కేంద్రం

18:34 - September 19, 2018

ఢిల్లీ : ట్రిపుల్ తలాక్ పై మరోసారి చర్చలు వేడిని రాజేస్తున్నాయి. ట్రిపుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలకు తీవ్రంగా అన్యాయం జరుగుతోందంటు గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా చర్చలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. దీనిపై కేంద్రం ప్రభుత్వానికి దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా పదే పదే ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో 'ట్రిపుల్ తలాక్' నేరంగా పరిగణిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ట్రిపుల్ తలాక్ అంశాన్ని బీజేపీ ఎప్పుడూ ఓ రాజకీయ క్రీడగానే చూస్తోందని, ఓట్ల కోసం, లేనిపోని క్రెడిట్ ఆపాదించుకునే ప్రయత్నమే ఇదని పేర్కొంది. కేంద్ర కేబినెట్ తీసుకున్న ఆర్డినెన్స్ ప్రకారం...తక్షణ ట్రిపుల్ తలాక్ చట్టవ్యతిరేకం అవుతుంది. భర్తకు మూడేళ్ల వరకూ జైలుశిక్ష పడుతుంది.
 కేంద్ర కేబినెట్ ఆర్డినెన్స్ నిర్ణయంపై కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా మాట్లాడుతు..ఓట్లకు గాలం వేసేందుకే కేంద్రం ట్రిపుల్ తలాక్ అంశాన్ని ఉపయోగించుకుంటోందని విమర్శించారు. 'పొలిటికల్ ఫుట్‌బాల్‌గా ట్రిపుల్ తలాక్ అంశాన్ని వాడుకోవడం ప్రధాని మోదీకి, బీజేపీకి ఒక అలవాటుగా మారిపోయిందన్నారు. ముస్లిం మహిళల సంక్షేమం కంటే ఓట్ల రాబట్టుకునే అంశంగానే ట్రిపుల్ తలాక్ ను చూస్తున్నారన్నారు. ప్రతిపాదిత ఆర్డినెన్స్‌ను రిలీజ్ చేయకుండా, పరిష్కారాలు చెప్పకుండా, ముస్లిం మహిళల లెవెనెత్తిన ఆందోళనకు సమాధానం ఇవ్వకుండా మోదీ ప్రభుత్వం, న్యాయమంత్రి 'బ్లేమ్ గేమ్' ఆడారని దెప్పిపొడిచారు. అబద్ధాలు, ఆరోపణలు చేయడం, తప్పుదారి పట్టించడం న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు అలవాటుగా మారినట్టుందన్నారు. ప్రతి అంశాన్ని కాంగ్రెస్‌తో ముడిపెట్టి సత్యదూరమైన ఆరోపణలకు దిగుతున్నారంటూ మండిపడ్డారు. మహిళా భద్రత అంశాన్ని పక్కనపెట్టి హడావిడిగా ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ తీసుకురావడం అసలు సమస్యను పక్కదారి పట్టించడమే అవుతుందని సూర్జేవాలా అన్నారు.

20:05 - September 5, 2018

అమరావతి : యువత ఆత్మహత్యలకు పాల్పడవద్దని, పోరాడి ప్రత్యేక హోదాను సాధించుకుందామని సీఎం చంద్రబాబు సూచించారు. తెలంగాణకు చెందిన బిల్లులను నాలుగు రోజుల్లో క్లియర్ చేసిన కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి కక్షకట్టినట్టు వ్యవహరిస్తోందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలకు రానప్పుడు జీతాలు ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. అమరావతిలో ఈరోజు జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వని బీజేపీకి అమరావతి బాండ్లపై మాట్లాడే అర్హత లేదని చెప్పారు. రాజధానికి ఓ రూపు వచ్చిందని తెలిపారు. 

