జనసేన పార్టీ

22:57 - September 12, 2018

హైదరాబాద్ : ఉత్తరాంధ్రలో పర్యటనతో సెగ పుట్టించిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ .. చల్లబడ్డారు. పశ్చిమలో భారీ బహిరంగ సభ నిర్వహించి కాక రేపిన జనసేనాని.. మళ్లీ కనుమరుగైపోయారు. సీరియస్‌గా పాలిటిక్స్ మొదలుపెట్టారని అనుకున్నంతలోనే.. తన తీరు మారలేదని నిరూపించుకుంటున్నారు. ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం వేడెక్కుతున్న సమయంలో పవన్‌ తెరమరుగు అవడం సంచలనం కలిగిస్తోంది. 

మే 20న ఇచ్ఛాపురం నుంచి పోరాట యాత్ర మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్‌.. రెండు విడతల్లో దాదాపు 40 రోజుల పాటు జనం మధ్యే గడిపారు. మధ్యలో రంజాన్‌ పేరుతో కొన్ని రోజులు, కంటి సమస్య పేరుతో మరికొన్ని రోజులు విరామం తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ పర్యటించిన పవన్.. ఆ తర్వాత మాత్రం అనూహ్యంగా మౌనం దాల్చారు. పవన్ కళ్యాణ్‌పై చాలా ఆశలు పెట్టుకున్న ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు  తీవ్ర నిరాశకు గురవుతున్నారు. 

21:42 - August 14, 2018

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ దూకుడు పెంచారు. పార్టీ మేనిఫెస్టో విజన్‌ డాక్యుమెంట్‌ని విడుదల చేశారు. భీమవరంలో పార్టీ సిద్ధాంతాలు, హామీలను ప్రకటించారు. జనసేన అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని అన్నారు. సోమవారం పార్టీ గుర్తును ప్రకటించిన పవన్‌, ఇవాళ జనసేన విజన్‌ మేనిఫెస్టోని విడుదల చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు తెలకపల్లి రవి, వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి, టీడీపీ నేత పట్టాభిరామ్, జనసేన అధికార ప్రతినిధి అద్దెపల్లి శ్రీధర్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

16:16 - August 14, 2018

పశ్చిమ గోదావరి : జిల్లాలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రజా పోరాట యాత్ర కొనసాగుతోంది. ఇవాళ భీమవరంలోని శ్రీ మావుళ్లమ్మ ఆలయాన్ని పవన్ సందర్శించారు. పార్టీ విజన్‌ మేనిఫెస్టోని అమ్మవారి వద్ద ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం జనసేన పార్టీ విజన్‌ మేనిఫెస్టోను పవన్ విడుదల చేశారు. విజన్‌ డాక్యుమెంట్‌లో 12 అంశాలను పొందుపరిచారు. మహిళా ఖాతాల్లో నెలకు 2,500 నుంచి 3,500 వరకు జమ... చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, బీసీలకు రిజర్వేషన్లు మరో ఐదు శాతం పెంచే ఆలోచన, కాపులకు 9వ షెడ్యూల్‌ కింద రిజర్వేషన్లు, ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ విధానం రద్దు చేయడం లాంటి అంశాలను చేర్చారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 
పశ్చిమగోదావరి జిల్లాలో పవన్‌ ప్రజా పోరాటయాత్ర

 

18:50 - February 5, 2018

హైదరాబాద్ : మత్స్యకారులకు అండగా ఉంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ తో మత్స్యకార సంఘాలు భేటీ అయ్యారు. మత్స్యకారులు పవన్ కు తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మత్స్యకారుల సమస్యలు తనకు తెలుసు అన్నారు. మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మత్స్యకారులు ఎస్టీ జాబితాలో ఉండాల్సిన వారేనని అన్నారు. శాంతియుతంగా చేస్తున్న మత్స్యకారుల దీక్షలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదని హితవు పలికారు. ఈనెల 21న శ్రీకాకుళంలో పర్యటిస్తానని చెప్పారు. శ్రీకాకుళం చాలా చైతన్యం ఉన్న జిల్లా అన్నారు. మ్యానిఫెస్టోలో చెప్పినదానికి నేతలు కట్టుబడి ఉండాలన్నారు. మ్యానిఫెస్టో ఓటు బ్యాంకులా ఉండకూడదని తెలిపారు. 

 

10:39 - January 28, 2018

అనంతపురం : ప్రజాభీష్టం మేరకే ముందుకెళ్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజాభిప్రాయం మేరకు ఎవరికి మద్దతు ఇవ్వాలి.. ఎవరితో వెళ్లాలని నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి పరిటాల సునీతతో పవన్ భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతపురంలోని సమస్యలను అర్థం చేసుకునేందుకే పరిటా సునీతను కలిశానని తెలిపారు. అందరూ కలిసి వస్తేనే జిల్లాలోని సమస్యలను ఎదుర్కోగలమని చెప్పారు. అందరు కలిసివస్తేనే అనంతపురం జిల్లాలోని కరువును నిర్మూలించవచ్చన్నారు. అనంతపురం జిల్లాపై ప్రత్యేక దృష్టి పెడతానని చెప్పారు. జిల్లాలో రెండు, మూడు పర్యటనలు చేస్తానని చెప్పారు. ఏపీలోని సమస్యలపై ప్రధానికి నివేదిక ఇస్తానని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాల అమలు సాధ్యం కానప్పుడు ప్రజలను మభ్యపెట్టకుండా నిజాయితీగా చెప్పాలన్నారు. పొత్తులపై ఎన్నికల సమయంలో మాట్లాడుతానని తెలిపారు. 

