కోహ్లీ

11:24 - October 21, 2018

ఢిల్లీ : వెస్టిండీస్‌తో టెస్ట్‌ సిరీస్‌ను అలవోకగా కైవసం  చేసుకున్న భారత్‌.. నేటినుంచి వన్డే పోరుకు సిద్దమైంది.  ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈరోజు తొలి వన్డే గౌహతిలో  మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానుంది.  మిడిలార్డర్‌పై భారత్‌ ప్రధానంగా దృష్టి  పెట్టింది. ఇప్పటికే  టెస్టుల్లో తనదైన ముద్ర వేసిన యువ వికెట్‌ కీపర్‌ రిషబ్‌  పంత్‌ వన్డే ఆరంగేట్రానికి సిద్దమయ్యాడు. తుది జట్టులో చోటు  సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు భారత్‌-వెస్టిండీస్‌లు  121 సార్లు తలపడగా.. 56 మ్యాచ్‌ల్లో భారత్‌, 61 మ్యాచ్‌లు  విండీస్‌ సొంతమయ్యాయి. ఒక వన్డే టై కాగా.. మూడు  మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. 

 

 

09:56 - October 14, 2018

హైదరాబాద్ : భారీ ఆధిక్యంపై టీం ఇండియా దృష్టి పెట్టింది. ఆట మొదట్లోనే వికెట్లు తీయడం.. ఆ తర్వాత స్కోర్ పెంచడంతో రెండో టెస్టులో కూడా వెస్టిండిస్‌ను శాసించే పరిస్థితి సృష్టించుకుంది టీం ఇండియా. క్రీజులో రహానే, రిషభ్‌ పంత్‌ నిలదొక్కుకొని సెంచరీల దిశగా సాగుతుండటం... వీరి తర్వాత వచ్చే జడేజా సహా లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌లో కూడా మరిన్ని పరుగులు జోడించే సత్తా ఉండటంతో భారత్‌కు భారీ ఆధిక్యం దక్కే అవకాశముంది. మూడో రోజు ఆట విండీస్‌, భారత్‌లకు కీలకం కానుంది.
వెస్టిండీస్‌ తొలిరోజు ఆకట్టుకుంది కానీ... రెండో రోజు తేలిగ్గానే ఆలౌటైంది. టీం ఇండియా రెండో సెషన్‌ మినహా రెండో రోజంతా ప్రతాపం చూపింది. శనివారం ఉదయం ఉమేశ్‌ యాదవ్‌ మిగతా మూడు వికెట్లను పడేయడంతో వెస్టిండీస్‌ ఆట ముగిసింది. ఇండియా పృథీ షా 53 బాల్ లలో 70 రన్ లు చేయగా 11 ఫోర్లు, 1 సిక్స్‌ షో తో మొదలైంది. 
