ఎన్నికలు

10:00 - September 18, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ ముమ్మరం చేస్తోంది. సాంకేతిక అంశాలపై అధికారులకు శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్లు, అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

రాష్ర్టంలో ఎన్నికల ఏర్పాట్లలో వేగం పెంచారు ఎన్నికల ప్రధానాధికారి. సుప్రీం కోర్డు తీర్పు మేరకు ఈవీఎంలతోపాటు.. వివిప్యాట్ ను ఉపయోగించనున్నారు. జిల్లా కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ అధికారులతో ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ సమావేశం నిర్వహించారు. వివి ప్యాట్‌ వినియోగంపై  శిక్షణ ఇచ్చారు. 

 న్నికల ఏర్పాట్లపై అధ్యయనానికి కేంద్ర ఎన్నికల బృందం మరోసారి పర్యటించనుంది. దీనికి ముందు రాష్ర్ట ఎన్నికల అధికారులతో ఢిల్లీలో ఈసీ భేటీ కానున్నట్లు సమాచారం. మొత్తంగా ఒకటి, రెండు రోజుల్లో ఢిల్లీలో ఈసీ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా.. ఎన్నికలు ఎప్పుడన్నది తేలనుంది. పలు పార్టీలు ఓటర్లతో చేయించిన తీర్మాణాలపై ఈసీ స్పందించింది. బలవంతంగా తీర్మానాలు, ప్రతిజ్ఞలు చేయించినట్లు తమ  దృష్టికి వస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరిస్తోంది. 

20:30 - September 17, 2018

ఢిల్లీ: జేఎన్‌యూలో మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఏదో ఒక వివాదంలో నిత్యం వార్తల్లో వుండే జేఎన్‌యూలో జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల ఫలితాల సందర్భంగా ఘర్షణలు జరిగాయి. విద్యార్థి సంఘం ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది సేపటితే ఏబీవీపీ, ఏఐఎస్ఏ విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. యూనివర్సిటీ క్యాంపస్‌లో జరిగిన ఈ ఘర్షణలో జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన ఎన్.సాయిబాబాపై పలువురు ఏబీవీపీ నేతలు దాడికి పాల్పడ్డారు.
బ్యాలెట్ బాక్సులను తీసివేసేందుకు ప్రయత్నించడం వంటి ఘటనలపై కొంతమందిని సస్పెండ్ చేశారు. ఆ సమయంలో కూడా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కాగా ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం, అర్థరాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణలు మరోసారి భగ్గుమన్నాయి. 
ఈ విషయమై ఇరు వర్గాలు భిన్న వాదనలు వినిపించాయి. లెఫ్ట్ విద్యార్థి సంఘాలకు చెందిన నేతలు తమపై దాడికి పాల్పడ్డాయని ఏబీవీపీ నేతలు ఆరోపించారు. ఆర్ఎస్ఎస్-ఏబీవీపీ నేతలు తమపై మూక దాడులకు దిగారని లెఫ్ట్ విద్యార్థి సంఘాలకు చెందిన నేతలు తెలిపాయి. 
యూనివర్సిటీలో జరిగిన ఎన్నికల్లో ఐక్య వామపక్ష కూటమి  ఘన విజయం సాధించింది. ఆదివారం ప్రకటించిన ఫలితాల్లో సాయిబాలాజీ సహా.. 4 కేంద్ర ప్యానెళ్లను వామపక్ష కూటమి సొంతం చేసుకుంది. దీన్ని తట్టుకోలేకపోయిన ఏబీవీపీ విద్యార్థి సంఘం నేతలు ఏదో విధంగా క్యాంపస్‌లో వివాదాలు  సృష్టించేందుకు శతవిధాలు యత్నిస్తున్నాయి. 

 

13:03 - September 15, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమీత్ షా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు శనివారం హైదరాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లడారు. కేసీఆర్ ప్రభుత్వంపై పలు విమర్శలు..ప్రశ్నలు సంధించారు. జమిలి ఎన్నికలను కేసీఆర్ మొదట సమర్థించారని, కానీ ముందస్తుకు వెళ్లారని తెలిపారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో రాజకీయ స్వార్థం ఉందని ఆరోపించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వల్ల ప్రజలప కోట్లాది రూపాయల భారం పడుతుందని..ఈ విషయం తెలిసినా ఎందుకు భారం మోపుతున్నారని సూటిగా ప్రశ్నించారు. 

