్లడించారు. 

ఇక నేతలు చేసిన వ్యాఖ్యలపై టి.కాంగ్రెస్ సీరియస్ అయ్యింది. శుక్రవారం కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. నేతలు చేసిన వ్యాఖ్యలపై సుదీర్ఘంగా చర్చించింది. ఘాటు వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నోటీసులు పంపాలని నిర్ణయం తీసుకుంది.శుక్రవారం నోటీసులు జారీ చేసింది. రెండు రోజుల్లో వివరణనివ్వాలని పేర్కొంది. మరి టిపిసిసి తీసుకుంటున్న చర్యలతో నేతలు మారుతారా ? వీరి మధ్య సఖ్యత ఉంటుందా ? లేదా ? అనేది చూడాలి. 

10:22 - September 21, 2018

ఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం...మరోసారి తెలంగాణలో పర్యటించనుంది. గత పర్యటనలో అధికారులతో ఎన్నికలపై చర్చించిన ఈసీ...ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించనుంది. ఈసీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సమస్యాత్మక ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో పర్యటించి క్షేతస్థాయిలో ఎన్నికల నిర్వహణపై పరిస్థితులను తెలుసుకోనున్నారు. 

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం వేగంగా అడుగులు వేస్తోంది. ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులపై అధ్యాయనం చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులు....మరోసారి రాష్ట్రానికి రానున్నారు. గత పర్యటనలో ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపిన ఈసీ సభ్యులు...ఈ పర్యటనలో గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తిరగనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత తొలిసారి జరిగే ఎన్నికలకు...ఏమైనా ఆటంకాలు ఉన్నాయా అన్న అంశాలను సభ్యులు గ్రౌండ్ లెవల్ లో తెలుసుకోనున్నారు.  ఇప్పటికే తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు సిద్దమైన సీఈసి..మధ్యప్రదేశ్, రాజస్ధాన్ రాష్ట్రాల్లోనూ ఇదే సమచారం కోసం తమ పర్యటన పూర్తి చేసినట్లు తెలుస్తోంది. 

మరోవైపు ఈ నెల 25తో తెలంగాణలో ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమం పూర్తవుతుంది. ఓటరు నమోదుపై వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో  పెట్టుకుని... జిల్లా ఎన్నికల అధికారులు ప్రత్యేక కార్యక్రమాలతో క్యాంపెయిన్ చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్... వివిధ జిల్లాల కార్యాలయాలను నేరుగా సందర్శిస్తున్నారు. ఇప్పటికే వీవీ ప్యాట్స్, ఈవీఎంలు రాష్ట్రానికి చేరుకున్నాయి.  వాటిని ఎలా వినియోగించాలనే దానిపై కూడా ప్రత్యేక శిక్షణలు ఇస్తున్నారు. వచ్చే వారంలో రాష్ట్రానికి రానున్న సీఈసీ బృందానికి...ఈవీఎంలు, వీవీ ప్యాట్లకు సంబంధించిన నివేదికను అందజేయనున్నారు రజత్ కుమార్. గ్రామీణ స్థాయిలో పర్యటన ముగించిన తర్వాత...పరిస్థితులను బట్టి ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించే అవకాశాలున్నాయి. 

17:48 - September 20, 2018

హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల వేడి తెలంగాణలో రోజు రోజుకు పెరుగుతోంది. ఏపార్టీకి ఆ పార్టీ గెలుపుకోసం నానా పాట్లు పడుతున్నాయి. విజయంపై ధీమాగా వున్న టీఆర్ఎస్ కూడా తమ ప్రయత్నాల్లో నేతలు తలమునకలయైపోయారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీతో కలిసి పోటీ చేస్తుందనీ..వారిద్దరి పొత్తుతో విజయం సాధిస్తే ఇరు పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాలు చేస్తారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో..ఎంఐఎం పార్టీ ఎంపీ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  
టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకొస్తే కనుక ఆ పార్టీతో కలిసి అధికారాన్ని పంచుకుంటారా?’ అనే ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవర్ పాలిటిక్స్‌పై తనకు అంతగా ఆసక్తి లేదని, టీఆర్ఎస్‌తో కలిసి అధికారం పంచుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కానీ వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలే ఆయన విజయానికి దోహదపడతాయని ఎంపీ ఒవైసీ పేర్కొన్నారు.
కర్ణాటకలో కుమారస్వామి సీఎం అయినట్లుగానే తెలంగాణలో కూడా జరగవచ్చని..తాము అధికారంలోకి రావచ్చని మాజీ ఎమ్మెల్యే..ఒవైసీ సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించారు. దీనిపై ఆయన స్పందిస్తూ, అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను మీడియా తప్పుగా ప్రచారం చేసిందని..మీడియా తీరంతా కట్ అండ్ పేస్ట్ అన్న రీతిలో ఉంటుందని పనిలో పనిగా ఒవైసీ మీడియాకు చురకలంటించారు. 