ఓవర్‌నైట్‌ 295 పరుగులు7వికేట్లతో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన విండీస్‌ మిగిలిన 3 వికెట్లను  త్వరగానే కోల్పోయింది. జట్టు స్కోరు 300 దాటిన కాసేపటికే ఆలౌటైంది. 296 పరుగుల వద్ద బిషూ పెవిలియన్‌ చేరగా, శతక వేటలో నిలిచిన ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మన్‌ ఛేజ్‌  సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం ఛేజ్, గాబ్రియెల్‌ (0) వరుస బంతుల్లో ఔట్‌ కావడంతో 101.4 ఓవర్లలో 311 పరుగుల వద్ద విండీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఈ మూడు వికెట్లను ఉమేశ్‌ యాదవే పడగొట్టాడు.  స్పిన్నర్లు శాసించే భారత గడ్డపై 1999 తర్వాత 6 వికెట్లు తీసిన తొలి పేసర్‌గా ఉమేష్ నిలిచాడు.   
టీనేజ్‌ ఓపెనింగ్‌ సంచలనం పృథ్వీ షా 39 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌ సహాయంతో తన అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఉరిమే ఉత్సాహంతో మొదలైన తొలి సెషన్‌కు రెండో సెషన్‌లో బ్రేక్‌లు పడ్డాయి. జోరుమీదున్న పృథ్వీ షా, టెస్టు స్పెషలిస్ట్‌ పుజారా, కెప్టెన్‌ కోహ్లిల వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. మొదట 98 పరుగుల వద్ద పృథ్వీ షోకు వారికెన్‌ తెరదించాడు. తర్వాత కోహ్లి క్రీజులోకి రాగా... 4 పరుగుల వ్యవధిలో పుజారా వికెట్‌ను గాబ్రి యెల్‌ పడగొట్టాడు. ఈ దశలో రహనేతో కలిసి కోహ్లి నింపాదిగా ఆడాడు. ఈ సెషన్‌లో 31 ఓవర్లు ఆడిన భారత్‌ కీలకమైన 3 వికెట్లను కోల్పోయి 93 పరుగులు చేసింది. .
సొంతగడ్డపై తడబడిన రహానే... అసలైన సమయంలో తన సత్తా చాటాడు. యువ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌తో కలిసి జట్టుకు ఉపయుక్తమైన ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. ఇద్దరు ఆచితూచి ఆడుతూ పరుగులు జోడించారు. 55వ ఓవర్లో జట్టు 200 పరుగులు చేసింది. వీరిద్దరు అజేయంగా సాగడంతో జట్టు స్కోరు 77వ ఓవర్లో 300 పరుగులు దాటింది. ఈ సెషన్‌లో 34 ఓవర్లు వేసిన వెస్టిండీస్‌ బౌలర్లు ఈ జోడీని విడగొట్టలేకపోయారు. కనీసం ఒక్క వికెట్‌నైనా చేజిక్కించుకోలేకపోయారు. ఇక చివరి సెషన్‌లో  రహానే నిదానంగా ఆడుతున్నప్పటికీ... హైదరాబాదీల జోష్‌కు ఊతమిచ్చేలా రిషభ్‌ పంత్‌ ఫోర్లతో రెచ్చిపోయాడు. మొత్తానికి నగరవాసులు శనివారం క్రికెట్‌తో వీకెండ్‌ పండగ చేసుకున్నారు. 

