ఎక్సైజ్

18:28 - January 13, 2018

పశ్చిమగోదావరి జిల్లా : జంగారెడ్డిగూడెం ఎక్సైజ్‌ అధికారులు నాటు సారా స్థావరాలపై దాడులు చేస్తున్నారు. సంక్రాంతి కావడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ నాటుసారా ఎక్కువగా ఉండటంతో దాడులు చేశారు. జంగారెడ్డి గూడెం ఎక్సైజ్‌ సర్కిల్‌ పరిధిలో ముద్దప్పగూడెం, పంగిడిగూడెంలో దాడులు నిర్వహించి.. పద్దెనిమిది వందల లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేశారు. నాటుసారా తయారు చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. నాటుసారాతో పాటు ఎక్కడైనా బెల్ట్‌ షాపుల్లో మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని.. ఎక్సైజ్‌ అధికారులు హెచ్చరించారు. 

06:24 - November 8, 2017

హైదరాబాద్ : నాంపల్లిలోని వక్ఫ్‌బోర్డు కార్యాలయాన్ని హైదరాబాద్‌ కలెక్టర్‌ సీజ్‌ చేశారు. సమగ్ర భూ సర్వే నేపథ్యంలో వక్ఫ్‌బోర్డుఓలని కొందరు అధికారులు కబ్జాదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. భూ కబ్జాలు నిజమేనని తేలడంతో వక్ఫ్‌బోర్డు ఆఫీసును సీజ్‌చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. దీంతో పెద్ద ఎత్తున పోలీసులతో తరలివెళ్లిన ఆర్డీవో చంద్రకళ హజ్‌హౌస్‌ను సీజ్‌ చేశారు.  

10:10 - October 11, 2017

 

కరీంనగర్ : ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, కరీంనగర్ జిల్లాలో ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. కరీంనగర్ టౌన్, రామడుగు మండలం గోపాలరావు పేట లో కూడా ఏసీబీ సోదాలు చేస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

10:46 - September 29, 2017

విశాఖ : ఎక్సైజ్‌ శాఖ దాడుల్లో ఇన్నాళ్లూ స్మగ్లర్లు, కూలీలే పట్టుపడుతున్నారు తప్ప సొంతశాఖ ఉద్యోగులు దొరక్క పోవడం గమనార్హం. ముఖ్యంగా అనకాపల్లి ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పరిధిలోకి వచ్చే ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణా విస్తృతంగా జరుగుతోంది. దీనిని అరికట్టాల్సింది పోయి ఆ పరిధిలోని కొంతమంది సిబ్బంది, అధికారులపైనే ఆరోపణలు వస్తున్నాయి. గంజాయి రవాణాకు సహకరిస్తున్న సొంత శాఖ వారు దొరకలేదని కాదు..ఇప్పటికే ఎందరో పట్టుబడ్డారు..అందులో కొందరు తప్పించుకుతిరుగుతున్నారు....అనకపల్లి పరిధిలోని పాడేరు మొబైల్‌ సీఐ పెదకాపు శ్రీనివాస్‌ ఇప్పటికే పోలీసులకు చిక్కి సస్పెండయ్యారు. ఆరు నెలలుగా ఆయన పత్తా లేకుండా పోయారు. తాజాగా అనకాపల్లి ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్సు కానిస్టేబుల్‌ నాయుడు గంజాయి విక్రయాల్లో చిక్కుకున్నారు..విజయవాడలో గంజాయితో పట్టుబడ్డ నిందితులిచ్చిన సమాచారంతో కానిస్టేబుల్‌ నాయుడు పేరు బయటకొచ్చింది. దీనిపై ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు స్పందించారు. ఈ వ్యవహారం వెలుగు చూడడంతో నాయుడు పరారీలో ఉన్నారు.