రాజకీయ స్వార్థం కోసం కోట్ల రూపాయల ఖర్చు మోపారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర నియోజకవర్గంలోని ప్రతొక్క సీటుకు పోటీ చేస్తామని ప్రకటించారు. 2014-16 సంవత్సర కాలంలో బీజేపీ పటిష్టత్వానికి కృషి చేయడం జరిగిందని, ఈ మధ్యకాలంలో బీజేపీ పార్టీ ప్రతిష్ట పెరిగిందన్నారు. 

సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం ఎందుకు బంద్ చేశారని ప్రశ్నించారు. ఎంఐఎం ఒత్తిడితోనే కార్యక్రమం నిర్వహించడం లేదన్నారు. తెలంగాణాను రజాకార్ల చేతుల్లోకి పెడుతారా ? ఆలోచించాలని ప్రజలకు సూచించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కేసీఆర్ పలు ప్రయత్నాలు చేశారని, ఇలాంటి ప్రభుత్వం మళ్లీ వస్తే ఇలాంటివి పునరావృతమవుతుందన్నారు. రాష్ట్రంలో మహా కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, పివి నరసింహరావు, అంజయ్యలను కాంగ్రెస్ అవమానాలకు గురి చేసిందన్నారు. 

దళితులకు కేసీఆర్ ఒక వాగ్ధానం ఇచ్చారని, ఈ విషయం దళితులు మరిచిపోలేరని తెలిపారు. 2018లో అలాంటి హామీని నెరవేరుస్తారా ? అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు, అమరవీరులకు ఎన్నో హామీలిచ్చారని గర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం సహకారం అందించిందని, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులను ప్రపంచస్థాయికి చేరుస్తామన్న హామీ ఏమైందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరి చెప్పాలన్నారు. 

కేసీఆర్ పాలన చూసిన తరువాత మళ్లీ టీఆర్ఎస్ వస్తుందని అనుకోవడం లేదన్నారు. అవకాశవాద రాజకీయాలు చేయడం లేదా ? తన కుటుంబం కోసం కేసీఆర్ ముందస్తుకు వెళుతున్నారని అందరికీ తెలుసన్నారు. రాష్ట్రంలో ఎన్ని డబుల్ బెడ్ రూంలు కట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. కుటుంబ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమని, మూఢ నమ్మకంతో సచివాలయానికి వెళ్లకపోవడం సబబేనా ? నేరళ్లలో ఇసుక మాఫియాను ప్రశ్నిస్తే దళితులను వేధించారని, మద్దతు అడిగిన రైతులని ఖమ్మంలో అరెస్టు చేయించారని విమర్శించారు. టీఆర్ఎస్ పాలనలో 4500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, కనీసం కేంద్ర పథకాలను కూడా ఉపయోగించుకోలేదన్నారు. ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్ ఏమైంది ? అని ప్రశ్నించారు. వెనుకబడిన జిల్లాల కోసం రూ. 900 కోట్లు నిధులు, 13వ ఆర్థిక సంఘం ద్వారా రూ. 16,597 కోట్లు...తెలంగాణకు అనేక విద్యా సంస్థలు మంజూరు...ఎయిమ్్స తో పాటు కొత్త వర్సిటీల మంజూరు చేయడం జరిగిందని అమిత్ షా వెల్లడించారు. 

 

07:57 - September 15, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు బీజేపీ రెడీ అవుతోంది. పాలమూరు బహిరంగ సభ వేదికగా...ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. ఒంటరిగా వెళ్లాలని డిసైడ్ బీజేపీ నేతలకు....దిశానిర్దేశం చేసేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శనివారం హైదరాబాద్ రానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రేణులకు సూచనలు చేయనున్నారు. 

తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి రాజుకుంది. అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్...బహిరంగ సభలతో దూసుకెళ్తున్నారు. మహాకూటమి నేతలు భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా బీజేపీ సైతం ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధమయింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.....ఇవాళ హైదరాబాద్ రానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు సూచనలు చేయనున్నారు. ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించిన షా....ఇందుకనుగుణంగా డైరెక్షన్ కూడా ఇచ్చారు. పాలమూరులో జరగనున్న బహిరంగ సభ నుంచి...అమిత్ షా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.

