కేసు

21:49 - September 21, 2018

అనంతపురం : వినాయక చవితి సందర్భంగా రాజుకున్న అనంతపురం జిల్లా రగడ చిలికి చిలికి గాలివానగా మారుతోంది. సీఐ మాధవ్, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిల మధ్య నెలకొన్న గొడవ నువ్వా? నేనా? అన్నట్లుగా రాజుకుంటోంది. సాధారణంగానే జేసీ ఫైర్ బ్రాండ్. దానికి తోడు ఇగో హర్ట్ అయ్యింది. ఇక ఇంకేముంది. ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరువురు సై అంటే సై అంటున్నారు. టంగ్ స్లిప్ అయితే నాలుక కోస్తా అని సీఐ మాధవ్ అంటే ఎక్కడికి రావాలో చెప్పు అంటూ జేసీ దివాకర్ రెడ్డి సవాల్ విసురుతున్నారు. అక్కడితో ఆగని జేసీ తాజాగా సీఐ మాధవ్‌పై తాడిపత్రి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేల నాలుకలు కోస్తానన్న వ్యాఖ్యలను జేసీ ఫిర్యాదులో పేర్కొన్నారు. దివాకర్‌రెడ్డి ఫిర్యాదు నేపథ్యంలో తాడిపత్రి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాగా ప్రభోదానంద ఆశ్రమ వివాదంలో దివాకర్‌ రెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గులేని పోలీసులు, నిర్వీర్యమైన వ్యవస్థ, ఉన్నట్టా చచ్చిపోయినట్లా అంటూ మండిపడ్డారు. మీరు ఇంతే అట్టు పోలీసుల ముందు హిజ్రాలతో నృత్యాలు చేయించారు. జేసీ వ్యాఖ్యలు చేష్టలతో పోలీసులు అధికారులు సంక్షేమ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ పార్టీ వారైనా, ఏ నాయకుడైనా పోలీసు వ్యవస్థను కించపరిచేలా మాట్లాడితే నాలుక తెగ్గోస్తాం. తస్మాత్‌ జాగ్రత్త అని కదిరి సీఐ మాధవ్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జేసీ దివాకర్ రెడ్డి మాధవ్ పై ఫిర్యాదు చేశారు. 

 

18:36 - September 20, 2018

అనంతపురం : గుత్తి పోలీసు స్టేషన్‌లో ప్రభోదానంద స్వామిపై కేసు నమోదు అయింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రసంగించారంటూ టీడీపీ నేత మధుసూదన్ గుప్తా ఫిర్యాదు చేశారు. సీడీలను సాక్ష్యాలుగా అందజేశారు. వాటిని పరిశీలించిన పోలీసులు ప్రభోదానందపై కేసు నమోదు చేశారు. 
కాగా వినాయక చవితి పండుగ సందర్భంగా నిమజ్జనానికి వెళుతుండగా ప్రజలపై దాడిచేసిన ప్రబోధానంద వర్గీయులు స్వామి వారి విగ్రహాన్ని ధ్వంసం చేశారని స్థానికులు ఆరోపించారు. ఈ సందర్భంగా జరిగిన అల్లర్లలో అన్ని సామాజిక వర్గాలకు చెందినవారు గాయపడినట్లుగా తెలుస్తోంది. కాగా  ఆశ్రమాన్ని ఖాళీ చేసి దోషులను అరెస్ట్ చేసేవరకూ తాను వెనక్కు తగ్గబోనని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రసంగించారంటూ టీడీపీ నేత మధుసూదన్ గుప్తా ఫిర్యాదు చేశారు. కాగా ఎటువంటి కేసు ప్రభోదానందపై నమోదు కాలేదని ఆశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. 

