జూ.ఎన్టీఆర్

12:36 - September 11, 2018

టాలీవుడ్ యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్...మాట మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న అరవింద సేమత సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. సినిమాలో ఎన్టీఆర్ ఆరు పలకలతో కనిపించడం అభిమానులను అలరిస్తోంది. ఎన్టీఆర్ సరసన పూజాహెగ్డే నటిస్తోంది. అక్టోబర్ మాసంలో చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. 
తాజాగా చిత్ర యూనిట్ ఆడియో వేడుకపై దృష్టి పెట్టింది. వేడుకకు ముఖ్యఅతిథులు వారేనంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు రానున్నారని ప్రచారం జరిగింది. గతంలో మహేష్ సినిమాకు ఎన్టీఆర్ వెళ్లిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ కూడా హాజరయ్యే అవకాశం ఉందని టాక్. కానీ తాజాగా మరో టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ వస్తారని పుకార్లు షికారు చేస్తున్నాయి. అరవింద సమేతలో బిగ్ బి కీలక పాత్ర పోషించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఇది నిజమా ? కాదా ? అనేది తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. 

12:37 - September 10, 2018

నందమూరి కుటుంబం ఇప్పుడిప్పుడే కొలుకోంటోంది. హరికృష్ణ హఠాన్మరణం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచిన సంగతి తెలిసిందే. ప్రధానంగా జూ.ఎన్టీఆర్ ను తీవ్రంగా కలిచివేసింది. మనస్సులో ఉన్న బాధను దిగమింగుకుని జూ.ఎన్టీఆర్ షూటింగ్ లలో పాల్గొంటున్నారంట. జూ.ఎన్టీఆర్ 'అరవింద సమేత' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా ఈ షూటింగ్ జరుపుకొంటోంది. పంద్రాగస్టును పురస్కరించుకుని మూవీ టీజర్‌ రిలీజైంది.

టీజర్ లో ఎన్టీఆర్ నటన చూసి అభిమానులు ఫిదా అయిపోయారంట. తాజాగా మరో ప్రచార చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందంట. వినాయక చవితి సందర్భంగా ఈ టీజర్ ను విడుదల చేస్తారని టాక్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీలో జగపతిబాబు, నాగబాబులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు సెప్టెంబర్ 20న ఈ మూవీ ఆడియో విడుదల చేయనున్నారు. ఈ మూవీని దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.

06:29 - August 30, 2018

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు గురువారం జరగనున్నాయి. జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హరికృష్ణ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి హరికృష్ణ అంతిమయాత్ర కొనసాగనుంది. సాయంత్రం 4 గంటలకు జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. మెహిదీపట్నంలోని నివాసం నుంచి జూబ్లీహిల్స్‌ వరకు అంతిమయాత్ర కొనసాగనుంది. చైతన్య రథంపైన హరికృష్ణ అంతిమయాత్ర సాగనున్నట్లు తెలుస్తోంది. హరికృష్ణ మృతదేహాన్ని సందర్శించి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. హరికృష్ణను కడసారి చూసేందుకు పలువురు అభిమానులు తరలివస్తున్నారు

09:23 - August 29, 2018

హైదరాబాద్ : సినీ నటుడు, ప్రొడ్యూసర్, టిడిపి రాజకీయ నేత నందమూరి హరికృష్ణ దుర్మరణం చెందడం పలువురు జీర్ణించుకోలేకపోతున్నారు. విషయం తెలుసుకున్న నందమూరి కుటుంబసభ్యులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నల్గొండ జిల్లా అన్నేపర్తి వద్ద ఆయన కారు ప్రమాదానికి గురైంది. తీవ్రగాయాల పాలైన హరికృష్ణ నార్కెట్ పల్లి కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆసుపత్రికి బయలుదేరారు.

ఇదిలా ఉంటే ఆయన జీవిత గమనాన్ని నేతలు నెమరు వేసుకుంటున్నారు. ఎన్టీరామారావుతో ఎంతో సానిహిత్యంగా ఉండేవాడని, ఆయన ప్రారంభించిన చైతన్య రథానికి డ్రైవర్ గా హరికృష్ణ చేశారని గుర్తు చేసుకుంటున్నారు. ఆయన నిర్వహించిన పాత్ర ఇప్పటికీ నెమరు వేసుకుంటున్నారు. హరికృష్ణ ఒక మొండి మనిషి..భోళాశంకరుడని టిడిపి నేతలు అభివర్ణిస్తుంటారు. సీతయ్య ఎవరి మాట వినడనే రీతిలో వ్యవహరించేవాడని...ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రాజీనామా చేసి తెలుగులో ప్రసంగించిన సంగతి తెలిసిందే.

