ఏపీ

22:35 - September 25, 2018

భద్రాద్రి కొత్తగూడెం : ముంపు మండలాలపై తెలంగాణ అశలు పూర్తిగా తొలగిపోయాయి. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. పోలవరం ప్రాంతంలోని ఏడు ముంపు మండలాలపై కేంద్ర హోం శాఖ స్పష్టత ఇవ్వడంతో ఆయా మండలాలకు చెందిన ఓటర్లను ఏపీలో విలీనం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ముంపు మండలాల ఓటర్లను తాజాగా రంపచోడవరం, పోలవరం నియోజకవర్గంలో విలీనం చేశారు. ఆ మేరకు ఏపీ ప్రభుత్వం కూడా గెజిట్‌ జారిచేసింది. 


పోలవరం ముంపు మండలాలల్లో ఉన్న ఓటర్ల నమోదు పక్రియపై సందిగ్ధతతకు తెరపడింది. ఇప్పటి వరకూ పోలవరం ముంపు మండలలాల ఓటర్లను ఏ రాష్ట్రంలో నమోదు చేసుకోవాలవాలనే దానిపై స్పష్ట్తత రాలేదు. తాజాగా పోలవరం ఏడు  మండలాల్లో ఓటర్లను ఎపీలో విలీనం చేస్తూ కేంద్ర ఎన్నిక సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో ఎన్నికల కమిషన్ తాజా నోటిఫికేషన్‌తో ఈ ఓటర్లు ఎటువైపన్న సమస్యకు తెరపడింది. పోలవరం, రంపచోడవరం నియోజవర్గాల పునర్విభజనతో తెలంగాణ ముందస్తు ఎన్నికలకు సంబంధం లేకపోయినా ఎన్నికల కమిషన్ తానే ముందు నిర్ణయిం తీసుకోవడం విశేషం. ఈ సమస్య ఏపీలో ఎన్నికలకే వస్తుందని, తెలంగాణ ఎన్నిలకు సంబంధం లేదని ముందునుండీ ఈసీ చేబుతోంది. 

నోటిఫికేషన్ ప్రకారం 211 గ్రామాలు, 34 వేల కుటుంబాలను ఏపీలోకి వస్తాయి. రంపచోడవరం నియోజవర్గంలోని మారేడుమిల్లీ, దేవిపట్నం, వై.రామవరం, అడ్డతీగల, గంగవరం, రంపచోడవరం, రాజవోమ్మంగి, కూనవరం, చింతూరు, వి.ఆర్ పురం, యాటపాక మండలంలోని అన్ని గ్రామాలు, భద్రచలం రెవెన్యూ విలేజ్ మినహ మిగిలిన అన్ని గ్రామాలు ఏపీ కిందికి వస్తాయి. అలాగే.. పోలవరం నియోజకవర్గంలోని పోలవరం, బుట్టయాగూడెం, జీలుగు మిల్లి, కొయ్యలగూడెం, టి నరసాపురం, వేలేరుపాడు, మండలం, కుక్కునూర్ మండలంతోపాటు రెవెన్యూ విలేజ్ సీతారామనగరం, శ్రీధరా వేలేర్, గుంపాన పల్లి, ఘనపవరం, ఇబ్రహీంపేట్, రావిగూడెం గ్రామాలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో కలుస్తాయి. మొత్తానికి పునర్విజభన జరగకుండా నియోజకవర్గాల ఓట్లను రాష్ట్రం దాటించిన ఘటన బహుషా దేశంలోనే ఇది తొలిసారి కావోచ్చని అంటున్నారు ఎన్నికల కమిషన్ అధికారులు.

