గోదావరి పుష్కరాలు

18:49 - April 20, 2017

తూ.గో : ఆంధ్రప్రదేశ్‌లో 2015 గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట కేసు చివరి దశకు చేరింది. ఈ కేసు విచారణ కోసం నియమించిన.. జ‌స్టిస్ సోమ‌యాజులు కమిషన్‌ పలు మార్లు రాజ‌మండ్రిలో పర్యటించింది. 19 నెలలుగా సుదీర్ఘ విచారణ జరిపి..ప‌లువురి వాద‌న‌లు రికార్డ్ చేసింది. ప్రభుత్వ ప్రతినిధుల నుంచి ఆధారాలు సేక‌రించింది. కమిషన్‌ సేకరించిన ఆధారాల్లో అనేక దోషాలున్నాయ‌ని...ఈ కేసులో బాధితుల తరపు లాయరు ముప్పాళ్ల సుబ్బారావు ఆరోపిస్తున్నారు.

ఆధారాల్లో తప్పులున్నాయంటున్న బాధితుల తరపు లాయర్‌ ....

చంద్రబాబు సర్కార్ త‌న తప్పును కప్పిపుచ్చుకోవ‌డానికి ప్రయత్నిస్తోందని విప‌క్ష నేతలు విరుచుకుపడుతున్నారు. కేసులో సాక్ష్యాధారాల‌ను మాయం చేశారని ఆరోపిస్తున్న సీపీఎం నేత‌లు...విషయాన్ని క‌మిష‌న్ దృష్టికి తీసుకెళ్లారు. సీపీ కెమెరా ఫుటేజ్ లేద‌ని చెప్పడం విడ్డూరంగా ఉందంటున్నారు.

సాక్ష్యాధారాలను మాయం చేశారంటున్న సీపీఎం నేతలు. అటు బాధితులు కూడా నష్టపరిహారం చెల్లింపు విష‌యంలో న్యాయం జరగలేదని ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు. త‌మ కుటుంబాల‌ను ఆదుకోవాలని కోరుతున్నారు.

చంద్రబాబు సర్కార్‌ నిర్లక్ష్యమే కారణమన్న విమర్శలు...

గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటకు చంద్రబాబు సర్కార్‌ నిర్లక్ష్యమే కారణమన్న విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. 2015 గోదావరి పుష్కరాల్లో తొక్కిస‌లాట‌లో 28 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. సీఎం చంద్రబాబు కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి పుష్కర స్నానం చేసిన స‌మ‌యంలో..భ‌క్తుల‌ను అనుమ‌తించ‌క‌పోవ‌డం..గంట‌ల త‌ర‌బ‌డి క్యూ లైన్‌లో నిలుచుకున్న భ‌క్తులు ఒక్కసారిగా దూసుకురావ‌డం వల్లే తొక్కిస‌లాట జరిగిందని పలువురు ఆరోపించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఈ వాద‌న‌ను తోసిపుచ్చింది. పుష్కర ఘాట్లలో భ‌క్తుల కోసం స‌క‌ల ఏర్పాట్లు చేశామ‌ని...స‌మ‌న్వయలోపంతోనే తొక్కిసలాట జ‌రిగింద‌ని చెబుతోంది. ఏదీఏమైనా నిజాల నిగ్గు తేల్చేందుకు నియమించిన జస్టిస్‌ సోమయాజులు కమీషన్‌ ఎలాంటి నివేదిక ఇస్తుందనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. 

09:32 - April 20, 2017

గుంటూరు : గోదావరి పుష్కరాల తొక్కిసలాట కేసు ద‌ర్యాప్తు ముగింపు ద‌శ‌కు చేరింది. ఈ ఘటనకు బాధ్యులెవ‌రన్న దానిపై 19 నెల‌లుగా సుదీర్ఘ విచార‌ణ సాగింది. విచారణలో భాగంగా.. వివిధ వ‌ర్గాల నుంచి అభిప్రాయాల‌ను సేక‌రించారు. జ‌స్టిస్ సోమ‌యాజులు నేతృత్వంలోని క‌మిష‌న్ పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు, బాధితుల వాద‌నలు విన్నది. ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో 2015 గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట కేసు చివరి దశకు చేరింది. ఈ కేసు విచారణ కోసం నియమించిన.. జ‌స్టిస్ సోమ‌యాజులు కమిషన్‌ పలు మార్లు రాజ‌మండ్రిలో పర్యటించింది. 19 నెలలుగా సుదీర్ఘ విచారణ జరిపి..ప‌లువురి వాద‌న‌లు రికార్డ్ చేసింది. ప్రభుత్వ ప్రతినిధుల నుంచి ఆధారాలు సేక‌రించింది.