2004లో ఎన్నికల ప్రచారానికి వెళుతున్న జూ.ఎన్టీఆర్ ప్రమాదానికి గురై తృటిలో మృత్యువాత నుండి బయటపడ్డారు. కానీ జానకీ రామ్ మాత్రం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఇప్పుడు నందమూరి హరికృష్ణ మృతి చెందడం కుటుంబసభ్యులను కలిచివేస్తోంది. 

09:14 - August 29, 2018

నల్గొండ : నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. నటుడు, ప్రొడ్యూసర్, టిడిపి నేత నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. జిల్లాలోని అన్నేపర్తి వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో ఆయన కన్నుమూశారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో కారు నడుపుతున్నట్లు తెలుస్తోంది. స్వయంగా హరికృష్ణ కారును నడుపుతూ ఉండటం, సీటు బెల్టు పెట్టుకో లేదని సమాచారం. ప్రమాదం జరిగిన తరువాత కారు పల్టీలు కొట్టినట్లు, హరికృష్ణ కారులోంచి కిందపడినట్లు ఘటనాస్థలిని చూస్తే తెలుస్తోంది. తలకు బలమైన గాయమై మెదడు చిట్లిందని సమాచారం. కామినేని ఆసుపత్రికి తరలించగా ఆయన శరీరం చికిత్సకు సహకరించలేదు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

08:58 - August 29, 2018

విజయవాడ : సినీ నటుడు, టిడిపి నేత హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందడంతో కుటుంబంలో, అభిమానుల్లో తీవ్ర విషాదం నెలకొంది. నల్గొండ జిల్లా అన్నేపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ కన్నుమూశారు. విషయం తెలుసుకున్న కుటుంసభ్యులు నార్కట్ పల్లికి బయలుదేరారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ మంత్రి లోకేష్ లు ప్రత్యేక హెలికాప్టర్ లో హైదరాబాద్ కు పయనమయ్యారు.

హరికృష్ణ ఇక లేరన్న విషయం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన సాదాసీద జీవితం గడిపారని..ఎవరైనా మృతి చెందితే మొదటగా వెళ్లేంది హరికృష్ణనేని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. లక్ష్మీ పార్వతితో విబేధాలు రావడంతో చంద్రబాబు నాయుడు వద్ద చేరి పార్టీ అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారు. పొలిట్ బ్యూరో సభ్యులుగా, రాజ్యసభ్యులుగా పార్టీ నియమించింది. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ఆయన రాజీనామా చేసి ఆమోదించుకున్నారు. 

06:37 - May 28, 2018

హైదరాబాద్ : స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవితంలోని ముఖ్య ఘట్టాలు...జీవిత విశేషాలను పాఠ్యాంశాల్లో చేర్చాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరుతున్నట్లు సినీ నటుడు నందమూరి హరికృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ కు విచ్చేసిన ఆయన ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ ను ఈతరం కూడా మరిచిపోలేదని, ఆయన చేసిన సేవలు అమోఘమన్నారు. ఎన్టీఆర్ ఘాట్ తనకు దేవాలయమని, సమాధి దగ్గరకు వచ్చి నివాళులర్పించడం తన బాధ్యత అన్నారు. మహానాడులో ఎందుకు పాల్గొనడం లేదని విలేకరుల ప్రశ్నకు సమాధానం దాట వేశారు. జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, ఇతర కుటుంబసభ్యులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. 

16:47 - February 21, 2018

తెలుగు ఇండస్ట్రీ కి సుపరిచితమైన స్టార్ హీరో ఫామిలీ వరుస సినిమాలతో ఎప్పుడు టాక్ ఆఫ్ ధీ టౌన్ గా ఉంటుంది. ఈ ఫామిలీకి చెందిన హీరో ఇప్పుడు తన బ్రదర్ ఫాదర్ తో సినిమా చెయ్యాలని అనుకుంటున్నాడట తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు 'నందమూరి తారక రామారావు'. ఎన్ టి ఆర్ నుండి నటవారసత్వాన్ని తీసుకుని వచ్చిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు హీరోగానే కాక ప్రొడ్యూసర్ గా కూడా మంచి ఫామ్ లో ఉన్న 'నందమూరి హీరో కళ్యాణ్ రామ్'. కెరీర్ స్టార్టింగ్ నుండి హీరోగా ట్రై చేస్తూ 'ఫటాస్' సినిమాతో హిట్ ట్రాక్ పట్టిన హీరో 'నందమూరి కళ్యాణ్ రామ్’.