 

22:13 - September 19, 2018

హైదరాబాద్ : రాష్ట్ర సాధన కోసం  తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి..టీఆర్ఎస్ లో విలీనం చేసిన అనంతరం తెరమరుగు అయిపోయిన రాములమ్మ కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుస్తు ఎన్నికల్లో రాములమ్మ చక్రం తిప్పనుంది. టీఆర్ఎస్ లో ఎంపీగా పనిచేసిన ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి మళ్లీ కీలకపాత్ర పోషించబోతున్నారు. ఆమెను టీకాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా పార్టీ అధిష్ఠానం నియమించింది. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి 2014 ఎన్నికల్లో మెదక్ శాసనసభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత నుంచి ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. 
ఇటీవల హైదరాబాద్ మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన సందర్భంలో... ఆమె మళ్లీ కనిపించారు. రాజకీయాలల్లో ఇకపై క్రియాశీలకంగా ఉంటానని ఆ సందర్భంగా ఆమె తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆమెకు కీలక పదవిని కట్టబెట్టింది. పార్టీ గెలుపులో ఆమె కీలక పాత్ర పోషిస్తారని పార్టీ భావిస్తోంది. మరోవైపు, టీడీపీతో పొత్తును ఇంతకు ముందే ఆమె వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.

 

19:33 - September 19, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సమయం శంఖం పూరించిన వేళ టీ.కాంగ్రెస్ లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఎన్నికల సమయం ముంచుకొస్తున్న వేళ..పార్టీ అధినేత రాహుల్ గాంధీ పలు మార్పులు చేశారు. టీపీసీసీకి ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు 9 అనుబంధ కమిటీలను ఏర్పాటు చేశారు. టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరిన ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి పదోన్నతి లభించింది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లు నియమితులయ్యారు. ప్రచార కమిటీ ఛైర్మన్ గా మల్లు భట్టి విక్రమార్క, కో-ఛైర్మన్ గా డీకే అరుణ, కన్వీనర్ గా దాసోజు శ్రవణ్ లను నియమించారు. 41 మందితో ఎన్నికల కమిటీని ఏర్పాటు చేశారు. 53 మందితో కోఆర్డినేషన్ కమిటీని నియమించారు. మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ గా దామోదర రాజనర్సింహను నియమించారు. స్ట్రాటజీ కమిటీ ఛైర్మన్ గా వి.హనుమంతరావు నియమితులయ్యారు.

 

16:24 - September 19, 2018

హైదరాబాద్: తెలంగాణ ఆడపడుచు ఐశ్వర్య బొడ్డపాటికి అపధ్దర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు శుభాశ్సీసులు అందజేశారు. కేంద్ర యువజన విభాగం మరియు క్రీడల శాఖ మంత్రిత్వ శాఖ భారత నావికాదళం లెఫ్ట్‌నెంట్ కమాండర్ ఐశ్వర్య బొడ్డపాటి టెన్జింగ్ నార్గే జాతీయ అడ్వంచర్ అవార్డు 2017 కు ఎంపిక చేసిన సందర్భంగా కేసీఆర్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.     

ఐశ్వర్యకు ఈ అవార్డు దక్కఃటం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని.. ఇటువంటి అవార్డులు మరిన్ని ఐశ్వర్య సొంతం చేసుకోవాలని కేసీఆర్ ఆకాంక్షించారు. 2017 సెప్టెంబరు 10 న ప్రారంభమైన ‘టఫ్ ఎక్స్‌పెడిషన్‌’లో ఐశ్వర్య పాల్గొని ‘ఐఎన్ఎస్ తరిణి’ అనే పడవలో ప్రపంచాన్ని చుట్టి వచ్చారు.  తెలంగాణ వాసి అయిన ఐశ్వర్య గతంలో నారీ శక్తి, నవ్‌సేన వంటి అవార్డులను కైవసం చేసుకొన్నారు. ఈ నెల 25న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఒక కార్యాక్రమంలో ఈ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా ఐశ్వర్య అందుకుంటారని కేంద్ర యువజన విభాగం మరియు క్రీడల శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది.

Pages

Don't Miss

Subscribe to RSS - తెలంగాణ