ఆధారాల్లో అనేక దోషాలు....
కమిషన్‌ సేకరించిన ఆధారాల్లో అనేక దోషాలున్నాయ‌ని...ఈ కేసులో బాధితుల తరపు లాయరు ముప్పాళ్ల సుబ్బారావు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు సర్కార్ త‌న తప్పును కప్పిపుచ్చుకోవ‌డానికి ప్రయత్నిస్తోందని విప‌క్ష నేతలు విరుచుకుపడుతున్నారు. కేసులో సాక్ష్యాధారాల‌ను మాయం చేశారని ఆరోపిస్తున్న సీపీఎం నేత‌లు...విషయాన్ని క‌మిష‌న్ దృష్టికి తీసుకెళ్లారు. సీపీ కెమెరా ఫుటేజ్ లేద‌ని చెప్పడం విడ్డూరంగా ఉంద‌ంటున్నారు.

నష్టపరిహారం చెల్లింపు విష‌యంలో
అటు బాధితులు కూడా నష్టపరిహారం చెల్లింపు విష‌యంలో న్యాయం జరగలేదని ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు. త‌మ కుటుంబాల‌ను ఆదుకోవాలని కోరుతున్నారు. గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటకు చంద్రబాబు సర్కార్‌ నిర్లక్ష్యమే కారణమన్న విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. 2015 గోదావరి పుష్కరాల్లో తొక్కిస‌లాట‌లో 28 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. సీఎం చంద్రబాబు కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి పుష్కర స్నానం చేసిన స‌మ‌యంలో..భ‌క్తుల‌ను అనుమ‌తించ‌క‌పోవ‌డం..గంట‌ల త‌ర‌బ‌డి క్యూ లైన్‌లో నిలుచుకున్న భ‌క్తులు ఒక్కసారిగా దూసుకురావ‌డం వల్లే తొక్కిస‌లాట జరిగిందని పలువురు ఆరోపించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఈ వాద‌న‌ను తోసిపుచ్చింది. పుష్కర ఘాట్లలో భ‌క్తుల కోసం స‌క‌ల ఏర్పాట్లు చేశామ‌ని...స‌మ‌న్వయలోపంతోనే తొక్కిసలాట జ‌రిగింద‌ని చెబుతోంది. ఏదీఏమైనా నిజాల నిగ్గు తేల్చేందుకు నియమించిన జస్టిస్‌ సోమయాజులు కమీషన్‌ ఎలాంటి నివేదిక ఇస్తుందనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.

11:33 - March 27, 2017

అమరావతి: గోదావరి పుష్కరాల్లో 27మంది మృతి ఘటనపై ఏపీ అసెంబ్లీలో హాట్‌ హాట్‌ చర్చ నడిచింది.. ఈ దుర్ఘటనపై ఇంకా ఎన్నిరోజులు విచారణ కొనసాగుతుందని... వైసీపీ సభ్యుడు చిర్ల జగ్గిరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.. దీనిపై స్పందించిన మంత్రి యనమల... విచారణ తర్వాత రిపోర్ట్‌ రాగానే తగు చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చారు..

16:27 - March 21, 2016

తూ.గో :గోదావరి పుష్కరాల తొక్కిసలాట ఘటనపై విచారణ మరోసారి వాయిదా పడింది. ఇవాళ సోమయాజులు కమిషన్.. బాధితులు, అఫిడవిట్లు దాఖలు చేసిన వారితో సమావేశమైంది. అయితే వాదనలు వినిపించడానికి రెండు వారాల గడువు కావాలని ప్రభుత్వం తరుపున న్యాయవాది అభ్యర్ధించడంతో విచారణ అర్థాంతరంగా ముగిసింది. కమిషన్ 6 నెలల గడువు ఈ నెల 29తో ముగియనుంది. ఇప్పడు మళ్లీ గడువు పెంచడంతో నివేదిక ఆలస్యం అవుతుందని సీపీఎం, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రజాసంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

20:10 - August 31, 2015

హైదరాబాద్ : ఆరోపణలు, ప్రత్యారోపణలు... సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ అట్టుడికింది. ప్రత్యేక హోదా, పుష్కర వివాదంపై... టీడీపీ, వైసీపీ మధ్య సభా సమరమే జరిగింది. మాటల తూటాలతో వైసీపీ అస్త్రాలు సంధిస్తే... అధికార పక్షం సైతం ధీటుగా సమాధానం చెప్పింది.

. తొలిరోజే వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు....

