చమురు

15:58 - September 9, 2018

ముంబై : చమురు ధరల పెరుగుదలపై మహారాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. రాష్ట్ర ప్రజలపై భారం పడకుండా చూస్తామని సీఎం పేర్కొన్నారు. ఓ జాతీయ ఛానెల్ తో ఆయన మాట్లాడారు. జీఎస్టీ కిందకు పెట్రోల్, డీజిల్ తీసుకురావడం వల్ల ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు. ధరల పెరుగుదలపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్షిస్తోందని..ధరలు తగ్గే మార్గాలను చూస్తున్నట్లు వెల్లడించారు. జీఎస్టీలోకి తీసుకొస్తే మహారాష్ట్ర ప్రభుత్వం మద్దతిస్తుందని, ఎన్డీయే ప్రభుత్వ హాయాంలో 13 సార్లు ధరలు పెరిగాయన్నారు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం ధరల పెరుగుదల ఉంటుందన్నారు.

 

06:42 - May 8, 2018

పెరుగుతున్న పెట్రోల్‌ డీజిల్‌ ధరలపై ఈ రోజు దేశ వ్యాప్తంగా ప్రజాసంఘాలు నిరసన కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. అంతర్జాతీయంగా పెరిగిన క్రూడాయిల్‌ ధరల వల్లే వీటి ధరలు పెరుగుతున్నట్లు ఒక వైపు ప్రభుత్వం చెప్పుతుంటే అధికంగా ఉన్న ట్యాక్స్‌ల వల్లే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎక్కువగా ఉన్నాయని ప్రజాసంఘాల నాయకులు విమర్షిస్తున్నారు. పెరుగుతున్న వీటి ధరలు నిత్యవసరాలమీద తీవ్ర ప్రభావం చూపుతున్నాయని దీనివల్ల సామాన్యులపై పెను భారం పడుతున్నదని వారు చెబుతున్నారు. ఈ అంశం పై టెన్ టివి 'జనపథం'లో అవాజ్‌ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్బాస్‌ విశ్లేషించారు. 

08:33 - April 28, 2018

ఢిల్లీ : పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలపై సీపీఎం సమరశంఖం పూరించింది. వచ్చే నెల 8న డీజిల్‌, పెట్రోల్‌ ధరల పెరుగులను నిరసిస్తూ దేశ వ్యాప్త ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. పార్టీతోపాటు.. అన్ని అనుబంధ సంఘాలు ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని సీపీఎం పొలిట్‌బ్యూరో పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు, బహుళజాతి కంపెనీలకు భారీ రాయితీలనిస్తూ.. సామాన్యులపై భారం మోపుతున్నాయని పొలిట్‌బ్యూరో ఆరోపించింది. చమురు ధరలు పెరగడంతో సామాన్యులకు భారంగా మారిందని అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం స్పందించిన వెంటనే ధరలను నియంత్రించాలని డిమాండ్‌ చేసింది. 

20:45 - April 7, 2018

ఆల్ టైమ్ రికార్డు స్థాయికి పెట్రోల్..డీజిల్ ధరలు చేరుకుంటున్నాయి. విపరీతమైన పన్నులు బాదుతూ క్రూడాయిల్ ధరలను పాలకులు సాకుగా చూపుతున్నారు. పెట్రో ధరల ప్రభావంతో నిత్యావసర ధరలు..రవాణా ఛార్జీలు పెరుగుతున్నాయి. పేద, మధ్య తరగతి వర్గాలు బెంబేలెత్తుతున్నారు. ఈ అంశంపై టెన్ టివి బిగ్ డిబేట్ నిర్వహించింది. ఈ చర్చలో పాల్గొని శశికుమార్ (ఆర్థిక నిపుణులు), అద్దంకి దయాకర్ (టి.కాంగ్రెస్), మందా జగన్నాథం (టీఆర్ఎస్), శ్రీధర్ రెడ్డి (బీజేపీ), రాజీవ్ (తెలంగాణ పెట్రోల్ సంఘం నేత) అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

07:22 - April 4, 2018

ప్రస్తుతం ఎండాకాలం ఎండల కంటే పెట్రోల్‌ డీజిల్‌ ధరలు మండిపోతున్నాయి. నాలుగేళ్ల గరిష్టానికి పెట్రోల్‌ ధర చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధర పెరగడమే దీనికి కారణమని పాలకులు చెబుతున్నారు. కానీ పాలకులు చెబుతున్న కారణాలపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అన్నింటికీ జీఎస్టీ వర్తించినప్పుడు.. పెట్రోల్‌, డీజిల్‌కు ఎందుకు వర్తించదని జనం నుంచి బలమైన వాదన వినిపిస్తోంది. అసలు పెట్రోల్‌ డీజిల్‌ ధరలు పెరగడానికి కారణాలేంటి ? తగ్గించడానికి పాలకులు తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి ? వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి కేంద్రానికి ఉన్న అభ్యంతరాలేంటి ? ఈ అంశంపై ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు శశికుమార్‌ విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:23 - January 18, 2018

