చట్టాలు

16:50 - August 15, 2018

మహిళలకు సంబంధించి ఎన్ని చట్టాలున్నాయి ? మహిళలకు సంబంధించి అనేక చట్టాలున్నాయి. మహిళలకు ఉన్న చట్టాలను పలు రకాలుగా వర్గీకరించారు. ఇదే అంశంపై నిర్వహించిన మానవి మైరైట్ కార్యక్రమంలో లాయర్ పార్వతి పాల్గొని, మాట్లాడారు. ఆ వివరాలను ఆమె మాటల్లోనే..
నాటి కాలం నుంచి మన సమాజంలో అనేక సాంఘీక దురాచారాలు ఉన్నాయి. సతీసహాగమనం, కన్యాశుల్కం, వరకట్నం వంటి సాంఘీక దురాచారాలు ఉన్నాయి. మహిళలకు అనేక చట్టాలు ఉన్నాయి. సాంఘీక దురాచారాల నుంచి మహిళలను కాపాడేందుకు, మహిళ రక్షణ... భద్రత కోసం చట్టాలు ఉన్నాయి. మొదటగా 1929 లో బాల్య వివాహ నిరోధక చట్టం వచ్చింది. 1937 లో హిందూ మహిళలకు ఆస్తి హక్కు చట్టం వచ్చింది. 1956 లో సవరణలతో కూడిన మహిళలకు ఆస్తి హక్కు చట్టం వచ్చింది. 1961లో వరకట్నం నిషేధ చట్టం వచ్చింది. 2006 లో సవరణలతో కూడిన బాల్య వివాహాల చట్టం వచ్చింది. మహిళలపై అత్యాచారాలు...లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయి. అత్యాచారాలు, లైంగిక వేధింపుల నిరోధానికి నిర్భయ చట్టం వచ్చింది. ఆమె తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

14:51 - May 23, 2018

భారత రాజ్యాంగా జీవించే హక్కును అందరికి ఇచ్చింది. దీంట్లో ఎవ్వరికి మినహాయింపు లేదు. పిల్లలను కని,పెంచి, పెద్ద చేసి, విద్యాబుద్ధులు చెప్పించి, వారి భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడిన తల్లిదండ్రులను, వృద్దులను బాధ్యతగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిది.  జీవితంలో ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని జీవితపు మలిసంధ్యలో వారు కోరుకునేవి ప్రేమ,ఆత్మీయత. అంతే వారు ఇంకేమీ ఆశించరు. కానీ ఆస్తుల కోసం, వారి బాధ్యత తీసుకోవాల్సి వస్తుందనే దురాచనతో వారిని నిరాశ్రయులను చేస్తున్న సందర్బాలు ఎన్నో, ఎన్నెన్నో. కానీ వారికి కూడా హక్కులున్నాయి. చట్టాలున్నాయి. వృద్ధులు వారికి ఉండే హక్కులు ఏమిటో ఈరోజు మైరైట్ లో తెలుసుకుందాం. తల్లిదండ్రుల పోషణను విస్మరిస్తే వారిని శిక్షించేందుకు చట్టాలు ఉన్నాయి. వృద్ధులను పట్టించుకోకుంటే వారికి చట్టం అండగా ఉంటుంది. చట్టం పరిధిలో వారికి ఎటువంటి హక్కులుంటాయి? ఎటువంటి చట్టాలుంటాయి అనే అంశంపై ఎడ్వకేటే పార్వతిగారి సలహాలు, సూచనల కోసం చూడండి..మైరైట్..

 

 

 

