డ్రగ్స్

21:52 - October 9, 2018

హైదరాబాద్ : నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. అమీర్‌పేట్‌లో టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. రాహుల్ అనే వ్యక్తి నుంచి 12 గ్రాముల ఎల్‌సీడీ డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాహుల్ స్నేహితులు రిషబ్, ప్రవీణ్ దగ్గర కూడా డ్రగ్స్ ఉందన్న సమాచారంతో వారిపై కూడా అధికారులు దాడులు చేశారు. వారి నుంచి భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు లక్ష విలువ చేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రాహుల్, రిషబ్, ప్రవీణ్‌లతోపాటు డ్రగ్స్ కొనడానికి వచ్చిన వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు. 

 

16:26 - September 8, 2018

జీవితం అనేది అందరికి వడ్డించిన విస్తరికాదు. కష్టంతో, కమిట్ మెంట్ తో..కష్టాన్నే ఇష్టంగా మార్చుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరిన వ్యక్తి చిన్ని చిన్నివాటికే బేజారైపోయి జీవితాన్ని నాశనం చేసుకుని ఆఖిరి ఆ జీవితాన్నే అంతం చేసుకునే పరిస్థితులకు దిగజారిపోతున్న నేటితరం యువతను చూస్తుంటే ఆత్మస్థైర్యం తగ్గిపోతుందా? అనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ నేపథ్యంలో చిన్న వయసులోనే ఉన్నత స్థానాన్ని అధిరోహించి కోట్లాది మంది సంగీత అభిమానులను సొంతం చేసుకున్న ప్రముఖ అమెరికన్‌ ర్యాప్‌ సింగర్ మ్యాక్‌ మిల్లర్ మృతి చెందాడు. డ్రగ్స్‌ మోతాదు అధికం తీసుకోవటంతో తన 26 ఏళ్ల వయసులోనే మిల్లర్ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. చిన్ననాటే పెద్ద పేరు..ప్రేమలో పడటం..ప్రియురాలితో బ్రేకప్‌...హిట్‌ అండ్‌ రన్‌ కేసులో అరెస్టులు వంటి పలు సమస్యలతో మిల్లర్ తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన ఈ ర్యాపర్‌ డ్రగ్స్‌కు బానిసయ్యాడు. లాస్‌ ఏంజిల్స్‌లోని తన నివాసంలో ఆపస్మారక స్థితిలో పడివున్న మ్యాక్‌ మిల్లర్ ను కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించేసరికే డ్రగ్స్ మోతాదు ఎక్కువ కావటంతో అప్పటికే చనిపోయినట్లు డాక్టర్స్ తెలిపారు.

ప్రియురాలు అరియానా గ్రాండే తనకు బ్రేఇకప్ చెప్పి అమెరికా కమేడియన్‌ పిటె డేవిడ్సన్‌తో ఎగేజ్ మెంట్ ఫిక్స్ చేసుకోవడాన్ని మ్యాక్‌ మిల్లర్ తట్టుకోలేకపోయాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆమెతో విడిపోయినప్పటి నుండి మిల్లర్ తీవ్రంగా కృంగిపోయాడని..తన చివరి ఇంటర్వ్యూలో కూడా మిల్లర్ డిప్రెషన్‌లో ఉన్నట్లు తెలిపాడు.

07:17 - August 14, 2018

హైదరాబాద్‌ : మళ్లీ డ్రగ్స్‌ ఆనవాళ్లు కలకలం సృష్టించాయి. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో డ్రగ్స్‌ కేసులు విచ్చలవిడిగా నమోదైన నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. కీలక సమాచారం సేకరించి గోవా నుండి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

విద్యార్థులు, టాలీవుడ్‌ను టార్గెట్‌ చేసిన డ్రగ్స్‌ మాఫియా..
హైదరాబాద్‌లో డ్రగ్స్‌ మాఫియా చెలరేగిపోతోంది. దీన్ని అరికట్టేందుకు పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా డ్రగ్స్‌ ఆనవాళ్లు మాత్రం కనిపిస్తూనే ఉన్నాయి. గతంలో విద్యార్థులు, టాలీవుడ్‌ను డ్రగ్స్‌ మాఫియా టార్గెట్‌ చేసుకున్న నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. డ్రగ్స్‌ కదలికలపై నిఘా పెట్టి కీలక సమాచారంతో గోవా నుండి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న అబ్దుల్‌ హమీద్‌ను అరెస్ట్ చేశారు. ఇతను బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌లో డ్రగ్స్‌ సప్లై చేస్తున్నట్లు గుర్తించారు.

