ఏసీబీ

12:50 - September 1, 2018

చిత్తూరు : రేణిగుంట ఆర్టీవో చెక్‌పోస్ట్‌పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మోటార్‌ వెహికిల్‌ ఇన్స్‌పెక్టర్‌ విజయ్‌ భాస్కర్‌పై వచ్చిన ఫిర్యాదు మేరకు దాడులు చేపట్టారు. విజయ్‌ భాస్కర్‌ ఇంటితో పాటు అతని బంధువులు, స్నేహితులు ఇళ్లపై అధికారులు ఏక కాలంలో దాడులు నిర్వహించారు. అనంతపురం, బెంగళూరు, తిరుపతి సహా 14 ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేపట్టారు. చెక్‌పోస్ట్‌లో లభించిన 14 వేల రూపాయల అక్రమ నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

15:46 - August 31, 2018

హైదరాబాద్ : ఏసీబీ వలకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడో లైన్‌మెన్‌ ఆకుల రాజేందర్‌. తన వద్దకు ట్రాన్స్‌ఫారం సిటీ మీటర్‌ కోసం వచ్చిన బాలకృష్ణ అనే వ్యక్తి వద్ద 50వేలు లంచం అడిగాడు. దీంతో బాలకృష్ణ ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. గచ్చిబౌలి సబ్‌ స్టేషన్‌లో 50వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి లైన్‌మెన్‌ రాజేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

13:29 - August 12, 2018

నిజామాబాద్ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న నిజామాబాద్‌ మాజీ మేయర్‌ సంజయ్‌ ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. గత కొన్ని రోజులుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న సంజయ్‌.. ఈరోజు ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. సంజయ్‌పై నర్సింగ్‌ విద్యార్థినులు అనేక ఆరోపణలు చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సంజయ్‌పై నిర్భయ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

16:13 - August 4, 2018

హైదరాబాద్ : బాలానగర్‌ ఎంఈవో శ్రీధర్‌ ఏసీబీ అధికారులకు చిక్కాడు. కూకట్‌పల్లిలోని ఓ ప్లే స్కూల్‌ యాజమాన్యం నుంచి లంచం తీసుకుంటున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

13:51 - July 24, 2018

అనంతపురం : ఏసీబీ వలకు మరో అవినీతి తిమింగళం చిక్కింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగం మేరకు అనంతపురం జిల్లా గుంతకల్లు రవాణాశాఖ కానిస్టేబుల్‌ రవీంధ్రనాథ్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. జిల్లా వ్యాప్తంగా రవీంద్రనాథ్‌కు చెందిన ఐదు చోట్ల దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 20 కోట్ల ఆస్తులు గుర్తించారు ఏసీబీ అధికారులు. 

13:24 - July 24, 2018

అనంతపురం : ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం పడింది. జిల్లాలో గుంతకల్లు రవాణాశాఖ కానిస్టేబుల్ రవీంద్రనాథ్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో తనిఖీలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఐదు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. 14 ఇళ్ల స్థలాలు, కిలో బంగారం, 2 కిలోల వెండి, భూములకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు రూ.20 కోట్ల అక్రమ ఆస్తులు గుర్తించారు. 

 

19:26 - July 19, 2018

హైదరాబాద్‌ : రాజేంద్రనగర్‌లో ఆదిలాబాద్‌ ట్రాఫిక్‌ సీఐ దాసరి భూమయ్య ఏసీబీకి పట్టుబడ్డారు. తాండూరులో భూమి కొనుగోలు చేసేందుకు రూ.10 లక్షల నగదుతో వెళ్తుండగా భూమయ్యను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే... డబ్బు తనది కాదంటున్న భూమయ్య బుకాయిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భూమయ్య భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు అనేక ఫిర్యాదులు ఉన్నట్లు సమాచారం. ఇక కరీంనగర్‌లోనూ భూమయ్య ఇళ్లలో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. 


 

20:37 - July 13, 2018
16:36 - July 13, 2018

హైదరాబాద్ : స్పోర్ట్స్‌ కోటాలో మెడికల్‌ సీట్ల కేటాయింపులో జరిగిన కుంభకోణంపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడ్డ తెలంగాణ జూడో అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ కైలాసం యాదవ్‌కు చెందిన ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు కొనసాగిస్తున్నారు అధికారులు. అక్రమాలకు పాల్పడ్డ ఎవ్వరినీ వదిలేది లేదంటున్నారు ఏసీబీ అధికారులు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్‌ అందిస్తారు. 

13:49 - July 11, 2018

మహబూబ్ నగర్ : అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. కొత్తకోట తహసీల్దార్ ఏసీబీకి చిక్కాడు. రూ.150000 లంచం తీసుకుంటూ ఎమ్మార్వో మల్లికార్జున్ రావు ఏసీబీకి పట్టుబడ్డాడు. 

Pages

Don't Miss

Subscribe to RSS - ఏసీబీ