వృద్ధుల్లో 50 శాతానికిపైగా వేధింపులకు గురి అవుతున్నట్టుగా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ మేరకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం వృద్ధుల కోసం పలు చట్టాలను రూపొందించింది. కుమారులు , కోడళ్లు ఇతర బంధువుల ధూషణలు , చిత్ర హింసలతో ఇబ్బంది పడేవారి కోసం జాతీయ వయోశ్రీ యోజన పేరిట నూతన పథకాన్ని ప్రవేశ పెట్టింది. వృద్ధుల్లో అధిక శాతం వైకల్యాలు , వ్యాధులతో పాటు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నవారే ఉన్నారు. మలిదశలో ఆ సరాగా నిలివాల్సిన పిల్లలు కన్న వారిని ఆశ్రమాలు ఇతర చోట్ల చేరుస్తున్న ఘటనలో కోకొల ్లలు దీంతో వృద్ధులకు ఒటరితనం శాపంగా మారింది. సామాజిక భద్రత పథకాలు వారికి అంతగా ఉపయోగపడడం లేదు. అందుకే మన దేశంలో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు సంరక్షన కోసం 2007లో కేంద్ర ప్రభుత్వం తల్లిదండ్రులు , పెద్దల పోషణ సంక్షేమ చట్టం పేరిట తెచ్చిన దీనిని అమలు చేయం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడి ఉంది. 

 

15:17 - February 26, 2018

వేధింపుకు ఒక చట్టం...ర్యాగింగ్ కు ఒక యాక్ట్..గృహ హింసకు ఒక చట్టం...అత్యాచారానికి ఒక చట్టం...మహిళలను కించపరిస్తే తాటతీసే చట్టాలున్నాయి. కానీ ఇన్ని చట్టాలున్నా మహిళలకు రక్షణ కరువైంది. ఇది లెటెస్ట్ రిపోర్టు చెబుతున్న సత్యం. మహిళలకు రోజు రోజు నేరాలు పెరిగిపోతూనే ఉన్నాయి. మరి ఈ నేరాలు చట్టాలు ఎందుకు ఆపలేకపోతున్నాయి. లోపం ఎక్కడుంది ? ఈ అంశంపై మానవి వేదికలో ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో సామాజిక కార్యకర్త దేవి విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:42 - July 12, 2017

వృద్ధులు..పిల్లలు తమ బాగోగులు చూసుకోవడం లేదని చాలా మంది వృద్ధులు వృద్ధాశ్రమాలను ఆశ్రయిస్తున్నారు. జరుగుతున్న అన్యాయాన్ని దింగమింగుకొని జీవితాన్ని ఆశ్రమాల్లో కొనసాగిస్తున్నారు. వృద్ధులు నిరాదరణకు గురైన సమయంలో కోర్టును ఆశ్రయించవచ్చా ? వీరికి ఏ విధమైన చట్టాలున్నాయనే దానిపై టెన్ టివి 'మై రైట్' కార్యక్రమం చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో ప్రముఖ లాయర్ పార్వతి పాల్గొని సూచనలు..సలహాలు ఇచ్చారు. వృద్ధులను ఇంట్లో వారు ఒక వేస్ట్ గా చూస్తున్నారని, వీరితో మనకు ఏం అవసరమని అనుకుంటున్నారని పేర్కొన్నారు.
ఉమ్మడి వ్యవస్థ క్షీణదశకు చేరుకుందని చెప్పవచ్చని, వృద్ధులు నిరాదరణకు గురవుతున్నారని తెలిపారు. విదేశాలకు వెళ్లి అమ్మనాన్నలను మరిచిపోతూ..ఆస్తుల కోసం కూడా పీడిస్తున్నారన్నారు. మనోవేదనకు భరించలేక వృద్ధులు తీవ్ర మనస్థాపానికి గురవుతూ బలవన్మరణాలకు పాల్పడుతుండడమే కాకుండా చంపేస్తున్న ఘటనలు చూస్తున్నామన్నారు. వీరికి తప్పకుండా చట్టాలున్నాయన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

