ఢిల్లీ

11:42 - September 19, 2018

ఢిల్లీ : చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య ప్రతిష్టాత్మక పోరుకు రంగం సిద్ధమైంది. ప్రపంచ క్రికెట్ ను తన వైపు తిప్పుకునే మ్యాచ్ పై అంతటా ఉత్కంఠ రేపుతోంది. క్రికెట్ ప్రేమికులను కనువిందు చేయడానికి దాయాది జట్లు రెడీ అయ్యాయి. ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాక్‌ చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్...ఓటమికి బదులు తీర్చుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏడాది తర్వాత భారత్‌, పాకిస్థాన్‌ క్రికెట్‌ పోరుకు రంగం సిద్ధమైంది. ఆసియా కప్‌లో భాగంగా గ్రూప్‌-ఎ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థులు మరోసారి తలపడనున్నాయి. రెండు జట్లు తలపడే అరుదైన మ్యాచ్‌లనూ ఏ క్రికెట్‌ అభిమానీ చూడకుండా ఉండలేడు. కేవలం రెండు దేశాల అభిమానులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ ప్రేమికులందరూ ఈ మ్యాచ్‌పై ఆసక్తి చూపిస్తారు. గత ఏడాది ఛాంపియన్స్‌ ట్రోఫీలో రెండు జట్లూ తలపడగా.. భారత్‌పై పాక్‌ భారీ విజయం సాధించింది. దీంతో ఇప్పుడు పాక్‌ను ఓడించడం భారత్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది.

పటిష్టమైన బౌలింగ్ ఉన్న పాకిస్తాన్ భారత్ బ్యాట్స్ మెన్లు ఎలా ఎదుర్కొంటారన్న ఆసక్తికరంగా మారింది. ఓపెనర్లు రోహిత్‌, ధావన్‌ ఎలాంటి ఆరంభాన్నిస్తారన్నది కీలకంగా మారింది. హాంకాంగ్ పై రాణించిన ధావన్, అంబటి రాయుడుతో పాటు ఇతర బ్యాట్స్ మెన్లు రాణిస్తే...భారత్ జట్టు సునాయసంగా గెలుస్తుంది. బౌలింగ్ లో భువీ, కుల్దీప్, చాహల్ రాణిస్తే పాకిస్తాన్ కు కష్టాలు తప్పవు. 

08:50 - September 19, 2018

ఢిల్లీ : ఆర్ఎస్ఎస్ చీఫ్‌ మోహన్ భగవత్...హిందూత్వ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజంలో ముస్లింలను భాగంగా చూడకుండా...వారిని కలుపుకొని ముందుకెళ్లకపోతే హిందూత్వకు అర్థం లేదన్నారు. జాతీయ ప్రయోజనాలకు కోసం పని చేసే వారికి అండగా ఉంటాన్న భగవత్...ఏ పార్టీకి పని చేయమని స్వయం సేవకులను ఆదేశించ లేదని స్పష్టం చేశారు.

హిందుత్వ అంశంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరుగుతున్న భవిష్య కా భౄరత్-అర్ఎస్ఎస్ పర్ స్పెక్టివ్ సదస్సులో భగవత్ మాట్లాడారు. భారత సమాజంలో ముస్లింలను భాగంగా చూడకపోతే...అది హిందుత్వ అనిపించుకోదని స్పష్టం చేశారు. సమాజంలో ముస్లింలను భాగంగా చూడకుండా...వారిని కలుపుకొని ముందుకెళ్లకపోతే అసలు హిందుత్వకే అర్థం లేదన్నారు. మొత్తం సమాజాన్ని ఏకం చేయడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని ప్రకటించారు.

సంఘ్‌ పుట్టుక నుంచే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేయబోదన్న ఆయన...జాతీయ ప్రయోజనాల కోసం పని చేసే వారికి అండగా ఉంటామన్నారు. కేంద్రం ప్రభుత్వం నిర్ణయాల వెనుక నాగ్ పూర్ ఉందంటూ...కొంత మంది చేస్తున్న వ్యాఖ్యలను భగవత్ కొట్టిపారేశారు. రాజకీయాలను, ప్రభుత్వ నిర్ణయాలను తాము ప్రభావితం చేయబోమన్న ఆయన...కేంద్ర ప్రభుత్వానికి ఏదైనా సలహా కావాలంటే మాత్రం తమను సంప్రదిస్తుందని.. అప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇస్తామన్నారు. ఫలానా పార్టీకి పని చేయాలని...స్వయం సేవకులకు ఎన్నడూ ఆదేశించలేదన్నారు. 

