కేరళ

16:21 - November 14, 2018

కేరళ : మహిళలకు అయ్యప్ప ఆలయంలో ప్రవేశంపై సుప్రీంకోర్టు తీర్పు నాటినుండి శబరిమల ఆలయం వివాదాస్పదంగా తయారయ్యింది. సుప్రీం తీర్పుతో పలువురు మహిళలు ఆలయ ప్రవేశానికి వెళ్లేందుకు యత్నించగా కొందరు దాన్ని తీవ్రంగా అడ్డుకోవటమేకాక రాళ్లదాడికి కూడా పాల్పడిన నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తతల రీత్యా ఆలయాన్ని మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా కార్తీక మాసంలో అయ్యప్ప భక్తులు మాలలు ధరించి స్వామివారిని దర్శించుకునే క్రమంలో మరోసారి ఆలయాన్ని తెరిచారు. ఈ క్రమంలో తాజాగా భూమాత బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ శబరిమలకు వెళుతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తనకు  రక్షణ కల్పించాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను ఆమె కోరారు. రెండు నెలల పాటు శబరిమలలో కొనసాగే 'మండల మక్కరవిళ్లక్కు' నవంబర్ 17 నుంచి ప్రారంభం కాబోతోంది. ఇదే సమయంలో తృప్తి దేశాయ్ శబరిమలకు వెళ్లనున్న క్రమంలో మరో 500 మంది యువతులు కూడా అయ్యప్ప దర్శనం కోసం ఆన్ లైన్ క్యూ వెబ్ సైట్లో రిజిస్టర్ చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో, మరోసారి ఆలయ పరిసర ప్రాంతాలు వేడెక్కనున్నాయి. కాగా కొన్ని ఆలయాలలోకి మహిళల ప్రవేశం నిషేధంపై తృప్తీ దేశాయ్ పోరాడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమె మహారాష్ట్రలోని శనిసింగనాపూర్ ఆలయంలోకి ప్రవేశించి శనీశ్వరునికి అభిషేకాలు జరిపిన విషయం తెలిసిందే. 
 

19:55 - November 13, 2018

కేరళ : శివకేశవుల ముద్దుల బిడ్డడు వివాదంలో చిక్కుకున్నాడు. మనుషులు సృష్టించిన వివాదం నుండి బైటకు రాలేక..మనుషుల అజ్నానానికి, అహంకారానికి మధ్య అయ్యప్ప నలిగిపోతున్నాడు. స్వామియే శరణం అయ్యప్పా అని భక్తులు పిలిస్తే శబరిమల ఇలవేలుపు పలుకుతాడని భక్తుల విశ్వాసం. మరి అటువంటి శివశంకరుల ముద్దుల బిడ్డడిని వివాదంలోపడేశారు ఆ భక్తులే. 
let us leave sabarimala to tigers, says environmentalistశబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అనుకూల, వ్యతిరేక వర్గాలు పలు వివాదాలకు కేంద్రంగా శబరిమల ఆలయాన్ని మార్చవిశాయి. ఈ నేపథ్యంలో అచ్యుతన్ అనే పర్యవరణ వేత్త ఘాటుగా స్పందించారు. శబరిమల ఆలయానికి మగవాళ్లు వద్దు, ఆడవాళ్లు వద్దు, అది పులుల అభయారణ్యం.. పులులకే వదిలేద్దాం అని కొత్తప్రతిపాదన ముందుకు తెచ్చారు.  వరదలతో కేరళ అతలాకుతలమైపోయింది. ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది కేరళ పునర్నిర్మాణం గురించే  కానీ శబరిమల ఆలయం గురించి కాదని తేల్చి చెప్పారు. 

రివల్యూషనరీ మార్క్సిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్‌ఎంపీఐ) ఆధ్వరంలో వరదల అనంతరం కేరళ పునర్నిర్మాణం అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో అచ్యుతన్ ప్రసంగించారు. ఓవైపు ప్రకృతి ఉత్పాతంతో కేరళ కుదేలైంది. పర్యావరణం ప్రమాదంలో పడింది. అడవులను విస్తరించలేకపోయినా కనీసం ఉన్నవి కాపాడుకుంటే మంచిదని ఆయన చెప్పారు. శబరిమలపై గతంలో జరిపించిన సర్వేలో అచ్యుతన్ పాల్గొన్నారు. ఆ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ అక్కడ అభివద్ధి పేరిట మరిన్ని నిర్మాణాలు చేపడితే గుడికే ప్రమాదం ఏర్పడుతుందని ఆయన హెచ్చరించారు. మూర్ఖత్వంతో అందరు అందరూ ఓ చిన్న విషయంపై సమయాన్ని, శక్తిని, వనరులను వృథా చేసుకుంటున్నారని పర్యవారణవేత్త అచ్యుతన్ అభిప్రాయపడ్డారు.
 

