చిరంజీవి

10:36 - September 15, 2018

భారీ బడ్జెట్ తో .. భారీ కాస్టింగ్ తో మెగా స్టార్ హీరోగా వస్తున్న మూవీ సైరా నరసింహారెడ్డి.. మెగా పవర్ స్టార్ నిర్మిస్తున్న ఈ మూవీలో మెగా డాటర్ కూడా ఓ రోల్ చేయబోతుందట. మెగాస్టార్ చిరంజీవి భారీ బడ్జెట్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్టార్ కాస్టింగ్ నటిస్తున్న మూవీ సైరాలో అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి లాంటి అదర్ లాంగ్వేజ్ స్టార్ యాక్టర్స్ అందరూ కనిపించబోతున్నారు. మెగా తనయుడు రాంచరణ్  నిర్మిస్తున్నఈ మూవీలో మరో మోగా ఫ్యామిలీ స్టార్ జాయిన్ అవ్వబోతున్నట్టు టాక్.

రీసెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మెగా డాటర్ నిహారిక సైరాలో ఓ క్యారక్టర్ లో కనిపించబోతుందట. సైరాలో ఓ కథాకళి డాన్సర్ క్యారక్టర్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ మూవీలో నిహారిక పదినిమిషాల పాత్ర చేయనున్నరట. ఈ క్యారక్టర్ కోసం స్పెషల్ గా నిహారిక కథకళిలో ట్రైనింగ్ తీసుకుంటోందట. పెద్ద పెద్ద స్టార్ యాక్టర్స్ నటిస్తున్నఈ మూవీలో నిహారిక కూడా జాయిన్ అవ్వబోతున్నట్టు టాలీవుడ్ టాక్.

‘ఒక మనసు’ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన నిహారికా కొణిదెల... అంతకు ముందు కొన్ని వెబ్ సిరీస్ లలో కనిపించింది. ఆ తరువాత సుమంత్ అశ్విన్ కాంబోలో ‘హ్యాపీ వెడ్డింగ్’ చేసింది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వకపోయినా నిహారిక నటనకు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో హీరోయిన్ గా కొణిదెల వారి వారసురాలు సెట్ అయినట్లే అని చెప్పోచ్చు.

10:56 - September 12, 2018

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రంపై ఓ వార్త సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ‘సైరా’ సినిమాను నిషేధిస్తారనే వార్త కలకలం రేపుతోంది. తెలుగు సినీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. దాదాపు రూ. 250 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 

స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. చిరంజీవి టైటిల్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాలో ఇతర భాష నటీనటులు కూడా నటిస్తున్నారు. శాండల్‌వుడ్ కు సంబంధించిన స్టార్ హీరో సుదీప్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఓ టీజర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ‘సైరా నరసింహారెడ్డి' సినిమాపై నిషేధం విధించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.  భారీ బడ్జెట్‌తో తెరకెక్కే తమిళ, తెలుగు, మలయాళ చిత్రాల డబ్బింగ్ వెర్షన్ ని కన్నడలో విడుదల చేయాలని నిషేధించాలని అక్కడ సినీ పరిశ్రమపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోందంట. మరి ఇది నిజమా ? కాదా ? అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ స్పందించే వరకు తెలియదు. 

06:32 - August 30, 2018

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన టీడీపీ సీనియర్‌ నేత, సినీ నటుడు నందమూరి హరికృష్ణకు సినీ ప్రపంచం నివాళులర్పించింది. ఆయన కుటుంబ సభ్యులకు సినీ ప్రముఖులు సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా హరికృష్ణతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి హరికృష్ణకు సినీ జగత్తు నివాళులర్పించింది. సినీ ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిజేశారు. ఈ సందర్భంగా హరికృష్ణతో ఉన్న అనుబంధాన్ని సినీ ప్రముఖులు గుర్తుచేసుకున్నారు.

