డయాబెటిక్

12:43 - August 10, 2018

తినే తిండి విషయంలో శ్రద్ధ పెరిగింది. తాగే నీటి విషయంలో మరింత జాగ్రత్త పడుతున్నాం. కానీ..మనం బతికేందుకు ప్రధాన వనరు అయిన 'గాలి' విషయంలో మాత్రం మన దారుణంగా నష్టపోతున్నాం. అదే ఆరోగ్యం విషయంలో . మనం నిజానికి, తిండికన్నా, నీటికన్నా గాలినే మనం ఎక్కువగా అవసరం. అనుక్షణం ఆక్సిజన్ మన శరీరంలోని అణువణువుకూ అందాలి. అప్పుడే మనం సజీవంగా ఉండగలుగుతాం. సృష్టిలో జీవులకు, నిర్జీవులకు మధ్య అదే అతిపెద్ద తేడా. మనం మనగలుగుతున్నా మంటే అందుకు కారణం ప్రాణవాయువే. ఆ గాలి ఎంతగా కాలుష్యమౌతోందంటే, అది మన మనుగడకే శాపంగా మారింది. విషవాయువుల్ని పీలుస్తూ మనకు తెలియకుండానే మనం మన ఆయుషును కోల్పోతున్నాం.

దేశవ్యాప్తంగా కాలుష్య నగరాల సంఖ్య 100..
దేశంలోని వంద నగరాల్లో అత్యవసర కాలుష్య నిరోధక కార్యక్రమాలు చేపట్టాలని కేంద్ర సర్కారు నిర్ణయించింది అంటే వాయు కాలుష్యం ఎంతటి పెను ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందో ఊహించలేం. ముంబై, పూణే, నాగపూర్, లక్నో, కాన్పూర్, వారణాసి, చంఢీఘడ్, కోల్ కతాలతోపాటు వంద నగరాల్లో కాలుష్య నివారణకు చర్యలు చేపట్టనుంది. కానీ ఇది ఎప్పటికి ఆచరణలో వచ్చేనో..మన ప్రాణాలకు ఎప్పుడు రక్షణ దొరికేనో? అదంతా పాలకు చేతిలోనే వుంది.

వాయు కాలుష్యంతో డయాబెటిస్ ముప్పు..
భారత్‌లోని ప్రధాన నగరాల్లో వాతావరణ కాలుష్యం ఎంతగా పెరిగిపోతోందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఈ కాలుష్యం మనుషుల్లో పలు వ్యాధులకు కారణం అవుతోంది. దీని కారణంగా డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం కూడా అధికమని తాజాగా పరిశోధనలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా మధుమేహంతో బాధపడుతోన్న వారి సంఖ్య పెరగడానికి గాలి కలుషితం కావడం కూడా ఓ కారణమని పరిశోధకులు గుర్తించారు.

ఇన్సులిన్‌ ఉత్పత్తిపై వాయు కాలుష్య ప్రభావం..
కలుషితమైన గాలి మనిషిలో ఇన్సులిన్‌ ఉత్పత్తిపై ప్రభావం చూపుతోందని.. రక్తంలోని గ్లూకోజ్‌ను శక్తిగా మారకుండా అడ్డుకుంటుందని పరిశోధనలో తేలింది. గాలి కాలుష్యం విషయంలో తక్కువ ఆదాయ దేశాల్లో ఎలాంటి ప్రత్యామ్నాయ పాలసీలు లేవని, దీంతో ఆయా దేశాల్లో ప్రజలు అత్యధికంగా గాలి కాలుష్యం వల్ల డయాబెటిస్‌ బారిన పడుతున్నారని గుర్తించారు.

గాలి కాలుష్యం 30లక్షల మంది మృతి..
పర్యావరణ రక్షణ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థలు కలిసి అతి తక్కువ కాలుష్యంగా గుర్తించిన ప్రదేశాల్లోనూ డయాబెటిస్‌ పెరిగిపోయిందని పరిశోధకులు తెలిపారు. 2016లో గాలి కాలుష్యం వల్ల ప్రపంచ వ్యాప్తంగా 30 లక్షల మధుమేహ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. మరి ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరిచి వాయు కాలుష్యం తగ్గించటంలో చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం..లేకుండే మానవ మనుగడకు ముప్పును మనకు మనమే మన విధి విధానాలతో కొన్ని తెచ్చుకునే ప్రమాదంలో పడిపోతాం..ఎన్నికల సమయంలో పాలకులకు ప్రజల ఓట్లు కోరేవారు ప్రజల ఆరోగ్య విషయంలో కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవరముంది. లేకుంటే స్వచ్ఛమైన గాలి కావాలంటు ప్రజలే ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. 