14:34 - November 12, 2018

ట్రిస్సూర్: ఒక పక్క మహిళలకు ప్రవేశం కల్పించాలని కేరళలోని శబరిమల ఆలయంలో ఆందోళనలు ఉదృతం అవుతుంటే.. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్న ప్రయోగాన్ని చేపట్టింది. మహిళలకు మాత్రమే ప్రవేశం కల్పిస్తూ ఒక లాడ్జిని ‘షీ లాడ్జ్’ పేరుతో ప్రారంభించింది. ఈ లాడ్జి మహిళలకు భద్రత కల్పించడంతోపాటు, అందుబాటు ధరల్లో వసతి కల్పిస్తామని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా పిల్లలతో ప్రయాణించే మహిళలకు 14 జిల్లాల్లో ఈ లాడ్జిలను నిర్మించాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ట్రిస్తూర్ పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో పచ్చటి పొలాలమధ్య మొదటి షీ లాడ్జిని ఏర్పాటు చేశారు. ఇందులో 50 మంది మహిళలకు సరిపడా వసతి సౌకర్యం ఉంది. మరోక లాడ్జి కాసరగాడ్‌లో ఏర్పాటు చేశారు. ఇది ఇంకా ప్రారంభం కావాల్సిఉంది. ఈ రెండు కాక తిరువనంతపురం, కొల్లాం, ఎర్నాకులంలో మరో మూడు లాడ్జిలు నిర్మాణంలో ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.  మొత్తానికి కేరళలోని కమ్యూనిస్టు సర్కార్ మహిళల కోసం చేస్తున్న కృషిని అభినందించాల్సిందే!
 

10:00 - November 5, 2018

కేరళ : శబరిమల అయ్యప్ప ఆలయం ద్వారాలు ఒక్క రోజు దర్శనానికి సర్వం సిధ్దమైంది. ఇవాళ సాయంత్రం ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. అయితే మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపధ్యంలో గత నెలలో జరిగిన రగడ తెలిసిందే.. ఈ నేపధ్యంలో మరోసారి ఆలయ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొన్నది. రేపు అర్ధరాత్రి వరకూ సెక్షన్ 144 కొనసాగనుంది

మహిళలకు అయ్యప్ప దర్శనం విషయంలో సుప్రీంకోర్టు తీర్పు అమలు అవుతుందో లేదో అనే అంశం ఉత్కంఠ రేపుతోంది. సన్నిధానం, పంబ, నీలక్కల్ ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులు నిషేధాజ్ఞలు జారీ చేశారు. ప్రతి సంవత్సరం చితిర అట్ట విశేషం పేరుతో జరిగే ఒక్క రోజు పూజకు ఆలయద్వారాలు తెరుచుకుంటాయ్. ఐతే ఈసారి మహిళల ప్రవేశంపై ఆంక్షలు కోర్టు రద్దు చేసిన నేపధ్యంలో ప్రాధాన్యత ఏర్పడింది. 

గతనెలలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో పోలీస్ శాఖ భారీగా బందోబస్తు చేసింది. దాదాపు 5వేలమంది పోలీసులను భద్రతకోసం నింపేదిసింది. వీరిలో 50ఏళ్ల వయసు దాటిన మహిళా కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. ఒక్క భక్తులను తప్ప..మిగిలిన వారిని అనుమతించే ప్రసక్తే లేదని పథనం తిట్ట జిల్లా ఎస్పీ నారాయణన్ ప్రకటించారు.  ఇద్దరు ఐజీలు, పదిమంది డిఎస్పీలు ఈ ఒక్క రోజు దర్శనం కోసం ఏర్పాటు చేసిన భద్రత సిబ్బందిని పర్యవేక్షిస్తారు. మరోవైపు పంబ పరిసరాల్లో మహిళాసంఘాలు దర్శనం కోసం చేరుకున్నట్లు తెలుస్తోంది. పైగా స్థానిక ఎమ్మెల్యే పిసి జార్జ్ స్వయంగా పదేళ్ల నుంచి 50ఏళ్ల మధ్య ఉన్న
మహిళలు బాలికలు స్వామి దర్శనంకోసం సిధ్దంగా ఉన్నట్లు చెప్తున్నారు. ఈ మేరకు గవర్నర్‌కి ఆయన లేఖ రాసినట్లు తెలుస్తోంది. 