నందమూరి హరికృష్ణ అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని హీరో చిరంజీవి అన్నారు. హరికృష్ణ నివాసానికి వచ్చిన చిరంజీవి.. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆత్మీయ మిత్రుడు, సోదర సమానుడైన హరికృష్ణ మృతి తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. హరికృష్ణ ఎప్పుడు కలిసినా ఎంతో ఆప్యాయంగా పలకరించేవారన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, హరికృష్ణ కుటుంబ సభ్యులకు మానసిక స్థైర్యం కలిగించాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని చిరంజీవి అన్నారు. అటు పవన్‌కల్యాణ్‌ సైతం హరికృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తన అన్నయ్య అందరితోను కలుపుకోలుగా ఉండేవారని అన్నాకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. హరికృష్ణ మనతో లేకున్నా ఆయన జ్ఞాపకాలు మనతోనే ఉంటాయన్నారు. హరికృష్ణ మృతికి సానుభూతి తెలిపిన ప్రతి ఒక్కరికీ బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. హరికృష్ణ తన జీవితంలో ఒక గొప్ప వ్యక్తిగా జీవించాడని బాలకృష్ణ అన్నారు.

హరికృష్ణ మహా మనిషి అని.. ఎవరికి ఏ సాయం కావాలన్నా.. చేసేవారని సినీ నటుడు కృష్ణం రాజు అన్నారు. ఒక మంచి మిత్రున్ని కోల్పోయనని కన్నీటి పర్యంతం అయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు కృష్ణం రాజు. హరికృష్ణ మంచి నటుడిగా.. మంచి వ్యక్తిగా గుర్తింపు సంపాదించారని సినీ నటుడు సీనియర్‌ నరేష్‌ అన్నారు. ఎన్టీఆర్‌ చైతన్య రథ సారథిగా హరికృష్ణకు గొప్ప పేరుందని తెలిపారు. హరికృష్ణ మృతి సినీ లోకానికి తీరని లోటని అన్నారు. హరికృష్ణ ఇంత త్వరగా తమని వదిలి వెళ్తారని తాను ఊహించలేదని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరలని కోరుకుంటున్నానని నరేష్‌ అన్నారు.

నందమూరి హరికృష్ణ అకాల మరణం తెలుగు సినీ జగత్తుకు తీరని లోటు అన్నారు ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్‌. ఆకస్మాత్తుగా హరికృష్ణ మరణ వార్త వినటం కలిచివేసిందని చెప్పారు. నందమూరి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని.. హరికృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని కోరకుంటున్నానని కళ్యాణ్ అన్నారు. హరికృష్ణ మంచి మనిషి అని.. గొప్ప వ్యక్తి అని అభివర్ణించారు సినీ నటుడు అశోక్‌. ఏ వ్యక్తి ఆపదలో ఉన్న వారికి ఎలాంటి సాయమైనా చేసే వారని తెలిపారు. నందమూరి హరికృష్ణ మరణించటం తెలుగు సినీ పరిశ్రమకు, టీడీపీకి, దేశ రాజకీయాలకు తీరని లోటు అని అన్నారు సినీ నటుడు ఆర్‌. నారాయణమూర్తి. మానవీయ విలువలు, కుటుంబ విలువలు, సామాజిక విలువలపై నిబద్దత, పట్టు ఉన్న మనిషి హరికృష్ణ అని తెలిపారు. అలాంటి వ్యక్తి చనిపోవటం దురదృష్టకరమని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని ఆర్‌. నారాయణ మూర్తి చెప్పారు. ఇక హరికృష్ణను కడసారి చూసేందుకు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున్న ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. 

18:25 - August 29, 2018

హైదరాబాద్ : హరికృష్ట మరణం తన మనసుని కలచివేసిందని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. హరిక్రిష్ట పార్దీవదేహానికి నివాళులర్పించిన అనరంతరం చిరంజీవి మాట్లాడుతు..ఆయన మరణంతో ఆప్యాయంగా పలకరించే ఓ మంచి మిత్రుడు అకాలంగా మరణించటం చాలా బాధాకరమని చిరంజీవి ఆవేదన వ్యక్తంచేశారు. ఎక్కడ కనిపించినా సరదాగా జోకులు వేసే హరికృష్ణ ఇక కనిపించరంటే చాలా బాధగా వుందన్నారు. కాగా చిరంజీవి వెంట ఆయన కుమారుడు రామ్ చరణ్ కూడా హరికృష్ణకు నివాళులర్పించారు.  ఇప్పటికే హరికృష్ణకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. 

