తమ్మినేని వీరభద్రం

10:26 - December 1, 2018


కరీంనగర్ :  కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మహిళా బిల్లును ఏమాత్రం పట్టించుకోలేదని..అధికారంలో వున్నప్పుడు చేయలేని పనులను ఇప్పుడు చేస్తామని ప్రజలను మభ్య పెడుతు ఓట్ల  కోసం మోసం చేస్తున్నాయనీ అటువంటప్పుడు సోనియా తెలంగాణ తల్లి ఎలా అవుతుంది? అని  బీఎల్ఎఫ్ చైర్మన్, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పెట్టుబడిదారుల చేతుల్లో కీలు బొమ్మలుగా పనిచేస్తున్నాయని తమ్మినేని విమర్శించారు. కేసీఆర్ ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని..మరోసారి టీఆర్ఎస్ పార్టీని ప్రజలు గెలిపించకుంటే రెస్ట్ తీసుకంటానని చెబుతున్న కేసీఆర ప్రజలకు సేవ ఎలా చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో యువత ఆత్మహత్యలకు కారణం ఎవరు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. 

19:48 - November 14, 2018

హైదరాబాద్: టీఆర్ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ కలిసి ఏర్పడిన మహాకూటమిపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పందించారు. మహాకూటమిని బేస్‌లెస్ ఆలోచనగా కొట్టిపారేశారు. మహాకూటమిలో సీపీఎం చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై తమ్మినేని వీరభద్రం మాట్లాడుతు..కేసీఆర్ స్వలాభం కోసమే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని..ముందస్తు ఎన్నికలతో ప్రజలపై ఆర్థిక భారం పడుతుందన్నారు. ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న తరుణంలో మళ్లీ కాంగ్రెస్‌కు వంత పలకటం మూర్ఖత్వం అని వ్యాఖ్యానించారు. దేశంలో కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాలను తీసుకొచ్చిందే కాంగ్రెస్‌ అని.. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌తో కలవటానికి తాము సిద్ధంగా లేమన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీకి ప్రత్యామ్నాయంగా బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్ఎఫ్)ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సామాజిక న్యాయం, చట్టసభల్లో బలహీనులకు అవకాశం కల్పించటమే తమ లక్ష్యమన్నారు. బీఎల్ఎఫ్‌తోనే బలహీనవర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. జనసేన, ఆమ్‌ ఆద్మీ పార్టీ సహా.. కలిసి వచ్చే వారితో బీఎల్ఎఫ్‌ను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. తమది మొదటిది లేదా మూడో ఫ్రంట్ అనికూడా  అనుకోవచ్చునని తమ్మినేని తెలిపారు.

16:35 - September 9, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరుగబోయే ఎన్నికలపై జనసేనానీ 'పవన్ కళ్యాణ్' దృష్టి సారించారు. ఆదివారం పార్టీ రాజకీయ వ్యవహార కమిటీతో పవన్ సుదీర్ఘంగా చర్చించారు. మాదాపూర్ లోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఎన్నికలపై ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి ? ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోవాలనే దానిపై చర్చించారు. గతంలో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో జరిపిన చర్చల వివరాలను పవన్ కు సభ్యులు వివరించారు. తదుపరి చర్చలు పవన్ తో జరపాలని సీపీఎం సభ్యులు పేర్కొన్నారని వారు తెలిపారు. దీనితో చర్చలకు పవన్ అంగీకరించారు. సీపీఎం నేతలను చర్చలకు ఆహ్వానించాల్సిందిగా పవన్ సూచించారు. మంగళ, బుధ వారాల్లో ఈ సమావేశాలు జరుగుతాయని తెలుస్తోంది. 

21:44 - August 1, 2018

హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లోనూ పోటీ చేయనున్నట్లు బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ తమ్మినేని వీరభద్రం చెప్పారు. ప్రధాన పార్టీలకు దీటైన పోటీ ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ పాతబస్తీలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందాన ఉందన్న ఆయన.. అర్హులందరికీ డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

బహుజన్‌ లెఫ్ట్‌ ఫ్రంట్‌ నేతలు.. కన్వీనర్‌ తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో.. హైదరాబాద్‌ పాతబస్తీలో విస్తృతంగా పర్యటించారు. జియాగూడలోని మేకలమండిని సందర్శించిన బిఎల్‌ఎఫ్‌ నేతలు.. అక్కడి కార్మికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మేకల మండీని ప్రైవేటుపరం చేయాలన్న  ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని, మండీని ప్రభుత్వమే నిర్మించాలని బిఎల్‌ఎఫ్‌ నేతలు డిమాండ్‌ చేశారు. 