మరోవైపు అభ్యర్థులను ఎలా ఎంపిక చేయాలన్న దానిపై రాష్ట్ర నాయకత్వానికి అమిత్ షా పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను పార్టీలోకి ఆహ్వానించడంతో పాటు మేధావులు, ప్రముఖులు, ప్రజా సంఘాల్లో యాక్టివ్ గా ఉన్న వారిని గుర్తించి చేర్చుకోవాలని చెప్పినట్లు సమాచారం. అంతటితో ఆగని అమిత్ షా....గెలుపు గుర్రాలను వెతికి పట్టుకునేందుకు సర్వేలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రచారంతో హోరెత్తిస్తూనే...బలమైన నేతలను బరిలోకి దించేందుకు పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది బీజేపీ. అమిత్ షా ప్రచార హోరుకు పార్టీ ఏ మేరకు కలిసి వస్తుందో వేచి చూడాలి.

07:06 - September 15, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు వేగవంతం చేసింది. పోలింగ్ బూత్‌ల వారిగా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్. ఈవీఎం మిషన్లు వచ్చిన వెంటనే రాజకీయ పార్టీల సమక్షంలోనే పరిశీలిస్తామని స్పష్టం చేశారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేందుకు... ప్రక్రియను కేంద్ర ఎన్నిక కమిషన్‌ వేగవంతం చేసింది. ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. 32 వేల 574 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్ల జాబితాల పరిశీలనకు ఏర్పాట్లు  చేశామన్నారు. ఓటర్ లిస్ట్‌లతో పోలింగ్ బూత్‌ల వారిగా విభజన జరుగుతోందన్న ఆయన... ఓటర్ జాబితాలోని అభ్యంతరాలన్నీ పరిష్కరిస్తామని రజత్ కుమార్ స్పష్టం చేశారు.

11:36 - September 14, 2018

హైదరాబాద్ : కాషాయం దళం ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనుంది. పార్టీ జాతీయ  అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ రాష్ట్రంపై ప్రధానంగా దృష్టి పెట్టారు. పక్కా ప్రణాళిక, వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలో అమిత్ షా అడుగు పెట్టనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న అనంతరం బషీర్ బాగ్ లోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కీలక నేతలతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో ఎలా ప్రచారం నిర్వహించాలి ? తదితర వివరాలను ఆయన నేతలకు దిశా..నిర్దేశం చేయనున్నారు. 

మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వ పథకాలను...రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని షా నిర్దశం చేయనున్నారు. ఈ ఎన్నికల్లో ఒంటిరిగా పోటీ చేయాలని బీజేపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల్లో ఉన్న నేతలను ఆకర్షించడం...బీజేపీపై అభిమానం ఉన్న వారిని పార్టీలోకి చేరిపించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసే వారిపై పార్టీ అధిష్టానం నిర్వహించినట్లు, వారికి టికెట్ కేటాయించనున్నటు్ల సమాచారం. మరి షా పర్యటన తెలంగాణలో బీజేపీ నేతలకు బూస్ట్ ఇస్తుందా లేదా ? అనేది చూడాలి. 

10:45 - September 12, 2018

ఢిల్లీ : నోటా...ఎందుకు తీసేశారు..అయ్యో వచ్చే ఎన్నికల్లో ఆప్షన్ లేకపోతే ఎలా ? అంటూ కంగారు పడకండి. పూర్తిగా చదవండి. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు నచ్చకపోతే తిరస్కరణ ఓటు వేసే అధికారాన్ని కల్పిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటర్లకు అవకాశం కల్పించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో అభ్యర్థుల గుర్తుతోపాటు నోటా (నన్ ఆఫ్ ది ఎబవ్) ను ఏర్పాటు చేశారు.

