ఉత్తరప్రదేశ్

15:32 - November 12, 2018

ఢిల్లీ : రామ జన్మభూమి, బాబ్రీ మసీదు వివాదంపై జనవరి నెలలో విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై వెంటనే  విచారణ జరపాలంటూ దాఖలైన మరో పిటిషన్‌ ను ఈరోజు సుప్రీంకోర్టు కొట్టివేసింది. కాగా అఖిల భారత హిందూ మహాసభ తరపున న్యాయవాది బరుణ్ కుమార్ సిన్హా దాఖలు చేసిన ఈ పిటీషన్ పై స్పందించని దేశ అత్యున్నత దేవస్థానం అయిన సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. దేశంలోకొన్ని రాష్ట్రాలలో  సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయని, ఈలోగానే కేసును విచారించాలని న్యాయవాది బరుణ్ కుమార్ సిన్హా వాదించారు. దీనిపై స్పందించని న్యాయస్థానం ఇప్పడు కుదరదని జనవరిలోనే విచారిస్తామని తెలిపింది. 
ఈ కేసును జనవరికి వాయిదా వేస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌ కే కౌల్ ధర్మాసనం, అఖిల భారత హిందూ మహాసభ వేసిన పిటిషన్ ను తోసిపుచ్చింది. ఇప్పటికే కోర్టు ఈ కేసులో ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేసిన ధర్మాసనం, అప్పీళ్లన్నింటినీ జనవరిలోనే పరిశీలిస్తున్నామని, ముందస్తు విచారణకు అనుమతి నిరాకరిస్తున్నామని తెలిపింది. 
 

 

08:00 - November 9, 2018

హైదరాబాద్ : బీజేపీ పేర్లు మార్పు కార్యక్రమంలో సరికొత్త వివాదాలకు తెరలేపుతోంది. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం పేర్ల మీద ఉన్న సంస్థలన్నింటినీ హైందవీకరిస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం ఆ దిశగా మరో వివాదానికి తెరతీసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే మరో సంచలన, వివాదాలకు పూనుకున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ ల పేర్లు మార్చేస్తామని ప్రకటించారు. తాము అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. అసలు పేరు భాగ్యనగరమని... 1590లో భాగ్యనగరం పేరును హైదరాబాదుగా కులీ కుతుబ్ షా మార్చారని తెలిపారు. తాము మళ్లీ అసలైన పేరును పెట్టాలనుకుంటున్నామని చెప్పారు. 

hyderabad historical places కోసం చిత్ర ఫలితంతెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని... రాష్ట్ర అభివృద్ధి తమ ప్రథమ లక్ష్యమని, తదుపరి లక్ష్యం హైదరాబాద్ పేరు మార్చడమేనని అన్నారు. మొఘలులు, నిజాంల పేరిట ఉన్న పేర్లను తొలగిస్తామని... దేశం కోసం, తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తుల పేర్లను పెడతామని రాజా సింగ్ తెలిపారు.
కాగా ఇప్పటికే దేశంలోని అతి పురాతనమైన మొగల్‌సరారు జంక్షన్‌ను దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ జంక్షన్‌గా మార్చిన యోగి సర్కారు.. తాజాగా రాష్ట్రంలోని మూడు విమానాశ్రాయాల పేర్లను మార్చాలని నిర్ణయించింది. రారుబరేలి, కాన్పూర్‌, ఆగ్రాలో ఉన్న రక్షణ శాఖ విమానాశ్రాయాల పేర్లను మార్చనుంది. బరేలి విమానాశ్రాయాన్ని నాథ్‌నగరిగా (పౌరాణికాల్లో బరేలి పేరు), కాన్పూర్‌లోని చకేరి ఎయిర్‌పోర్ట్‌కు గణేష్‌ శంకర్‌ విద్యార్థి పేరు, ఆగ్రా విమానాశ్రాయాన్ని దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయగా మార్చాలని ప్రతిపాదించారు. దీనిపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపించామని.. త్వరలోనే కేంద్ర విమానయాన శాఖతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని యూపీ మంత్రి నంద్‌గోపాల్‌ నంది తెలిపారు. అలహాబాద్ పేరును ‘ప్రయాగ్ రాజ్‘గా మార్చే పనిలో వుంది యోగీ సర్కార్. 