హైదరాబాద్ : పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. చాపకింద నీరులా వినియోగదారుల జేబుకు చిల్లిపెడుతున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై నియంత్రణ ఎత్తివేసి.. రోజువారిగా మార్చు విధానం అమలు చేసినప్పటి నుండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పైసల్లో తగ్గుతూ.. రూపాయల్లో పెరుగుతూ.. వినియోగ దారులకు చుక్కలు చూపిస్తున్నాయి. బండి బయటికి తీద్దామంటే భయపడే పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గిన సమయంలో కూడా ... దేశీయంగా పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్లుగా పన్నులు వేస్తూ పోవడంతో ధరలు అమాతం పెరిగిపోతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. డీజిల్‌ ధర అయితే దేశంలోనే అత్యధికంగా ఉండడం గమనార్హం.

చమురు సంస్థలు గతంలో ప్రతి 15 రోజులకోసారి పెట్రోల్, డీజిల్‌ల ధరలను సవరించేవి. అలా చేసినప్పుడు ఒక్కోసారి రెండు మూడు రూపాయల వరకు పెంపు ఉండేది. దాంతో ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమయ్యేది. దీంతో ప్రభుత్వం గతేడాది జూన్‌ 16 నుంచి రోజువారీ ధరల సవరణ విధానాన్ని తెరపైకి తెచ్చింది. నామమాత్రంగా తొలి 15 రోజుల పాటు ధరలు తగ్గించగా... ఆ తర్వాతి నుంచి మెల్లమెల్లగా మోత మొదలైంది. హైదరాబాద్‌లో గతేడాది జూలై 16న రూ.67.11గా ఉన్న లీటర్‌ పెట్రోల్‌ ధర ప్రస్తుతం రూ.75.47కు.. డీజిల్‌ ధర రూ.60.67 నుంచి రూ.67.23కు చేరింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.76.92కు, డీజిల్‌ ధర రూ.68.79కు చేరాయి.

రెండేళ్ల క్రితం క్రూడ్‌ ఆయిల్‌ ధరలు భారీగా తగ్గినప్పడు.. ధరలను తగ్గించకుండా ప్రభుత్వాలు సొమ్ముచేసుకున్నాయి. గతేడాది నుండి రోజువారీ ధరల సవరణ విధానాన్ని తీసుకొచ్చారు. అప్పటి నుండి పది పన్నెండు పైసలు పెంచడం, నాలుగైదు పైసలు తగ్గించడం చేస్తూ.. మొత్తంగా పెట్రోల్, డీజిల్‌ల ధరలు బాగా పెంచేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ డ్యూటీ కింద ఒక్కో లీటర్‌ పెట్రోల్‌పై ఇరవై ఒక్క రూపాయల నలభై ఎనిమిదిపైసలు.. డీజిల్‌పై పదిహేడు రూపాయల ముప్పైమూడు పైసలు వసూలు చేస్తోంది. ఈ పన్ను తర్వాతి మొత్తం ధరపై రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ పన్ను మోత మోగిస్తున్నాయి. మొత్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు కలిపి పెట్రోల్‌పై 57 శాతం, డీజిల్‌పై 44 శాతం భారం పడుతున్నట్లు తెలుస్తోంది.

పెట్రోల్‌ ఉత్పత్తుల అమ్మకాలపై వ్యాట్, అదనపు సుంకాల విధింపులో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే రెండో స్థానంలో ఉన్నాయి. మహారాష్ట్ర పెట్రోల్‌పై 26 శాతం వ్యాట్‌తో పాటు ప్రతి లీటర్‌పై రూ.9 చొప్పున అదనపు సుంకం వసూలు చేస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌పై 31 శాతం వ్యాట్‌కు తోడు ప్రతి లీటర్‌పై రూ.4 అదనపు సుంకం వసూలు చేస్తున్నారు. దీంతో పన్ను 38.82 శాతానికి చేరింది. డీజిల్‌పై 22.25 శాతం పన్ను, ప్రతి లీటర్‌పై రూ.4 సుంకంతో పన్నుశాతం 30.71కి చేరింది. తెలంగాణలో పెట్రోల్‌పై 35.20 శాతం, డీజిల్‌పై 27 శాతం పన్ను వసూలు చేస్తున్నారు. ఢిల్లీలో పెట్రోల్‌పై పన్ను 27 శాతం ఉండగా.. గోవాలో అతి తక్కువగా 17 శాతం మాత్రమే ఉన్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు.. చమురు ఉత్పత్తి దేశాలు క్రూడాయిల్‌ ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయం తీసుకోవడం నేపథ్యంలో.. ధరలు ఎగసిపడుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఇండియన్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర రూ.4,085గా ఉంది. ప్రస్తుతమున్న ధరల్లో దాదాపు సగం మాత్రమే అసలు ధరలుగా ఉండగా.. మిగతాదంతా పన్నుల భారమే.
దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చినా.. పెట్రోలియం ఉత్పత్తులను మాత్రం అందులో చేర్చలేదు. పెట్రోల్‌ ఉత్పత్తులతో భారీగా ఆదాయం వస్తుండడంతో జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంపై రాష్ట్రాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. అదే జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను తీసుకువస్తే ద్వంద్వ పన్నుల భారం తగ్గి ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. 

