టీడీపీ

08:31 - November 19, 2018

అమరావతి: తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. ఏపీ మంత్రి కళా వెంకట్రావు పవన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. విశాఖపట్నంలో యలమంచిలి రవి ఇంట్లో జగన్‌తో రహస్యంగా సమావేశం కావడం, 2014 ఎన్నికల్లో పోటీ చేసేందుకు జగన్‌ని 40 సీట్లు డిమాండ్ చేయడం నిజం కాదా అని పవన్‌ను ప్రశ్నించారు మంత్రి కళా వెంకట్రావు. 2009 ఎన్నికల్లో తన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవిని గెలిపించుకోలేని పవన్, గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని గెలిపించానని ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారాయన. 
ఏపీ ప్రజలను నమ్మించి నట్టేట ముంచిన ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాల నిరంకుశ పాలనకు పవన్ వంత పాడుతున్నారని  మంత్రి కళా వెంకట్రావు మండిపడ్డారు. ఎన్నికల నేపథ్యంలో పవన్ చేసిన వ్యవహారాలపై సైతం ఆయన ధ్వజమెత్తారు. ఈ మేరకు పవన్‌కు మంత్రి కళా వెంకట్రావు 19 ప్రశ్నలతో బహిరంగ లేఖను సంధించారు. 
ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పవన్ ఏనాడూ నిజాయతీ, నిబద్ధతతో పనిచేయలేదని కళా వెంకట్రావు విమర్శించారు. బీజేపీ హిందుత్వ పార్టీ కాదని పవన్ కల్యాణ్ చెప్పడాన్ని లేఖలో మంత్రి తప్పుపట్టారు. ఏపీకి రూ.75వేల కోట్లు రావాలన్న నిజనిర్ధారణ కమిటీ నివేదికపై పవన్ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు.  కల్యాణ్ రహస్యంగా సమావేశం అయ్యారని ఆరోపించారు. జనసేన పోరాటయాత్ర పేరుతో ఏసీ బోగీల్లో కూర్చున్న పవన్ సామాన్యులను ఎలా కలవగలిగారో చెప్పాలన్నారు.
బాక్సైట్ సహా ఇతర గనులకు మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే అనుమతులు వచ్చాయని తెలిసినా పవన్ మౌనం వహించారని విమర్శించారు. ప్రసంగాల్లో పరుష పదజాలం వాడుతూ యువతకు ఏం సందేశం ఇవ్వదలచుకున్నారని ప్రశ్నించారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం, జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు, సీబీఐతో వేధింపులు, ఐటీ దాడులపై పవన్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎలా కలిశారో చెప్పాలన్నారు. సుప్రీంకోర్టు వ్యవహారంలో, గవర్నర్‌ వ్యవస్థలపై కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నిస్తే బాగుంటుందని బహిరంగ లేఖలో పవన్‌కు మంత్రి కళా వెంకట్రావు సూచించారు. రాష్ట్రంలోని యువత, బడుగుబలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం చంద్రబాబుపై పవన్ విమర్శలు చేయడం దారుణమని కళా వెంకట్రావు అన్నారు.

11:07 - November 17, 2018

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఎన్నిసార్లు చెప్పినా చింతమనేని తీరు మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పని చేస్తే సరిపోదని పద్ధతిగా ఉంటేనే పార్టీలో భవిష్యత్తు ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చంద్రబాబు చింతమనేనికి తేల్చి చెప్పారు. అధినాయకత్వానికి పరీక్ష పెడితే ఉపేక్షించేది లేదని చంద్రబాబు హెచ్చరించినట్లు సమాచారం. ఇదే లాస్ట్ వార్నింగ్ అని ఈసారి వివాదాల్లో చిక్కుకుంటే కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. కొంతకాలంగా చింతమనేని ప్రభాకర్ తరుచుగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అధికారులు, ప్రతిపక్ష నేతలపై దాడులు చేయడం, అసభ్య పదజాలం వాడటం వంటి పనులతో వివాదాస్పదమవుతున్నారు. ఇటీవల దెందులూరు సభలో మాట్లాడుతూ చింతమనేనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అటు వైసీపీ అధినేత జగన్ కూడా చింతమనేని ప్రభాకర్‌నే టార్గెట్ చేశారు. ఒక్కరు చేసే తప్పునకు పార్టీ మొత్తం సమాధానం చెప్పుకోవాల్సి వస్తోందని పలువురు సీనియర్లు చంద్రబాబు వద్ద వాపోయినట్లు సమాచారం. దీంతో చింతమనేనిపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. మరి ఇకనైనా చింతమనేని తన తీరు మార్చుకుంటారో లేదో చూడాలి.