11:09 - November 8, 2018

ఉత్తరప్రదేశ్ : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని అయోధ్యలో 'అయోధ్య దీపోత్సవ్ 2018' పేరిట ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేపట్టిన అయోధ్య దీపోత్సవానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. సరయు నది తీరాన 3,01,152 దీపాలు వెలిగించినందుకుగాను అయోధ్య దీపోత్సవ్ 2018 ఈ రికార్డ్ సొంతం చేసుకుంది. కాగా ఈ దీపోత్సవానికి సౌత్ కొరియా అధ్యక్షుడు సతీమణి సూరిరత్నప్రత్యేక అతిథిగా విచ్చేయటం మరో విశేషం. ఏటా వందల సంఖ్యలో దక్షిణ కొరియన్లు మన దేశానికి వచ్చి ఉత్తరప్రదేశ్‌లో ఉన్న అయోధ్యను దర్శించుకొని వెళుతుంటారు.మన రామాయణ దేవుడి జన్మభూమితో వారికేం పని అంటే.. దాని వెనక ఒక పెద్ద కథే ఉంది. ఈ నేపథ్యంలో క్రీస్తు శకం 48వ సంవత్సరంలో కొరియా యువరాజును సూరిరత్న కొరియా యువరాజును వివాహం చేసుకున్నారు. వివాహానంతరం సూరిరత్న పేరును హియో హ్వాంగ్-ఓక్ గా పేరు మార్చుకున్నారు. 
 

20:02 - November 6, 2018

లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ తన పదవి కాలంలో రికార్డులు సృష్టించేటట్టు ఉన్నారు. నిన్నటికి నిన్న లక్నోలోని ఏకన ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పేరును భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి ఏకన ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంగా మార్చిన యోగి, మంగళవారం ఫైజాబాద్ జిల్లా పేరును అయోధ్య జిల్లాగా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయోధ్యలో  దీపావళి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యోగి ఈప్రకటన చేశారు. అయోధ్య మనకు గర్వకారణమని, అయోధ్య అంటేనే రాముడని యోగి అన్నారు. ఈరోజు నుంచి ఫైజాబాద్‌ జిల్లా అయోధ్యగా పేరు మారుస్తున్నట్లు ఆయన సభాముఖంగా ప్రకటించారు. ఫైజాబాద్ జిల్లా పేరు మార్పుతో పాటు అయోధ్యలో నిర్మించే విమానాశ్రయానికి రాముడి పేరు, వైద్య కళాశాలకు రాముడి తండ్రి దశరధుని పేరు పెడతామని యోగి ఆదిత్యనాథ్  తెలిపారు. గతంలో యూపీ ప్రభుత్వం మొఘల్‌సరై రైల్వే జంక్షన్‌ పేరును దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ్‌ జంక్షన్‌గాను, అలహాబాద్ ను ప్రయాగరాజ్ గాను మార్చిన విషయం తెలిసిందే. మరోవైపు బరేలి, ఆగ్రా విమనాశ్రాయాల పేర్లను కూడా మార్చే యోచనలో యోగి  సర్కార్‌  ఉన్నట్లు తెలుస్తోంది.

10:48 - November 5, 2018

ఉత్తరప్రదేశ్‌ :  రామజన్మ భూమిలో రామ మందిరం కోసం కంకణం కట్టుకున్నామంటున్న బీజేపీ ప్రభుత్వం 2019 ఎన్నికల నేపథ్యంలో మరోసారి ఆ అంశాన్ని తెరమీదికి తెస్తోంది. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం రాముడి పేరుతో మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుని పనులు ప్రారంభించేసింది. ప్రపంచంలోనే అతి ఎత్తైన రాముడి విగ్రహాన్ని సరయూ నది ఒడ్డున ప్రతిష్ఠించాలని యోచిస్తున్న యోగి సర్కారు అందుకోసం శిల్పిని వెతికే పనిలో పడింది. అందులో భాగంగా ఆర్కిటెక్ట్, డిజైన్ కన్సల్టెంట్‌ను ఎంపిక చేయడానికి ఇప్పటికే టెండర్లు పిలిచింది. షార్ట్ లిస్ట్ అయిన సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిసి ప్రజంటేషన్ ఇచ్చినట్టు అధికారులు తెలిపారు. ఆర్కిటెక్ట్‌ను ఎంపిక చేసిన అనంతరం విగ్రహ నిర్మాణ సంస్థను ఎంపిక చేస్తామన్నారు.  రాముడి విగ్రహం మొత్తం నిర్మాణం ఎత్తు 201 మీటర్లు కాగా, అందులో పీఠం ఎత్తు 50 మీటర్లు, విగ్రహం ఎత్తు 151 మీటర్లు వుండేలా  యోగీ ప్రయత్నాలను ప్రారంభించింది.
 