 

13:16 - September 12, 2018

హైదరాబాద్ : టి.టిడిపి నేత రేవంత్ రెడ్డిని అరెస్టు చేస్తారా ? అనే చర్చ జరుగుతోంది.  తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఫీవర్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం కలకలం రేపింది. రాజకీయ కుట్రలో భాగంగా అరెస్టులు చేశారని టీ.పీసీసీ ఆరోపించింది. మరో నేత గండ్ర వెంకటయ్య వీరయ్యకు పోలీసులు ఓ కేసు నిమిత్తం నోటీసులు జారీ చేశారు. తాజాగా టి.టిడిపి నుండి కాంగ్రెస్ లో జంప్ అయిన రేవంత్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 

బుధవారం జూబ్లీహి ల్స్ హౌజింగ్ సొసైటీ కేసులో రేవంత్ కు నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లోగా విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. తప్పుడు డ్యాక్యుమెంట్లతో సొసైటీ సొసైటీలో అక్రమంగా లబ్ది పొందారనే ఆరోపణలతో నోటీసులు జారీ చేశారు. ఆయనతో పాటు 13 మంది సభ్యులకు కూడా నోటీసులు జారీ చేశారు. తాను ఎన్నికల ప్రచారంలో తాను బిజీగా ఉన్నట్లు ప్రస్తుతం రాలేనని రేవంత్ స్పష్టం చేశారు. 

15:44 - August 31, 2018

కేరళ : మలయాళ నటి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌పై ఉన్న కేసును సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఆమె నటించిన 'ఒరు అదార్‌ లవ్' చిత్రంలో ముస్లిం భావాలను కించపరిచేలా పాట ఉందన్న ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ పాటలో ప్రియ కన్నుకొట్టిన సన్నివేశాలు దేశవ్యాప్తంగా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. నాలుగు నెలల తర్వాత ప్రియపై వేసిన కేసును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. 'ఎవరో సినిమాలో ఏదో పాట పాడితే మీకు కేసు వేయడం తప్ప మరో పని లేదా?' అంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

18:55 - August 29, 2018

హైదరాబాద్ : భీమా-కోరేగావ్‌ హింస కేసులో అరెస్ట్‌ అయిన ఐదుగురు పౌరహక్కుల నేతలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అరెస్ట్‌లపై దాఖలైన పిటిషన్‌లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు- మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. వారిని సెప్టెంబర్‌ 5 వరకు హౌజ్‌ అరెస్ట్‌లో ఉంచాలని కోర్టు ఆదేశించింది. వరవరరావు సహా మిగతా నలుగురు మానవ హక్కుల కార్యకర్తలను గృహ నిర్బంధంలో ఉంచాలని, వారని బయటకు వెళ్లకుండా నిరోధించాలని పేర్కొంది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ సెప్టెంబర్‌ 6కు వాయిదా వేసింది. పౌరహక్కుల నేతల అరెస్ట్‌ను ఖండిస్తూ.. ప్రముఖ చరిత్రకారిణి రొమిల్లా థాపర్‌తోపాటు మరో నలుగురు సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఐదుగురిపై తప్పుడు అభియోగాలు మోపారని, వారిని వెంటనే విడుదల చేయాలని పిటిషన్‌లో కోరారు. భీమా-కోరేగావ్‌ హింసాత్మక ఘటనలు, మావోయిస్టులతో సంబంధాలు, చట్ట విరుద్ధ కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో పుణె పోలీసులు వరవరరావుతో సహా నలుగురు పౌర హక్కుల కార్యకర్తలను మంగళవారం అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