19:11 - November 16, 2018

హైదరాబాద్ : కుకట్ పల్లి టీడీపీ అభ్యర్థిగా సడెన్  ఎంట్రీ ఇచ్చిన హరికృష్ణ కుమార్తె సుహాసిని మాట్లాడారు. నామినేషన్ పత్రాలు అందుకున్న ఆమె మాట్లాడుతు..తనపై నమ్మకం ఉంచి పోటీ చేసే అవకాశమిచ్చినందుకు టీడీపీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా తన తండ్రి నందమూరి హరికృష్ణను ఆమె గుర్తుచేసుకుంటు ‘‘టీడీపీకి ఆయన ఎంతో సేవ చేశారని.. చిన్నప్పటి నుంచి తనకు రాజకీయాలంటే ఇష్టమని..తాతగారు  నందమూరి ఎన్టీ రామారావు, తండ్రి హరికృష్ణ, మామయ్య చంద్రబాబునాయుడు తనకు ఎంతో స్ఫూర్తి నిచ్చార’ని’అన్నారు. ‘‘తన మామ మాజీ ఎంపీ అని, ఆయన స్ఫూర్తి కూడా తనపై ఉందని ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే తన తాతయ్య ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, ఇది ప్రజల పార్టీ స్థాపించారని..తెలంగాణ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని, ప్రజల కోసం అనునిత్యం కష్టపడి పని చేస్తానని’’ అన్నారు. అందరి ఆశీర్వాదాలు తనకు కావాలని, రేపు నామినేషన్ వేసిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడతానని సుహాసిని స్పష్టం చేశారు. 
 

18:31 - November 16, 2018

హైదరాబాద్ : అనుకోకుండా అదృష్టం వరించి రావటమంటే ఇదే. ఏమాత్రం రాజకీయ అనుభవం లేదు..అసలు ఆమె ఎవరో ప్రజలకు తెలీదు. ఎన్నికల్లో సీట్ కోసం నేతలు నానా పాట్లు పడుతుంటే  రాత్రికి రాత్రే ఎమ్మెల్యే అభ్యర్థిగా అవతంరించింది దివంగత నేత, టీడీపీ మాజీ ఎంపీ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు స్వయానా బావమరిది అయిన నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని. చంద్రబాబు ఆమెను కుకట్ పల్లి సీట్ కేటాయించటంతో సుహాసిని ఎన్నికల బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, టీడీపీ ప్రతినిధులు ఆమెకు నామినేషన్ పత్రాలను అందించారు. రేపు ఉదయం తాత ఎన్టీఆర్, నాన్న హరికృష్ణలకు నివాళి అర్పించిన అనంతరం ఆమె నామినేషన్ వేయనున్నారు. మరోవైపు, సుహాసిని సడన్ ఎంట్రీతో కూకట్ పల్లి నియోజకర్గ ఎన్నికల పర్వం వేడెక్కింది. టీడీపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ఆమె తరపున ప్రచారానికి ఆమె సోదరులు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు కూడా వచ్చే అవకాశం ఉంది. 
 

