ఎంపీలు

20:51 - November 14, 2018

హైదరాబాద్ : ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి దూకుడు ఏమాత్రం తగ్గలేదు. సరికదా ఇనుమడించిన ఉత్సాహంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి సవాళ్లు విసిరారు. టీఆర్ఎస్‌కు చెందిన ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని, కేసీఆర్‌కు చేతనైతే అసెంబ్లీ ఎన్నికల లోపు ఆ ఇద్దరు ఎంపీలను ఆపుకోమని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఆయనకు దమ్ముంటే కొడంగల్ నుంచి పోటీ చేయాలన్నారు. నామినేషన్ వేసేందుకు ఇంకా సమయం ఉంది కాబట్టి త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్‌కు సూచించారు. ఏనాడూ తాను కొండగల్ ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగించలేదని.. ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని..తాను గెలవడం ఖాయమని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ, ఎన్నికలు, కాంగ్రెస్, రేవంత్ రెడ్డి, కేసీఆర్, సవాల్, టీఆర్ఎస్, ఎంపీలు, 

11:33 - October 20, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్ అభ్యర్థులు ముందస్తు వేడిని పెంచుతున్నారు. పార్టీ అభ్యర్థులను  ప్రకటించిన అనంతరం తొలి విడత ప్రచారాన్ని పూర్తిచేసుకుంది. తాజాగా పాక్షిక మ్యానిఫెస్టో ప్రకటించి ముందస్తు ముందున్నాం అనే సంకేతాలను వెల్లడించింది. బతుకమ్మ, దసరా పండుగల వాతావరణం నుండి ఇప్పుడు బైటకొచ్చిన నేతలు మలి విడత ప్రచారానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ కేసీఆర్ యాభైరోజులు, వందసభలు అని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ సందడి  ప్రారంభంకానున్నట్లుగా గాలాబీ నేతల సమాచారం. దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కేసీఆర్ సభలు ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఓటర్లకు ప్రభుత్వం ఇప్పటివరకు అమలుచేసిన పథకాలు, పార్టీ అధికారంలోకి రాగానే అమలుచేసే పథకాలు, ఓటర్లను ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చేయడం, ఓట్లు టీఆర్‌ఎస్‌కు వేసేలా, ముఖ్యంగా పోల్ మేనేజ్‌మెంట్‌పై అవగాహన కల్పించడంపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థులతో మరోసారి కేసీఆర్ భేటీ అయ్యేందుకు సన్నద్ధమవుతున్నారు. 

Related imageఈ క్రమంలోనే టీఆర్‌ఎస్ అభ్యర్థులకు అవగాహన సదస్సును ఈ నెల 21న నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. తెలంగాణభవన్‌లో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమయ్యే సదస్సులో కేసీఆర్ తో పాటు పార్టీ ఎంపీలను కూడా పాల్గొననున్నారు. ఈ సమావేశంలో  అభ్యర్థులతో స్వయంగా మాట్లాడి దిశానిర్ధేశం చేయనున్నారు. ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహం, ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా వ్యవహరించాల్సిన పద్ధతులు తదితర అంశాలపై అభ్యర్థులకు ఈ సమావేశంలో అవగాహన కల్పిస్తారు. కాగా ఇప్పటికే  పార్టీ ప్రకటించిన 105 మంది అభ్యర్థులు ఈ సమావేశంలో విధిగా పాల్గొనాలని పార్టీ ఆదేశించింది.తాజాగా పార్టీకి కీలకమైన మ్యానిఫెస్టో పాక్షిక అంశాలను ప్రకటించిన నేపథ్యంలో వరుసగా సభలకు శ్రీకారం చుట్టనున్నారు.

 

17:14 - October 6, 2018

ఢిల్లీ : డిసెంబ‌ర్ 7న తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు అది కూడా ఒకే ద‌శ‌లో జ‌రుగుతాయ‌ని  కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన అధికారి రావ‌త్ వెల్ల‌డించారు. కాగా ఏపీ ఎంపీలు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదించినా.. ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు లేవ‌ని, సాధారణ ఎన్నికల వరకూ ఈ సీట్లు ఖాళీగానే ఉంటాయని కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ తాజాగా స్పష్టం చేశారు. తెలంగాణతో పాటు నాలుగు రాష్ర్టాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా ఎంపీల రాజీనామాలను జూన్ 4న ఆమోదించారు. లోక్‌సభ గడువు వచ్చే జూన్ 3తో ముగుస్తుంది. ఇంకా కేవలం ఏడాదిలోపే సమయం ఉన్నందున ఆంధ్రప్రదేశ్‌లో ఉప ఎన్నికలు నిర్వహించమని తేల్చి చెప్పారు. ఐదుగురు వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు తమ లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే.
 