14:31 - October 13, 2018

హైదరాబాద్ : భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీని కొద్దిలో మిస్ అయ్యాుడు. ఉప్పల్ స్టేడియంలో వెస్టిండీస్ - భారత్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. విండీస్ తొలి ఇన్నింగ్స్ 311 పరుగుల వద్ద ముగిసింది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. భారత ఓపెనర్ రాహుల్ (4) త్వరగా అవుటయ్యాడు. మరో ఓపెనర్ పృథ్వీ షా చెలరేగాడు. కేవలం 53 బంతుల్లో 70 పరుగులు చేసి అవుటయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన పుజారా (10) ఎక్కువ సేపు నిలవలేదు. ఇతనితో జత కట్టిన కెప్టెన్ కోహ్లీ భారత్ స్కోరును పరుగెత్తించే ప్రయత్నం చేశాడు. 78 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 45 పరుగులు చేసి వెనుదిరిగాడు. దీనితో భారత్ 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. 

09:39 - October 13, 2018

హైదరాబాద్ : వెస్టిండీస్ తో జరుగుతోన్న రెండో టెస్ట్ మొదటి రోజు నువ్వా నే్నా అన్నట్లుగా సాగింది. మొదటి రెండు సెషన్లు టీమిండియా బౌలర్లు  ఆధిపత్యం సాధిస్తే..చివరి సెషన్ మాత్రం విండీస్ బ్యాట్స్ మెన్ పట్టుదల ప్రదర్శించారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి  కరీబియన్లు 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేయగలిగింది. మొదటి టెస్టులో ఓటమి అనంతరం రెండో టెస్టులో విండీస్ బ్యాట్స్ మెన్ పోరాట పటిమ కనబరిచారు. రెండు సెషన్లలోనే  రెండు వికెట్లు కోల్పోయినా..ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న  కరీబియన్స్ రెండు సెషన్లు పూర్తయ్యేసరికి  6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది.
ఆ తర్వాత మాత్రం వికెట్ మాత్రమే కోల్పోయి 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. రోస్టన్ ఛేజ్ సిసలైన టెస్ట్ ఆటతీరు  ప్రదర్శించడంతో భారీ స్కోరు సాధించగలిగింది. 174 బంతులు ఆడిన  రోస్టన్ 7 ఫోర్లు ఒక సిక్స్‌తో సెంచరీకి రెండు పరుగుల దూరంలో  నాటౌట్‌గా మిగిలాడు. రెండో వైపు దేవేంద్ర బిషూ సింగిల్ డిజిట్ స్కోరుతో రెండో రోజుకు సిధ్దమయ్యాడు. చివరి సెషన్లో వికెట్లు పడగొట్టలేకపోవడంతో విండీస్ సేఫ్ సైడ్ స్కోరుతో మొదటి రోజు ముగించగలిగింది. ఇక ఫస్ట్ టెస్ట్ ఆడుతోన్న శార్దూల్ ఠాకూరే పది  బంతులు మాత్రమే వేసి గాయంతో పెవిలియన్‌కి పరిమితమయ్యాడు. టీమిండియా బౌలర్లలో ఉమేష్ యాదవ్, కుల్దీప్ యాదవ్‌లకు చెరో మూడు వికెట్లు..రవిచంద్రన్ అశ్విన్‌కి ఒక వికెట్ దక్కింది.

07:06 - September 12, 2018

ఓవల్‌ టెస్ట్‌లో భారత్‌ ఓటమి పాలయ్యింది. భారత్‌తో జరిగిన ఐదో టెస్టులో ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 332 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. ఆ తర్వాత భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 292 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. దీంతో 40 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ విజృంభించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 423 పరుగులు చేసి.. భారత్‌కు 464 పరుగల లక్ష్యాన్ని ముందుంచింది. అయితే లక్ష్యఛేదనలో భారత్‌ మరోసారి తడబడింది. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతంగా రాణించిన విహారి... ఈ ఇన్నింగ్స్‌లో పరుగులు చేయకుండా పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రిషబ్‌ పంత్‌.. రాహుల్‌కు మంచి సహకారాన్ని అందిస్తూ బ్యాటింగ్‌ చేశాడు. వీరిద్దరు కలిసి ఆరో వికెట్‌కు 204 పరుగులు జోడించారు. ఈ క్రమంలో రాహుల్‌, పంత్‌లు సెంచరీలు చేశారు. అయితే.. 82వ ఓవర్‌లో ఈ భాగస్వామ్యానికి తెరపడింది. రాహుల్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత రిషబ్‌ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ దారిపట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన వారెవరూ రాణించలేదు. దీంతో భారత్‌ 94.3 ఓవర్లలో 345 పరుగులు చేసి ఆలౌంట్‌ అయ్యింది. ఫలితంగా ఇంగ్లండ్‌ ఈ మ్యాచ్‌లో 118 పరుగుల తేడాతో విజయం సాధించి.. 4-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. ఇరు ఇన్నింగ్స్‌లో అద్బుతంగా రాణించిన అలెస్టర్‌ కుక్‌కి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. ఈ సిరీస్‌లో 250కి పైగా పరుగులు చేసి.. 11 వికెట్లు తీసిన యువ క్రికెటర్‌ శామ్‌ కర్రన్‌కి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు దక్కింది. 