13:46 - July 5, 2017

మహిళలకు సంబంధించిన ఎన్నో చట్టాలున్నాయి. పురుషులకన్నా మహిళలకు ఎందుకు ఎక్కువ చట్టాలున్నాయి ? ఈ అంశంపై టెన్ టివి మానవి ‘మై రైట్’ కార్యక్రమంలో ప్రత్యేక చర్చ చేపట్టింది. చట్టాలు ప్రత్యేకంగా వారికి..వీరికి ఉద్ధేశించినవి లేవని లాయర్ పార్వతి పేర్కొన్నారు. చట్టం ముందు అందరూ సమానులే..అని అందరికీ తెలుసని, మహిళలకు సంబంధించిన చట్టాలు రావడానికి చరిత్ర ఉందన్నారు. మహిళలంటే వివక్ష అనేది ఉందని, గతంలో అనేక సాంఘీక దురాచారాలు జరిగిన సంగతి అందరికీ తెలిసిందేనన్నారు. సాంఘీక దురాచారాల నుండి మహిళలకు రక్షణ కల్పించాలనే ఉద్ధేశ్యంతో చట్టాలు ఏర్పడడం జరిగిందన్నారు. ఇతర అంశాలు...కాలర్స్ అడిగిన పలు న్యాయ సందేహాలకు లాయర్ పార్వతి ఇచ్చిన సూచనలు..సలహాల కోసం వీడియో క్లిక్ చేయండి.

12:39 - May 24, 2017

హైదరాబాద్: ఉన్నత స్థానంలో వున్న పురుషులు మహిళలను కించపరిచే విధంగా, అగౌరపరిచే విధంగా మాట్లాడుతున్నారు. అలాంటి పురుషల పై ఏ విధమైన చట్టాలు ఉన్నాయి. ఇదే అంశం పై మానవి 'వేదిక'లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ప్రముఖ న్యాయవాది పార్వతి పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

 

16:29 - May 19, 2017

హైదరాబాద్: రైతులకు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నగదు సాయాన్ని కౌలు రైతులకు కూడా నేరుగా అందించాలని కౌలు రైతుల సంఘం డిమాండ్‌ చేసింది. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం రుణాలు అందించాలని కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలువురు డిమాండ్‌ చేశారు. కౌలు రైతుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కౌలు రైతులకు రుణాలివ్వాలని.. ఇందుకోసం బ్యాంకుల ఎదుట ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించినట్లు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్‌ తెలిపారు.

 

13:47 - January 3, 2017

అమ్మాయిల అక్రమ రవాణ...పేదరికం..నిరక్షరాస్యతతో అమ్మాయిలు మోసపోతున్నారు. ఈ ట్రాఫికింగ్ లో ఎక్కువగా చిన్నారులే బలౌతున్నారు. ఉద్యోగాల పేరిట ఇతర దేశాలకు అమ్మాయిలు ఎగుమతి అవుతున్నారు. నయవంచనకు గురై అమ్మాయిలు నరకం అనుభవిస్తున్నారు. అమ్మాయిల అక్రమ రవాణా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ అంశంపై మానవి 'వేదిక' చర్చను చేపట్టింది. ఈ చర్చలో శ్యామలాదేవీ (ఛైల్డ్ రైట్స్ యాక్టివిస్ట్), మురళీ మోహన్ (సాధన స్వచ్చంద సంస్థ) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. మరి వారు ఎలాంటి అంశాలు పేర్కొన్నారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

17:47 - August 9, 2016

హైదరాబాద్ : దట్టమైన అడవులు.....ప్రకృతి అందానికి నిలువెత్తు దృశ్యాలు... అక్కడక్కడ విసిరేసినట్టుండే గిరిజన గూడేలు....చూసేందుకు ఆహ్లాదకరంగా కనిపించినా... ఆగూడేల్లో నివసించే గిరిజనుల పరిస్థితి మాత్రం దయనీయంగానే ఉంది. దేశం ఎంత అభివృద్ధి సాధిస్తున్నా....ఎన్ని ప్రభుత్వాలు మారినా..గిరిజనులు సమాజానికి దూరంగానే ఉండాల్సి రావడం సిగ్గుచేటు. 12వ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనుల స్థితిగతులపై ప్రత్యేక కథనం.....

