గృహనిర్బంధం

14:36 - September 12, 2018

న్యూఢిల్లీ: వరవరరావు సహా ఇతర నలుగురు మానవ హక్కుల నేతలకు గృహనిర్బంధాన్ని వచ్చే సోమవారం (సెప్టెంబరు 17) వరకు కొనసాగించేందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది.  ఐదుగురు మానవ హక్కుల నేతల విడుదల కోసం దాఖలైన పిటీషన్ ను విచారించిన కోర్టు వారి గృహనిర్బంధాన్ని పొడిగించాలని ఆదేశాలు జారీచేసింది.

చరిత్రకారుడు రోమిల థాపర్ హక్కుల నేతలు ఐదుగురిని విడుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తెలుగ రచయిత వరవరరావు, హక్కుల నేతలు వెర్నాన్, అరుణ్ ఫెర్రీరా, లాయర్ సుధా భరధ్వాజ్, పౌరహక్కుల కార్యకర్త గౌతం నవలఖాలను మహారాష్ట్ర పోలీసులు గత నెలలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.   

16:37 - December 21, 2017

రాజన్న సిరిసిల్ల : జిల్లాలో దారుణం జరిగింది. వడ్డీ వ్యాపారి దారుణానికి పాల్పడ్డాడు. అప్పు తీర్చాలంటూ మూడు రోజులుగా మహిళలను గృహనిర్బంధం చేశాడు. బట్టల దుకాణం కోసం కృష్ణహరి అనే వ్యక్తి వడ్డీ వ్యాపారి ఆంజనేయులు వద్ద రూ.2 లక్షలు అప్పు తీసుకున్నాడు. వస్త్ర వ్యాపారంలో నష్టం రావడంతో కృష్ణహరి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. దీంతో అప్పు తీర్చాలంటూ కృష్ణహరి భార్య, తల్లిని వడ్డీవ్యాపారి వేధిస్తున్నాడు. అప్పు తీర్చాలని ఆ ఇద్దరు మహిళలను ఇంట్లో వేసి మూడు రోజులుగా గృహనిర్బంధం చేశాడు. వడ్డీవ్యాపారి ఆంజనేయులు వేధింపుల నుంచి కాపాడాలని బాధితులు వేడుకుంటున్నారు. మహిళలని కూడా చూడకుండా ఇంటికి తాళం వేసి వెళ్తున్నాడని వాపోయారు. 

 

21:54 - August 1, 2017

పాకిస్తాన్ : ముంబై ఉగ్ర దాడుల మాస్టర్‌ మైండ్ హఫీజ్‌ సయీద్‌ గృహ నిర్బంధాన్ని పొడిగించారు. హఫీజ్‌ సయీద్‌కు మరో 2 నెలల పాటు గృహ నిర్బంధం పొడిగిస్తూ పాకిస్తాన్‌ లోని పంజాబ్‌ హోంశాఖ నిర్ణయించింది. జమాత్‌ ఉద్‌ దవా ఉగ్రవాద సంస్థ చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ జనవరి 31 నుంచి గృహ నిర్బంధంలో ఉన్నారు. హఫీజ్‌కు చెందిన మరో నలుగురు సహచరులను ఉగ్రవాద నిరోధక చట్టం కింద పంజాబ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

12:34 - July 27, 2017

తూర్పుగోదావరి : కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభంను మళ్లీ గృహనిర్బంధం చేయడంతో కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీన్ని నిరసిస్తూ ముద్రగడ అనుచరులు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. దీనిపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

11:07 - July 27, 2017

తూర్పుగోదావరి : జిల్లాలోని కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు బయల్దేరారు. కానీ ఇంటి గేటు వద్దే పోలీసులు ముద్రగడను అడ్డుకున్నారు. పోలీసులతో ముద్రగడ అనుచరులు వాగ్వాదానికి దిగారు. ముద్రగడ గృహ నిర్బంధాన్ని పోలీసులు పొడిగించారు. ఆగస్టు 2 వరకు ముద్రగడ గృహ నిర్బంధంలోనే ఉంటారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 151 కింద ఎస్పీ విశాల్‌ గున్నీ నోటీసులు అందించారు. అనుమతి లేని పాదయాత్రను జరగనివ్వమని విశాల్‌ గున్ని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss

Subscribe to RSS - గృహనిర్బంధం