07:32 - September 1, 2018

ఉమ్మడి హైకోర్టు విభజనపై ఏపీ ప్రభుత్వానికి, హైకోర్టుకు దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టుల ఏర్పాటుపై కేంద్రం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎకె సిక్రీ, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరురాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా వున్న హైదరాబాద్‌లో వేరే భవనంలో వేర్వేరుగా హైకోర్టుల ఏర్పాటుపై కేంద్రం ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా ఎందుకు హైకోర్టులను ఏర్పాటు చేయకూడదని కేంద్రం ఈ పిటిషన్‌లో పేర్కొంది. హైకోర్టు విభజన ఎంతమాత్రం జాప్యం చేయటం వీలులేదని తెలంగాణ తరపున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి, రెండు రాష్ట్రాలకు వేర్వేరు హైకోర్టులు ఏర్పాటు చేయాల్సిందేనని కేంద్ర న్యాయశాఖ తరపున అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌లు వాదించారు. కేంద్రం వాదనలతో తెలంగాణ ఏకీభవించింది. దీనిపై ఏపిలో హైకోర్టు భవన నిర్మాణాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా..దీనికి సంబంధించిన నిర్మాణాలు పూర్తి కాలేదని కేంద్రం న్యాయస్థానానికి తెలిపింది. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు రెండు ప్రతిపాదనలు పెట్టింది. ప్రస్తుత హైకోర్టు భవనంలో ఖాళీగా ఉన్న 24 హాళ్లలో ఏపికి వేరుగా హైకోర్టు ఏర్పాటు చేయవచ్చునని, లేదంటే రెండో ప్రత్యామ్నాయంగా ప్రస్తుత హైకోర్టు భవనాన్ని తాము ఖాళీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. చట్టసభలు, అధికారుల విభజన జరిగిందని, కానీ న్యాయవ్యవస్థ విభజన జరగలేదని ముకుల్‌ రోహత్గి కోర్టుకు విన్నవించారు. హైకోర్టు విభజన ఆలస్యం కావడం వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, న్యాయమూర్తుల్లో 40 శాతం ఉండాల్సిన తెలంగాణ వాటా కూడా లేదని కోర్టుకు తెలిపింది. కేసు వాదనల సమయంలో ఏపి ప్రభుత్వం తరపు న్యాయవాది గైర్హాజయ్యారు. దీంతో ఏపి ప్రభుత్వానికి, హైకోర్టుకు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను సుప్రీం కోర్టు ధర్మాసనం రెండు వారాలపాటు వాయిదా వేసింది. ఈ అంశంపై 10టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఏపీ బీజేపీ అధికార ప్రతినిథి ఆర్.డి. విల్సన్, కాంగ్రెస్ మాజీ ఎంపీ, తులసిరెడ్డి, టీఆర్ఎస్ నేత రాకేశ్ , టీడీపీ నేత లాల్ వజీర్ పాల్గొన్నారు. 

21:11 - August 30, 2018

తెలంగాణలో కొత్త జోన్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో ఏడు జోన్లు, రెండు మల్లీజోన్లకు కేంద్రం అంగీకారం తెలిపింది. దీనితో కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లకు అంగీకారం తెలిపింది. ఉపాధి విషయాల్లో స్థానికులకే అవకాశం వచ్చే విధంగా కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల నిరుద్యోగులు లబ్ధి పొందే అవకాశం ఉందని ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగస్తులకు కూడా లాభం కలుగుతుందని పలువురు పేర్కొంటున్నారు.అంశంపై 10టీవీ విశ్లేషణ..

 

20:45 - August 26, 2018

ఢిల్లీ : కేంద్ర ఎన్నికల కమిషన్‌ సోమవారం అన్ని రాజకీయ పార్టీలో సమావేశం ఏర్పాటు చేసింది. రాజకీయ పార్టీల కమిటీల్లో మహిళలకు రిజర్వేషన్లు, ఎమ్మెల్సీ ఎన్నికలకు వ్యయపరిమితి నిర్ణయించడం, ఓటర్ల జాబితాల సవరణకు శాశ్వత యంత్రాంగం ఏర్పాటు వంటి అంశాలపై చర్చించనుంది. 

18:20 - August 24, 2018

కేరళ : వరదలతో అతలాకుతలమైన కేరళకు యూఏఈ 700 కోట్ల సహాయంపై చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో భారత్‌లో ఆ దేశ రాయబారి అహమద్‌ అలబానా స్పందించారు. ఇప్పటివరకు అధికారికంగా ఎన్ని కోట్లు ఇవ్వాలన్నది ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. దీనిపై తమ ప్రభుత్వం అంచనా వేస్తోందని అలబానా పేర్కొన్నారు. విదేశీ ప్రభుత్వాల నుంచి ఆర్థిక సహకారాన్ని తీసుకునేది లేదని భారత ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. కేరళలో సహాయక చర్యలు, పురరావాసానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే సహకారం అందిస్తాయని విదేశాంగ ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ వెల్లడించారు. కేరళకు సహాయం అందించేందుకు యూఏఈ 700 కోట్లు, కతార్‌ 35 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కేరళ ప్రభుత్వం యూఏఈ సహాయం స్వీకరించడానికి శ్రద్ధ చూపుతోంది. కేరళ ప్రజలు యూఏఈ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని ఆ దేశ పాలకులు గుర్తించిన క్రమంలో యుఏఈని ఇతర దేశంగా పరిగణించలేమని చెబుతోంది. 