ఆగస్ట్‌ 9 ని ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించిన ఐక్యరాజ్యసమితి..
గిరిజనులు..ప్రకృతినే ఆధారంగా చేసుకుని బతుకుతూ ప్రత్యేక జీవన విధానాన్ని కొనసాగించే మానవ జాతి. మానవ మనుగడ వీరి నుంచే ప్రారంభమైందని..కనుకనే వీరిని ఆదివాసీలుగా పేర్కొంటారు. సమాజం ఎంత అభివృద్ధి సాధిస్తున్నా..వీరు మాత్రం ప్రకృతి ఒడిలో ఉండేందుకే ఇష్టపడుతూ..సమాజానికి దూరంగా ఉంటారు. ఫలితంగా ఎలాంటి మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వాలు ఆదుకోకపోవడంతో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి సాధించలేక సతమతమవుతూనే ఉన్నారు. గిరిజనులను అభివృద్ధి పథంలోకి తీసుకొద్దామనే ఆలోచనతో ఐక్యరాజ్యసమితి...1994 జెనీవా సమావేశంలో ప్రతి ఏడాది ఆగస్ట్ 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా జరపుకోవాలని పిలుపునిచ్చింది.

విద్య, వైద్య సదుపాయాలు అంతంతమాత్రమే..
సమాజానికి దూరంగా ఉంటూ జీవనం సాగిస్తున్న గిరిజన ప్రజల కష్టాలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విద్య, వైద్య, ఆరోగ్య పరిస్థితులు అంతంతమాత్రమే. చాలామంది చిన్నారులకు పసిప్రాయంలోనే నూరేళ్ళు నిండుతున్నాయి. చిన్నారులు, మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. గిరిజనుల సమాగ్రాభివృద్ది కోసం ప్రభుత్వం ఐటిడీఏ ఏర్పాటు చేసి నాలుగు దశాబ్దాలు గడిచినా వారి జీవన విధానంలో మార్పు కనిపిచడంలేదు.

గిరిజన చట్టాలు అమల్లోకి వచ్చినా ఫలితం శూన్యం..
గిరిజనుల జీవనవిధానాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఎన్ని చట్టాలు వచ్చినా ఫలితం మాత్రం శూన్యమే. గిరిజనుల సంక్షేమం కోసం ఎన్ని పథకాలు తీసుకొచ్చినా వారి అభివృద్ధి అంతంతమాత్రమే. ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసినా అధికారుల నిర్లక్ష్యంతో వాటి ఫలాలు గిరిజనులకు అందడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి గిరిజనుల అభివృద్ధికి కృషి చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

10:28 - June 26, 2016

మెదక్ : 'మాకు చట్టాలు తెలియదు..ఇక్కడే ఉంటం..ఇక్కడే ఛస్తం..గ్రామాన్ని..సొంత ఊర్లను వదలం..ఇక్కడ మంచిగ పంటలు పండుతాయి..దీనిని వదిలి ఎక్కడకు పోవాలె..మాకు పరిహారం వద్దు..ఏమొద్దు'..అంటూ మల్లన్న సాగర్ నిర్వాసితులు పేర్కొంటున్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై నిర్వాసితులు ఇంకా ఆగ్రహంగానే ఉన్నారు. తమకు చట్టాలు..జీవోలు తెలియవని..ఇక్కడే ఉంటమని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. మల్లన్న సాగర్ నిర్వాసితులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. 2013 భూ సేకరణ చట్టం లేదా 123 జీవో ప్రకారం పరిహారం చెల్లిస్తామని, ఇందులో ఏది కావాలో నిర్వాసితులు నిర్ణయించుకోవాలని సీఎం కేసీఆర్ శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై నిర్వాసితులు ఏమి అనుకుంటున్నారనో తెలుసుకొనేందుకు టెన్ టివి ప్రయత్నించింది. అందులో భాగంగా పల్లె పాడు గ్రామంలో టెన్ టివి పర్యటించింది. అక్కడున్న గ్రామస్తులతో మాట్లాడింది. 123 జీవో, 2013 చట్టాలు తమకు తెలియని, ఊర్లను వదిలిపెట్టమన్నారు. చుట్టుపక్కల చెరువులున్నాయని, బహుళ పంటలు పండుతాయని తెలిపారు. సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో ప్రాజెక్టు కట్టుకోవాలని తాము సూచించడం జరుగుతోందన్నారు. సమీక్షా సమావేశం జరిపించాలని కోరుతున్నారు. ఈ పల్లెపాడు గ్రామస్తుల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకుంటుందా ? లేక మొండిగా ముందుకెళుతుందా వేచి చూడాలి.

Pages

Don't Miss

Subscribe to RSS - చట్టాలు