ఆరోపణలు

19:12 - September 12, 2018

మంచిర్యాల : తనపై నల్లాల ఓదేలు వర్గం హత్యాయత్నానికి పాల్పడిందని ఎంపీ బాల్క సుమన్ ఆరోపించారు. జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చిన తనపై హత్యాయత్నం చేశారని పేర్కొన్నారు. చెన్నూరు నియోజకవర్గ టిక్కెట్ ను కేసీఆర్ తనకు కేటాయించారని ఎవరూ అడ్డుపడినా ఇక్కడి నుంచే పోటీ చేస్తానని తెలిపారు. ఓదేలు వర్గం ఎన్నికుట్రలు పన్నినా తన నిర్ణయాన్ని మార్చుకునేది లేదని స్పష్టం చేశారు. చెన్నూరు నియోజకవర్గ అభ్యర్థిగా బాల్క సుమన్ టీఆర్ ఎస్ ఇటీవలే ప్రకటించిన విషయం విధితమే. దీన్నితాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు తీవ్రంగా ఖండించారు. తనకు చెన్నూరు టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిన్న ఓదేలు స్వీయ గృహ నిర్బంధం విధించుకున్నారు. దీంతో ఓదేలు వర్గ బాల్క సుమన్ పై ఆగ్రహంతో ఉన్నారు.

ఇవాళ నియోజకవర్గంలోని ఇందారం గ్రామంలో పర్యటించేందుకు వెళ్లిన బాల్క సుమన్‌ను ఓదేలు వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఓదేలు అనుచరుడు రేగుంట గట్టయ్య కిరోసిన్‌ పోసుకుని ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనను బాల్క సుమన్‌ తీవ్రంగా ఖండించారు. 

 

13:30 - August 23, 2018

చిత్తూరు : తిరుపతి టీటీడీకి చెందిన శ్రీనివాస మంగాపురం ఆలయ ఏఈవోపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. శ్రీనివాసులు తనను లైంగిక వేధిస్తున్నాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. శ్రీనివాస మంగాపురం ఆలయంలో గతకొంతకాలంగా బాధితురాలి తల్లి పని చేస్తోంది. అయితే తల్లిని కలిసేందుకు వెళ్లినప్పుడు ఆ మహిళపై ఏఈవో శ్రీనివాసులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తాను చెప్పినట్లు వినాలని, చెప్పిన చోటుకు రావాలని శ్రీనివాసులు వేధిస్తున్నాడని మహిళ పేర్కొంది. టీటీడీ ఏఈవో, విజిలెన్స్ అధికారులకు యువతి ఫిర్యాదు చేసింది. చంద్రగిరి పీఎస్ లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఈమేరకు శ్రీనివాసులపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

 

21:48 - August 5, 2018

మేడ్చల్‌ : జిల్లాలోని చర్లపల్లి జైలు సూపరింటెండెంట్‌పై వేధింపుల ఆరోపణలు వచ్చాయి. చింతల దశరథం తనను వేధిస్తున్నాడంటూ వార్డర్‌ శ్రీనివాస్‌ సూసైడ్‌ నోట్‌ రాశాడు. నిజాయితీగా ఉన్నందుకు తనను వేధిస్తున్నాడని శ్రీనివాస్‌ సెల్ఫీ వీడియో తీసి కనిపించకుండా పోయాడు. దీంతో ఆందోళన నెలకొంది. దశరథం అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నాడని శ్రీనివాస్‌ తన సూసైడ్‌ లేఖలో పేర్కొన్నాడు. 