మరోవైపు మహిళల దర్శనంపై ఆంక్షలను కోరుతున్న భక్తులు కూడా వీరిని అడ్డుకునేందుకు సిధ్దమైనట్లు తెలుస్తోంది. ఐతే ఇలా కోర్టు తీర్పు ప్రకారం దర్శనం కలిగించకపోవడంపై విమర్శలు వస్తున్నాయ్. ఇలా చేయడం కేరళని వందేళ్ల వెనక్కి తీసుకెళ్తోందని జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీత
ఎంటి వాసుదేవన్ నాయర్ అన్నారు. పాతకాలపు సంప్రదాయాలను అమలు చేయాలని చెప్పడం వాటిని పట్టుకుని వేలాడటం మూర్ఖత్వం అని ఆయన అభిప్రాయపడ్డారు.  ఇదే అంశానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు 543 కేసులు రిజిస్టర్ చేసి 3701మందిని అరెస్ట్ చేశారు. ఈ చర్యలు భక్తులను రెచ్చగొట్టేందుకే తప్ప ఇంకోటి కాదని..బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ముక్తకంఠంతో విమర్శించడం విశేషం. ఈ నేపధ్యంలో శబరిమల ఆలయ పరిసరాల్లో ఆందోళనకర వాతావరణం నెలకొన్నది.

16:01 - November 4, 2018

కేరళ : శబరిమల మరోసారి వార్తల్లోకి ఎక్కుతోంది. గత కొన్ని రోజుల క్రితం ఉన్న టెన్షన్ వాతావరణం మరోసారి పునరావృతమౌతోంది. సోమవారం ఆలయాన్ని తెరువనున్న నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అలర్ట్ అయ్యారు. పలు నిబంధనలు..ఆంక్షలు విధిస్తోంది. మాస పూజల నిమిత్తం సోమవారం తెరుచుకోనుంది. దీనితో పలువురు మహిళలు ఆలయానికి వెళ్లడానికి సమాయత్తమవుతున్నారు. కానీ వీరిని అడ్డుకోవడానికి కొన్ని సంఘాలు సిద్ధమౌతున్నాయి. 
Image result for sabarimala don't send women journalistఇదిలా ఉంటే పలు మీడియా సంస్థలకు విశ్వహిందూ పరిషత్, శబరిమల కర్మ సమితి, హిందూ ఐక్యవేదికలతో కూడిన రైట్ వింగ్స్ సంయుక్త వేదిక పేరిట లేఖలు వచ్చాయి. సోమవారం నాడు ఆలయం తెరువనున్న నేపథ్యంలో శబరిమల ఆలయం వద్దకు మహిళా జర్నలిస్టులను పంపించవద్దని వారు లేఖలో కోరారు. ఇటీవలే కొంతమంది మహిళా జర్నలిస్టులు ఆలయంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వీరిని ఆందోళనకారులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తెలుగు జర్నలిస్ట్ మోజో కవిత సైతం ఆలయ ఎంట్రీ కోసం వెళ్లి.. నిరాశతోనే వెనుదిరగాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆలయాన్ని మూసివేయడంతో ఉద్రిక్తతలకు తెరపడింది.
అన్ని వయస్కుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీం ఇటీవలే తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. దీనిని పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తీర్పుకు వ్యతిరేకంగా కేరళ రాష్ట్రంలో ఆందోళనలు..నిరసన ప్రదర్శనలు జరిగాయి. కానీ సుప్రీం ఇచ్చిన తీర్పును అనుసరిస్తామని కేరళ సీఎం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సోమవారం మరోసారి ఆలయాన్ని తెరువనున్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

