కరివెపాకు

11:09 - September 12, 2018

వంటల్లో కరివేపాకు కీలకం. ప్రతి కూరగాయి..ఇతర ఆహార పదార్థాల్లో దీనిని వాడుతుంటారు. కానీ చాలా మంది కరివేపాకును తీసి పారేస్తుంటారు. దీనివల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. మరి ఒకసారి ఉపయోగాలు...తెలుసుకోండి...

  • కరివేపాకు శరీరంలో ఉన్న కొవ్వును కరిగించడానికి ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకొనే వారు విరివిగా దీనిని ఆహారపదార్థంలో తీసుకుని చూడండి. అంతేగాకుండా ఆకులను నమిలి మింగినా ఫలితం ఉంటుందంట. 
  • ఇందులో విటమిన్ ఎ సమృద్ధిగా లభిస్తుంది. కళ్లకు సంబంధించిన సమస్యలను పొగొడుతుంది. కంటిచూపును కూడా మెరుగుపరచడంతో పాటు రేచీకటి సమస్యను దూరం చేస్తుంది. 
  • ఇక వెంట్రుకలు రాలడం...పలచబడడం..తదితర సమస్యలను చాలా మంది ఎదుర్కొంటుంటారు. వీరికి కరివేపాకు మంచి ఔషధం అని చెప్పవచ్చు. వెంట్రుకలు ఒత్తుగా పెరిగేందుకు కరివెపాకు సహాయ పడుతుంది. 
  • ఇందులో ఉండే కొన్ని ప్రత్యేక లక్షణాలు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించేందుకు కృషి చేస్తుంది. చక్కెర నియంత్రణలో ఉంటుంది. మూత్రసంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లను కరిగిస్తుంది.
09:33 - February 8, 2017

కరివేపాకులు తినడం వల్ల కొన్ని పోషకాలు అందుతాయనే విషయం తెలిసిందే. తద్వారా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వీటిని తినడమే కాకుండా అందానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ముఖానికి..తలకు పట్టించినా కూడా మంచిదే. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ కరివేపాకు వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి.

  • ముఖ వర్ఛస్సును పెంచడమే కాకుండా జుట్టుకి మెరుపుదనాన్ని ఇస్తుంది.
  • మొటిమలు..ఇతరత్రా వల్ల ముఖంపై మచ్చలు ఏర్పడుతుంటాయి. దీనిని నుండి బయటపడాలంటే కరివేపాకులకు కొద్దిగా నీరు చేర్చి మెత్తగా పేస్టు చేయాలి. ఇందులో కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఈ విశ్రమాన్ని మొటిమలు..మచ్చలున్న చోట రాయాలి. మంచి ఫలితం ఉంటుంది.
  • పచ్చి కరివెపాకులను ముద్దలా చేసి అందులో పెరుగు కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. తరువాత షాంపుతో స్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. చుండ్రు బాధ కూడా తగ్గుతుంది.
  • కొబ్బరినూనెని గోరువెచ్చగా మరగబెట్టి అందులో కరివేపాకులు వేయాలి. తలస్నానం చేసే ముందు ఆ నూనె బాగా తలకి పట్టించి ఓ అరగంట తరవాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చిన్న తనంలో జుట్టు నెరిసిపోయే సమస్య తగ్గుతుంది.
  • కరివేపాకు పేస్టులో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి మచ్చలున్న చోట రాయాలి. ఇలా తరచూ చేస్తే మచ్చలు తొలగిపోతాయి.
  • కరివేపాకు పేస్టులో ఆలివ్ నూనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆలివ్ నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి మృదుత్వాన్ని ఇస్తాయి.
10:10 - November 10, 2015

చిన్న వయసులోనే జుట్టు నెరసిపోతే.. కరివేపాకు ఉపయోగించండి. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ జుట్టు నెరవడం సహజమే. కానీ కొందరికి 20 ఏళ్లు కూడా నిండకుండా జుట్టు తెల్లబడిపోతుంది. ఈ సమస్య అమ్మాయిల్లో తలెత్తితే మరీ ఇబ్బందిగా ఉంటుంది. అలాంటివారికి కరివేపాకు హెయిర్‌ టానిక్‌లా పనిచేస్తుంది.
కరివేపాకును బాగా ఉపయోగించేవారికి జుట్టు అంత త్వరగా తెల్లబడదు. శిరోజ మూలానికి బలం చేకూర్చే గుణంతోపాటు జుట్టుకు మంచి రంగును ఇచ్చే గుణం కరివేపాకులో ఉన్నది.
ఇందుకుగాను ఒక కప్పు కొబ్బరి నూనెను తీసుకుని అందులో 20 కరివేపాకు ఆకులను వేసి కొద్దిసేపు వేడి చేయాలి. కరివేపాకులు నల్లగా మారిన తర్వాత వేడి చేయడం ఆపేసి దించేయాలి. ఇలా వచ్చిన నూనెను వారంలో రెండు మూడు సార్లు మాడుకు మర్దన చేస్తుంటే శిరోజాలు బాగా పెరగడంతోపాటు తెల్లబడటం కూడా తగ్గుతుంది. చక్కని రంగుతో నిగనిగా మెరిసిపోతాయి.

Don't Miss

Subscribe to RSS - కరివెపాకు