09:10 - September 25, 2018

అమెరికా : ఐక్యరాజ్య సమితిలో ఏపీ సీఎం చంద్రబాబు ‘సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత: అంతర్జాతీయ సవాళ్లు-అవకాశాలు’ అనే అంశంపై  ప్రసంగించారు. అనంతరం ఈ సమావేశవంలో పాల్గొన్న అంతర్జాతీయ సంస్థలు ఏపీలోని ప్రకృతి వ్యవసాయంపై ప్రశంసలు కురిపించాయి. 30 దేశాల్లో వ్యవసాయ-అటవీ రంగంలో పరిశోధనలు చేస్తున్న తమ సంస్థ ..ఏపీలో జరుగుతున్న సేంద్రీయ సేద్యాన్ని ఆసక్తికరంగా పరిగణిస్తోందని జీరో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో ఏపీ కొత్త ఒరవడి సృష్టిస్తోందని ఐసీఆర్‌ఏఎఫ్‌కి చెందిన ప్రపంచ అగ్రోఫారెస్ట్రీ సెంటర్ డీజీ టోనీ సైమెన్స్ తెలిపారు. అభివృద్ధిలోనే పరిశోధన ఉంటుందని...చంద్రబాబు ఆలోచన విధానంలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఏపీలో గ్లోబల్ సెంటర్ ఏర్పాటైన ఆశ్చర్యపడనవసరం లేదని టోనీ సైమెన్స్ పేర్కొన్నారు. ఏపీలో కూడా పరిశోధనలకు టోనీ సైమెన్స్ ఆసక్తి కనబర్చటం సీఎం చంద్రబాబు పరిపాలనా దక్షతకు..వ్యవసాయం రంగంలోను..అభివృద్ధిలోను ఆయనకు గల ముందుకు చూపుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

07:46 - September 25, 2018

అమెరికా  : ఐక్యరాజ్య సమితిలో మాట్లాడే అరుదైన అవకాశం దక్కించుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. కొద్దిసేపటి క్రితం ప్రసంగాన్ని తెలుగులోనే ప్రారంభించారు. ఐక్యరాజ్య సమితిలో పాల్గొనే అరుదైన అవకాశం దక్కటం అదృష్టంగా భావిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. ప్రపంచ ఆర్థిక వేదిక, బ్లూంబర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరం ఆధ్వర్యంలో ‘సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత: అంతర్జాతీయ సవాళ్లు-అవకాశాలు’ అనే అంశంపై చంద్రబాబు తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మనమంతా రసాయన ఎరువులతో పండించిన పంటలనే తింటున్నామన్నారు. ప్రకృతి వ్యవసాయంలో ఏపీ కొత్త ఒరవడి సృష్టిస్తోందన్నారు. ఐటీ నిపుణులు కూడా వ్యవసాయం వైపు దృష్టి సారిస్తున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీలో ప్రకృతి వ్యవసాయం ప్రపంచానికే ఆదర్శమన్నారు. ప్రకృతి వ్యవసాయం వల్ల భూమి కలుషితం కాదన్నారు. అంతేకాక, పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రకృతి సేద్యం తీరుతెన్నులను వివరించారు. అమ్మ జన్మ మాత్రమే ఇస్తే.. భూమి ఆహారం నుంచి అన్నీ ఇస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్నపూర్ణ అనే పేరు కూడా ఉందన్నారు. జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం వల్లే రైతులకు పెట్టుబడి తగ్గుతుందన్నారు. రసాయన ఎరువుల వాడకం వల్ల పంట దిగుబడుల్లో నాణ్యత లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగానే అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగంలో పేర్కొన్నారు.

 

13:00 - September 24, 2018

అరకు : మావోల తుపాకులతో దద్దరిల్లిన అందమైన అరకు అగమ్యగోచరంగా తయారయ్యింది. మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ మృతదేహాలకు శవపరీక్ష పూర్తిచేశారు. ఈ నేపథ్యంలో విశాఖ మన్యం మూగబోయింది. నిత్యం పర్యాటకులతో కళకళలాడే అరకు లోయ నిన్నటి నుంచి కళ తప్పింది. రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల పిలుపుతో అరకులో బంద్‌ కొనసాగుతోంది. వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డయి. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మన్యంలోని అన్ని ప్రాంతాలను గ్రేహౌండ్స్‌ దళాలు జల్లెడ పడుతున్నాయి. అల్లర్లను నివారించడంలో విఫలమయ్యారంటూ డుంబ్రిగూడ ఎస్‌ఐ అమ్మన్‌రావును డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ సస్పెండ్‌ చేశారు. ఈ ఘటనపై విచారణ కోసం విశాఖ డీసీపీ ఫకీరప్ప నేతృత్వంలో సిట్‌ ఏర్పాటుచేశారు.

ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల అంత్యక్రియలకు వెళ్లనున్న ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను ఆకాశమార్గంలో అరకుకు పంపడానికి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. అంత్యక్రియలకు జిల్లా మంత్రులు, ఇన్‌ఛార్జి మంత్రి, ప్రజా ప్రతినిధులంతా హాజరవనున్నారు. రోడ్డుమార్గంలో వెళ్లడం అంత శ్రేయస్కరం కాదని, భద్రతా కారణాల దృష్ట్యా ఆకాశ మార్గంలో నేతలను తరలించాలని యంత్రాంగం భావించింది. దీని కోసం ప్రత్యేకంగా ఒక హెలికాప్టర్‌ను సిద్ధం చేశారు. వెళ్లేవారి సంఖ్యను బట్టి అవసరమైతే రెండు, మూడు సార్లు హెలికాప్టర్‌ అటు ఇటు నడపాలని భావిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రజాప్రతినిధులు వెళ్లే మార్గాలను గోప్యంగా ఉంచుతున్నారు.

08:13 - September 24, 2018

విశాఖపట్నం : ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు...చివరిసారి ఎవరితో మాట్లాడారు. మరణాన్ని నవ్వుతూనే ఆహ్వానించారా ? మావోయిస్టులు తనను చంపేస్తారన్న విషయం సర్వేశ్వరరావుకు ముందే తెలుసా ? మరణాన్ని సర్వేశ్వరరావు ముందే ఊహించారా ?

2014 ఎన్నికల్లో అరకు నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన....ఎమ్మెల్యేగా విజయం సాధించారు కిడారి సర్వేశ్వరరావు. వైసీపీలో ఇమడలేకపోవడంతో....ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తర్వాత నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టి...గిరిజనుల్లో మంచి పేరు సంపాదించారు. అయితే చావును మాత్రం నవ్వుతూనే ఆహ్వానించారు. మనం కూడా శవం అవతాం కదా...అయితే అది ఒక రోజు ముందు లేదంటే వెనక అవ్వొచ్చన్నారు.

కిడారి సర్వేశ్వరావు హత్యకు ముందు రోజు రాత్రి...మంత్రి నక్కా ఆనంద్ బాబుతో మాట్లాడారు. తాను ఫోను చేస్తే.. సిగ్నల్స్ సరిగ్గా లేవని 15 నిమిషాల్లో ఫోన్ చేస్తానంటూ పెట్టేశారని మంత్రి నక్కా ఆనంద్ బాబు చెప్పారు. 20 నిమిషాల తర్వాత ఫోన్ చేశారని గుర్తు చేశారు. 25న విశాఖ వస్తున్నానని చెప్పిన సర్వేశ్వరరావు....ఆ రోజు జిల్లా మీటింగ్ ఉందని చెప్పారన్నారు.  ఇంతలోనే ఇలా జరగడం కలిచివేసిందన్నారు. ఇలా జరుగుతుందని ఊహించలేదన్నారు. 
ప్రజల సమస్యలను ఎప్పుడూ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ఉండేవారని టీడీపీ నేతలు చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే సోమ కూడా గిరిజనుల సంక్షేమం కోసం పాటు పడేవారని నేతలు గుర్తు చేస్తున్నారు. 

08:09 - September 24, 2018

విశాఖపట్నం : మావోయిస్టుల చేతిలో హతమైన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు...మాజీ ఎమ్మెల్యే శివెరి సోమ మృతదేహాలను అరకు క్యాంప్ కార్యాలయానికి తరలించారు. అరకు ప్రభుత్వాసుపత్రిలోనే ఇద్దరి మృతదేహాలకు వైద్యులు పోస్టుమార్టం నిర్వహించనున్నారు.  కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతదేహాలను చూసి...బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఇద్దరి మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత....బంధువులు కోరుకున్న చోట అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 
 

 

07:54 - September 24, 2018

విశాఖపట్నం : మావోయిస్టుల చేతిలో హతమైన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు...మాజీ ఎమ్మెల్యే శివెరి సోమ మృతదేహాలను అరకు క్యాంప్ కార్యాలయానికి తరలించారు. అరకు ప్రభుత్వాసుపత్రిలోనే ఇద్దరి మృతదేహాలకు వైద్యులు పోస్టుమార్టం నిర్వహించనున్నారు.  కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతదేహాలను చూసి...బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఇద్దరి మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత....బంధువులు కోరుకున్న చోట అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 
 

 