 

19:34 - September 12, 2018

విశాఖ : రైల్వే డీఆర్ ఎం మీటింగ్ ను ఉత్తరాంధ్ర ఎంపీలు బాయ్ కాట్ చేశారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్ర అనుసరిస్తున్నవైఖరికి నిరసనగా సమావేశాన్నిఉత్తరాంధ్ర ఎంపీలు బహిష్కరించారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ఎంపీలు డిమాండ్ చేశారు. దీంతో చత్తీస్ గఢ్, ఒడిషా ఎంపీలతో డీఆర్ ఎం సమావేశం అయ్యారు. 

 

15:56 - August 7, 2018

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టాలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ నేతలందరూ ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నింటినీ కేంద్రం నెరవేర్చాలని ఎంపీ రామ్మోహన్‌ నాయుడు డిమాండ్‌ చేస్తున్నారు. వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన డబ్బులను అకౌంట్‌లో వేసి తిరిగి తీసుకోవడంపై ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు.ఈ నేపథ్యంలో ఈరోజు కేంద్ర రైల్వే మంత్రిని టీడీపీ ఎంపీలు కలవనున్నారు. విశాఖ రైల్వే జోన్‌ కోరుతూ కేంద్ర మంత్రి పియూశ్‌ గోయల్‌కు విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులపై ఆర్థిక శాఖ కార్యదర్శిని కలవనున్నామని ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలిపారు. 

16:12 - August 6, 2018

ఢిల్లీ : ఏపీలోని వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చిన కేంద్రం వాటిని వెనక్కి తీసుకోవడంపై లోక్ సభలో టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం చర్యకు నిరసనగా లోక్ సభ నుంచి టీడీపీ ఎంపీలు వాకౌట్ చేశారు. అనంతరం పార్లమెంట్ ప్రాంగణంలో టీడీపీ ఎంపీలు అవంతి శ్రీనివాస్, జేసీ దివాకర్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, మురళీమోహన్ లు మీడియాతో మాట్లాడారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే నిధులు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఏపీపై కేంద్రం వివక్ష చూపడం మానుకోవాలని, 95 శాతం యూసీలు ఇచ్చినా కేంద్రం నిధులు ఇవ్వకపోవడం కక్ష సాధింపు చర్యేనని అన్నారు. ఫిబ్రవరి 9న వెనుకబడిన జిల్లాలకు రూ.350 కోట్లు విడుదల చేశారని, వారం రోజుల్లోగా పీఎంవో చెప్పిందంటూ వెనక్కి తీసుకున్నారని, ఏపీపై వివక్ష చూపుతున్నారనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. యూసీలు అందించడంలో దేశంలోనే ఏపీ 3వ స్థానంలో ఉందని, యూసీలు ఇవ్వడం లేదని ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేతలు అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ఏపీకి బుందేల్ ఖండ్ తరహాలో ప్యాకేజ్ అమలు చేస్తామన్నారని, అది అమలు చేస్తే రూ.22 వేల కోట్లు విడుదల చేయాలని అన్నారు. 

06:38 - July 27, 2018

హైదరాబాద్ : రాహుల్‌ ప్రధాని కావాలంటే.. తెలంగాణలో ఎంపీ స్థానాలు కీలకంగా మారనున్నాయి. గత ఎన్నికల్లో రెండు ఎంపీలను గెలిచిన హస్తం నేతలు... ఈసారి పరిస్థితి తమకు అనుకూలంగా ఉందంటున్నారు. ఇదే ఊపుతో దూసుకుపోతున్న హస్తం నేతలు... మెజారిటీ ఎంపీ స్థానాలు దక్కించుకుంటామంటున్నారు. అయితే కాంగ్రెస్‌ నేతలు చెబుతున్న దాంట్లో ఎంతమేరకు వాస్తవం ఉంది ? 17 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటి ?

తెలంగాణ కాంగ్రెస్‌లో అప్పుడే ఎన్నికల వేడి మొద‌లైంది. ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయన్న ఊహాగానాలతో హస్తం నేతలు అల‌ర్ట్ అయ్యారు. ఇప్పటినుండే బూత్ స్థాయి నుంచి క్యాడ‌ర్‌లో జోష్ నింపుతూ.. ఎన్నిక‌ల‌కు రెడీ అవుతున్నారు. ఈ ముందస్తుతో పాటు లోక్‌సభకు కూడా ముందస్తు ఎన్నికలు వస్తాయని అంచనా వేస్తున్న హస్తం నేతలు... ఈసారి మెజారిటీ ఎంపీ స్థానాలకే కైవసం చేసుకుంటామంటోది.