13:35 - June 12, 2017

పెట్రోల్..డీజిల్ వాహనం ఏదైనా ఉందా ? అయితే ఈ వార్త మీ కోసమే. వాహనంలో ముందుగానే పెట్రోల్..డీజిల్ ఉందా అని చెక్ చేసుకోండి. 16వ తేదీలోపుగానే ఫుల్ గా పెట్రోల్..డీజిల్ పోయించుకోండి. లేకపోతే ఆ రోజు అనంతరం బంకుల్లు బంద్ కానున్నాయి. పెట్రోల్..డీజిల్ ధరలను రోజువారీగా సవరించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెట్రోల్ బంక్ యజమానులు ఆందోనలకు సిద్ధమౌతున్నాయి. అందులో భాగంగా జూన్ 16వ తేదీ నుండి చమురు సంస్థల నుండి పెట్రోల్..డీజిల్ లను కొనకూడదని నిర్ణయం తీసుకున్నాయి. ఒకవేళ అదే జరిగితే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. జూన్ 16వ తేదీ నుండి దేశ వ్యాప్తంగా పెట్రోల్..డీజిల్ ధరలను రోజు వారీగా సవరిస్తామని పెట్రోలియం సంస్థలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పెట్రోల్ బంకుల యజమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్త అమలుపై పునరాలోచించాలని సూచిస్తున్నారు. మరి ఎలా జరుగుతుందో వేచి చూడాలి.

10:00 - May 2, 2017

ఢిల్లీ : సబ్సిడీ గ్యాస్..కిరోసిన్ ధరలు మళ్లీ పెరిగాయి. సబ్సిడీ ఎత్తివేసే క్రమంలో భాగంగా ధరలు పెంచుతున్నట్లు తెలుస్తోంది. సబ్సిడీ వంట గ్యాస్‌ ధర సిలిండర్‌కు రెండు రూపాయల చొప్పున...కిరోసిన్‌ లీటర్‌కు 26 పైసలు పెంచారు. చమురు సంస్థలు చివరి సారిగా ఏప్రిల్‌ 1న సబ్సిడీ గ్యాస్‌ ధరను సిలిండర్‌కు రూ 5.57పైసలు పెంచిన సంగతి తెలిసిందే. ప్రతినెలా చిన్న మొత్తంలో గ్యాస్‌ ధరలను పెంచుతూ వస్తున్నాయి. ప్రతినెలా గ్యాస్‌ ధరను రూ 2 మేర పెంచుతున్నారు. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొంతకాలం పెంపును పక్కనపెట్టిన చమురు మార్కెటింగ్‌ సంస్థలు తిరిగి ధరల పెంపును చేపట్టాయి.

11:19 - April 26, 2017

సాయంత్రం పెట్రోల్ అందుబాటులో ఉండదా ? అయితే ఎలా ? అని ఆలోచిస్తున్నారా ? ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఉదయం 6 నుండి సాయంత్రం వరకు పెట్రోల్ బంక్ లు పనిచేయనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇదంతా పక్క రాష్ట్రమైన ఏపీలో అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. మే మూడో వారం నుండి రాష్ట్రంలో పరిమిత గంటల్లో మాత్రమే పెట్రోల్ బంక్ లు పనిచేయనున్నాయని, మే 15వ తేదీ నుండి ఉదయం 6 నుండి సాయంత్రం 6గంటల వరకు మాత్రమే పనిచేస్తాయని ఫెడరేషన్ ప్రెసిడెంట్ రావి గోపాల కృష్ణ పేర్కొనట్లు తెలుస్తోంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ డీలర్లు కమిషన్లు పెంచకపోతుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నిర్వాహణ వ్యయం తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్.

21:30 - February 5, 2017

Pages

Don't Miss

Subscribe to RSS - చమురు