 

10:48 - September 1, 2018

హైదరాబాద్ : ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు ఆసక్తి కరంగా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో 273పరుగులకు భారత్‌ ఆలౌట్‌ అయింది. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్‌ పుజారా చెలరేగి పోయాడు. వీరోచిత సెంచరీ చేశాడు. కెప్టెన్‌ కోహ్లీ ఆటతీరు ఫర్వాలేదనిపించింది. మిగతా బ్యాట్స్‌మెన్లంతా తక్కువ పరుగులకే వికెట్‌ కోల్పోయారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 84.5ఓవర్లలో 273పరుగులకే పెవిలియన్‌ దారి పట్టింది. ఇంగ్లాండ్‌ బౌలర్లు మొయిన్‌ అలీ ఐదు వికెట్లు, ఫాస్ట్‌ బౌలర్‌ బ్రాడ్‌ మూడు వికెట్లు తీశారు.

నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 195 పరుగులకే 8 వికెట్లు!.. ఈ స్థితిలో ఇంగ్లాండ్‌ గడ్డపై టీమ్‌ఇండియా ఆలౌట్‌ కావాలంటే ఎంత సమయం కావాలి? విజృంభిస్తున్న ఇంగ్లిష్‌ బౌలర్లను భారత టెయిలెండర్లు తట్టుకునేదెంతసేపు? కానీ చెతేశ్వర్‌ పుజారా 132 పరుగులు చేసి నాటౌట్‌ గా నిలిచాడు. 257 బంతుల్లో 16×4 చేసి ఇండియాకు కంచుకోటలా నిలిచాడు. కోహ్లి వికెట్‌ పడగొట్టామని సంబరపడిన ఇంగ్లాండ్‌ ఆనందానికి తెరదించుతూ ఒక్కడు భారత్‌ను ఆదుకున్నాడు. టెయిలెండర్ల సాయంతో.. అపరిమిత సహనాన్ని ప్రదర్శిస్తూ.. కఠోర దీక్షతో బ్యాటింగ్‌ చేసిన పుజారా.. అజేయ సెంచరీతో భారత్‌కు అనూహ్యమైన ఆధిక్యాన్ని అందించాడు. 

07:14 - March 15, 2018

ఢిల్లీ : ముక్కోణపు టీ20 సిరీస్‌లో భారత్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఇండియా.... బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. 17 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తుచేసి ఫైనల్‌కు చేరింది. టీమ్‌ ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించిన కెప్టెన్‌ రోహిత్‌శర్మకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. నిదహాస్ ట్రోఫీ T20 ట్రై సీరిస్‌లో భారత్‌ మరో విజయాన్ని అందుకుంది.

టాస్‌ ఓడిన ఇండియా.. ముందుగా బ్యాటింగ్‌ చేసింది. కొద్దిరోజులుగా నిలకడలేమితో సతమతమవుతున్న కెప్టెన్‌ రోహిత్‌శర్మ... ఈ మ్యాచ్‌లో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. 61 బంతుల్లో 89రన్స్‌ చేసి భారీ స్కోరుకు బాటలు వేశౄడు. అర్థసెంచరీ వరకు నిలకడగా ఆడిన రోహిత్‌ తరువాత తనదైన శైలిలో చెలరేగాడు. రోహిత్‌కు శిఖర్‌ ధావన్‌ జతకలవడంతో భారత్‌ స్కోరు పరుగులు పెట్టింది. శిఖర్‌ ధావన్‌ 27 బంతుల్లో 35 రన్స్‌ చేశాడు. ఆ తర్వాత వచ్చిన రైనా కూడా రోహిత్‌కు చక్కటి భాగస్వామ్యం అందించాడు. రైనా 30 బంతుల్లో 47 రన్స్‌ చేశాడు. భారత బ్యాట్స్‌మెన్‌లు రాణించడంతో.. మూడు వికెట్ల నష్టానికి భారత్‌ 176 పరుగులు చేసింది.

