డీజిల్

11:44 - September 17, 2018

బెంగళూరు : భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబెలెత్తుతున్నారు. గత కొన్ని రోజులుగా ధరలు పెరుగుతూ రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో ధరలు తగ్గించే విధంగా కేంద్రం పలు చర్యలు తీసుకోవాలని పలు ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప‌రిధిలో లీట‌ర్ పెట్రోల్‌, డీజిల్‌పై రూ. 2 వ్యాట్‌ను త‌గ్గించారు. అసెంబ్లీలో ఈ మేర‌కు ఆయ‌న ఈ ప్ర‌క‌ట‌న చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కర్ణాటక ప్రభుత్వం ఏపీ బాటలో పయనించింది. రూ. 2 తగ్గిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార స్వామి ప్రకటించారు. సోమవారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 89.44గా ఉంది. 

09:51 - September 17, 2018

పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడెప్పుడు ధరలు తగ్గుతాయని సామాన్య, మధ్య తరగతి ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. రోజుకో రేట్లు పెరుగుతూ రికార్డులను సృష్టిస్తున్నాయి. తాజాగా లీటర్ పెట్రోల్ పై 15 పైసలు, డీజిల్ పై 6 పైసలు ధరను పెంచుతున్నట్లు ప్రభుత్వం రంగ చమురు కంపెనీలు ప్రకటించాయి. మళ్లీ ధర పెరగడంతో పలువురు బెంబేలెత్తుతున్నారు. 

  • న్యూఢిల్లీలో పెట్రోలు ధర రూ. 82.06కు, డీజిల్ ధర రూ. 73.78. 
  • ముంబైలో లీటరు పెట్రోలు ధర రూ. 89.44 డీజిల్ ధర రూ. 78.33. 
  • కోల్ కతాలో లీటరు పెట్రోలు ధర రూ. 83.76 డీజిల్ ధర రూ. 75.57
  • చెన్నైలో లీటరు పెట్రోలు ధర రూ. 85.15 డీజిల్ ధర రూ. 77.94
  • హైదరాబాద్ లీటరు పెట్రోలు ధర రూ. 86.85 డీజిల్ ధర రూ. 80.19.

అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు పెరుగుతుండడంతో ధరలను పెంచక తప్పడం లేదని చమురు కంపెనీలు పేర్కొంటున్నాయి. వెంటనే సుంకాలను తగ్గించి, ప్రజలకు మేలు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

07:52 - September 17, 2018

ఢిల్లీ : యోగా గురు బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీజిల్, పెట్రోలును జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న రావాలన్న బాబా రాందేవ్....పెట్రో ధరలు మోడీని ముంచుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం పన్నుల్లో వెసులుబాటు కల్పిస్తే లీటరు పెట్రోలు, డీజిల్‌ను కేవలం 35 రూపాయలకే విక్రయిస్తానన్నారు. పెట్రో ధరల పెరుగుదలతో జనాలకు మోడీ మరింత ప్రియమయ్యే అవకాశం ఉందన్నారు. పెట్రో ధరలపై నరేంద్ర మోడీ స్పందించి...ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

09:51 - September 16, 2018

ఢిల్లీ : పెట్రోల్...డీజిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతుండడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అసలు ధరలు అదుపులోకి వస్తాయా ? రావా ? అని మథన పడుతున్నాడు. కేంద్రం కూడా ధరలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ ప్రజల నడ్డి విరుస్తున్నాయి. 

ధరలు పెరుగుతూ రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఉదయం పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది.  ఏకంగా ధర రూ. 89 దాటుతుండడంతో ఏమి చేయాలో దిక్కుతోచడం లేదని పలువురు వాపోతున్నారు. దీనిపై ఆధారపడిన వస్తువుల ధరలు కూడా అమాంతం పెరిగిపోతున్నాయని, ఇంతగా ధరలు పెరగడం చూడలేదని వాపోతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న క్రూడాయిల్ ధరల వల్లే 'పెట్రో' ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయని, డాలర్ తో మారకపు విలువలో బలహీన పడుతున్న రూపాయి కూడా ధరల పెరుగుదలకు తోడవుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ. 86.95, డీజిల్ రూ. 80.82.

విజయవాడలో పెట్రోల్ ధర రూ. 85.41, డీజిల్ రూ. 78.63.

ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 81.91, డీజిల్ రూ. 73.72.

ముంబైలో పెట్రోల్ ధర రూ. 89.29, డీజిల్ రూ. 78.26.

కోల్ కతాలో పెట్రోల్ ధర రూ. 83.76, డీజిల్ రూ. 75.57.