16:04 - September 18, 2018

ఢిల్లీ : భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ ప్రతీక..అనేక వృత్తులు, అనేక సంప్రదాయాలు, అనేక భాషలు, అనేక మతాలు.. ఇలా అన్నీ కలగలిస్తేనే భారతదేశం. మరి ఆ సంప్రదాయాలు, కళలు అన్నీ  ఒకే చోట కనిపిస్తే... అది ఎంత చూడముచ్చటగా ఉంటుందో. అన్నీ ఒకే చోటా ఎలా సాధ్యమనుకుంటున్నారా.. భారత్ పర్యటన్ పర్వ్ -2018తో సాధ్యమే..దేశ రాజధాని ఢిల్లీ..  వివిధ రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలతో  కళకళలాడుతుంది..రాజ్ పథ్ వేదికగా 12 రోజుల పాటు పర్యటన్ పర్వ్ ఘనంగా జరగుతుంది...అసలేంటీ పర్యటన్ పర్వ్. 

దేశంలో పర్యాటక రంగ అభివృద్దికి కేంద్ర పర్యాటక శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నడుం బిగించాయి. ఇందులో భాగంగానే... దేశంలోని పర్యాటక ప్రాంతాలను ప్రాచుర్యం లోకి తేవడం పై రెండేళ్ళుగా దేశ రాజధానిలో పర్యటన్ నిర్వహిస్తున్నారు.
ఢిల్లీలో రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్ మధ్య ఉన్న రాజ్ పథ్ లాంజ్ లో పర్యటన్ పర్వ్ వేదికను కేంద్రం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాజ్ పథ్ కు ఇరువైపులా దేశంలోని అన్ని రాష్ట్రాల స్టాళ్లను ఏర్పాటు చేశారు. చారిత్రక కట్టడాలు, ప్రాంతాలు, దర్శనీయ ప్రదేశాలకు మరింత ప్రాచుర్యం లభించేలా ఈ పర్వ్ లో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.ఏపీ  పర్యాటక శాఖ సైతం  ఇందులో స్టాల్ ఏర్పాటు చేసి ఏపీలోని పర్యాటక ప్రాంతాల వివరాలను ప్రత్యేకతలను ప్రజలకు తెలియజేస్తున్నారు..

దేశంలోని అన్ని రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసేలా ఏర్పాటు చేసిన స్టాల్స్ లో దేశంలోని పురాతన వస్తువులు సహా ఆహార పదార్థాల స్టాళ్లు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పర్యాటక స్థలాలకు ప్రాచుర్యంతో పాటు అక్కడి ఆచార వ్యవహారాలను అందరికీ తెలియజేస్తున్నారు. తెలుగురాష్ట్రాల నుంచి చేనేత, హస్తకళలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.
12 రోజులపాటు జరిగే ఈ పర్యటన్ పర్వ్ లో ప్రతి రోజు ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు..ఏపీ కూచిపూడి నృత్య ప్రదర్శన 21న ఢిల్లీలోని తెలుగువాసులను అలరించబోతుంది..అయితే పర్యటన్ పర్వ్ లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన స్టాల్స్ లేకపోవడం కొంత వెలితిగా అనిపిస్తోంది. 