తెలంగాణ‌కు గుండెకాయలాంటి హైద‌రాబాద్ ఎంపీ స్థానానికి ఇప్పుడు పార్టీ అభ‌్యర్థే లేరు. గతంలో ఎంఐఎం దోస్తానాతో హైదరాబాద్‌ వదులుకున్న ఈ కాంగ్రెస్‌... ఈ సారి అజారుద్దీన్‌ను రంగంలోకి దింపాలని చూస్తున్నారు. అయితే.. దీనికి అజార్‌ సిద్దంగా లేనట్లు తెలుస్తోంది. ఇక చేవెళ్ల పార్లమెంట్‌ నుండి గతంలో సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్‌రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కార్తిక్‌ చేవెళ్ల లోక్‌సభకు కాకుండా... రాజేంద్రనగర్‌ అసెంబ్లీ నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన గ్రౌండ్‌ వర్క్‌ చేసుకుంటున్నారు. దీంతో చేవెళ్ల లోక్‌సభకు అభ్యర్థి కనిపించడం లేదు. మరోవైపు సీఎం ఇలాఖా అయిన మెదక్‌ లోక్‌సభ విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికలు, బై ఎలక్షన్‌లో పోటీ చేసిన శ్రవణ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డిలు కూడా ఈసారి అసెంబ్లీలో పోటీ చేయాలని భావిస్తున్నారు. దీంతో అక్కడ అభ్యర్థులు లేని పరిస్థితి నెలకొంది.

మొన్నటి ఎన్నికల్లో వరంగల్‌లో మాజీ ఎంపీ రాజయ్య ఎపిసోడ్‌తో లాస్ట్‌ మినిట్‌లో ఎంట్రీ ఇచ్చిన సర్వే సత్యనారాయణ ఓడిపోయారు. ఈసారి ఆయన తన పాత నియోజకవర్గమైన మల్కాజ్‌గిరి నుండే పోటీ చేస్తానని చెప్పడంతో అక్కడ అభ్యర్ధే లేకుండాపోయారు. ఇక ఆదిలాబాద్‌ లోక్‌సభకు కూడా వరంగల్‌ పరిస్థితే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన నారేష్‌జాదవ్‌ ఘోర పరాజయం పాలయ్యారు. దీంతో అక్కడ కూడా అభ్యర్ధి కనిపించకుండాపోయారు. ఇక పెద్దపల్లిలో పార్టీకి క్యాడరే లేదు. గతంలో పోటీ చేసి ఓడిపోయిన వివేక్‌ ప్రస్తతుం.. టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నారు. గతంలో జహీరాబాద్‌లో సిట్టింగ్‌ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన సురేష్‌ షెట్కర్‌.. ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఇక్కడా కూడా పార్టీకి అభ్యర్థులు లేని పరిస్థితి నెలకొంది.

ఇక పార్టీ బలంగా ఉన్న ఉమ్మడి నల్గొండలో రెండు లోక్‌సభలకు కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. నల్గొండ నుండి పోటీ చేసి గెలిచిన గుత్తా సుఖేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడంతో... ఇక్కడినుండి ఎవరు బరిలో ఉంటారన్న దానిపై క్లారిటీ లేకుండాపోయింది. మరోవైపు భువనగిరి లోక్‌సభ నుండి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గతంలో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఇప్పటివరకు.. అభ్యర్ధి లేవు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఇక ప్రస్తుతం పార్టీకి ఉన్న ఒకే ఒక్క ఎంపీ నంది ఎల్లయ్య. నాగ‌ర్ క‌ర్నూల్ లోక్‌స‌భ నుండి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నంది ఎల్లయ్య.. వ‌య‌సు పైబ‌డ‌టంతో ఆయ‌న‌ను ఈసారి ప్రత్యక్ష ఎన్నిక‌లకు దూరంగా ఉంచుతార‌ని ప్రచారం జరుగుతోంది. ఇదే జ‌రిగితే.. నాగ‌ర్ క‌ర్నూల్ లోక్ స‌భ‌ నుండి పార్టీకి అభ్యర్థి కూడా క‌నిపించ‌డం లేదు. మొత్తానికి ఇలా 17 లోక్‌స‌భ‌ల‌కుగాను ప‌ది చోట్ల కాంగ్రెస్‌కు ఎంపీ అభ్యర్థులు కరువయ్యారు. దీంతో ఆయా స్థానాల్లో బ‌ల‌మైన‌ అభ్యర్థులను వెతికి ప‌ట్టుకోవ‌డం టీపీసీసీకి స‌వాల్‌గా మారింది. మ‌రీ ఈ ప‌రిస్థితుల్లో కాంగ్రెస్ మెజారీటి స్థానాల్లో ఎలా గెలుస్తుంది..? రాహుల్ ప్రధాని కావ‌డంలో ఎలా కీల‌క పాత్ర వ‌హిస్తార‌న్నది.. ఇప్పడు ఆస‌క్తిక‌రంగా మారింది.