14:05 - August 26, 2018

హైదరాబాద్ : మెగాస్టార్‌ చిరంజీవి ఇంట్లో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. చిరంజీవికి ఆయన ఇద్దరు చెల్లెళ్లు రాఖీలు కట్టి ఆశీర్వాదాలు తీసుకున్నారు. 'మామయ్య రాఖీ సెలబ్రేషన్స్‌ విత్‌ లవ్లీ సిస్టర్స్‌' అంటూ ఉపాసన ఈ వీడియోను ట్వీట్‌ చేశారు. రాఖీలు కట్టిన ఇద్దరు చెల్లెళ్లకు చిరంజీవి... ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని బహుమతులు ఇచ్చారు. 

20:16 - August 22, 2018

హైదరాబాద్ : మెగాస్టార్‌ చిరంజీవికి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సమేతంగా చిరంజీవి నివాసానికి వచ్చి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పవన్‌తో ఆయన సతీమణి అన్నా లెజినోవా, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. అన్నదమ్ములిద్దరూ కలిసి ఉన్న ఈ ఫొటోలను అభిమానులు లైక్‌ చేసి తెగ కామెంట్లు పెడుతున్నారు. అటు సోషల్‌ మీడియాలోనూ చిరంజీవికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులతో పాటు... సినీ ప్రముఖులు కూడా మెగాస్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తనను కలిసేందుకు వస్తున్న అభిమానులను చిరంజీవి ఆప్యాయంగా పలకరించారు. 

16:02 - August 20, 2018

మెగాస్టార్ 'చిరంజీవి'...ఆయన తాజా చిత్రం కోసం అభిమానులతో పాటు ఇతరులు ఎదురు చూస్తున్నారు. చాలా కాలం తరువాత 150 సినిమా 'ఖైదీ నెంబర్ 150' ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం 151సినిమాకు చాలా రోజుల గ్యాప్ తీసుకున్నారు. 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' జీవిత చరిత్ర ఆధారంగా 'సైరా నరసింహారెడ్డి' చిత్రం తెరకెక్కుతోంది. 'కొణిదెల ప్రొడక్షన్స్' పతాకంపై మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'సురేందర్ రెడ్డి' దర్శకత్వం వహిస్తుండగా.. 'నయనతార' 'చిరు' జోడీ కడుతోంది. బాలీవుడ్ నుండి 'అమితాబ్ బచ్చన్', కోలీవుడ్ నుండి 'విజయ్ సేతుపతి', శాండిల్ ఉడ్ నుండి 'కిచ్చా సుదీప్'లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతేగాకుండా నటిస్తుండగా.. 'జగపతిబాబు' కీలక పాత్రలో కనిపించనున్నారని టాక్.

ఇదిలా ఉంటే ఆగస్టు 22వ తేదీ 'చిరంజీవి' జన్మదినం సందర్భంగా 'సైరా' సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయబోతోంది. ఆగస్టు 15వ తేదీన ఈ విషయాన్ని చిత్ర యూనిట్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆగష్టు 21 ఉదయం 11:30 గంటలకు 'సైరా' సందడి చేయనుంది. 

15:14 - August 20, 2018

ఎన్నో అంచనాలతో వచ్చిన 'గీత గోవిందం'..అనుకున్న దానికొంటే ఎక్కువ ఫలితాన్నే చూపిస్తోంది. దగ్గరగా పెద్ద సినిమాలు లేకపోవడం ఈ మూవీకంటే యూత్ ఫుల్ అండ్ ఇంట్రస్టింగ్ మూవీ లేకపోవడం 'గీత గోవిందాని'కి కలిసి వచ్చింది. 'గీత గోవిందం' మూవీ థీయేటర్స్ లో సూపర్ ఫాస్ట్ గా పరుగులు పెడుతోంది. ఈ వీక్ లో మిడిల్ లో రిలీజ్ అయిన 'గీత గోవిందం' మూడు రోజులకే తెలుగు రాష్ట్రాలు రెండింటిలో కలిపి 13 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ఇవి పక్కన పెడితే తమిళనాడు, కర్ణాటక, కేరళ కలిపి నాలుగుకోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. ఈ రేంజ్ లో దూసుకుపోతుంది.. అంతే కాదు ఈ శని, ఆది వారాలు 60 పర్సంట్ అడ్వాన్స్ బుక్కింగ్స్ కూడా అయిపోయాయట.