11:42 - August 9, 2018

మహారాష్ట్ర : రైతే రాజ్యానికి వెన్నెముక అన్నారు. రైతన్న అలిగితే ఎవరికి అన్నమే వుండదు..కడుపు నిండదు. రైతు లేనిదే రాజ్యం లేదు. అందుకే రైతన్నను అన్నదాత అన్నారు. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం..దేశ ప్రగతికి రైతే వెన్నెముకలాంటివాడు. మరి ఈనాడు రైతు అంటే విలువలేకుండా పోయింది. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు హామీలతోనే సరిపెడుతున్నాయి. మరోపక్క వరుణుడు కూడా రైతన్నపైనే అలుగుతున్నాడు. కోపం లేని కోపం రాని రైతన్న అలిగితే..క్రాప్ హాలిడే ప్రకటిస్తే..దేశమే కాదు..ప్రపంచమే స్థంభించిపోతుంది. ఆకలి కరాళనృత్యం చేస్తుంది. కానీ అన్నదాత అన్నమే పెడతాడు..ఆకలిని దరి చేరనివ్వడు. అందుకే తనను తాను చంపుకుంటాడు తప్ప ఎవరిపైనా రైతన్న కోపగించుకోడు..కానీ ఆ రైతన్నకు కోపం వస్తే..ఎవరిమీదనైనా సరే పోరాడుతాడు. తన పంటను కాపాడుకునేందుకు రైతన్న దేనికైనా తెగిస్తాడు..ఈ నేపథ్యంలో కొందరు రైతన్నలు ఓ విచిత్రమైన పనిచేశారు. నారు వేసిన రైతన్న వర్షం కోసం ఆకాశం వంక ఆశగా చూసాడు. వర్షాలు పడతాయో లేదోనని ఆందోళన పడ్డాడు. వర్షాలు పడతాయో లేదో చెప్పేందు ఓ శాఖ కూడా వుంది. కానీ అదెప్పుడు సరైన సమాచారాన్ని అందివ్వదు. దీనికి నిరసనగా రైతన్నలు వాతావరణ శాఖ తప్పుడు సమాచారం చెప్పిందనీ ఆ సంస్థ డైరెక్టర్ పై కేసు పెట్టారు..అవును నిజమండీ..కావాలంటే ఆ వివరాలు చూడండి..
వాతావరణ శాఖ డైరెక్టర్ పై ఫిర్యాదు చేసిన మలాఠ్వాడ రైతులు..
వానలు పడక ఒకసారి..నకిలీ విత్తనాలతో మరోసారి..వెరసి రైతన్నలు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు. తీవ్రంగా నష్టపోతున్నారు. రైతన్న నష్టపోతే మనకేమిలో అనుకోవటానికి వీలులేదు..రైతన్న నష్టపోతే దేశానికే నష్టం. ఈ క్రమంలో నష్టాలపాలైన రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటే..మరికొందరు వున్న ఊరును..కన్నతల్లిలాంటి పొలాన్ని అమ్ముకుని వలస బాట పడతున్నారు. కానీ రైతన్నలలో మరాఠ్వాడా రైతులు మాత్రం ఫుల్ డిఫరెంట్. వాతావరణ శాఖ వర్షపాతంపై సరైన అంచనాలు ఇవ్వకపోవడంతో ఏకంగా సంస్థ డైరెక్టర్ పై మహారాష్ట్రలోని మలాఠ్వాడ రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వర్షాలు పడతాయన్న సంస్థ..పడని వర్షాలు..కేసు నమోదు..
ఈ సారి రుతుపననాల సందర్భంగా మంచి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మరఠ్వాడా ప్రాంతానికి చెందిన రైతులు తమవద్ద ఉన్న మొత్తం నగదుతో పంటల్ని సాగుచేశారు. అయితే తొలికరి వర్షం మినహా వాన జాడలేకపోవడంతో ఆగ్రహం చెందిన రైతన్నలు.. భారత వాతావరణ శాఖ పుణె డైరెక్టర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడి అధికారులు ఎరువులు, పురుగు మందుల కంపెనీలతో కుమ్మక్కై తప్పుడు అంచనాలను ఇచ్చారని ఆరోపించారు.

ఐపీసీ 420 సెక్షన్ కింద కేసు నమోదుచేయాలని డిమాండ్..
ఈ మేరకు రైతు సంఘం స్వాభిమాని షేట్కారీ సంఘటన మరఠ్వాడా ప్రాంత చీఫ్ మాణిక్ కదమ్ రైతులతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై ఐపీసీ 420 సెక్షన్ కింద కేసు నమోదుచేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ విషయమై స్పందించేందుకు వాతావరణ శాఖ అధికారులెవరూ అందుబాటులోకి రాలేదు.