177 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు భారత బౌలర్స్‌ చుక్కలు చూపించారు. వాషింగ్టన్‌ సుందర్‌ బంగ్లాకు ఆరంభంలోనే షాక్‌ ఇచ్చాడు. ఓపెనర్‌ లిటన్‌దాస్‌, సౌమ్యా సర్కార్‌, తమీమ్‌ ఇక్బాల్‌లను స్వల్ప స్కోరుకే పెవిలియన్‌ బాట పట్టించాడు. ఆ తర్వాత కొంత సమయానికే కెప్టెన్‌ మహ్మదుల్లా చాహల్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఔటై పెవిలియన్‌ చేరాడు. ఈ దశలో కష్టాల్లోపట్ట బంగ్లాను రహీమ్‌ ఆదుకున్నాడు. ముష్ఫికర్‌ రహీం 55 బంతుల్లో 72 పరుగులు చేశాడు. చివరిదాకా పోరాడి గెలిపించే ప్రయత్నం చేశాడు. మొదట్లో భారత్ బౌలింగ్‌లో ఇబ్బంది పడినా, క్రమంగా బౌండరీలతో చెలరేగాడు. ఈ క్రమంలో సిరీస్‌లో మరో అర్ధశతకాన్ని నమోదు చేశాడు. కానీ భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో విజయం భారత్‌ వశమైంది. బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగుల చేసింది. దీంతో భారత్ 17 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌కి దూసుకెళ్లింది. భారత్ బౌలర్లలో వాషింగ్టన్‌ మూడు వికెట్లు తీయగా, సిరాజ్‌, శార్దూల్‌, చాహల్‌ తలో వికెట్‌ తీశారు.

13:10 - February 28, 2018

కేప్ టౌన్ నగరంలో ఇది దక్షణాఫ్రికాలో ప్రధానమైన నగరం ఇప్పుడు నీటి ఎద్దడి ఎదుర్కొంటుంది. భారత్, దక్షణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ కు కేప్ టౌన్ అతిథ్యమిచ్చింది. అయితే అక్కడ అధికారులు భారత ఆటగాళ్లను ఇక్కడ నీటి కరువు ఉంది కొంచెం నీటి తక్కువగా వాడండి అన్నారు. వారి విజ్ఞప్తిని భారత ఆటగాళ్లు స్వీకరించి నీటిని తక్కుగా వాడారు. అయితే అక్కడి నీటి కష్టాలను చూసిని ఇరు జట్ల కెప్టెన్లు కేప్ టౌన్ రూ.5లక్షల విరాళు ప్రకటించారు. భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, దక్షణాఫ్రికా కెప్టెన్ డుప్లిసెస్ ఇద్దరు కలసి రూ.5లక్షల చెక్ ను కేప్ టౌన్ అధికారులకు అందజేశారు.

06:46 - February 2, 2018

ఢిల్లీ : డర్బన్‌ వన్డేలో టీమిండియా దుమ్మురేపింది. కోహ్లీసేన సఫారీ జట్టుకు చుక్కులు చూపించింది. 6వికెట్లతేడాతో ఆతిథ్యజట్టును చిత్తుచిత్తుగా ఓడించింది. మొత్తం ఐదువన్డేల సిరీస్‌లో 1-0తో టీమ్‌ఇండియా ముందంజవేసింది. విరాట్‌ ఆర్మీ మరోసారి దుమ్మురేపింది. కోహ్లీసేన దూకుడు ముందు డూప్లెసిస్‌ బ్యాచ్‌ విలవిల్లాడింది. 270 పరుగుల టార్గెట్‌ను టీమిండియా ఈజీగా ఛేదించింది. భారత్‌ విజయంలో విరాట్‌ మరోసారి కీలకంగా మారాడు. మొత్తం 119 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 10ఫోర్లతో 112 రన్స్‌ సాధించాడు. అటు రహానే 86 బంతుల్లో 5ఫోర్లు, 2భారీ సిక్స్‌లతో దక్షిణాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించాడు. 79 పరుగులు సాధించిన రహానే కెప్టెన్‌ కోహ్లీకి సరిజోడు అనిపించుకున్నాడు.