వారం రోజలు నిఘా పెట్టి డ్రగ్‌ ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు..
వారం రోజుల నిఘా అనంతరం డ్రగ్స్‌ గుట్టును రట్టు చేశారు పోలీసులు. గోవాలో మాక్స్‌ అనే వ్యక్తి వద్ద నుండి హమీద్‌ డ్రగ్స్‌ సేకరిస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌లో ఇతనికి 20 మంది వరకు కష్టమర్లు ఉన్నారని గుర్తించారు. హమీద్‌ వద్ద నుంచి 31 గ్రాముల కొకైన్‌, 7 లక్షల నగదు, రెండు మొబైల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. గోవా నుండి మాక్స్‌ పంపిన డ్రగ్స్‌ను 2వేలకు కొని హైదరాబాద్‌లో 6 వేలకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఆగని డ్రగ్స్‌ ముఠాల ఆగడాలు..
గోవాకు చెందిన మ్యాక్స్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు ఎంత నిఘాపెట్టినా డ్రగ్స్ ముఠాల ఆగడాలు మాత్రం ఆగడంలేదు. కీలక నిందితులు విదేశాల్లో ఉండి కార్యకలాపాలు సాగిస్తుండటంతో స్థానిక పోలీసులకు తలనొప్పిగా మారింది.

 

13:40 - August 13, 2018

హైదరాబాద్ : నగరంలో డ్రగ్స్ కలకలం రేపింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న అబ్దుల్ హమీద్ ను అరెస్టు చేశారు. హమీద్ ను ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్టు చేశారు. 31 గ్రాముల కొకైన్, రూ.7 లక్షలు, రెండు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు.  హమీద్.. గోవా నుంచి హైదరాద్ కు డ్రగ్స్ తరలిస్తున్నారు. గోవాలో మాక్స్ అనే వ్యక్తి నుంచి హమీద్ డ్రగ్స్ సేకరిస్తున్నారు. హైదరాబాద్ లో హామీద్ 20 మంది కస్టమర్లు ఉన్నట్లు గుర్తించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

10:14 - August 2, 2018

హైదరాబాద్ : నగరంలో కొకైన్ విక్రయాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అక్రమంగా మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న ఘటనలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. తాజాగా హుమాయిన్ నగర్ పీఎస్ పరిధిలో కొకైన్, గంజాయి విక్రయిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరోజిని దేవి ఆసుపత్రి సమీపంలో కొకైన్ విక్రయిస్తున్నారని టాస్క్ ఫోర్స్ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కొకైన్ కొనడానికి వచ్చిన వ్యక్తిని..అమ్ముతున్న వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు రెడ్ హ్యాండెండ్ గా అదుపులోకి తీసుకున్నారు. ఇర్ఫాన్ అనే వ్యక్తిని పట్టుకొనేందుకు ప్రయత్నించగా అతను పరారయ్యాడు. వీరి వద్ద 15 గ్రాముల కొకైన్, 80 గ్రాముల డ్రై గంజాయి, 2 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. 

06:41 - March 4, 2018

హైదరాబాద్‌ : నగరం విష సంస్కృతి వడిలోకి వెళుతోంది. విదేశీ సంస్కృతి నగర వాసులను పెడ దారి పట్టిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో పబ్‌, హుక్కా కల్చర్ విస్తరిస్తోంది. దీనికి అలవాటు పడుతున్న నగర యువత రేవ్ పార్టీలతో మజా చేస్తున్నారు.హుక్కాతో మత్తులో తూగుతున్నారు. డ్రగ్స్, గంజాయి, హెరాయిన్, తాజాగా ఎల్ఎస్డి అన్నీ నగర యువతను ఓ గమ్మత్తైన లోకానికి తీసుకెళ్లి మత్తులో చిత్తు చేస్తోంది. చాలా గుట్టుగా సాగిపోతున్న హుక్కా కల్చర్ ఈ మధ్య కాలంలో పోలీసుల దాడుల్లో బయటపడింది. హుక్కా సెంటర్లు పైకి చూడడానికి కాఫీబార్లు, టీ స్పాట్లు, ఐస్ క్రీం పార్లర్లు ,గేమింగ్ పార్లర్ లాగా కనిపిస్తాయి. లోపల మాత్రం హుక్కా పొగలు గుప్పు గుప్పు మంటున్నాయి. ఒక్కో ఫ్లేవర్కు ఒక్కో రేట్ ఫిక్స్ చేసి యజమానులు డబ్బులు దండుకుంటున్నారు. ఈ ఫ్లేవర్లకు తంబాకు, గంజాయి,కొకైన్, హెరాయిన్ మిక్స్ చేసి యూత్ ను మత్తులో ముంచెత్తుతున్నారు.