16:32 - November 16, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికలు రోజురోజుకు  రసవత్తరంగా మారుతున్నాయి. ఆయా పార్టీలు..నేతలు, సీట్లు, కేటాయింపులు, జంపింగ్ జిలానీలు వంటి పలు అంశాలపై వేడి వేడిగా కొనసాగుతు ఎన్నికల స్టంట్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మరో అంశం హాట్ టాపింగ్ గా మారింది. రాజకీయ వ్యూహాలలో కేసీఆర్ దిట్ట. అతనికంటే  ఇంకో పైమెట్టుగానే వుండే ఏపీ సీఎం చంద్రబాబు చాణక్య వ్యూహాలకు కేరాఫ్ అడ్రస్ గా వుంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు రాత్రికి రాత్రే ఓ నిర్ణయం తీసుకుని రాజకీయాలలో మరింత వేడిని రాజేశారు. అదే! దివంగత నేత, చంద్రబాబు బావమరిది, టీడీపీ మాజీ ఎంపీ అయిన హరికృష్ణ కుమార్తెకు కుకట్ పల్లి సీటును కేటాయించటం. ఇదిప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆ సీటును ఆశించిన టీడీపీ నేతలకు కూడా మారు మాట్లాడలేని పరిస్థితి. బాబు వ్యూహం అటు సెంటిమెంట్ ను ఇటు రాజకీయ లబ్ది రెండు నెరవేర్చేలా వుండటం గమనించాల్సిన విషయం. 
Image result for kcr and chandrababuఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల్లో ఏర్పడిన మహాకూటమిలో భాగస్వామిగా వున్న టీడీపీపై టీఆర్ఎస్ పార్టీ ఏకధాటిగా విమర్శిస్తూ వస్తోంది.. చంద్రబాబు తెలంగాణను అస్థిర పరిచేందుకు కుట్రలు చేస్తున్నాడంటూ చెప్పుకొస్తోంది.. తెరాస  విమర్శలకు బలం చేకూరేలా కూటమిలో బాబు పావులు కదుపుతున్నాడేందుకు కూకట్ పల్లి సీటే నిదర్శనం.. అమరావతిలో కూర్చుని చర్చల మీద చర్చలు జరిపి.. నయానో - భయానో అందరినీ ఒప్పించి మరీ కూకట్ పల్లి టిక్కెట్ హరికృష్ణ కూతురు సుహాసినికి దక్కేట్టు చేసుకున్నాడు..కానీ అసలు కథ ఇక్కడే ఉంది..

Image result for harikrishna death kcr talasaniహరికృష్ణ దుర్మరణం పాలైనప్పుడు తెరాస  ప్రభుత్వం చేసిన హంగామా అంతా ఇంతా కాదు.. హరికృష్ణ మృతి నుండి అంత్యక్రియలవరకూ అంతా తానే అయి కార్యక్రమాలను దగ్గరుండి మరీ జరిపించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అంతేకాదు ఇప్పుడు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా వున్న కేసీఆర్ అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో హరికృష్ణ కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు. స్మారక స్థూపానికి కూడా ప్రామిస్ చేశారు..టీడీపీ అంటేనే గిట్టని టీఆర్ఎస్ ఇదంతా ఎందుకు చేసినట్లు? టీఆర్ఎస్ మంత్రులే కాదు సాక్షాత్తు సీఎం కేసీఆరే స్వయంగా వెళ్లి చంద్రబాబును, ఎన్టీఆర్, కళ్యాణ రామ్ లను పరామర్శించారు. అప్పట్లో చర్చనీయాంశం కూడా అయ్యింది. జనం మరిచిపోయింటారులే అని అంత తేలిగ్గా తీసేయటానికి కూడా లేదు. ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల్లో సరిగ్గా ఇప్పుడే చంద్రబాబు చాణక్య వ్యూహాన్ని అమలు చేశారు. అదే హరికృష్ణ కుమార్తె సుహాసినికి కుకట్ పల్లి సీటు ఖరారు చేయటం!!.ఈ అంశం టీఆర్ఎస్ ను కూడా ఇరుకున పెట్టేలా వుండటం మరో విశేషంగా చెప్పుకోకతప్పదు. అదెలాగో చూద్దాం...

హరికృష్ణకు అంత చేసిన టీఆర్ఎస్ పౌ టీడీపీ నేతలకు కాస్తో కూస్తో అభిమానం ఏర్పడకపోదు. ఒక వేళ అది కనుక జరిగి వుంటే టీడీపీ  ఓట్లు చేజారతాయనే నేపథ్యం..హరికృష్ణ గౌరవం ఇచ్చినట్లుగాను వుంటుంది..మరోపక్క అతనికి సరై గుర్తింపు ఇచ్చినట్లుగాను వుంటుంది. అలాగే వారి కుటుంబాల పరంగా చూస్తే అందరినీ ఒకతాటిపైకి తెచ్చినట్లుగా వుంటుంది. అంతేకాదు..హరికృష్ణ కుటుంబంలో పురుషులు వున్నాగానీ..అటు కుటుంబంలోను..ఇటు సమాజంలోను మహిళ సెంటిమెంట్ ను గౌరవించినట్లుగా..ఇలా చెప్పుకుంటు పోతే చంద్రబాబు ఒక దెబ్బకు అంటే ఒకే ఒక్క ఆలోచనకు...సముచిత నిర్ణయానికి ఒకే దెబ్బకు ఎన్ని ప్రయోజనాలో లెక్క వేసుకోవాలంటే ఎన్నైనా వుంటాయి..