కోహ్లిసేన ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ20 పరుగులు, శిఖర్‌ ధవన్‌ 35 పరుగులు చేసి అవుటయ్యారు. తర్వాత క్రీజులోకి వచ్చిన సారధి కోహ్లి రహనేతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. రహనే కూడా నెమ్మదిగా బౌండరీలు కొడుతూ క్రీజులో పుంజుకున్నాడు. రహనే 79 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఫెలూక్వాయో వేసిన బంతికి మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. తర్వాత అల్‌రౌండర్‌ హార్దిక్‌​పాండ్యా కోహ్లితో కలిశాడు. సారథి విరాట్‌ తన అద్బుతమైన ఆటతీరుతో అందర్నీ అకట్టుకున్నాడు. 45 ఓవర్లో ఫెలూక్వాయో వేసిన మూడో బంతికి రబడాకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 112 పరుగులు చేసిన కోహ్లి తన కెరీర్‌లో 33వ సెంచరీని సాధించాడు.
అంతకు ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 269పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను డీకాక్‌, హషీమ్‌ ఆమ్లాలు ఆరంభించగా సఫారీలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ ఆమ్లా16 పరుగులు చేసి తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. బూమ్రా బౌలింగ్‌లో ఆమ్లా వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆపై సఫారీ ఇన్నింగ్స్‌ను డీకాక్‌-డు ప్లెసిస్‌లు కొనసాగించారు. జట్టు స్కోరు 83 వద్ద 34 పరుగులు డీకాక్‌ రెండో వికెట్‌గా అవుటయ్యాడు. తర్వాత బ్యాటింగ్‌ కు వచ్చిన మర్‌క్రామ్‌, డుమినీ, మిల్లర్‌ స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరారు. ఇదే సమయంలో క్రిస్‌ మోరిస్‌-డు ప్లెసిస్‌ జోడి ఇన్నింగ్స్‌ నిలబెట్టారు. ఈ ఇద్దరూ 74 పరుగులు జోడించడంతో సౌతాఫ్రికా జట్టు సఫారీలు రెండొందల మార్కును చేరింది. మోరీస్‌ 37 పరుగులు చేసి అవుటవ్వగా టెయిలెండర్ ఫెలూక్వాయో27 పరుగులు చేశాడు. కాగా.. సఫారీల ఇన్నింగ్స్‌ను కెప్టెన్‌ డుప్లెసిస్‌ ఒంటిచేత్తో నడిపించాడు. 112 బంతుల్లో 120 పరుగుల చేసిన డూప్లెసిస్‌ భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో పాండ్యాకు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో 269 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌కు తెరపడింది.

భారత్‌ బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ మూడు వికెట్లు సాధించగా, చాహల్‌ రెండు వికెట్లు తీశాడు. ఇక బూమ్రా, భువనేశ్వర్‌లకు తలో వికెట్‌ దక్కింది. అటు దక్షిణాఫ్రికా బౌలర్లలో బౌలర్లలో ఫెలూక్వాయో రెండు వికెట్లు, మోర్నీ మోర్కెల్‌ ఒక వికెట్‌ దక్కాయి. ధోని విన్నింగ్‌ షాట్‌ తో భారత్‌ విజయాన్ని సాధించింది. ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి 45.3 ఓవర్లలో టార్గెట్‌ను ఛేదించింది.దీంతో 5 వన్డేల సిరీస్‌లో విరాట్‌ ఆర్మీ 1-0తో ముందజ వేసింది. 

14:49 - December 28, 2017

ముంబై : విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ రిసెప్షన్ లో బాలీవుడ్ తారలు, క్రీడకారులు తలుక్కుమన్నారు. బాలీవుడ్ బాద్ షా నూతన జంటతో స్టెప్పులేశారు. సచిన టెండూల్కర్, కుంబ్లే, ధోని వారి ఫ్యామిలీతో విందు హాజరైయ్యారు. ఈ విందులో యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ పంజాబీ డ్యాన్స్ చేసి అందరిని అలరించారు. వారు డ్యాన్స్ చేయడమే కాకుండా విరాట్ తో కూడా స్టెప్పులెంచారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - కోహ్లీ