14:13 - September 18, 2018

ఢిల్లీ : మహిళా సాధికరత అనే మాట భారత్ లో తొలిసారిగా వినిపించిన రోజుల్లోనే కొందరు మహిళా మణులు విభిన్న రంగాల్లో తమదైన ముద్ర వేసుకున్నారు. ఇంటిలోని నుండి మహిళలు బైటకు అడుగు పెట్టని రోజుల్లో ఐఏఎస్ స్థాయికి చేరుకున్న మహిళలు తమదైన శైలిలో తమ ప్రతిభను కనబరిచారు. వీరిలో భారతదేశంలోనే మొట్టమొదటి ఐఏఎస్ గా గుర్తింపబడిన తొలి మహిళా ఐఏఎస్ రాజమ్ మల్హోత్రా. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక సివిల్‌ సర్వీస్‌ పరీక్షల్లో విజేతగా నిలిచి తొట్టతొలి ఐఏఎస్‌ ఆఫీసర్‌గా విధులు  నిర్వహించిన రాజమ్‌ మల్హోత్రా తన 91వ ఏట  కన్నుమూశారు. ముంబయిలోని తన స్వగృహంలో ఆమె కన్నుమూశారు. కేరళలోని ఎర్నాకుళం జిల్లాకు చెందిన రాజమ్‌ 1951 సివిల్స్‌ బ్యాచ్‌ సభ్యురాలు. హోసూరు సబ్‌ కలెక్టర్‌గా తొలిసారి సేవందించారు. ఐఏఎస్‌ అధికారిణిగా చెన్నైలో సేవందించిన ఆమె అప్పటి సీఎం సి.రాజగోపాలచారి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. మొత్తం ఏడుగురు సీఎంల వద్ద పనిచేసిన అనుభవం ఆమెకుంది. 1985-90 మధ్య ఆర్‌బీఐ గవర్నర్‌గా పనిచేసిన ఆర్‌.ఎన్‌.మల్హోత్రా ఈమె భర్త.

 

13:10 - September 18, 2018

ఢిల్లీ : వారణాసిలో ప్రధానమంత్రి మోడీ పర్యటించారు. వారణాసిలో రూ.500 కోట్ల అభివృద్ధి పనులను మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ వారణాసిని దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. 

 

07:55 - September 18, 2018

అమెరికా : మొబైల్‌ ఫోన్ లో సెట్టింగ్‌లను మన అనుమతి లేకుండానే గూగుల్‌ మార్చేస్తుందా ? అంటే అవునని పలువురు ఆండ్రాయిడ్‌‌ యూజర్లు అంటున్నారు. గత శుక్రవారం పలు ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ‘బ్యాటరీ సేవర్’‌ మోడ్‌ ఆటోమెటిక్‌గా ఆన్‌ అయింది. తమ ప్రమేయం లేకుండానే ఇలా జరగడంతో పలువురు ఆండ్రాయిడ్‌‌ యూజర్లు ఆందోళన వ్యక్తం చేశారు.

గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్ల‌ వినియోగదారులు చాలా మంది తమ ఫోన్లలో తగినంత ఛార్జింగ్‌ ఉన్నప్పటికీ.. ఆటోమెటిక్‌గా బ్యాటరీ సేవర్‌ మోడ్‌ ఆన్‌ అయిందని ఫిర్యాదు చేసినట్లు ‘ఆండ్రాయిడ్‌ పోలిస్‌’ వెబ్‌సైట్‌ తెలిపింది. ‘పై’ లాంటి లేటెస్ట్‌ ఆండ్రాయిడ్‌ వెర్షన్లు వినియోగిస్తున్నవినియోగదారులు ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొన్నారని పేర్కొంది.
 

ఆ తర్వాత ఈ సమస్యపై గూగుల్‌ సంస్థ స్పందించింది. తాము చేసిన కొన్ని మార్పుల కారణంగానే అలా జరిగిందని తప్పుని ఒప్పుకుంది. ‘కొన్ని ఫోన్లలో బ్యాటరీ సేవర్‌ మోడ్‌ ఆటోమెటిక్‌గా ఆన్‌ అవడం జరిగింది. అంతర్గతంగా మేం చేపట్టిన ఓ ప్రయోగం పొరపాటున బయటి ఫోన్లపై ప్రభావం చూపించింది. బ్యాటరీ సేవర్‌ మోడ్‌ను అంతర్గతంగా పరీక్షిస్తున్న సమయంలో ఇలా జరిగింది. మేం వెంటనే సెట్టింగ్స్‌ను తిరిగి పూర్వస్థితిలోకి తీసుకొచ్చాం. ఇందుకు క్షమించగలరు’ అని గూగుల్‌ రెడిట్‌ పోస్ట్‌లో పేర్కొంది.