పాతబస్తీలో అనుకూలమైన వారికి తాయిలాలు ఇచ్చారే తప్ప.. ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదని బిఎల్‌ఎఫ్‌ నేతలు ఆరోపించారు. ఉర్దూఘర్‌లో విలేకరులతో మాట్లాడిన తమ్మినేని వీరభద్రం.. పాతబస్తీ అభివృద్ధికి ప్రభుత్వం పదివేల కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని, ప్రధాన పార్టీలకు దీటుగా గట్టి పోటీ ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

జియాగూడలో నిర్మాణంలోని డబుల్‌బెడ్‌ ఇళ్లనూ బిఎల్‌ఎఫ్‌ నేతలు పరిశీలించారు. అనంతరం, బండ్లగూడ తహశీల్దార్‌ కార్యాలయం ముందు బిఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో సాగుతోన్న ధర్నాలో పాల్గొన్నారు. ఆ ప్రాంత నిరుపేదలందరికీ ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, ఇళ్ల నిర్మాణం కోసం ఖాళీ చేయించిన పేదలందరికీ ప్రభుత్వమే అద్దె చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 

 

17:58 - July 26, 2018

హైదరాబాద్ : త్రిపుర, పశ్చిమ బెంగాల్లో వామపక్షాలపై బీజేపీ, టీఎంసీ గూండాల దాడిని నిరసిస్తూ.... హైదరాబాద్‌లో వామపక్షాలు ర్యాలీ చేపట్టాయి.. నారాయణగూడ ఫ్లై ఓవర్ నుంచి సుందరయ్యవిజ్ఞాన కేంద్రం వరకు వామపక్షాల నిరసన ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. 

19:29 - July 18, 2018

ఖమ్మం : పేదలకు డబుల్‌బెడ్రూం ఇళ్లు ఇప్పించాలని డిమాండ్‌ చేస్తూ ఖమ్మం జిల్లా పాల్వంచలో ఎమ్మార్వో కార్యాలయాన్ని ముట్టడించారు సీపీఎం నేతలు. తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని 4 ఏళ్లు గడిచినా ఇంకా హామీలు నెరవేర్చకపోవడంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. కేవలం ఓట్ల కోసమే వాగ్దానాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.

13:19 - July 1, 2018

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌తో సీపీఎంకు, బీఎల్‌ఎఫ్‌కు లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్‌తో సహా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజావ్యతిరేక విధానాలపై మిలిటెంట్‌ తరహా ఉద్యమాలు చేసిన ఏకైక పార్టీ సీపీఎం అని... అలాగే బీఎల్‌ఎఫ్‌, టీ-మాస్‌ కూడా ప్రజలపక్షాన నిలిచాయని ఆయన అన్నారు. కాంగ్రెస్‌తో సీపీఐ, కోదండరామ్‌ పార్టీ జతకడతారని ప్రచారం జరుగుతుందని ఆ ప్రచారాన్ని ఖండించాల్సిన బాధ్యత ఆయా పార్టీలపైనే ఉందని తమ్మినేని అన్నారు. 

17:55 - June 28, 2018

నల్గొండ : రాష్ట్ర ప్రభుత్వం ఫాసిస్టు చర్యలకు పాల్పడుతోందని బీఎల్ఎఫ్ నేతలు విమర్శలు గుప్పించారు. కలెక్టరేట్ల ముట్టడిని ప్రభుత్వం అడ్డుకున్నందుకు...నల్గొండ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే జూలకంటిని గృహ నిర్భందం..కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు అనుమతినివ్వకపోవడంపై నిరసిస్తూ జూలకంటి చేపట్టిన నిరహారదీక్షను సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. అనంతరం మిర్యాలగూడలో బీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్శంగా తమ్మినేని వీరభద్రంతో టెన్ టివి మాట్లాడింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానం అమలు కావడం లేదని..కేసీఆర్ లో భయం ఉందని..అందుకే నిర్భందం..పోలీసు రాజ్యం నడిపిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలు చేస్తామని కేవలం బీఎల్ఎఫ్ మాత్రమే ప్రకటించిందన్నారు. అధికారపక్షం..ప్రతిపక్ష కాంగ్రెస్..ఏవీ మాట్లాడడం లేదన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

21:46 - June 18, 2018

హైదరాబాద్ : రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న లైంగికదాడులను అరికట్టాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టి భద్రత కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయని ... దేశంలోనే నేరాలలో రాష్ట్రం 9వ స్థానంలో ఉంది. అసభ్య, అశ్లీల సినిమాలు, వెబ్‌సైట్లు, ప్రసార మాద్యమాలలో మహిళలను కించపరిచే విధంగా చూపడం వల్లే వేధింపులు పెరుగుతున్నాయని అన్నారు. వాటి నివారణకు ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని దోషులను శిక్షించాలని సీపీఎం ప్రభుత్వాన్ని కోరింది. 

15:25 - June 7, 2018

కామారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం అన్నదాతలందరికీ అందడంలేదని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. కౌలు, పోడు రైతులకు ఈ పథకాన్ని వర్తింపచేయకపోవడాన్ని తమ్మినేని తప్పుపట్టారు. కామారెడ్డి జిల్లా జుక్కల్‌ మండలంలోని 15 గ్రామాలకు చెందిన వేలాది మంది రైతులకు ఈ పథకం కింద సాయం అందలేదు. దీనిని నిరసిస్తూ సీపీఎం పాదయాత్ర నిర్వహించింది. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

Pages

Don't Miss

Subscribe to RSS - తమ్మినేని వీరభద్రం