08:39 - November 5, 2018

తూర్పుగోదావరి : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కడుపు మంటగా వుందని తెలిపారు. అదీ ఎవరిమీదనో తెలుసా? బీజేపీపైనే. బీజేపీపై తనకు చెప్పలేనంత కోపం ఉందన్నారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా ఆదివారం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట బహిరంగ సభలో మాట్లాడుతు... ఉత్తరప్రదేశ్‌ను నాలుగు చేసే వరకు తన కడుపు మంట చల్లారదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయ నేతలకు బీజేపీని ప్రశ్నించే ధైర్యం లేదని..మీరెవర్రా రాష్ట్రాన్ని విడదీయడానికి అని అడగొద్దా? అని ప్రశ్నించారు. ఉత్తర ప్రదేశ్‌ను కూడా అలాగే ముక్కలు చేస్తారా ? అని నిలదీశారు. యూపీని నాలుగు ముక్కలు చేసే వరకు తమ కడుపు మంట చల్లారదని పవన్ పేర్కొన్నారు.
 

18:58 - November 1, 2018

ఉత్తరప్రదేశ్ : అయోధ్య భూ వివాదం కేసుపై గతకాలం నుండి కొనసాగుతునే వుంది. దీనిపై ఎవరికి వారు తమ అభిప్రాయాలను వ్యక్తంచేస్తున్న నేపథ్యంలో ఈ కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు జనవరికి వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం తీసుకుంది. దీనిపై  సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయంసింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్ స్పందించారు. అయోధ్య రామాలయ నిర్మాణానికి సంపూర్ణ మద్ధతు ఇస్తున్నట్లు ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

Image result for ramamandiram supreme courtఅయోధ్యలో రామాలయం నిర్మించాల్సిందేనని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టుపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, ఈ కేసును జనవరిలో విచారిస్తామని సుప్రీం చెప్పడంతో అందరూ వేచి చూడాల్సిందేనన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగాలని కోరుకుంటున్నాని తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్టు వెల్లడించారు. ఇదిలావుండగా ఎన్నికల్లోగా కేసు కొలిక్కి వస్తుందని భావించిన బీజేపీ నేతలు సుప్రీం నిర్ణయంపై తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా రామ మందిరం నిర్మాణంపై సుప్రీంకోర్టు స్పందిస్తు ఇప్పుడు ఆ వివాదంపై విచారణ అంత ముఖ్యమా అంటు జనవరికి విచారణను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. 
ఈ నేపథ్యంలో అపర్ణా యాదవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి దీనిపై యాదవ్ కుటుంబం ఎలా స్పదింస్తుందో వేచి చూడాలి. 

15:35 - October 29, 2018

ఢిల్లీ : అయోధ్య రామ మందిరం- బాబ్రీ మసీదు కేసు విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అయోధ్య రామ మందిరి కేసు ఇప్పుడంత అత్యవసరంగా విచారించాల్సిన అవుసరం లేదంటు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుపై విచారణ నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలను చేసింది. అనంతరం తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది. విచారణ తేదీలను, ధర్మాసనం వివరాలను వెల్లడిస్తామని ప్రకటించింది. 2010లో అలహాబాద్ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ కేసుకు సంబంధించి తీర్పును వెలువరించింది. ఆ సందర్భంగా ముగ్గురు న్యాయమూర్తులు మూడు రకాలైన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లపై చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా గొగోయ్ మాట్లాడుతూ, వాస్తవానికి జనవరిలో కూడా ఈ పిటిషన్లపై విచారించాల్సిన అవసరం లేదని... సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు దీనిపై విచారణ అనవసరమని చెప్పారు. తరుపరి విచారణను జనవరికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి... నాలుగు నిమిషాల్లో విచారణను ముగించారు. 
 