ఓ మంత్రిని ఆశ్రయించినట్టు
ఇక కానిస్టేబుల్‌ నాయుడు తను కేసు నుంచి బయటపడేందుకు జిల్లాకు చెందిన ఓ మంత్రిని ఆశ్రయించినట్టు తెలిసింది. మరోవైపు గంజాయి అక్రమ రవాణాలో పాడేరు మొబైల్‌ టీమ్‌ సీఐ పెదకాపుపై కేసు నమోదయింది. దీంతో ఆయనను గతంలోనే సస్పెండ్‌ చేశారు. దాదాపు ఆరు నెలల నుంచి ఆయన పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో ఎక్సైజ్‌ సోమవారం స్టాట్యుటరీ నోటీస్‌ జారీ చేయనున్నారు. అనంతరం నిబంధనల ప్రకారం శ్రీనివాస్‌ను ఉద్యోగం నుంచి తొలగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వరరావు తెలిపారు. ఇక గంజాయి రవాణాపై అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు...సొంత శాఖవారే సహకరిస్తున్నారన్న నిజాలు తట్టుకోలేకపోతున్నారు....దీంతోనే ఉక్కుపాదం మోపేందుకు పక్కా ప్రణాళిక సిద్దం చేశారు...అనకాపల్లి కేంద్రంగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ బృందంలో ఎక్సైజ్, పోలీసు, రెవెన్యూ, అటవీ, వ్యవసాయ, ఉద్యానవన శాఖ ఉద్యోగులు ఉంటారు. వీరు ప్రత్యేక దృష్టి సారించి అక్రమ గంజాయి సాగు, రవాణాలను అరికట్టేందుకు పాటుపడతారు. గంజాయి అక్రమ రవాణాలో సంబంధాలున్న ఎక్సైజ్‌ సిబ్బంది, అధికారుల జాబితాను ఇప్పటికే ఉన్నతాధికారులు సిద్ధం చేసినట్టు సమాచారం. త్వరలోనే వారిపై వేటు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వరరావు విశాఖలో మకాం వేసినట్లు తెలుస్తోంది.

10:44 - September 29, 2017

విశాఖ : గంజాయికి కేంద్రంగా ఉన్న విశాఖ జిల్లాలో సరికొత్త మత్తు దందా కొనసాగుతుందా...ఇంతకాలం స్మగ్లర్లు...వివిధ ముఠాలు మాత్రమే అక్రమ రవాణా చేస్తున్నాయని తెలుసు...కాని జిల్లాలో ఎక్సైజ్‌ శాఖలోని కొందరు అక్రమార్కులే దందా చేస్తున్నట్లు అనుమానాలు పెరుగుతున్నాయి...గంజాయి అక్రమ సాగు, రవాణాను నియంత్రించాల్సిన వారే అందులో మునిగి తేలుతున్నారు. దొరికిన వారే దొంగలు అన్నట్టు జిల్లాలో కొంతమంది ఎక్సైజ్‌ అధికారులు గంజాయి అక్రమార్కులతో పోటీ పడుతున్నారు. గంజాయి స్మగ్లర్లు తమపై ఎవరైనా అధి కారులు దాడులు చేస్తారేమోనని భయపడుతుంటారు. అందువల్ల రవాణాలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ దాడులు చేయాల్సిన వారే వారితో కుమ్మక్కై పోవడంతో రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా జిల్లాలో గంజాయి సాగు, రవాణా యథేచ్ఛగా సాగిపోతున్నాయి.

లోపాయికారీగా నొక్కేస్తున్నారన్న ఆరోపణలు
జిల్లాలో కొన్నాళ్లుగా పట్టుబడుతున్న గంజాయిని ఎక్సైజ్‌ శాఖ యథాతథంగా చూపడం లేదన్న ఆరోపణలున్నాయి. బహిరంగంగా పట్టుబడ్డ గంజాయిని మాత్రమే రికార్డుల్లో చూపిస్తున్నారు...ఇక మారుమూల ప్రాంతాల్లో దొరికిన గంజాయిని మాత్రం లోపాయికారీగా నొక్కేస్తున్నారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. రహస్యంగా స్వాధీనం చేసుకున్న గంజాయిని తమకు అనువైన చోటికి జీపులు, వ్యాన్లు, లారీల్లో తరలిస్తున్నారు...ఆ తర్వాత దొరికింది దోచేసుకునే కొందరు సిబ్బంది బేరం పెట్టుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి...ఇక దొరికిన అదే గంజాయిని స్మగ్లర్లకు రహస్యంగా విక్రయిస్తున్నారు...ఇలా జిల్లాలోని ఎక్సైజ్‌ శాఖలో కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు కొంతమంది ఉద్యోగులు వ్యాపకంగా పెట్టుకున్నారు.