16:05 - March 13, 2018

భారతదేశంలో డయాబెటిక్ సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. ఇటీవలికాలంలో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతొక్కరు ఈ డయాబెటిక్ బారిన పడుతున్నారు. అసలు డయాబెటిక్ రావడానికి ప్రధానమైన కారణమేంటి ? ఇది వంశపారపర్యంగా వచ్చే అవకాశముందా? ఇది నెక్ట్స్ జరేషన్ కు కూడా కంటిన్యూ అయ్యే అవకాశముందా ? దీన్ని పూర్తిగా నివారించవచ్చా? అసలు నిపుణులు ఏమని చెబుతున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం.... ఇదే అంశంపై నిర్వహించిన మానవి వేదిక చర్చా కార్యక్రమంలో డయాబెటిక్ ఎడ్యుకేటర్ వసుధరాణి, న్యాచురోపతి మరియు ఆక్యుపెంచర్ వైద్య నిపుణులు సాగర్ పాల్గొని, మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డయాబెటిక్ అనేది రోగం కాదన్నారు. డయాబెటిక్ తో వచ్చే రోగాలే అనారోగ్యానికి గురిచేస్తాయన్నారు. డయాబెటిక్ ఉన్నవారు అధిక నిద్ర, ఎప్పుడూ నీరసంగా ఉంటారని తెలిపారు. పలు విలువలైన సలహాలు, సూచనలు చేశారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం... 

 

14:58 - December 25, 2017
08:50 - February 8, 2017

మధుమేహ పీడితులకు వరం...ఈ వరి అన్నం అంటోంది వ్యవసాయ శాస్త్రవేత్తలు. ఇటీవలే జరిపిన వ్యవసాయ పరిశోధన విజయవంతమైంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు తినేందుకు అనుకూలమైన 'వరి' రకాన్ని రూపొందించాలని బెంగళూరులోని వ్యవసాయ విశ్వ విద్యాలయం ఉపక్రమించింది. సాధారణంగా వరిలో ఆరున్నర శాతం నుండి ఏడు శాఇతం వరకు మాంసకృత్తులు ఉంటాయనే సంగతి తెలిసిందే. కానీ కొత్తగా ఆవిష్కరించిన వరిలో మాంసకృత్తులు ఎక్కువగా ఉండాలని శాస్త్రవేత్తలు భావించి విజయం సాధించారు. ప్రస్తుతం ఆవిష్కరించిన వరిలో ఏకంగా 12 శాతం నుండి 13 శాతం మాంసకృత్తులు ఉన్నాయంట. మాంసాహరం ద్వారా లభించే మాంసకృత్తుల కంటే వరిలోని మాంసకృత్తులు తేలిగ్గా జీర్ణమౌతాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అదనపు వ్యయం లేకుండానే ఈ రకం వరిని పండించి రైతులు లాభాలు గడించవచ్చని వెల్లడిస్తున్నారు. 

19:43 - November 14, 2016

హైదరాబాద్ : ఇవాళ వరల్డ్‌ డయాబెటీక్‌ డే. ప్రపంచవ్యాప్తంగా షుగర్‌ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా డయాబెటిక్‌కి భారత దేశం కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోందని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా ఆహారపు అలవాట్ల వల్లే ఇవాళ భారత దేశంలో షుగర్‌ పేషంట్లు రోజు రోజుకు పెరుగుతున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆహారపు అలవాట్లను మార్చుకొని నిత్యం వ్యాయామం చేస్తే షుగర్‌ వ్యాధిని కంట్రోల్లో ఉంచుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

 

10:24 - October 10, 2015

ఇంటి ముంగిట్లో, నాలుగు మొక్కలుంటే పచ్చగా కళకళ్లాడుతుంది. అదే అపార్ట్ మెంట్ అయితే కుండీల్లో ఒదిగిన మొక్కలు వచ్చిపోయే వారికి స్వాగతం పలుగకుతాయి. చిన్నమొక్కలే కదా అనుకుంటే పొరపాటే మనస్సు పెట్టి ఎంచుకుంటే అలంకరణకు ఉపయోగపడతాయి. ఆరోగ్యాన్నీ అందిస్తాయి. ముఖ్యంగా ఇంటిల్లిపాదికి ఉపయోగపడే ఔషదమొక్కలు పెంచుకుంటే చాలు ఇంట్లో ఉండే చిన్న..పెద్ద..ముసలి అన్నివయస్సుల వారికి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. తులసిలో 5 రకాలు ఉన్నాయి. తులసి మొక్కలు 5 జాతులు ఉన్నప్పటికీ ప్రధానంగా కృష్ణ తులసి, రామతులసీ నే ఎక్కువగా వాడుతుంటారు. ల్యూకోడెర్లాలో ప్రకృతి వైద్యులు తులసికి మొదటి ప్రాధాన్యతనిస్తారు. అలాంటి తులసి గురించి మీ కోసం...

