కరుణా నిధి

20:23 - August 9, 2018

సూస్తిరా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలు ఎట్లైనయో.. మనం ఈడ అంగీలు శింపుకుంటం.. అభిమానం ఉండాలేగని.. అది బానిసత్వానికి ప్రతిరూపంగ మారొద్దు.. కరుణానిధి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమన్న ఉన్నదా..? జగన్ మోహన్ రెడ్డిగారు పాదయాత్ర జేస్తున్నడు.. ఎందుకు..?అభిమానం ఉండాలేగని.. అది బానిసత్వానికి ప్రతిరూపంగ మారొద్దు.. జగన్ మోహన్ రెడ్డిగారు పాదయాత్ర జేస్తున్నడు.. ఎందుకు..? రేపు పొద్దుగాళ్ల పేపర్ల పొంట వస్తయ్ తాటికాయంత అచ్చరాలతోని.. ఘనంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలు.. రాజకీయాలు ఎంత దిగజారిపోయినయో సూడుండ్రి మొన్న ఒకనాడు ఒక బాండు బైటవడెనా..? డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం కేసీఆర్ రాజకీయ కొంప కొల్లేరు జేస్తట్టే గొడ్తున్నది..వర్దన్నపేట ఎమ్మెల్యేగారు.. మీరు రాజీనామా జేయవల్చిన ఎమ్మెల్యేల లిస్టుల ఫస్టు ప్లేస్ల ఉంటరేమో... పదో తర్గతి పోరడు ఉరివెట్టుకోని సచ్చిపోయిండు.. ఎందుకు..? గీ గరం గరం ముచ్చట్ల కోసం వీడియో క్లిక్ చేయండి. 

15:19 - August 8, 2018

చెన్నై : కరుణా నిధి గొప్ప జాతీయ నేత అని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. కరుణ పార్థీవ దేహానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల కోసం జీవించారని, సామాజిక న్యాయం కోసం కృషి చేశారని తెలిపారు. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, పార్టీ అధ్యక్షుడిగా ఆయన పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిందన్నారు. అలాంటి ఎన్నో ప్రతిభాపాటవాలున్న నేత ఇక లేకపోవడం బాధించదన్నారు. ఆయన మృతికి సంతాపం తెలియచేస్తున్నట్లు, కరుణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నట్లు వెల్లడించారు.

వీరప్ప మొయిలీ...
ఆయన మృతికి తీరని లోటని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ పేర్కొన్నారు. కరుణ పార్థీవ దేహానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సామాజిక న్యాయం, పేద ప్రజలకు ఆయన మృతి తీరని లోటన్నారు. ఎంతో చురుకుగా ఉంటూ రాజకీయాలను కొనసాగించారని, తమిళడు రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రజలు గొప్ప నాయకుడిని కోల్పోయారన్నారు. తాను ఆప్తమిత్రుడిని కోల్పోయాయన్నారు. 

15:17 - August 8, 2018

చెన్నై : తమ అభిమాన నాయకుడిని చూసేందుకు రాజాజీహాల్ కు భారీగా అభిమానులు చేరుకుంటున్నారు. తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కరుణా నిధి పార్థివ దేహం రాజాజీ హాల్ లో ఉంచిన సంగతి తెలిసిందే. ఆయనకు నివాళులర్పించేందుకు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు చెన్నైకి చేరుకుంటున్నారు. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీలు విచ్చేసి ఘనంగా నివాళలర్పించారు. కరుణ కుటుంబాన్ని ఓదార్చారు. వివిధ జాతీయ పార్టీల నేతలు కూడా విచ్చేసి నివాళులర్పించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులు చెనైకి చేరుకున్నారు. కాసేపటి క్రితం సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. ఆయనతో పాటు ఎంపీ కవిత, తదితరులున్నారు. నివాళి అర్పించిన అనంతరం... జోహార్ కరుణానిధి అంటూ కేసీఆర్ పిడికిలి బిగించారు. అనంతరం కరుణానిధి కుటుంబసభ్యులను కేసీఆర్ పరామర్శించారు.

14:51 - August 8, 2018

చెన్నై : తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పార్థివ దేహాన్ని సినీ, రాజకీయ రంగ ప్రముఖులు సందర్శించి నివాళుర్పిస్తున్నారు. సాయంత్రం మెరీనా బీచ్ లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అభిమానుల సందర్శనార్థం రాజాజీ హాల్ లో 'కరుణ' భౌతికకాయన్ని ఉంచారు. ఆయన కడసారి చూసేందుకు భారీగా అభిమానులు, డీఎంకే కార్యకర్తలు, నేతలు తరలివచ్చారు. ఆ ప్రాంతమంతా జనాలతో కిక్కిరిసిపోయింది. సాయంత్రం 4గంటల నుండి రాజాజీహాల్ నుండి కరుణానిధి అంతమయాత్ర జరుగనుంది. చెపాక్ స్టేడియం మీదుగా యాత్ర కొనసాగనుంది. సాయంత్రం ఆరు గంటలకు మెరీనా బీచ్ లోని అన్నా స్వ్కేర్ వద్ద అంత్యక్రియలు జరుగనున్నాయి.

అఖిలేష్ యాదవ్...
ఆయన జీవితంలో ఎన్నో విశేషాలు నెలకొన్నాయని అఖిలేష్ యాదవ్ తెలిపారు. కరుణా నిధి పార్థివ దేహానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పేద వారి కోసమే ఆయన జీవించారని, కేవలం 14 ఏళ్ల వయస్సు నుండే ప్రజల కోసం ఆలోచించారన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నట్లు తెలిపారు. 

13:15 - July 28, 2018

చెన్నై : తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కరుణా నిధి ఆరోగ్య పరిస్థితిపై అనిశ్చితి పరిస్థితి కొనసాగుతోంది. పైకి ఆరోగ్యంగానే ఉన్నారని చెబుతున్నా ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిన సంగతి తెలిసిందే. కావేరీ వైద్యు బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. డీఎంకే నేత స్టాలిన్, ఆయన కుటుంబసభ్యులు ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి రెండు గంటలకు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అనంతరం ఎలాంటి హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదు.

ఆయన ఆరోగ్య పరిస్థితి..చికిత్స ఇతరత్రా వాటిపై ప్రభుత్వం అప్రమత్తమైంది. కరుణ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తోంది. ఎప్పటికప్పుడు డిప్యూటి సీఎం పన్నీర్ సెల్వం పరిస్థితిని తెలుసుకుంటున్నారు. కరుణ చికిత్స..ఇతరత్రా వివరాలు ఎప్పటికప్ర్పుడు తెలుసుకోవాలని స్వయంగా ముఖ్యమంత్రి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ భాస్కర్ కు ఆదేశాలు జారీ చేశారు. 

Don't Miss

Subscribe to RSS - కరుణా నిధి