 

20:30 - September 17, 2018

ఢిల్లీ: జేఎన్‌యూలో మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఏదో ఒక వివాదంలో నిత్యం వార్తల్లో వుండే జేఎన్‌యూలో జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల ఫలితాల సందర్భంగా ఘర్షణలు జరిగాయి. విద్యార్థి సంఘం ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది సేపటితే ఏబీవీపీ, ఏఐఎస్ఏ విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. యూనివర్సిటీ క్యాంపస్‌లో జరిగిన ఈ ఘర్షణలో జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన ఎన్.సాయిబాబాపై పలువురు ఏబీవీపీ నేతలు దాడికి పాల్పడ్డారు.
బ్యాలెట్ బాక్సులను తీసివేసేందుకు ప్రయత్నించడం వంటి ఘటనలపై కొంతమందిని సస్పెండ్ చేశారు. ఆ సమయంలో కూడా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కాగా ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం, అర్థరాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణలు మరోసారి భగ్గుమన్నాయి. 
ఈ విషయమై ఇరు వర్గాలు భిన్న వాదనలు వినిపించాయి. లెఫ్ట్ విద్యార్థి సంఘాలకు చెందిన నేతలు తమపై దాడికి పాల్పడ్డాయని ఏబీవీపీ నేతలు ఆరోపించారు. ఆర్ఎస్ఎస్-ఏబీవీపీ నేతలు తమపై మూక దాడులకు దిగారని లెఫ్ట్ విద్యార్థి సంఘాలకు చెందిన నేతలు తెలిపాయి. 
యూనివర్సిటీలో జరిగిన ఎన్నికల్లో ఐక్య వామపక్ష కూటమి  ఘన విజయం సాధించింది. ఆదివారం ప్రకటించిన ఫలితాల్లో సాయిబాలాజీ సహా.. 4 కేంద్ర ప్యానెళ్లను వామపక్ష కూటమి సొంతం చేసుకుంది. దీన్ని తట్టుకోలేకపోయిన ఏబీవీపీ విద్యార్థి సంఘం నేతలు ఏదో విధంగా క్యాంపస్‌లో వివాదాలు  సృష్టించేందుకు శతవిధాలు యత్నిస్తున్నాయి. 

 

21:25 - September 16, 2018

ఢిల్లీ : పుట్టిన ప్రతీ మనిషి చనిపోయేంత వరకూ బ్రతికేందుకు పోరాడుతునే వుంటుంది. కానీ కొన్ని విపత్కర పరిస్థితులు..విన్నా నమ్మలేనటువంటి నిజాలు ఆత్మహత్యలకు పురిగొల్పేలా చేస్తాయి. కానీ బ్రతకటానికంటే చనిపోవటానికే ఎక్కువ ధైర్యం కావాలి. ఆ చావుల కూడా వింతలు..నమ్మలేనటువంటి నిజాలు వెల్లడైనా నమ్మలేని పరిస్థితిని కల్పిస్తాయి. ఇటువంటి సంఘటనే దేశ రాజధాని ఢిల్లీలోని బురారి సామూహిక మరణాలు. దేశమంతటిని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. ఆ మరణాల గురించి విస్తుగొలిపే వింతలు..విశేషాలు బైటపడుతున్నాయి. 
ఒకే కుటుంబానికి చెందిన 11 మంది విగతజీవులై కనిపించిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ ఉదంతంలో విస్తుగొలిపే నిజం ఒకటి ఫోరెన్సిక్ నివేదిక ద్వారా వెల్లడైంది. పోలీసులు తొలుత భావించినట్టుగా ఆ కుటుంబానిది ఆత్మహత్య కాదని తేలింది. జూలై 1న బురారీ ప్రాంతానికి చెందిన నారాయణ్ దేవీ సహా 10 మంది కుటుంబసభ్యులు విగత జీవులుగా కనిపించిన విషయం తెలిసిందే. వీరంతా సామూహిక ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

ఈ కేసులో 'సైకలాజికల్ అటాప్సీ' అంటే ఆత్మహత్య చేసుకున్న వారి గురించి లోతైన మానసిక విశ్లేషణ నిర్వహించాలని న్యూఢిల్లీ పోలీసులు సీబీఐని కోరడం జరిగింది. తాజాగా దీనికి సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికను పోలీసులకు సీబీఐ అందించింది. ఈ నివేదిక ద్వారా బురారీ కుటుంబం ఉద్దేశపూర్వకంగా ఆత్మహత్యలకు పాల్పడలేదని.. అసలు ఆ కుటుంబంలో ఎవరికీ చనిపోవాలన్న ముందస్తు ఆలోచనే లేదనే విషయం వెల్లడైంది. మోక్షం కోసం క్రతువు నిర్వహిస్తుండగా, అందులో సూచించిన విధానాన్ని వారు అనుసరించడంతో జరిగిన ప్రమాదం కారణంగానే వారంతా చనిపోయినట్టు సైకలాజికల్ అటాప్సి నివేదికలో పేర్కొన్నారు. ఆ ఇంట్లో లభించిన ఆయా వ్యక్తుల నోట్ పుస్తకాలు, డైరీలను లోతుగా విశ్లేషించడంతో పాటు, వారి స్నేహితులను, బంధువులను ఇంటర్వ్యూలు చేసి సీబీఐ ఫోరెన్సిక్ ల్యాబ్ ఈ నివేదికను రూపొందించింది. 