Image result for chandrababi suhasiniహఠాత్తుగా వెలుగులోకొచ్చిన సుహాసిని..ఎమ్మెల్యే అభ్యర్థి..
నిన్నటి దాకా ఆమె ఎవరో కూడా ఎవరికీ తెలీదు.. ఇంకా చెప్పాలంటే హరికృష్ణకు కూతురున్న సంగతి కూడా చాలా మందికి తెలీదు.. ఇప్పుడామె ఎమ్మెల్యే అభ్యర్థి.. అదీ టీడీపి తరుపున.. గెలుపు కోసం ఆమె ఈ ఎన్నికల్లో ఏమని ప్రచారం చేస్తుంది.. అధికార పార్టీని విమర్శిస్తూ ప్రచారం చేయగలదా..? చేసి ఓట్లు రాబట్టగలదా? ఒక వేళ అదే చేస్తుందనుకుంటే.. మరి తెరాస  వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? హరికృష్ణ అవటానికి చంద్రబాబుకు బామ్మర్ది అయినా.. తమ సొంత బామ్మర్ది అయినంతగా స్పందించిన తెరాసను నందమూరి సుహాసిని ఘాటుగా విమర్శించగలదా? కోరి స్నేహ హస్తం చాచిన గులాబీతో తెగదెంపులకు సిద్ధ పడగలదా? ఇప్పుడు సిటీ జనాలందరినీ ఇదే ప్రశ్న తొలుస్తోంది.. నామినేషన్ ఇంకా వేయలేదు కానీ.. వేశాక ఏంటి పరిస్థితి? అనేదే హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి పెద్ద చిక్కొచ్చి పడిందే అని అటు టిడిపి క్యాడరు - ఇటు గులాబీ క్యాడరు పైకి చెప్పలేక..మనస్సులో దాచుకోలేని లోలోపలే ఆందోళన పడుతున్నట్లుగా తెలుస్తోంది.

-మైలవరపు నాగమణి

 
 
 
 
09:40 - November 16, 2018

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో టీడీపీని సమూలంగా రాష్ట్రం నుండి తరిమి కొట్టాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో కాంగ్రెస్ దగ్గర తాకట్టు పెట్టేసి...పాలనలో అవినీతి పెచ్చుమీరేలా చేసిన తెలుగుదేశం పార్టీని సమూలంగా రాష్ట్రం నుండి తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

  • ఢిల్లీ కోటలు బద్దలు కావాలి..కాంగ్రెస్ కోటకు బీటలు వారాలి.
  • జగన్, చంద్రబాబు మనకు వద్దు..లోకేష్ అసలే వద్దు
  • వీళ్లంతా అవినీతిని అలవాటుగా మార్చేస్తున్నారు.
  • జనసేన ప్రభుత్వంలో 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేస్తాం

ఏపీకి అన్యాయం చేస్తున్న ఢిల్లీ కోటను బద్ధలు కొట్టాలని..కాంగ్రెస్ కోటలకు బీటలు వారేలా చేయాలని సూచించారు. ఇప్పుడున్న నాయకులు మాత్రం అవినీతిని ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంటూ పోతున్నారని, గతంలో రూ. 100 కోట్ల అవినీతి అంటే చాలా పెద్ద విషయమని, దేశాన్ని కుదిపేసిన భోపార్స్ కుంభకోణం అలాంటిదేనని పవన్ రాజానగరంలో నిర్వహించిన బహిరంగ సభలో తెలిపారు. ప్రజా జీవితాల్లో వెలుగులు నింపేలా జనసేన ప్రభుత్వాన్ని స్థాపిద్ధామని తెలిపారు.