16:45 - July 9, 2018

ఢిల్లీ : 2012 దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన నిర్భయ గ్యాంగ్ రేప్ హత్య కేసులో సుప్రీంకోర్టు నిందితులకు ఉరిశిక్షను ఖరారు చేసింది. దోషులకు మరణ శిక్ష కాకుండా యావజ్జీవ కారాగార శిక్ష విధించాలన్న రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసింది. దోషులకు మరణశిక్షే సరైనదంటూ... ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా , న్యాయమూర్తులు జస్టిస్‌ అశోక్‌భూషణ్‌, జస్టిస్‌ భానుమతిలతో కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. నిర్భయ కేసులో గత ఏడాది మే 5న నలుగురు దోషులు ముఖేస్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్తలకు సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది. తమకు విధించిన మరణ శిక్షను తగ్గించి యావజ్జీవ శిక్షగా మార్చాలని నిందితులు రివ్యూ పిటిషన్‌ వేశారు. 31 ఏళ్ల అక్షయ్‌ కుమార్‌ మాత్రం రివ్యూ పిటిషన్‌ వేయలేదు. విచారణ సమయంలో నిందితుల్లో ఒకడైన రాంసింగ్‌ 2013 మార్చి 11న పోలీస్‌ కస్టడీలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. క్యురెటివ్‌ పిటిషన్‌ వేసేందుకు మాత్రం అంగీకరించింది. సుప్రీం తీర్పును నిర్భయ తల్లిదండ్రులు స్వాగతించారు.

16:00 - July 9, 2018

ఢిల్లీ : 2012 దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన నిర్భయ గ్యాంగ్ రేప్ హత్య కేసులో సుప్రీంకోర్టు నిందితులకు ఉరిశిక్షను ఖరారు చేసింది. దోషులకు మరణ శిక్ష కాకుండా యావజ్జీవ కారాగార శిక్ష విధించాలన్న రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసింది. దోషులకు మరణశిక్షే సరైనదంటూ... ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా , న్యాయమూర్తులు జస్టిస్‌ అశోక్‌భూషణ్‌, జస్టిస్‌ భానుమతిలతో కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. నిర్భయ కేసులో గత ఏడాది మే 5న నలుగురు దోషులు ముఖేస్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్తలకు సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది. తమకు విధించిన మరణ శిక్షను తగ్గించి యావజ్జీవ శిక్షగా మార్చాలని నిందితులు రివ్యూ పిటిషన్‌ వేశారు. 31 ఏళ్ల అక్షయ్‌ కుమార్‌ మాత్రం రివ్యూ పిటిషన్‌ వేయలేదు. విచారణ సమయంలో నిందితుల్లో ఒకడైన రాంసింగ్‌ 2013 మార్చి 11న పోలీస్‌ కస్టడీలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. క్యురెటివ్‌ పిటిషన్‌ వేసేందుకు మాత్రం అంగీకరించింది. సుప్రీం తీర్పును నిర్భయ తల్లిదండ్రులు స్వాగతించారు.

15:37 - July 9, 2018

ఢిల్లీ : నిర్భయకేసులో ఇవాళ తుది తీర్పు రానుంది. 2012 డిసెంబర్‌ 16న ఢిల్లీలో జరిగిన గ్యాంగ్‌రేప్‌లో మొత్తం నలుగురికి మరణశిక్ష పడింది. అయితే దీనిపై ముగ్గురు మద్దాయిలు పవన్‌, వినయ్‌, ముఖేశ్‌లు న్యాస్థానాన్ని ఆశ్రయించారు. తమకు విధించిన మరణ శిక్షను పునఃసమీక్షించాలని పిటిషన్‌ వేశారు. ముద్దాయిల పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం ధర్మాసనం ఇవాళ తీర్పు ఇవ్వనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా , న్యాయమూర్తులు జస్టిస్‌ అశోక్‌భూషణ్‌, జస్టిస్‌ భానుమతిలతో కూడా ధర్మాసనం ఇవ్వనున్న తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. 

17:11 - July 3, 2018

విజయవాడ : ఐఏఎస్‌ అధికారి గంధం చంద్రుడుపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. కొంత కాలంగా ఐఎస్‌ అధికారి గంధం చంద్రుడు వరకట్నం కోసం వేధిస్తున్నట్టు ఆయన భార్య... మాచవరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.  ప్రస్తుతం ట్రైబల్‌ వెల్ఫెర్‌ డిపార్టు మెంట్‌లో డైరెక్టర్‌గా గంధం చంద్రుడు పనిచేస్తున్నారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - కేసు