తొలిరోజే వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు హీటెక్కించాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రత్యేక హోదా, పుష్కర విషాదంపై ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. సభ ప్రారంభం కాగానే ప్రత్యేక హోదాపై తీర్మానం చేయాలంటూ వైసీపీ పట్టుబట్టింది. స్పీకర్ వాయిదా తీర్మానం తిరస్కరించడంతో సభలో గందరగోళం నెలకొంది. కేంద్ర ప్రభుత్వం నుంచి టిడిపి వైదొలగాలని... ప్రతిపక్ష నేత జగన్‌ డిమాండ్ చేశారు. టీడీపీ మంత్రులు కేంద్రం నుంచి బయటకు వస్తేనే... రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందన్నారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నామని ఏపీ సీఎం చెప్పుకొచ్చారు. రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వంపై అనవరసరంగా వైసీపీ ఆరోపణలు చేస్తోందన్నారు.

అనంతరం గోదావరి పుష్కరాలపై సభలో దుమారం.....

అనంతరం గోదావరి పుష్కరాలపై సభలో దుమారం రేగింది. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా... అపశృతి చోటుచేసుకుందని చంద్రబాబు ప్రకటించారు. పుష్కరాల మృతులకు ఏపీ సీఎం సంతాపం ప్రకటించారు. పుష్కరాల మృతులపై బాబు చేసిన ప్రసంగంపై జగన్‌ మండిపడ్డారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. బాబు పబ్లిసిటీ కోసం చేసిన నిర్వాహకం వల్ల 29 మంది చనిపోయారని ఆయన ఆరోపించారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. జగన్‌ ప్రసంగంపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ప్రతిపక్ష సభ్యులు సైతం హల్‌చల్....

అటు ప్రతిపక్ష సభ్యులు సైతం హల్‌చల్ చేశారు. స్పీకర్‌ వారించినా ఎవరూ వినిపించుకోలేదు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ కాసేపు సభను వాయిదా వేశారు. అనంతరం ప్రత్యేక హోదాపై మృతులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు చంద్రబాబు.. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారని ఆరోపించారు. లోక్‌సభలో కాంగ్రెస్‌పై అవిశ్వాసం పెట్టి ఎందుకు వెనక్కి తీసుకున్నారో..? చెప్పాలని వైసీపీని డిమాండ్ చేశారు.. దీనిపై వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. అసెంబ్లీలో వైసీపీ ఆందోళనపై సీరియస్‌గా స్పందించారు మంత్రి యనమల. ప్రతిపక్షానికి సభ సజావుగా సాగడం ఇష్టంలేదని ఆరోపించారు. స్పీకర్ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వైసీపీ సభ్యులు శాంతించలేదు.. స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు.. దీంతో సభను మంగళవారానికి వాయిదావేశారు స్పీకర్.

17:38 - August 31, 2015

హైదరాబాద్ : జగన్‌ గీత దాటనంతవరకు ఉపేక్షిస్తాం.. గీత దాటితే సహించేది లేదని బాబు హెచ్చరించారు. పుష్కరాల్లో తొలిరోజు జరిగిన ఘటన పొరబాటే కాని.. తప్పిదం కాదని ఆయన చెప్పుకొచ్చారు. తగిన సూచనలు చేయకుండా శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మీడియాతో బాబు చిట్‌ చాట్‌ చేస్తూ ఆ రోజు కంచిపీఠాధిపతులు వీఐపీ ఘాట్‌లో చేయడం వల్లే.. తాను పక్క ఘాట్‌కెళ్లానని.. బాబు వివరణ ఇచ్చారు.

 

13:42 - July 25, 2015

రాజమండ్రి: రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన రాజరాజనరేంద్రుడికి సీఎం చంద్రబాబు ఘనమైన నివాళులర్పించారు. రాజరాజనరేంద్రుడు 40 ఏళ్లు సుపరిపాలన అందించారని చంద్రబాబు ఆయనను కీర్తించారు. ఆయన పాలనలో ప్రజలందరూ సుఖంగా గడిపారన్నారు. రాజరాజనరేంద్రుడి కాలం చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయిందని చంద్రబాబు అన్నారు. ప్రస్తుత పాలకులకు రాజరాజ నరేంద్రుడు మార్గదర్శి అని పొగిడారు. దేశానికి మంచి పనులు చేసిన వారిని గుర్తుంచుకొని.. భావి తరాలకు తెలియజేయాల్సిన అవసరముందన్నారు. 

10:38 - July 25, 2015

రాజమండ్రి: గోదావరి మహా పుష్కరాలు నేటితో ముగియనుండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పుష్కరాల ముగింపునకు టీటీడీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామికి చక్రస్నానం కార్యక్రమం చేపడుతున్నారు. సాయంత్రం గోదావరి హారతి కార్యక్రమంతో పుష్కరాలు ముగుస్తాయి. 