22:03 - November 15, 2018

హైదరాబాద్: ఊహాగానాలకు తెరపడింది. దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసినికే కూకట్‌పల్లి టీడీపీ టికెట్ ఖరారు అయింది. ఈ నెల 17వ తేదీన సుహాసిని నామినేషన్ దాఖలు చేయనున్నారు. కూకట్‌పల్లి నేతలతో సమావేశం నిర్వహించిన చంద్రబాబు.. అనంతరం సుహాసినికే టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు. సుహాసిని విజయానికి సహకరించాలని టీడీపీ నేతలు పెద్దిరెడ్డి, మందాడి శ్రీనివాసరావులకు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఎన్టీఆర్ కుటుంబానికి టికెట్ ఇస్తున్నందున సహకరించాలని కూకట్‌పల్లి టీడీపీ నేతలను చంద్రబాబు కోరారు. నందమూరి ఫ్యామిలీ వచ్చి టికెట్ కోరడంతో తాను కాదనలేకపోయానని టీడీపీ నేతలతో చంద్రబాబు అన్నారు. కాగా పార్టీకి సేవలు అందించిన మందాడి శ్రీనివాసరావుకి న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
నందమూరి కల్యాణ్‌రామ్ సోదరిగా సుహాసిని సుపరిచితురాలే అయినా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్ర ప్రాంతం వారు ఎక్కువగా ఉండే కూకట్‌పల్లి నియోజవకర్గం నుంచి నందమూరి ఫ్యామిలీకి అవకాశం ఇవ్వడం ద్వారా విజయం ఈజీ అవుతుందని చంద్రబాబు అంచనా వేసినట్లు తెలుస్తోంది. అందుకే నందమూరి కుటుంబం నుంచి మూడోతరం నేతగా సుహాసినిని బరిలో నిలపాలని నిర్ణయించినట్టు స్పష్టమవుతోంది.
మహాకూటమి పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూకట్‌పల్లి స్థానాన్ని టీడీపీకి కేటాయించింది. కూకట్‌పల్లి నుంచి పోటీ చేసేందుకు భారీసంఖ్యలో ఆశావహులు పోటీపడ్డారు. టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి, మందాడి శ్రీనివాసరావులు కూకట్‌పల్లి నుంచే పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే, అనూహ్యంగా నందమూరి సుహాసిని పేరు తెరమీదకు వచ్చింది.

17:58 - November 15, 2018
విశాఖ: హైదరాబాద్ కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా దివంగత నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని బరిలోకి దిగనున్నారనే వార్తలు నిజం కానున్నాయి. ఈ స్థానం నుంచి నందమూరి సుహాసినికి టికెట్ దాదాపు ఖరారైనట్టు సమాచారం. సెటిలర్ల ఓట్లు అధికంగా ఉన్న ఈ నియోజవకర్గంలో.. హరికృష్ణ వారసురాలిగా సుహాసినిని బరిలోకి దింపడం ద్వారా ఫలితం ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
హరికృష్ణ కూతురు సుహాసిని... తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కలిశారు. విశాఖలోని నోవాటెల్ హోటల్‌లో భేటీ అయ్యారు. కూకట్‌పల్లి అసెంబ్లీ టికెట్‌ సుహాసినికి ఇస్తారని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆమె చంద్రబాబును కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కూకట్‌పల్లి నుంచి పోటీ విషయమై వారివురూ చర్చించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సాయంత్రం కూకట్‌పల్లి నేతలతో సమావేశం కానున్న చంద్రబాబు... అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది. పార్టీ నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న చంద్రబాబు... ఆమెను ఆ స్థానం నుంచి బరిలోకి దింపాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని సుహాసినికి చంద్రబాబు చెప్పారని... అందరని కలుపుకుపోతూ ప్రచారంలో పాల్గొనాలని ఆమెను సూచించినట్టు వార్తలు వస్తున్నాయి.
నందమూరి కల్యాణ్‌రామ్ సోదరిగా సుహాసిని సుపరిచితురాలే అయినా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కూకట్‌పల్లి నియోజవకర్గం నుంచి నందమూరి ఫ్యామిలీకి అవకాశం ఇవ్వడం ద్వారా విజయం ఈజీ అవుతుందని చంద్రబాబు అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే నందమూరి కుటుంబం నుంచి మూడోతరం నేతగా సుహాసినిని బరిలో నిలపాలని నిర్ణయించినట్టు స్పష్టమవుతోంది.
మహాకూటమి పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూకట్‌పల్లి స్థానాన్ని టీడీపీకి కేటాయించింది. కూకట్‌పల్లి నుంచి పోటీ చేసేందుకు భారీసంఖ్యలో ఆశావహులు పోటీపడ్డారు. టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి తాను కూకట్‌పల్లి నుంచే పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే, అనూహ్యంగా నందమూరి సుహాసిని పేరు తెరమీదకు వచ్చింది.
17:34 - November 15, 2018