16:12 - August 6, 2018

ఢిల్లీ : ఏపీలోని వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చిన కేంద్రం వాటిని వెనక్కి తీసుకోవడంపై లోక్ సభలో టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం చర్యకు నిరసనగా లోక్ సభ నుంచి టీడీపీ ఎంపీలు వాకౌట్ చేశారు. అనంతరం పార్లమెంట్ ప్రాంగణంలో టీడీపీ ఎంపీలు అవంతి శ్రీనివాస్, జేసీ దివాకర్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, మురళీమోహన్ లు మీడియాతో మాట్లాడారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే నిధులు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఏపీపై కేంద్రం వివక్ష చూపడం మానుకోవాలని, 95 శాతం యూసీలు ఇచ్చినా కేంద్రం నిధులు ఇవ్వకపోవడం కక్ష సాధింపు చర్యేనని అన్నారు. ఫిబ్రవరి 9న వెనుకబడిన జిల్లాలకు రూ.350 కోట్లు విడుదల చేశారని, వారం రోజుల్లోగా పీఎంవో చెప్పిందంటూ వెనక్కి తీసుకున్నారని, ఏపీపై వివక్ష చూపుతున్నారనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. యూసీలు అందించడంలో దేశంలోనే ఏపీ 3వ స్థానంలో ఉందని, యూసీలు ఇవ్వడం లేదని ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేతలు అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ఏపీకి బుందేల్ ఖండ్ తరహాలో ప్యాకేజ్ అమలు చేస్తామన్నారని, అది అమలు చేస్తే రూ.22 వేల కోట్లు విడుదల చేయాలని అన్నారు. 

10:09 - August 3, 2018
07:04 - July 25, 2018

కేంద్రం పార్లమెంట్‌లో తీసుకవస్తున్న మోటర్‌ వెహికిల్‌ యాక్ట్‌ అమెండ్‌మెంట్ మీద వివిధ వర్గాల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది ఇప్పుడున్న రవాణా చట్టాలను తొంగలో తొక్కేదిగా ఉందని ఇది పెట్టుబడిదారులకు మేలు చేసేదిగా ఉందని వివిధ ప్రజా సంఘాలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. దీనికి నిరసనగా దేశవ్యాప్త సమ్మెకు సైతం తాము సిద్ధమని ప్రకటిస్తున్నాయి. దీనిపై స్టాఫ్‌ అండ్‌ వర్కర్‌ ఫెడరేషన్‌ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్‌. రావు విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:36 - July 25, 2018

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన చట్టం అమలు, ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఏపి విభజన చట్టంలోని హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. బిల్లులో పేర్కొన్న హామీల్లో 90 శాతం హామీలను కేంద్రం ఇప్పటికే నెరవేర్చిందని... మిగిలినవి కూడా పూర్తి చేయనున్నట్లు పేర్కొంది. రైల్వే జోన్‌పై ప్రతికూలంగా నివేదిక వచ్చినా జోన్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటివరకూ 6754 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. పోలవరం ప్రాజెక్ట్‌ కోసం తొలి కేబినెట్‌ భేటీలోనే తెలంగాణకు చెందిన 7 ముంపు మండలాలను ఏపీలో కలిపడమే తమ చిత్తశుద్ధికి నిదర్శనమని హోంశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాతో సమానంగా ప్రత్యేక ప్యాకేజీకి సిఎం చంద్రబాబు అంగీకరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు వ్యతిరేకంగా ఉన్నాయని మంత్రి తెలిపారు.

ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వొద్దన్న 14వ ఆర్థిక సంఘం ఏపికి మాత్రం 42 శాతం కేంద్రం నిధులు ఇవ్వాలని సూచించినట్లు ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయెల్‌ అన్నారు. రెవెన్యూ లోటు కింద ఏపీకి ఐదేళ్లలో 22 వేల కోట్లు ఇవ్వాలని ఆర్థిక సంఘం సిఫారసు చేసిందన్నారు. ఏపీకి చేస్తున్న సాయానికి ధన్యవాదాలు తెలుపుతూ సిఎం చంద్రబాబు లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

విభజన చట్టంలోని హామీల మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ఉన్నత విద్యా సంస్థలను మంజూరు చేసినట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. తిరుపతిలో ఐఐటి, ఐసిఈఆర్‌.... వైజాగ్‌లో ఐఐఎం, కర్నూల్‌లో ట్రిపుల్‌ ఐటిలు ఇప్పటికే నడుస్తున్నాయన్నారు. అనంతపూర్‌లో సెంట్రల్‌ యూనివర్సిటీని త్వరలోనే ప్రారంభిస్తామని... గిరిజన విశ్వవిద్యాలయానికి కూడా అప్రూవర్‌ లభించిదన్నారు. ఏపికి ప్రత్యేక హోదాపై కేంద్రం తన వైఖరిని వెల్లడించిన నేపథ్యంలో టిడిపి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది వేచి చూడాలి. 

Pages

Don't Miss

Subscribe to RSS - కేంద్రం