12:48 - July 26, 2018
10:21 - July 18, 2018

అమరావతి : సీఎం చంద్రబాబు ఎంపీలకు టెలీకాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్ధేశం చేశారు. ఈ టెలీకాన్ఫరెన్స్ లో రాజ్యసభ సభ్యులు, పార్టీ బాధ్యులు పాల్గొన్నారు. ఈక్రమంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతకైనా పోరాడదామని ఎంపీలకు చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. పార్లమెంట్ లో ఏపీ ప్రయోజనాల కోసం పోరాడే విషయంలో సస్పెండ్ చేసినా ఫరవాలేదని పోరాటం మాత్రం కొనసాగించమని ఎంపీలకు చంద్రబాబు తెలిపారు.

07:33 - July 12, 2018

గుంటూరు : నేడు చంద్రబాబు పార్టీ ముఖ్యనేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీకానున్నారు. గ్రామదర్శిని కార్యక్రమం, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు.  ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ.. పార్టీపై నేతలు మరింత ఫోకస్‌ పెట్టేలా వ్యూహాలు రూపొందించనున్నారు. నేతల మధ్య విభేదాలను తొలగించేందుకు ప్రణాళికలను ఆయన రచిస్తున్నారు.
నేడు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం
ఇవాళ చంద్రబాబు తన నివాసంలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇంచార్జీలు హాజరుకానున్నారు.ఈ సమావేశంలో చంద్రబాబు పలు అంశాలపై నేతలతో సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఈనెల 16వ తేదీ నాటికి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1500 రోజులు పూర్తవుతున్నందుకు భారీ కార్యక్రమానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఆ రోజు నుంచి సుమారు నాలుగు నెలలపాటు గ్రామదర్శిని పేరుతో నేతలు ప్రజల్లో ఉండేలా యాక్షన్‌ ప్లాన్‌ సిద్దం చేయనున్నారు.  ఈ గ్రామదర్శిని, పట్టణదర్శిని కార్యక్రమంలో ఎమ్మెల్యేలతోపాటు సీఎం చంద్రబాబు నేరుగా ప్రజలతో మమేకంకానున్నారు.  4నెలల కాలంలో 75 బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. ఈ కార్యక్రమం ఎక్కడి నుంచి ఎలా ప్రారంభించాలి, ఎలాంటి అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నది ఈ సమావేశంలో చంద్రబాబు నేతలతో చర్చించనున్నారు.
అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించనున్న చంద్రబాబు
అసెంబ్లీ సమావేశాల నిర్వహణపైనా మంత్రులు, ఎమ్మెల్యేలతో చంద్రబాబు చర్చించనున్నారు.  ఈనెల 18 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు  ప్రారంభం అవుతున్న నేపథ్యంలో... అదే సమయంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారు. పార్లమెంట్‌ సమావేశాలు జరిగినట్టు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఏపీకి కేంద్రం చేసిన అన్యాయాన్ని మరోసారి అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలు ఏరోజు నుంచి ప్రారంభిస్తే బావుంటుంది.... ఏయే అంశాలను అసెంబ్లీ వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నే అంశాలపై చంద్రబాబు నేతలతో కూలంకశంగా చర్చించనున్నారు. 
నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
విస్తృత స్థాయి సమావేశం అనంతరం రాత్రికి పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగనుంది. పార్టీ ఎంపీలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం అవుతారు. ఏపీకి జరిగిన అన్యాయంపై... కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసిస్తూ ఏం చేయాలన్న దానిపై చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోసారి అవిశ్వాస తీర్మానం పెట్టాలని టీడీపీ భావిస్తోంది.

 

Pages

Don't Miss

Subscribe to RSS - ఎంపీలు