శివ రామరాజు, సీతయ్య లాంటి పవర్ ఫుల్ సబ్జెక్టుతో హీరోగా కనిపించిన నందమూరి హీరో హరికృష్ణ. తన నటనతో ఆకట్టుకుంటూ ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు హరికృష్ణ. గతంలో మంచి పాత్రలని చేసిన 'హరికృష్ణ' ఈ మధ్య కాలంలో స్క్రీన్ మీద కనిపించలేదు. హీరోగానే కాకుండా ఎలాంటి పాత్రలకైనా సిద్ధం అంటూ అలరించిన 'హరికృష్ణ' మరలా స్క్రీన్ మీద కనిపించబోతున్నాడట.

కళ్యాణ్ రామ్, హరికృష్ణ, ఎన్ టి ఆర్ ఒకే స్క్రీన్ పైన కనిపిస్తే చూడాలని ఫాన్స్ కి ఉంటుంది. ఇప్పుడు వీరి ముగ్గురిని ఒకే తెరపై కలిపి చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనుకున్నట్టు జరిగితే... తండ్రీ కొడుకులు త్వరలోనే ఒకే సినిమాలో కనిపించబోతున్నారు. సావిత్రి - ప్రేమ్ ఇష్క్ కాదల్ సినిమాలకు దర్శకత్వం వహించిన పవన్ సాధినేని ఒక కథతో కళ్యాణ్ రామ్ ని మెప్పించి హీరోగా కళ్యాణ్ రామ్, అతిథి పాత్రలో ఎన్ టి ఆర్ హరికృష్ణ ని చెయ్యాలని అడిగారట. మరి ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. నందమూరి వంశంలో బాలకృష్ణ తరువాత ఆ స్థాయికి చేరింది జూనియర్ ఎన్టీఆరే.

08:26 - January 18, 2018

హైదరాబాద్ : ఎన్టీఆర్ 22వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ లో పలువురు ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ కుటుంబసభ్యులు ఘాట్ కు చేరుకుని పుష్పగుచ్చాలుంచి నివాళులర్పించారు. ఏపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, హరికృష్ణ, జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, భువనేశ్వరీలు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ ఒక యుగపరుషుడని, ఆయన కడుపున పుట్టడం తమ పునర్జన్మ సుకృతమన్నారు. ఆయన గురించి చెప్పాలంటే తరాలు..యుగాలు చాలవని, తెలుగు జాతి ఉన్నంత కాలం ప్రతింటా ఆ మహానుభావుడు జీవించి ఉంటాడన్నారు. ఎన్టీఆర్ అంటే నేషనల్ టైగర్ ఆఫ్ రిఫార్మ్స్ అని తెలిపారు. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ ఉందని, దీని కోసం ప్రతొక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు.

తెలుగు జాతి చప్పుడు ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. తెలుగు జాతి అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడన్నారు. యావత్ భారతదేశం గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగు వారికి సేవ చేయాలన్న సంకల్పంతో టిడిపిని స్థాపించారని, ఎన్టీఆర్ కు భారతరత్న కోసం పోరాడుతామన్నారు. 

09:58 - September 25, 2017

స్టార్ మా టీవీ ఆధ్వర్యంలో టెలికాస్ట్ అయిన 'బిగ్ బాస్ 1’ విజేత ఎవరో తేలిపోయింది. సుమారు 71 రోజుల పాటు జరిగిన ఈ షో ఆదివారం క్లైమాక్స్ కు చేరుకుంది. జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ఈ షో కు ప్రజల నుండి భారీగానే స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. క్లైమాక్స్ లో ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ పాటలు..ఆటలతో సందడి చేశారు.

ఈ షోలో మొత్తం 16 మంది పాల్గొన్న సంగతి తెలిసిందే. చివరి వరకు ఐదుగురు మాత్రమే మిగిలారు. వారిలో అర్చన..నవదీప్..లు వెనుకబడ్డారు. ఆదివారం తుదిపోటీకంటే ముందుగానే వైదొలిగారు. ఫైనల్లో శివబాలాజీ..ఆదర్శ్..హరితేజ మాత్రమే మిగిలారు. దీనితో ఎవరనేది ఉత్కంఠ నెలకొంది. చివరకు అత్యధికంగా ఓట్లు సాధించిన 'శివ బాలాజీ' విజేత అని జూ.ఎన్టీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ట్రోఫితో పాటు రూ. 50 లక్షల నగదును అందచేశారు. ఈ షోలో మొత్తం దాదాపు 11 కోట్ల మంది ప్రేక్షకులు ఓటింగ్ లో పాల్గొన్నట్లు ఎన్టీఆర్ వెల్లడించారు. అత్యధికంగా మూడు కోట్లకు పైగా 'శివ బాలాజీ' ఓట్లు సాధించినట్లు తెలిపారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - జూ.ఎన్టీఆర్