13:26 - October 26, 2018

ఉత్తరప్రదేశ్ : బ్రిటీష్ బానిసత్వపు సంకెళ్ళను తెంచుకుని స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న భారతావని ఆగస్టు 15 1947న స్వాతంత్ర్య ఫలాలు అందుకుంది. దీంతో భారతదేశం స్వతంత్ర్యంగా ఎదుగుతోంది. కానీ బ్రిటీష్ వారు భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వకుండా వుంటే బాగుండేదనీ..కనీసం మరో 100 సంవత్సరాలు పరిపాలించి వుంటే బాగుండేదని బీఎస్సీ ఉత్తరప్రదేశ్‌ చీఫ్‌ ధరంవీర్‌ సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 
బ్రిటీష్‌ పాలకులు ఇImage result for ambedkarప్పటి వరకు మన దేశాన్ని పాలించి ఉంటే దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు సమగ్రాభివృద్ధి సాధించే వారని బీఎస్సీ ఉత్తరప్రదేశ్‌ చీఫ్‌ ధరంవీర్‌ సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరో వందేళ్లు వారి పాలనా కాలం కొనసాగి ఉంటే బాగుడేందన్నారు. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన ర్యాలీలో ధరంవీర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఈ దేశానికి అంబేడ్కర్‌ వంటి దళిత నాయకుడు లభించాడంటే అది బ్రిటీష్‌ వారి పుణ్యమే. 
ఇప్పటి లాంటి పాలకులు ఉండి ఉంటే ఆయనకు ఏ పాఠశాలలోనూ కనీసం చదువుకునేందుకు సీటు దొరికేది కాదు. దేశంలో అణగారిన వర్గాలకు ఆయన సేవలందించే అవకాశం ఉండేది కాదు’ అంటూ వ్యాఖ్యానించారు. Image result for august 15 freedom fighters

ధరంవీర్‌ వ్యాఖ్యలపై విపక్ష పార్టీ నాయకులు మండిపడ్డారు. దేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు మహానుభావులు చేసిన త్యాగాలను అవమానించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతగా ఆయనకు ఆంగ్లేయులపై అభిమానం ఉంటే బ్రిటన్‌ శరణార్థిగా ఉండాలని సూచించారు.
 

09:21 - October 25, 2018

ఉత్తరప్రదేశ్ : అత్తాకోడళ్ల మధ్య రొట్టె మాడింది అనే చందంగా మారింది కాన్పూర్ లోని ఓ అన్నదమ్ముల పరిస్థితి. ఓ బంగారం షాపులో జరిగిన భారీ దోపిడీల్లో కూడా రికార్డ్ సృష్టించింది. వందలు కాదు వేలు కాదు లక్షలు కాదు కోట్ల రూపాల విలువైన పసిడి దోపిడీకి గురైంది. అంతేకాదు ఈ దోపిడీయే ఈ శతాబ్ధంలోకెల్ల ఇండియాలో నమోదైన అతిపెద్ద దోపిడీల్లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్, బిర్హానా రోడ్డులో ఉన్న ఓ ఆభరణాల దుకాణంలోకి చొరబడిన దుండగులు రూ. 140 కోట్ల విలువైన ఆభరణాలను దొంగిలించుకు వెళ్లారు. 10 వేల క్యారెట్ల విలువైన డైమండ్స్, 100 కిలోల బంగారం, 500 కిలోల వెండి, ఐదు వేల క్యారెట్ల విలువైన ఆభరణాలను దొంగలు దోచుకెళ్లినట్టు సమాచారం. ఈ షాప్ ను యజమానుల మధ్య ఉన్న గొడవల కారణంగా ఐదేళ్ల క్రితం మూసివేయగా, ఇంత భారీ దొంగతనం జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
షాపు యజమానుల మధ్య నెలకొన్న వివాదంతో కోర్టుకు ఎక్కారు. దీంతో 2013లో జ్యూయెలరీ షాపును కోర్టు ఆదేశాలతో షాపును సీజ్ చేశారు. కొద్ది రోజుల క్రితం కేసు పరిష్కారం కాగా, తిరిగి షాపును తెరచుకోవచ్చంటూ ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. మరికొన్ని రోజుల్లో మంచిరోజు చూసి షాపును తెరవాలని భావిస్తున్న తరుణంలో ఈ ఘటన జరిగింది. ఆభరణాలతో పాటు షాపుకు చెందిన కొన్ని కీలక డాక్యుమెంట్స్ కూడా దొంగలు తీసుకెళ్లినట్టు పోలీసులకు యజమాని ఫిర్యాదు చేశారు. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు, దొంగలను గుర్తించేందుకు అన్ని మార్గాల్లో అన్వేషణ సాగిస్తున్నామని తెలిపారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - ఉత్తరప్రదేశ్