'విజయ్ దేవరకొండ', 'రష్మిక మండన్న' హీరో హీరోయిన్లుగా పరశురాం దర్శకత్వంలో... వచ్చిన గీతాఆర్ట్స్ పతాకంపై బన్నీ వాస్ నిర్మించారు. అదరిపోయే నటనతో అంతకంతకు ఇమేజ్ పెంచుకుంటున్నాడు విజయ్ దేవరకొండ. రెండు రోజులు డొమెస్టిక్ మార్కెట్ లో మంచి కలెక్షన్లు సాధించే దిశగా పరుగులు పెట్టింది. అయిదు రోజులకు వరల్డ్ వైడ్ కలెక్షన్లు 23 కోట్ల షేర్ ను దాటిందని అంచనా. మరి రానున్న రోజుల్లో ఎన్ని కలెక్షన్లు సాధిస్తుందో చూడాలి. 

14:31 - August 2, 2018

మోగా స్టార్ రీఎంట్రోలో రెండవ సినిమా అయిన 'సైరా' లో హేమా హేమీ నటులు నటిస్తుండటంతో అంచనాలు భారీగా పెరిగాయి. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ నిర్మాణంలో వస్తున్న సైరాలో బిగ్గెస్ట్ స్టార్స్ నటిస్తున్నారు.

బిగ్గెస్ట్ స్టార్లతో సైరా..
అగ్రహీరోయిన్ గా వెలుగొందుతున్న నయనతార కథానాయికగా నటిస్తుండగా, ముఖ్య పాత్రల్లో అమితాబ్..జగపతిబాబు..సుదీప్..విజయ్ సేతుపతి నటిస్తున్నారు. వీరి వీరి పాత్రలు ఇప్పటకే ఖరారైనట్లుగా తెలుస్తున్నా..తమిళ నటుడు విజయ్ సేతుపతి పాత్రపై ఉత్కంఠ నెలకొంది. మల్టీ టాలెంటెడ్ పర్సన్ అయిన విజయ్ సేతుపతికి తమిళనాట మంచి క్రేజ్ వుంది. నటుడిగా, నిర్మాతగా, పాటల రచయితగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.
'ఓబయ్య' గా విజయ్ సేతుపతి..
ఈ సినిమాలో ఆయన 'ఓబయ్య' అనే తమిళుడి పాత్రలో కనిపించనున్నాడనేది తాజా సమాచారం. ఆంగ్లేయులతో పోరాట సమయంలో తెలుగువారిని .. తమిళులని ఏకం చేయడానికి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ప్రయత్నంలో భాగంగా సైరా కుడిభుజంగా ఓబయ్య వ్యవహరిస్తాడని సినీ పరిశ్రమ సమాచారం. ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఈ పాత్రను తీర్చిదిద్దారని..విజయ్ సేతుపతి కెరియర్లో ఇది చెప్పుకోదగిన పాత్రగా నిలిచిపోతుందని సమాచారం. 

14:18 - August 2, 2018

రీ ఎంట్రీతో వచ్చి మెగా హిట్ అందుకున్న మెగా స్టార్ చిరంజీవి తన రెండో సినిమాను బయోపిక్ తో వస్తున్న విషయం తెలిసందే. బ్రిటీష్ వారికి ముచ్చెమటలు పట్టించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో 'సైరా' చిత్రం తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నరసింహారెడ్డిగా చిరంజీవి నటిస్తుండగా, రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అడపాదడపా చిన్నచిన్న ఆటంకాలు ఎదురవుతున్న విషయం కూడా తెలిసిందే. తాజాగా ఉయ్యాలవాడ వంశీకుల నుంచి నిరసనల పర్వం ఎదురవుతోంది.

కంటతడి పెట్టిన ఉయ్యాలవాడ వంశీకులు..
తమ వంశానికి చెందిన ఓ గొప్ప వీరుడి చరిత్రను తెరకెక్కిస్తుడటంతో ఉయ్యాలవాడ వంశీలుకు సంతోషపడుతున్నారు. కానీ తమను ఏమాత్రం గుర్తించడంలేదని ఉయ్యాలవాడ వంశీకులు ఆవేదన వ్యక్తం చేస్తు..ఆవేదన వ్యక్తం చేస్తు కంటతడి పెట్టారు. తమను కర్నూలు నుంచి హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నామని... చిరంజీవి కానీ..రామ్ చరణ్ కానీ తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిరంజీవిగారు వచ్చి మాట్లాడతారని చెబుతూనే ఉన్నారని... ఇంతవరకు అది జరగలేదని వాపోయారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - చిరంజీవి