కొన్ని ఉపయోగాలు....

~ తులసి మొక్కలు మన ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. నోటిపూత, నోట్లో అల్సర్స్, ఇతర ఇన్‌ఫెక్షన్ల నివారణకు తులసి ఎంతో ఉపకరిస్తుంది.

~ ప్రధానంగా చిన్నపిల్లల్లో తరచూ దగ్గు, జలుబు, జ్వరం, డయేరియా, వాంతులకు ఉపయోగకారిణి.

~ తులసి ఆకులను డికాషన్‌గా తీసుకుంటే తలనొప్పిని దూరం చేయవచ్చు.

~ తులసి ఆకులను ఎండబెట్టి, వాటిని పొడి చేసి, దాంతో పళ్ళు తోముకుంటే దంతాలకు చాలా మంచిది. దీన్ని ఆవనూనెలో కలిపి టూత్‌పేస్ట్‌లా       వాడుకుంటే దంతక్షయంతో పాటు నోటిదుర్వాసన పోయి, పళ్ళను అందంగా మార్చ గలిగే గుణం కలదు.

~ తులసి ఆకులు నాడులకు టానిక్‌లాగా,జ్ఞాపకశక్తిని పెంపొందించేవిగా పనిచేస్తాయి.

~ వర్షాకాలంలోమలేరియా, డెంగ్యూ జ్వరం వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు లేత తులసి ఆకుల్ని నీళ్లలో వేసి మరిగించి తాగితే ఈ రకం జ్వరాల నుంచి మంచి ఉపశమనం ఉంటుంది. జ్వరం మరీ ఎక్కువగా ఉంటే తులసి ఆకులనూ, యాలకుల పొడినీ కలిపి అరలీటరు నీళ్లలో మరిగించి కషాయం తయారు చేయాలి.అందులో చక్కెర, పాలు కలిపి తాగితే జ్వర తీవ్రత తగ్గుతుంది. తులసి ఆకుల్ని మెత్తగా నూరి నీటిలో కలుపుకుని రెండుమూడు గంటలకోసారి తాగొచ్చు.

~ బ్రాంకైటిస్‌,ఆస్థమాల్లోకఫాన్ని తొలగించటంలో తోడ్పడుతుంది. తులసి ఆకుల్ని నోట్లో పెట్టుకుని నమలటం వల్ల జలుబు,ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది.

~ ప్రతిరోజు 5 లేదా 6 ఆకులు, మిరియాలు, ధనియాలు కలిపి నూరి తింటే వాంతులు, దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. నులిపురుగులు నశిస్తాయి.

~ ఎండిన తులసి ఆకులను ధాన్యం నిలవ చేసిన చోట్ల ఉండుతారు - కీటకాలనుదూరంగా ఉంచడం కోసం. ఆకుల రసం (పసరు), ఎండిన ఆకుల పొడి, మరగించిన నీరు,హెర్బల్ టీ, నేతిలో మరగ పెట్టడం - ఇలా తులసిని చాలా విధాలుగా తీసుకోవచ్చును.

~ తులసికి రక్తంలో చక్కెర మోతాదును తగ్గించగలిగే శక్తి ఉండటంతో డయాబెటిస్ వారికి చక్కగా పనికొస్తుంది.

~ రక్తంలో కోలెస్టరాల్ను తగ్గించడానికీ, 'యాంటీ ఆక్సిడెంట్' గుణాల వలన బ్లడ్ షుగర్ తగ్గించడానికీ కూడా పనికొచ్చే పదార్ధాలు తులసిలో ఉన్నాయని మరి కొన్ని పరిశోధనలలో తేలింది.

~ 'రేడియేషన్' కు గురైనందువలన కలిగే విషమ పరిస్థితి నుండి రక్షణకు కూడా తులసి ఉపయోగ పడవచ్చునని కొన్ని అధ్యయనాలు సూచించాయి.

~ రెండు స్పూనుల తులసి రసాన్ని కొద్దిగా తేనె కలిపి తాగితే పైత్యం తగ్గుతుంది.

~ మూత్ర విసర్జన సమయంలో మంటతో బాధపడేవారు తులసి ఆకులను దంచి, ఆరసానికి కొద్దిగా పాలు, చక్కెర కలిపి తాగడం వలన ఉపశమనం దొరుకుతుంది.

~ తులసి ఆకులను నూరి మొఖానికి రాసుకుంటే మచ్చలు, మరకలు పోయి ముఖం అందంగా కాంతివంతంగా మారుతుంది.

ఇలా అనేక రకాలుగా మన ముగింట్లో తులసి ఉపయోగపడుతుంది. ఇంటి గుమ్మం ముందు కుండీల్లో కూడా ఈ మొక్క సులువుగా పెరుగుతుంది.


 

Don't Miss

Subscribe to RSS - డయాబెటిక్