గంజాయి దాచేందుకు ప్రత్యేక భవనం
సాక్షాత్తూ దాడులు చేసే సిబ్బందే గంజాయిని తరలిస్తుంటే ఎవరు అడ్డుకుంటారు? దీంతో స్మగ్లర్లు నిర్భీతిగా గంజాయి రవాణాలో వేళ్లూనుకుపోతున్నారు.దీని అరకట్టేందుకు ఇప్పుడు ఎక్సైజ్ ఉన్నదికారలు కళ్లుతేరిచారు.. పట్టుకున్నగంజాయి ఎటువైపు వెళ్తుందో తెలియని పరిస్థితి ఉండటంతో గంజాయి దాచేందుకు ప్రత్యేకంగా ఓ భవనాన్ని నిర్శస్తున్నారు...దీని ద్వారా మెజిస్ట్రీట్ ముందు ఎంత గంజాయి పట్టుకున్నారనేది తునీకలు వేసి సీచ్ చేసి తరువాత వాటిని ఆ భవనానికి తరలించనున్నట్లు ఎక్సైజ్ డేకర్టర్ తెలిపారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణా ద్వారా వచ్చే ఆదాయం రుచి మరిగిన వారు దానిని వదులుకోలేకపోతున్నారు. జిల్లాలో గంజాయి రవాణాలో పాలుపంచుకునే వారెవరో ఉన్నతాధికారులకు తెలిసినా వారు వివిధ కారణాల వల్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న వాదన ఉంది... దీంతో స్మగ్లర్లతోపాటు ఎక్సైజ్‌ శాఖ సిబ్బంది కూడా భారీగా అక్రమార్జన చేస్తున్నారు.

07:21 - September 13, 2017

హైదరాబాద్ : ఎక్సైజ్‌ పాలసీ అంటే మద్యం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడం కాదని..మద్యం వ్యాపారాన్ని అదుపు చేయడమే అని ఎక్సైజ్శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ అన్నారు. ఆదాయం కోసమే మద్యం రేట్లు పెంచారన్న ఆరోపణలను కొట్టివేశారు. గతంలో కన్న కొత్తగా వైన్‌ షాపుల సంఖ్య పెంచలేదని సోమేష్‌ కుమార్‌ అన్నారు. పూర్తి సమాచారం కోసం వీడియో చూడండి.

13:38 - August 14, 2017

హైదరాబాద్‌ : మరో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టయ్యింది. భారీ ఎత్తున గంజాయి, మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ట్యాబ్లెట్లు, బిస్కిట్లు, చాక్లెట్ల రూపంలో డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారు. ఓ నైజీరియన్‌తో పాటు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేవ్‌ పార్టీలకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

16:30 - July 29, 2017

ఒకరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమత్రి..మరొకరు ఎక్సైజ్ శాఖ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్..మరి వీరిద్దరూ ఓ విషయంపై భిన్నంగా స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ కేసు ఎంత కలకలం సృష్టిస్తుందో తెలిసిందే. కెల్విన్ ముఠా పట్టుబడడంతో ఎన్నో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. టాలీవుడ్ కు సంబంధించని పలువురు సెలబ్రెటీలను సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు పంపారు. సుమారు 20 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సినీ ప్రముఖుల విచారణ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటిదాకా 8 మందిని విచారించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గానే స్పందించింది. ఎవరు ఉన్నా వదిలిపెట్టవద్దని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శుక్రవారం రాత్రి ఉన్నతాధికారులతో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులు, ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పాల్గొన్నారు. సినీ పరిశ్రమపై వేధింపులు ఉండవని, డ్రగ్స్ ను తరిమివేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు..నేరస్తులను శిక్షిస్తుందే తప్ప..బాధఙతులను ఇబ్బంది పెట్టదని కేసీఆర్ పేర్కొన్నట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే డ్రగ్స్ అమ్మకం..సరఫరా చేయడం..వ్యాపారం చేయడం నేరమని..కేసీఆర్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ వాడినా నేరస్తులేనంటూ ఇటీవలే తెలంగాన ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇంతకీ..అకున్ సబర్వాల్ చెప్పింది నిజమా ? కేసీఆర్ చెప్పింది నిజమా ? అనే చర్చకు తెరలేపినట్లైంది.