20:46 - September 21, 2018

అమరావతి : ఏసీ సీఎం చంద్రబాబు నాయుడికి ఐక్యరాజ్యసమితి అరుదైన గౌరవాన్ని అందించింది. ఐక్యరాజ్యసమితిలో ప్రసగించాల్సిందిగా చంద్రబాబును కోరుతు ఐక్యరాజ్యసమితి ఆహ్వానంపంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 22న అమెరికా పర్యటనకు బయల్దేరుతున్నారు. 28వ తేదీ వరకు ఆయన పర్యటన కొనసాగనుంది. 24వ తేదీన ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఆయన ప్రసంగించనున్నారు. 'సుస్థిర వ్యవసాయాభివృద్ధిలో ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లు-ఏపీలో సహజ వ్యవసాయాభివృద్ధి విధానాలు' అనే అంశంపై ఆయన ప్రసంగించనున్నారు. 
అనంతరం 25న వరల్డ్ ఎకనామిక్ ఫోరం-ఏపీ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. 26న కొలంబియా యూనిర్శిటీలో 'గవర్నెన్స్ ఇన్ ది ఏజ్ ఆఫ్ టెక్నాలజీ అనే అంశంపై ప్రసంగిస్తారు. అమెరికాకు చంద్రబాబుతో పాటు మంత్రి యనమల, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, మరో ఆరుగురు అధికారులు కూడా వెళ్తున్నారు.

 

18:13 - September 21, 2018

అనంతపురం : టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై ప్రబోధానంద స్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. 2003లో ఆశ్రమంలోని కృష్ణ మందిరం ప్రారంభోత్సవానికి దివాకర్ రెడ్డిని తాము పిలిచామని ఆయన తెలిపారు. ఆయనకు తాము డబ్బు ఇవ్వలేదనే కారణంతో తమపై ఆయన కక్షగట్టారని, తమను ఎంతో వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. కక్షతో పక్క గ్రామాల ప్రజలను ఉసిగొల్పారని ప్రబోధానంద మండిపడ్డారు. తమ ఆశ్రమంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగడం లేదని స్పష్టం చేశారు. ఐఏఎస్ లు, ఐపీఎస్ లు కూడా ఆశ్రమానికి వస్తుంటారని..ప్రచారం కోసం తాము పాకులాడటం లేదని ప్రభోదానంద అన్నారు. 

 

17:58 - September 21, 2018

విజయవాడ  :  జనసేన పార్టీ పుట్టి కొంతకాలం అీయినా..ప్రత్యక్షంగా 2019 ఎన్నికలో్ల బరిలోకి దిగబోతోంది.  ఈ నేపథ్యంలో పార్టీ తరపు నుండి బరిలోకి దిగే అభ్యర్థులపై జనసేన కసరత్తు చేస్తోంది. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు కప్పలు గెంతినట్లుగా నేతలు ఆ పార్టీలో నుండి ఈ పార్టీలోకి గెంతటం సర్వసాధారణంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో తర పార్టీల్లో సీట్లు వచ్చే అవకాశం లేని నాయకులను తమ పార్టీలోకి తీసుకునేందుకు జనసేన నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియర్లు దొరకని నియోజకవర్గాల్లో కొత్త వారిని రంగంలోకి దించే అవకాశాలు ఉన్నాయని జనసేన పార్టీ నాయకులు తెలిపారు. 
ఇప్పటికే రాజకీయ కుటుంబాల వారసులు తమతో టచ్‌లో ఉన్నారని సదరు నేత తెలిపారు. విజయవాడలో కీలకంగా వున్న సెంట్రల్‌ నుంచి సీపీఎం తరఫున గతంలో పోటీ చేసిన బాబూరావు బరిలోకి దిగే అవకాశం ఉంది. పశ్చిమ నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పోటీ చేయవచ్చునని చెబుతున్నారు.
 ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ రెండవ కుమార్తె విజయవాడ లేదా మచిలీపట్నం పార్లమెంటు సీటు అడుగుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌కు సన్నిహితుడు తోట చంద్రశేఖర్‌ భార్య అనురాధ అవనిగడ్డ ప్రాంతానికి చెందినవారు కావడంతో అవనిగడ్డ అసెంబ్లీ లేదా మచిలీపట్నం పార్లమెంటు నుంచి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్టు పార్టీ వర్గా లు తెలిపాయి. మాజీమంత్రి సింహాద్రి సత్య నారాయణ మనమడు రామచరణ్‌ పేరు కూడా ఈ స్థానాలకు వినిపిస్తోంది. జగ్గయ్య పేట సీటు వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మేనల్లుడు అడుగుతున్నారు. ప్రస్తుతం ఆయన సాఫ్ట్‌వేర్‌రంగంలో ఉన్నారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - ఏపీ