16:12 - September 14, 2018

ఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్నాయి. వారం రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న స్వల్పంగా పెరిగిన ధరలు ఇవాళ ఇంకాస్త పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 28పైసలు, డీజిల్‌ పై 22పైసలు ధర పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 81.28 రూపాయలు, లీటర్ డీజిల్ ధర 77.82 రూపాయలకు చేరింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 88.39 రూపాయలు కాగా, లీటర్ డీజిల్ 77.82 రూపాయలు పెరిగింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ. 84.49, డీజిల్ రూ.77.49 లకు పెరిగాయి. కోల్‌కత్తాలో పెట్రోల్ రూ. 83.14, డీజిల్ రూ. 75.15లకు పెరిగింది. పెట్రో ధరలపై వాహనదారులు  భగ్గుమంటున్నారు. 

15:26 - September 9, 2018

హైదరాబాద్ : చమురు ధరలు పెరుగుతున్నాయి...రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో వాటిపై ఆధారపడుతున్న వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. వీటిపై వివిధ పార్టీలు దృష్టి సారించాయి. పాలకులపై విమర్శలు గుప్పిస్తున్నాయి. కాంగ్రెస్ తో సహా పలు పార్టీలు సోమవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలని ఆయా పార్టీలు నిర్ణయించాయి. ఇందుకు ప్రజలు స్వచ్చందంగా సహకరించాలని విజ్ఞప్తి చేశాయి. బంద్ కు ఇతర పార్టీలు మద్దతివ్వాలని కోరుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో స్వచ్చందంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేయాలని టి.కాంగ్రెస్ పిలుపునిచ్చింది. బంద్ కు మద్దతివ్వాలని వివిధ పార్టీలను విజ్ఞప్తి చేశాయి. ఇక ఏపీ రాష్ట్రంలో వామపక్షాలతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం బంద్‌కు మద్దతు తెలిపారు. శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చాయి. కానీ వైసీపీ మాత్రం బంద్ కు మద్దతివ్వలేదని తెలుస్తోంది. మరి సోమవారం బంద్ విజయవంతమవుతుందా ? లేదా ? అనేది చూడాలి. 

14:29 - September 7, 2018

ఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజల నెత్తిన అదనపు భారాలు పడుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో నిత్యావసరాల ధరలు పెరుగతు సామాన్యులు అష్టకష్టాలు పడుతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించటంలేదు. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగి సామాన్యులకు సవాల్ విసురుతున్నాయి. దీంతో ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. రూపాయి విలువ పతనమవుతుండటం పెట్రో ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనికి తోడు ఇరాన్ పై అమెరికా విధించిన ఆంక్షల నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ రోజు కూడా పెట్రోలియం కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. ముంబైలో పెట్రోల్ ధర ఆల్ టైమ్ హైని తాకింది. ఈరోజు ఏకంగా లీటర్ కు 52 పైసలు పెరిగి రూ. 87.39కి చేరుకుంది. డీజిల్ ధర రూ. 79.99కి చేరింది. హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర రూ. 84.91, డీజిల్ ధర రూ. 78.48కి పెరిగింది.   

18:27 - September 4, 2018

న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడి నడ్డి విరిచేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం తారాస్థాయికి చేరుకున్నాయి. పెట్రోల్ పై 16 పైసలు, డీజిల్ పై 19 పైసలు పెరిగాయి. హైదరాబాద్ లో పెట్రోలు లీటరు ధర రూ.84.09 కు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించుకోకపోతే లీటరు ధర వంద రూపాయలకు చేరుకొన్నా ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు. ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎటవంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. పైగా బీజేపీ నేతలు పెట్రో ధరల పెరుగుదలపై వ్యంగ వ్యాఖ్యలు చేయడం విమర్శలకు తావిస్తోంది.  
పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న ప్రతిపాదన ముందుకు కదలడం లేదు. పిల్లికి ముందుగా ఎవరు గంట కడతారు అన్న చందంగా కేంద్రం రాష్ట్రాల వైపు చూస్తోంది. ఈ ధరల భారాన్ని మోయలేక సామాన్యడు కుదేలవుతున్నాడు. 

20:43 - August 31, 2018

పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతుండటం పరిపాటిగా మారిపోయింది. ఈ విషయంలో సామాన్యుడు ఎంతగా మెత్తుకున్నా కేంద్రం ఏమాత్రం పట్టించుకోవటంలేదు. గత కొంతకాలం నుండి వరుసగా పెరుగతునే వున్నాయి. ముంబైలో రై.85.78 పైసలుగా వుంటే హైదరాబాద్ లో రూ.83.02 పైసలుగా వుంది. రికార్డులో స్థాయిలో పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యుడి నడి విరుస్తున్నాయి. దీంతో నిత్యావసర వస్తువులు ధరలు కూడా పెరుగుతున్నాయి. ధరలు నియంత్రణలో ప్రభుత్వాలు ఎందుకు విఫలం అవుతున్నాయి? డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ కూడా అంతకంతకు దిగజారుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రభావం చూపుతోంది. ఈ అంశంపై ప్రముఖ ఆర్థిక నిపుణులు పాపారావు విశ్లేషణతో..

13:24 - July 21, 2018

Pages

Don't Miss

Subscribe to RSS - డీజిల్