క్సైజ్ శాఖ నుంచి అనుమతి తీసుకున్న సెంటర్లు కొన్ని మాత్రమే ఉండగా.. అనధికారికంగా నడుస్తున్న సెంటర్లే అధికంగా ఉన్నాయి. వాటిపై నిఘా కొరవడడంతో మైనర్లు సైతం హుక్కా కు బానిసలవుతున్నారు. మత్తులో జోగుతున్నారు. తాజాగా షాలిబండ లోని నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న హుక్కా సెంటర్లపై పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో పట్టుబడిని వారు 12 మంది మైనర్లే ఉండటం ఆందోళన కలిగించే అంశం.

వాస్తవానికి హుక్క సెంటర్‌ నడపాలంటే విధిలా లైసెన్స్‌ తీసుకోవాలి. ప్రతీ సెంటర్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. మైనర్లను అనుమతించకూడదు. 18 ఏళ్లలోపు పిల్లలకు హుక్కా ఇవ్వడం నేరం కనుక సెంటర్‌కు వస్తున్న వారి పూర్తి వివరాలు వయసుతో సహా రిజిస్టర్‌లో నమోదు చేయాలి. దాంతోపాటు హుక్కాలో ఉపయోగించే పదార్థాలు,ఫ్లేవర్స్‌ వివరాలను బోర్డులో ప్రదర్శించాలి.. రాత్రి 9 గంటలకే హుక్కా సెంటర్లు బంద్‌ చేయాలి. కాని నగరంలో ఈ నిబంధనలేవీ పాటించిన దాఖలాలు కనిపించడంల లేదు. అసలు లైసెన్స్‌ లేకుండానే హుక్కా సెంటర్లు నడుస్తుంటే.. అధికారులు ఏంచేస్తున్నారని హైదరాబాద్‌ పబ్లిక్‌ ప్రశ్నిస్తున్నారు.

సిగరెట్ వల్ల ఎలాంటి హాని ఉంటుందో హుక్కావల్ల కూడా అంతే ప్రమాదం పొంచి ఉందని, ఇక అందులో మత్తుపదార్థాలు కలిపి సేవిస్తే వారి పని అంతే అంటున్నారు వైద్యులు. హుక్కా ద్వారా తంబాకు, గంజాయి, డ్రగ్స్ వంటి వాటిని పీల్చినప్పుడు మనిషి కంట్రోల్ తప్పుతాడు. ఏం చేయడానికైనా తెగబడతారు. దోపిడీలకు, దొమ్మీలకు, చైన్ స్నాచింగ్లకు సైతం పాల్పడతారని వైద్య నిపుణలు అంటున్నారు. మత్తు పదార్థాల వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతిని మెదడుకు కుంచించుకు పోతుందని హెచ్చరిస్తున్నారు. ఊపిరితిత్తులపై పొగ ప్రభావం పడి కేన్సర్‌ బారిన పడే అవకాశం కూడా ఉందంటున్నారు. ఇప్పటికైనా .. అధికారులు హుక్కా సెంటర్ల ఆగడాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. అనుమతి లేకుండా హుక్కా సెంటర్లు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు. దాంతోపాటు ఇప్పటికే మత్తుకు బానిసలుగా మారిన యువత, మైనర్లకు కౌన్సిలింగ్‌ ఇప్పించి పెడమార్గం పట్టకుండా చూడాల్సిన అవసరం ఉంది. 

16:52 - February 9, 2018

హైదరాబాద్ : నగరంలో మళ్లీ డ్రగ్స్ కలకలం రేగింది. బంజారాహిల్స్ రోడ్ నెం.10 లో డ్రగ్స్ విక్రయిస్తున్నా ముగ్గురు నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 20 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

17:29 - February 6, 2018

హైదరాబాద్‌ : నగరంలో ఓ డ్రగ్స్‌ ముఠా పోలీసులకు చిక్కింది. విద్యార్థులే టార్గెట్‌గా డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ముగ్గురిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి భారీగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌ సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్‌ఫోర్స్‌ సెంట్రల్‌జోన్‌ డీసీపీ రాధాకృష్ణ పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

16:09 - December 29, 2017

హైదరాబాద్ : నగరంలో మళ్లీ భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబండాయి. వాటిని సరఫరా చేస్తున్న నైజీరియన్లు పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

14:40 - December 29, 2017

హైదరాబాద్ : నగరంలో మరోసారి డ్రగ్స్ కలంకలం సృష్టించింది. ముగ్గురు నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద 225 గ్రాముల కొకైన్ 30 గ్రాముల హెరాయిన్ పట్టుబడింది. న్యూఇయర్ కోసం వారు డ్రగ్స్ ను హైదరాబాద్ కు తరలిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Pages

Don't Miss

Subscribe to RSS - డ్రగ్స్