20:50 - September 16, 2018

ఢిల్లీ : బీజేపీ నేతలే కాదు..వారి సతీమణులు కూడా స్త్రీల పట్ల పలు వివాదాస్పద, విమర్శల వివాదాలకు దారితీసేలా వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ నేతలు మహిళల పట్ల పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వీరి దారిలోనే బీజేపీ మహిళా నేత అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయో తెలియజేశారు. భారతదేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న అత్యాచారాలకు నిరుద్యోగ సమస్య పెరగడమే కారణమని హర్యానా బీజేపీ మహిళా నేత, కేంద్ర మంత్రి వీరేందర్ సింగ్ సతీమణి ప్రేమలతా సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు  వైరల్ కాగా, ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి.

మన దేశంలోని యువత మనసులోని విసుగు, అసంతృప్తులే అత్యాచారాలకు కారణాలుగా మారుతున్నాయని సదరు మహిళా నేత సెలవిచ్చారు. ప్రస్తుతం ఉద్యోగాలు లేక ఎంతో మంది అసంతృప్తితో ఉన్నారు. వారి భవిష్యత్తుపై ఆశలేకనే ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నారు ని ఆమెగారు సెలవిచ్చారు. రాష్ట్రంలోని రెవారి ప్రాంతంలో జరిగిన గ్యాంగ్ రేప్ ను ప్రస్తావిస్తూ ప్రేమలతా సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఓ బాధ్యతగల మహిళగా ఉండి ఈ తరహా వ్యాఖ్యలేంటని ప్రశ్నిస్తున్నారు. మండిపడుతున్నారు. 

15:34 - September 15, 2018

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ స్ర్కీనింగ్ కమిటీ భేటీ అయింది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలపైనే చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కమిటీల ఏర్పాటుపై స్ర్కీనింగ్ కమిటీ దృష్టి సారించింది.  ఎన్నిక లకు టికెట్లు కేటాయింపుపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. ప్రచార, సమన్వయ, మేనిఫెస్టో కమిటీల ఏర్పాటుపైనా చర్చిస్తున్నారు. మరో రెండు రోజుల్లో అన్ని కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. నిన్న ముగ్గురు సభ్యులతో రాహుల్ గాంధీ స్ర్కీనింగ్ కమిటీని వేశారు. భక్తచరణ్ అధ్యక్షతన జ్యోతిమని సెంథిమలై, శర్మిష్ఠ సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేశారు. 
ప్రచార కమిటీ బాధ్యతలపై కాంగ్రెస్ లో పోటీ పెరిగింది. తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లుభట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డిలు ప్రచార కమిటీ బాధ్యతలు కోరుతున్నారు. ప్రచార కమిటీ ఆశావహుల్లో కోమటిరెడ్డి, వి.హెచ్, మధుయాష్కీ గౌడ్ ఉన్నారు. కాంగ్రెస్ ఆశావహులు ఢిల్లీ చేరుకున్నారు. 
రాష్ట్రంలో పొత్తులపైనా తుది నిర్ణయం తీసుకునే దిశగా కసరత్తు చేస్తున్నారు. మహాకూటమి పార్టీలతో పొత్తుపై నిర్ణయానికి కాంగ్రెస్ కమిటీలు వేయయనుంది. కాంగ్రెస్, టీడీపీలు బలంగా ఉన్న స్థానాల జాబితాను రూపకల్పన చేయనున్నారు. టీడీపీకి ఎన్ని స్థానాలు ఇవ్వాలన్న అంశంపై ఢిల్లీ స్థాయిలో చర్చ చేస్తున్నారు. తుది నివేదికను రాహుల్ కు సమర్పించే దిశగా కసరత్తు చేస్తున్నారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - ఢిల్లీ