10:36 - July 25, 2015

హైదరాబాద్:గోదావరి పుష్కరాల ముగింపును... కనీవినీ ఎరుగని రీతిలో కన్నుల పండువగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పుష్కరాల మొదటి రోజు నుంచే.. హంగు ఆర్భాటాలకు ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం... ముగింపు వేడుల బాధ్యతను డైరెక్టర్‌ బోయపాటికి ఇచ్చింది. ఖర్చుకు కూడా ప్రభుత్వం వెనుకాడకపోవడంతో... భారీతనం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఓ తరం పాటు చెప్పుకునే విధంగా...
గోదావరి పుష్కరాల ముగింపు ఉత్సవాన్ని ఓ తరం పాటు చెప్పుకునే విధంగా ఏర్పాట్లు చేస్తోంది ఏపీ సర్కార్‌. ఇప్పటికే దేశంలోని ప్రముఖులందరికీ.. ఆహ్వానాలు అందించిన చంద్రబాబు సర్కార్‌... చివరిగా చేయాల్సిన వైభవం గురించి లెక్కకు మించి ఖర్చు పెడుతోంది. ఇక ఈ ముగింపు కార్యక్రమాన్ని.. ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనుకు అప్పజెప్పింది టీడీపీ ప్రభుత్వం. లెక్క ఎక్కువైనా పర్వాలేదు.. ఉత్సవం మాత్రం అంగరంగ వైభవంగా జరగాలన్నదే సర్కార్‌ టార్గెట్‌.

గోదావరి తీరం, ఆర్ట్స్‌ కాలేజ్‌లో వేడుకలు....
దీంతో గోదావరి తీరం, ఆర్ట్స్‌ కాలేజ్‌లలో జరిగే ముగింపువేడుకలను బోయపాటి శ్రీను పరిశీలించారు. సభావేదికల రూపకల్పన, కార్యక్రమాల డిజైన్‌ అంతా దగ్గరుండిమరీ చూసుకుంటున్నారు. ఇప్పటికే ఎక్కడెక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే దానిపై... రాష్ట్ర డీజీపీ, ఇతర అధికారులతో సమాలోచనలు జరిపారు బోయపాటి. ఈనెల 25 రాత్రి జరిగే నిత్యహారతి నభూతో నభవిష్యతి అనే రీతిలో నిర్వహించాలని సీఎం ఆదేశారు జారీ చేశారు.

ఖర్చుకు వెనకాడొద్దన్న సీఎం చంద్రబాబు.....
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్లు... సీఎం ఖర్చుకు వెనకాడొద్దని ఆదేశించిందే తడవుగా... ఇరు వంతెనలపై భారీ ఫోకస్‌లైట్లను ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఆ వెలుగులతో నదీ జలాలు సప్తవర్ణ శోభితంగా కన్పించేలా తీర్చిదిద్దుతున్నారు. అంతేకాకుండా హారతి సమయంలో.. కృత్రిమపొగ పంట్ల చుట్టూ వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హారతి సమయంలో... భక్తులు తన్మయం పొందేలా.. శ్రావ్యమైన సంగీతం వినిపించేలా స్టీరియో ఫోనిక్‌ సౌండ్‌సిస్టమ్‌ను సిద్ధం చేస్తున్నారు.

సినీ సెట్టింగ్‌లతో వేదికల ఏర్పాటు.....
ఆర్ట్స్‌ కాలేజ్‌లో భారీ తనం ఉట్టిపడేలా.. సినిమా సెట్టింగ్‌లతో వేదికలను సిద్ధం చేస్తున్నారు. వీటిల్లో సినీకళాకారుల సందడి, సంగీత విభావరి, పలు నృత్యప్రదర్శనలు వంటివి ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా వెయ్యిమంది కూచిపూడి నృత్య కళాకారులు ఒకేసారి నృత్యప్రదర్శన ఇచ్చేలా వేదికను, సౌండ్‌ సిస్టమ్‌ను తీర్చిదిద్దేపనిలో పడ్డారు బోయపాటి. ఇదంతా ఇలావున్నా.. మొదటి దుర్ఘటనకు బోయపాటి డాక్యుమెంటరీయే కారణమని విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ముగింపు ఉత్సవాలను కూడా బోయపాటికే ఇవ్వడంపై పలు విమర్శలు వస్తున్నాయి.

15:45 - July 23, 2015

హైదరాబాద్:పుష్కరాల సందర్భంగా భక్తులకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు మంత్రి కామినేని శ్రీనివాసరావు. 4 వందల టీములతో వైద్య విభాగాన్ని అలర్ట్‌ చేశామని తెలిపారు.

Pages

Don't Miss

Subscribe to RSS - గోదావరి పుష్కరాలు