సినీ ప్రముఖులను బాధితులగానే చూస్తామని కేసీఆర్ పేర్కొనడంతో కేసు అటకెక్కించే ప్రయత్నాలు జరుగుతాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ తీవ్రత అంతగా లేదని చెప్పడాన్ని పలువురు పేర్కొంటున్నారు. ఈ కేసు కూడా గతంలోగానే నీరుగారిపోతుందనే విమర్శలున్నాయి. 

19:21 - July 28, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో రవితేజ విచారణ ఇంకా కొనసాగుతోంది. ఉదయం ప్రారంభమైన విచారణ సాయంత్రం వరకు కొనసాగుతుండడం విశేషం. 9గంటలకు పైగా విచారణ జరుగుతుండడంతో ఉత్కంఠ రేకేత్తిస్తోంది. భిన్న కోణాల్లో అధికారులు ఆరా తీస్తున్నట్లు, రవితేజ కుటుంబ వ్యవహారాలు..సినీ రంగ ప్రవేశం..సోదరుడి విషయాలపై ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. సోదరుడు భరత్ కు మత్తు మందుల వాడకం ఎప్పటి నుండి ఉంది ? ఈ విషయం ఫ్యామిలీకి తెలుసా ? తదితర అంశాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. అంతేగాకుండా కెల్విన్..జీషన్ ఆలీలతో ఎలాంటి సంబంధాలున్నాయి ? వారు ఏ విధంగా పరిచయం అయ్యారు ? దానిపై కూడా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. చిత్ర పరిశ్రమలో ఎవరెవరు మత్తుమందులు వాడుతారనే దానిపై కూడా ఆరా తీసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే రవితేజతో పాటు ఫయద్ యూనిస్, తౌబీర్ అహ్మద్ లను విచారించడం జరిగిందని, శనివారం రవితేజ డ్రైవర్ ను విచారిస్తామని సిట్ పేర్కొంది.

సినీ రంగం టార్గెట్ కాదు..
తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం ఎక్కువగా లేదని సీఎం కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. డ్ర‌గ్స్ కేసుపై శనివారం ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో సీఎం కేసీఆర్ ఉన్న‌త స్థాయి స‌మీక్ష నిర్వ‌హించారు. పోలీసు, ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. డ్ర‌గ్స్ కేసు విచార‌ణ‌ను పార‌ద‌ర్శ‌కంగా, చిత్త‌శుద్ధితో నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. హైద‌రాబాద్ లో డ్ర‌గ్స్ వాడ‌కం, స‌ర‌ఫ‌రా వ్యాప్తి చెంద‌కుండా మొగ్గ‌లోనే తుంచేయాలని సూచించారు. తెలంగాణ లో డ్ర‌గ్స్ మ‌హ‌మ్మారి కి ప్ర‌వేశం లేకుండా చేయాల‌న్న‌దే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని, డ్రగ్స్ ఎక్కువగా వాడే రాష్ట్రాల్లో తెలంగాణ లేదన్నారు. డ్రగ్స్ మూలాలను పట్టుకొనే ప్రయత్నంలో ఉన్నామని, సినీ రంగాన్ని లక్ష్యంగా చేసుకున్నామనడం తప్పు అన్నారు. కీలక ఆధారాలు..సూత్రధారుల వివరాలు లభించాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు. 

18:17 - July 28, 2017

హైదరాబాద్ : సినీ నటుడు రవితేజను సిట్ అధికారులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. ఉదయం 10 నుండి విచారణ కొనసాగుతోంది. డ్రగ్స్ కేసుకు సంబంధించిన విషయాలపై ఆరా తీస్తున్నారు. కెల్విన్ తో ఉన్న సంబంధాలు..ఇతరత్రా వాటిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం. రాత్రి 10 నుండి 11గంటల వరకు విచారణ కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.
విచారణలో రవితేజ వెల్లడించిన సమాచారం..కీలకమైన వ్యక్తుల విషయంలో క్రాస్ స్కెచ్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ శ్రీనివాసరావుతో రవితేజ డ్రగ్స్ తెప్పించుకున్నట్లు, ఇతరులకు ఈ డ్రగ్స్ ఇచ్చారా అనే కోణంలో విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. కొంతమంది పొడ్యూసర్ల పేర్లు..రాజకీయ నేతల కుమారుల పేర్లు తెరపైకి వస్తాయని తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

Pages

Don't Miss

Subscribe to RSS - ఎక్సైజ్