సిరిసిల్ల: టీఆర్ఎస్ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అదే సమయంలో ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. మహాకూటమి టార్గెట్‌గా నిప్పులు చెరుగుతున్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఢిల్లీకి, టీడీపీకి ఓటు వేస్తే అమరావతికి, టీజేఎస్‌కు ఓటు వేస్తే ఎటూ కాకుండా పోతుందని టీఆర్ఎస్ నేత హరీష్‌రావు అన్నారు. అదే టీఆర్ఎస్‌కు ఓటు వేస్తే అభివృద్ధి కొనసాగుతుందన్నారు. చందుర్తి మండలం మల్యాలలో ప్రజా ఆశ్వీరాద సభలో హరీష్ పాల్గొన్నారు. సిరిసిల్ల రైతులు వానకోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని, ఇచ్చిన మాట ప్రకారం చెరువులను నింపామని హరీష్ చెప్పారు. చినుకు పడకపోయినా రుద్రాంగిలో పంటలు పండుతాయన్నారు. 10ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రైతులు కష్టాలు పడ్డారని హరీష్‌రావు వాపోయారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు మద్దతు ధర, పెట్టుబడి సాయం ఇచ్చామన్నారు. 60 ఏళ్లుగా టీడీపీ, కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తే ఏమీ లాభం లేకపోయిందన్నారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో 5లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తే టీఆర్ఎస్ హయాంలో నాలుగేళ్లలోనే 25లక్షల ఎకరాలకు నీరిచ్చామన్నారు. పేదలకు కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. రాష్ట్రంలో  మళ్లీ టీఆర్ఎస్‌దే విజయం అని హరీష్‌రావు ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ ఆస్పత్రులు అభివృద్ది చెందాయని, రైతు సమస్యలు తీరాయని హరీష్ చెప్పారు.

19:48 - November 14, 2018

హైదరాబాద్: టీఆర్ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ కలిసి ఏర్పడిన మహాకూటమిపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పందించారు. మహాకూటమిని బేస్‌లెస్ ఆలోచనగా కొట్టిపారేశారు. మహాకూటమిలో సీపీఎం చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై తమ్మినేని వీరభద్రం మాట్లాడుతు..కేసీఆర్ స్వలాభం కోసమే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని..ముందస్తు ఎన్నికలతో ప్రజలపై ఆర్థిక భారం పడుతుందన్నారు. ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న తరుణంలో మళ్లీ కాంగ్రెస్‌కు వంత పలకటం మూర్ఖత్వం అని వ్యాఖ్యానించారు. దేశంలో కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాలను తీసుకొచ్చిందే కాంగ్రెస్‌ అని.. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌తో కలవటానికి తాము సిద్ధంగా లేమన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీకి ప్రత్యామ్నాయంగా బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్ఎఫ్)ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సామాజిక న్యాయం, చట్టసభల్లో బలహీనులకు అవకాశం కల్పించటమే తమ లక్ష్యమన్నారు. బీఎల్ఎఫ్‌తోనే బలహీనవర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. జనసేన, ఆమ్‌ ఆద్మీ పార్టీ సహా.. కలిసి వచ్చే వారితో బీఎల్ఎఫ్‌ను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. తమది మొదటిది లేదా మూడో ఫ్రంట్ అనికూడా  అనుకోవచ్చునని తమ్మినేని తెలిపారు.

Pages

Don't Miss

Subscribe to RSS - టీడీపీ