20:20 - November 1, 2018

తిరువనంతపురం : చదువుకు వయస్సుతో పనిలేదు. ప్రతిభకు ఓపికతో పనిలేదు. మనలో వున్న ప్రతిభను వెలికి తీస్తే అది అద్భుతాలను సృష్టిస్తుంది. వేలమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. కాటికెల్లే వయస్సులో చదువులేంటి? అనే విమర్శించినవారికి తన మార్కులతో నోరు మూయించింది ఈ బామ్మ. 30ఏళ్లు వచ్చేసరికే మోకాళ్ల నొప్పులు..40 ఏళ్లు వచ్చేసరికే వయసంతా అయిపోయినట్లుగా ఆరోగ్య పరిస్థితి మారిపోతున్న క్రమంలో అలప్పుజ జిల్లాకు చెందిన కార్తియాని అమ్మ అనే 96 ఏళ్ల వయస్సులో అద్భుతాన్ని సృష్టించింది. అందరి మన్ననలు అందుకుంటోంది. కేరళ ప్రభుత్వం నిర్వహించిన సాక్షరత కార్యక్రమం పరీక్షలో అలప్పుజ జిల్లాకు చెందిన కార్తియాని అమ్మ అనే 96 ఏళ్ల నూటికి 98 మార్కులు సాధించిన సంగతి తెలిసిందే. 98 మార్కులు సాధించిన కార్తియాని అమ్మను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సత్కరించారు. అనంతరం సాక్షరత కార్యక్రమం సర్టిఫికెట్‌ను బామ్మకు ప్రదానం చేశారు. ఈ సందర్బంగా సీఎంగారు బామ్మగారితో ముచ్చటించారు. ఎలా సాధ్యమైంది నూటికి 98 మార్కులు ఎలా సాధించారని బామ్మను మీడియా ప్రశ్నించగా.. తాను కాపీ కొట్టలేదని..తన పేపర్‌ను చూసి అందరూ కాపీ కొట్టారని చెప్పారు. దీంతో సీఎం పినరాయి విజయన్ తో పాటు మీడియా మిత్రులంతా నవ్వులే నవ్వులు..మరి ఇటువంటి సందర్భాలను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం చాలా వుంది కదూ.
https://twitter.com/ANI/status/1057938545627807744

16:26 - November 1, 2018

కేరళ : భారత్ తరపున 164 టెస్టులు, 344 వన్డే మ్యాచ్‌లు ఆడి రెండు ఫార్మాట్లలోనూ 10 వేల పరుగుల మైలురాయిని అందుకున్న అరుదైన ఆటగాడు రాహుల్ ద్రావిడ్.‘మిస్టర్ డిపెండబుల్’, ‘దివాల్’గా అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన ముద్రవేసిన భారత మాజీ క్రికెటర్, దిగ్గజం రాహుల్ ద్రావిడ్‌కు అరుదైన గౌరవం లభించింది.  భారత్ తరపున హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న ఐదవ భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కిన ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఆయనకు చోటు దక్కింది. 

Image result for rahul dravid hall of fameతిరువనంతపురం వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న చివరి వన్డే మ్యాచ్ ప్రారంభానికి ముందు సునీల్ గవాస్కర్ చేతుల మీదుగా ద్రవిడ్ ఈ జ్ఞాపికను అందుకున్నాడు. ఈ కార్యక్రమానికి భారత మాజీ స్పిన్ బౌలర్ కార్తీక్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ద్రవిడ్‌కు ముందు 2009లో గవాస్కర్, బిషన్ సింగ్ బేడీ, కపిల్ దేవ్, 2015లో అనిల్ కుంబ్లేలు ఈ గౌరవాన్ని పొందారు. 

10:40 - November 1, 2018

తిరువనంతపురం: కేరళకు చెందిన ఈ బామ్మగారి పేరు కార్తియనియమ్మ కృష్ణపిల్లా. ఈమె వయస్సు 96 ఏళ్లు. ఈమె సాధించిన ఘనత నేటి యువతరానికే ఆదర్శం. వయస్సు అయిపోయిందీ అనుకొనే వారందరికీ వెన్నుతట్టి ముందుకు నడిపించే పరాశక్తి కార్తియనియమ్మ.

ముదిమి వయస్సులో సాక్షరతా మిషన్ నిర్వహించిన 4వ తరగతి పరీక్షలో దుమ్మురేపింది. ఏకంగా 98 శాతం మార్కులతో టాపర్‌గా నిలిచింది. కార్తియనియమ్మ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ చేతులమీదుగా మెరిట్ సర్టిఫికెట్‌ను గురువారం అందుకోబోతోంది. ఈమె అలప్పూళ జిల్లాలోని ముట్టొమ్ గ్రామానికి చెందిన కార్తియనియమ్మ స్కూల్ ముఖం ఎరుగదు.  గుళ్లలో పనిచేసుకుంటూ జీవిస్తోంది. దాదాపు 43,000 వేల మంది ఈ పరీక్షలు రాయగా కార్తీయనియమ్మ క్లాస్ 4లో టాపర్‌గా నిలిచింది. 