కానీ ఈ నోటా ఆప్షన్ ఆ ఎన్నికల్లో ఉండదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్‌ పేపర్లలో నోటా గుర్తును తొలగిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) మంగళవారం ప్రకటించింది. ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్‌కు సవరణలు సూచిస్తూ సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ల బెంచ్‌ తీర్పు చెప్పింది. కేవలం రాజ్యసభ ఎన్నికలకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపింది. లోక్ సభ, శాసనభ వంటి ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రమే నోటా ఉంటందని వెల్లడించింది. 

 

07:22 - September 11, 2018

హైదరాబాద్ : ముందస్తు ఎన్నికలపై ఈసీ దూకుడు పెంచింది. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌.... సోమవారం ఢిల్లీ వెళ్లారు. కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఎన్నికల నిర్వహణ, సిబ్బంది, ఈవీఎంలు, బందోబస్తు తదితర అంశాలపై ప్రాథమికంగా చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ముందస్తు ఎన్నికల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రస్తుత సమావేశం కేవలం ప్రాథమిక స్థాయిలోనే జరిగిందని చెప్పారు. మరోవైపు తెలంగాణలో జరుగనున్న ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు  మంగళవారం రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల బృందం రానుంది. సాయంత్రం రాష్ట్రానికి వచ్చే ఉమేష్‌కుమార్‌ నేతృత్వంలోని ఈ బృందం... అందరి అభిప్రాయలు సేకరించనుంది. సాయంత్రమే  గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభిప్రాయాలు సేకరిస్తారు. మరునాడు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయ్యి ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలు తెలుసుకుంటారు. అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి 6.30 వరకు సచివాలయంలో సీఎస్‌, డీజీపీతో సమావేశంకానున్నారు. 

 

07:13 - September 11, 2018

విజయవాడ : వచ్చే ఎన్నికల్లో ప్రజల మనస్సులను ఎలా చూరగొనాలి ? ప్రజలను ఎలా ఆకర్షించాలి ? వైసీపీ పట్ల మొగ్గు చూపేందుకు ఎలాంటి వ్యూహాలు రచించాలి ? అనేది దానిపై వైసీపీ ప్రణాళికలు రచిస్తోంది. ప్రజల సమస్యలను తెలుసుకొనేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా ‘ఇంటింటికి వైసిపి’ పేరిట ఓ కార్యక్రమం నిర్వహించాలని వైసీపీ యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు మంగళశారం విశాఖలో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన ఆ పార్టీ రాష్ట్రస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు హాజరుకానున్నారు. ఇందుకోసం నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఎన్నికల ఏడాది నేపథ్యంలో డిసెంబర్‌లోగా 'ఇంటింటికి' పార్టీ నేతలను పంపి టీడీపీ హామీలను ఎండగడుతూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది. ఈ సమావేశంలో ప్రధానంగా దీనిపై చర్చించి.. కార్యాచరణ రూపొందించనున్నారు. అలాగే నేతలంతా 175 నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజాసమస్యలను తెలుసుకునే విధంగా ప్రణాళిక రూపొందించనున్నారు. ఇక సర్కార్‌ వైఫల్యాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి.. ప్రజల వద్ద ఎలా ప్రస్తావించాలనే అంశాలపై నేతలకు జగన్‌ దిశా నిర్దేశం చేయనున్నారు. అలాగే వైసీపీ ఎజెండాలో ప్రధానమైన నవరత్నాలపై విస్తృతంగా ప్రచారం చేసేందుకు జగన్‌ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. 

18:19 - September 9, 2018

ఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ దుందుడుకుగా ప్రవర్తిస్తోందని...భవిష్యత్ లో ఒకే దేశం..ఒకే ఎన్నికలు జరగాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ పేర్కొన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అజయ్ భారత్ - అకల్ప్ బీజేపీ నినాదంతో ముందుకు వెళ్లాలని సూచించినట్లు తెలిపారు. గతంలో సాధించిన లోక్ సభ సీట్ల కంటే అధికంగా సాధించాలని..తప్పకుండా సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారని తెలిపారు. పోలింగ్ బూత్ లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం ద్వారా లబ్దిపొందిన వారిని కలుస్తామని..వీరిని బీజేపీ వైపు మొగ్గు చూపేందుకు ప్రయత్నిస్తామన్నారు. మోడీ ఇచ్చిన స్పూర్తితో ముందుకెళుతామని...పేర్కొన్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - ఎన్నికలు