 

09:52 - January 28, 2018

అనంతపురం : జిల్లాలో నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండోరోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు మాట్లాడుతూ తాము జనసేన పార్టీతో ఉంటామని చెప్పారు. యువతకు జనసేన మొదటి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పవన్ జిల్లా సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

12:34 - January 24, 2018

ఖమ్మం : జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కాసేపట్లో ఖమ్మం పట్టణం చేరుకోనున్నారు. ఖమ్మంలో ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ జిల్లాలకు చెందిన జనసేన కార్యకర్తలతో సమావేశం అవుతారు. కొత్తగూడెంలో బయలుదేరే ముందు పవన్‌ అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలను అధ్యయనం చేసుకోవడానికే తాను యాత్ర చేపట్టినట్టు తెలిపారు. తనకు అద్భుత ఆథిత్యం ఇచ్చిన కొత్తగూడెం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే కొత్తగూడెం వచ్చానని చెప్పారు. శ్రీజ ఆరోగ్యంగా ఉండడం సంతోషం కలిగించిందన్నారు. 

 

13:04 - January 23, 2018

కరీంనగర్ : రాజకీయాల్లోకి కొత్త రక్తం రావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కరీంనగర్ లోని శుభం గార్డెన్ లో ఏర్పాటు చేసిన మీటింగ్ లో ఆయన మాట్లాడారు. తెలంగాణ తనకు పునర్జన్మనిచ్చిందని..తెలంగాణ నేలకు చివరిశ్వాసవరకు రుణపడి ఉంటానని తెలిపారు. ఏడు సిద్ధాంతాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. మార్చి 14న వరకు పూర్తిస్థాయి కార్యచరణ ప్రకటిస్తానని చెప్పారు. వందేమాతరానికి ఉన్న శక్తి జై తెలంగాణ నినాదానికి ఉందన్నారు. 
కొన్ని కులాలకే సమాజిక న్యాయం 
కొన్ని కులాలకే సమాజిక న్యాయం జరిగిందని తెలిపారు. కుల, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు కావాలన్నారు. భారతదేశం సెక్యులర్ రాజ్యంగా ఉందని పేర్కొన్నారు. భాషను, యాసను గౌవరవించే సంప్రదాయం కావాలన్నారు. భారతదేశం ఒకటిగా ఉండాలంటే అన్ని సంస్కృతులను గౌరవించాలని పిలుపునిచ్చారు. సంస్కృతులను కాపాడే విధంగా జనసేన వ్యవహరిస్తుందన్నారు. దేశం కోసం తన గుండె కొట్టుకుంటుందన్నారు. 
జాతీయతను విస్మరించవద్దు.. 
ప్రాంతీయతను గౌరవించాలని..అయితే ప్రాంతీయత భావనలో పడి జాతీయతను విస్మరించవద్దన్నారు. ప్రాంతీయతను విస్మరించని జాతీయత జనసేన లక్ష్యమని తెలిపారు. సామాజిక న్యాయం అంటే సీట్లు ఇవ్వడమే కాదు...అందరూ అభివృద్ధి చెందాలన్నారు. అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలని కోరారు. అందరికీ ఆర్థిక భద్రత కల్పించాలన్నారు. తనకు ఏ వ్యక్తితతో వ్యక్తిగతంగా విభేదాల్లేవన్నారు. ఏ ఒక్క పార్టీ మీద ధ్వేషం లేదని చెప్పారు. 
తెలంగాణ పసిబిడ్డ 
తెలంగాణ పసిబిడ్డ అన్నారు. తెలంగాణను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరాజకీయ నాయకునికి ఉందన్నారు. కేసీఆర్ అంటే ముందునుంచి తనకు ఇష్టమన్నారు. రాజకీయల నుంచి ప్రజల కోసం పని చేసి ఏ వ్యక్తినైనా గౌరవిస్తానని చెప్పారు. 'మన యాస, భాషను గౌరవించాలని' అన్నారు. తనకు తెలంగాణ అంటే ఇష్టం, ప్రేమ ఉందన్నారు. తెలంగాణ ఒక్కరోజులో రాలేదని... 25 సం.లు పట్టిందన్నారు. అవినీతి లేని సమాజం రావాలన్నారు. పర్యావరణాన్ని కాపాడాలన్నారు. ప్రజా సమస్యలు, విధానపరంగానే తన పోరాటమన్నారు. ఆంధ్ర, తెలంగాణ వేరు కాదని చెప్పారు. 'మీ కోసం నేను ఉన్నాను 'అని పవన్ భరోసా ఇచ్చారు. 

 

 

09:06 - January 23, 2018
19:37 - January 22, 2018

కరీంనగర్ : రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి ఉండాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ, ఏపీలో పోటీ చేస్తానని చెప్పారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. సమస్యకు పరిష్కారం కావాలన్నారు. తనను బీజేపీలోకి రావాలని అమిత్ షా గతంలోనే కోరారని.. దాన్ని అప్పట్లోనే సున్నితంగా తిరస్కరించానని తెలిపారు. తెలంగాణలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ? వాటి పరిష్కారానికి సలహాలు, సూచనలు తీసుకుంటానని చెప్పారు. రాజకీయ అస్థిరత కోసం తాను మాట్లాడనని చెప్పారు. నిర్మాణాత్మక రాజకీయాలే చేస్తానని పేర్కొన్నారు. గొడవలతో సమస్యలు పరిష్కారం కావన్నారు. జనసేన చిన్న పార్టీ అని.. ఇప్పుడే సీట్ల గురించి ఆలోచించడం లేదని చెప్పారు. ఈనెల 27న అనంతపురంలో పర్యటిస్తానని తెలిపారు. విశాఖ ఏజెన్సీలో పర్యటిస్తానని చెప్పారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - జనసేన పార్టీ