 

 

14:57 - October 29, 2018

కేరళ : శబరిమల వివాదం కొనసాగుతునే వుంది. ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నాటి నుండి కొనసాగుతున్న దేశ వ్యాప్త చర్చ కాస్తా దేశాలయం తెరిచిన నాటి నుండి ఉద్రిక్తతగా మారింది. దేవాలయం ప్రవేశానికి మహిళలు యత్నించటం దీన్ని భక్తులు అడ్డుకోవటంతో ఉద్రిక్తతల నడుమ దేవాలయాన్ని మూసివేశారు. అయినా ఈ అంశంపై చర్చలు, మాటలు మాత్రం వాడి వేడిగానే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంల శబరిమలలో మహిళలు ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యతిరేకిస్తున్నారని కేరళ సీఎం పినరయి విజయన్ మండిపడ్డారు. ఆలయానికి వెళ్లేందుకు యత్నించిన మహిళలపై బీజేపీ, ఆరెస్సెస్ శ్రేణులు దాడికి తెగబడ్డాయని అన్నారు. సుప్రీంకోర్టునే బెదిరించేందుకు అమిత్ షాకు ఎన్ని గుండెలు? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Image result for amit shahమీ కుట్రలు గురజరాత్ లోనే ఇక్కడ కాదు..
కేరళలో వామపక్ష ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అమిత్ షా కుట్రలు చేస్తున్నారని... ఆయనకు ఉన్న బలం దానికి సరిపోదని విజయన్ వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వాన్ని కూల్చే శక్తి ఆయనకు లేదని ఎద్దేవా చేశారు. ఇలాంటి పనులు గుజరాత్ లో చేసుకుంటే మేలని హితవు పలికారు. కేరళలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అమిత్ షా కలలు కంటున్నారని...కేరళలో అడుగు మోపేంత స్థలం కూడా బీజేపీకి  లేదని సీఎం పినరాయి విజయం తీవ్రంగా మండిపడ్డారు. 
 

 

12:23 - October 27, 2018

తిరువనంతపురం: శబరిమలలో మహిళల ఆలయ ప్రవేశాన్ని సమర్ధించినందుకు  తిరువనంతపురం సమీపంలోని కుందమాన్‌కడవు లోని స్వామి సందీపానంద ఆశ్రమంపై గుర్తు తెలియని వ్యక్తులు శనివారం తెల్లవారు ఝామున దాడి చేశారు. ఈదాడిలో స్వామి సందీపానంద బాలికల పాఠశాల ముందు పార్క్‌చేసి ఉన్న రెండుకార్లు, ఒక స్కూటర్ అగ్నికి ఆహుతయ్యాయి. ఘటన తెల్లవారుఝూము గం.2-30 సమయంలో జరిగినట్లుగా పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన దుండగులు ఘటనా ప్రదేశంలో ఒక పుష్పగుచ్చం ఉంచారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. సమయానికి అగ్నిమాపక దళాలు ఘటనా స్ధలానికి చేరుకోవటంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్దానికులు అన్నారు.ఆశ్రమంలో స్వామి సందీపానంద, అతని సహాయకుడు మాత్రమే ఉంటున్నారు.
ఈ ఉదయం ఆశ్రమాన్ని సందర్శించిన కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ మాట్లాడుతూ "సిధ్ధాంత పరంగా ఎదుర్కోలేని పిరికి పందలు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని, చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోలేరని " వ్యాఖ్యానించారు.  శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల స్త్రీలకు ప్రవేశం కల్పిస్తూ గత నెలలో  సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పుడు స్వామి సందీపానంద  తీర్పును సమర్ధించారు. తీర్పును వచ్చిన తర్వాత కొందరు మహిళలు ఇటీవల శబరిమల ఆలయ దర్శనానికి వెళ్ళినప్పుడు ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తిన విషయం తెలిసిందే. నిరసనకారులు కొందరిపై భౌతిక దాడులు చేయగా, మరికొందరు ఇళ్లను కూడా ధ్వంసం చేశారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - కేరళ