19:29 - August 1, 2018

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో.. ఐదు జిల్లాలను సైబరాబాద్‌లుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు. విశాఖ, ఉభయగోదావరి, చిత్తూరు, అమరావతిలతో పాటు.. అనంతపురం జిల్లాలనూ ఐటీ పరిశ్రమలను స్థాపింప చేస్తామన్నారు. 2019 నాటికి ఐటీ రంగంలో లక్ష, ఎలెక్ట్రానిక్స్‌ మానుఫ్యాక్చరింగ్‌లో రెండు లక్షలు చొప్పున ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 
మరో పది ఐటీ కంపెనీలు ప్రారంభం 
నవ్యాంధ్రప్రదేశ్‌లో సరికొత్తగా మరో పది ఐటీ కంపెనీలు ప్రారంభమయ్యాయి. అమరావతిలోని ఏపీ ఎన్నార్టీ పార్క్‌లో.. ఒకేసారి పది ఐటీ సంస్థలను.. రాష్ట్ర ఐటీ మంత్రి నారాలోకేశ్‌ ప్రారంభించారు. వీటి ద్వారా వెయ్యిమందికి ఉద్యోగావకాశాలు కలగనున్నాయి. ఎన్నికల నాటికి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు మూడు లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో అహర్నిశలూ కృషిచేస్తున్నామని లోకేశ్‌ చెప్పారు. ఈ దిశగా.. ఐదు జిల్లాలను సైబరాబాద్‌లుగా తీర్చిదిద్దాలని నిర్ణయించామన్నారు.
ఎంఓయూలు వాస్తవరూపం 
ఎంఓయూలను వాస్తవరూపంలోకి తేవడంలో.. ఏపీ దేశంలోనే అగ్రభాగాన ఉందని లోకేశ్‌ వెల్లడించారు. సీఐఐ సదస్సులో ఐటీ శాఖ కుదుర్చుకున్న ఎంఓయూలు దాదాపుగా వాస్తవరూపం దాల్చాయన్నారు. జియో కంపెనీకి చెందిన ఎలెక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల్లో 80శాతం ఏపీలోనే చేస్తామని రిలయన్స్‌ సంస్థతో ఒప్పందం కుదిరిందని.. తిరుపతిలో 125 ఎకరాలు దీనికోసం సిద్ధం చేస్తున్నామని లోకేశ్‌ తెలిపారు. ప్రభుత్వం రూపొందించుకున్న విధానం వల్లే.. ఇది సాధ్యపడుతోందని లోకేశ్‌ చెప్పారు. 
పవన్‌ వ్యాఖ్యలపై స్పందించిన లోకేశ్‌  
తనను అవినీతిపరుడని ఆరోపించిన పవన్‌ వ్యాఖ్యలపై లోకేశ్‌ స్పందించారు. తాను అవినీతిపరుడైతే ఇన్ని సంస్థలు రాష్ట్రానికి వచ్చేవా అని ప్రశ్నించారు. తనపై ఆరోపణలను నిరూపించాల్సిన బాధ్యత కూడా వారిపైనే ఉంటుందని అన్నారు. రాజధాని నిర్మాణంపై ఆరోపణలు చేస్తూ.. పనులను అడ్డుకుంటామనడాన్ని తప్పుబట్టిన లోకేశ్‌.. పది మంది కోసం 35వేల ఎకరాలిచ్చిన రైతులను ఇబ్బందిపెట్టలేమని అన్నారు. విపక్షాలు అడ్డుకుంటే.. పెట్టుబడులు రావని, ఇది సరైంది కాదని లోకేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 

 

22:06 - July 21, 2018

హైదరాబాద్ : ఎన్నికలకు ముందే.. కత్తులు దూసుకుంటున్నారు రాజకీయ నేతలు. ఆరోపణలు, ప్రత్యాపరోణలతో ఎన్నికల వేడిని రాజేస్తున్నారు.. అవిశ్వాస తీర్మానంపై ఎవరికి వారే తమదైన శైలిలో స్పందిస్తున్నారు.. తమను తాము సమర్థించుకుంటూనే... ప్రత్యర్థి పార్టీలపై విమర్శల దాడి చేస్తూ ఎలక్షన్‌ స్టంట్‌ను తలపిస్తున్నారు.

ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఎన్నికల దృశ్యాన్ని కళ్ళకు కట్టిస్తున్నారు రాజకీయనేతలు. అవిశ్వాసం చర్చ నేపథ్యంలో ఒకరిపై ఒకరి దుమ్మెత్తి పోసుకుంటున్నారు. బీజేపీ, టీడీపీ, వైసీపీలు మోసకారి పార్టీలని విమర్శించారు కాంగ్రెస్‌ నేత ఎన్. రఘువీరారెడ్డి. ఆ పార్టీలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే శక్తి కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే ఉందన్నారు రఘువీరారెడ్డి. 

మరో వైపు టీఆర్‌ఎస్‌పై టీ కాంగ్రెస్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. పార్లమెంట్‌ సాక్షిగా బీజేపీ-టీఆర్‌ఎస్‌ దోస్తాని బయటపడిందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. అవిశ్వాస తీర్మాన సమయంలో టీఆర్‌ఎస్‌ సభ్యులు గైర్హాజరై..  పరోక్షంగా బీజేపీకి మద్దతిచ్చారని విమర్శించారు.  తెలంగాణాకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై  ఏ మాత్రం మాట్లాడలేదన్నారు. 

టీఆర్ఎస్‌, బీజేపీ పార్టీలు  చీకటి  ఒప్పందం ప్రకారం నడుకుంటున్నాయని తీవ్రంగా ఆరోపించారు డీకే అరుణ. ముస్లీం ఓటర్లకు దూరం కాకూడదన్న ఉద్దేశంతోనే ఈ చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు.  అందుకే.. పార్లమెంటులో ప్రధాని తెలంగాణాను అవమానించే విధంగా మాట్లాడినా టీఆర్ఎస్‌ నోరు మెదపలేదన్నారు. మొత్తానికి రాజకీయనేతల ప్రసంగాలు.. ఎన్నికల ప్రచార సభలను తలపిస్తున్నాయి. 

10:51 - June 28, 2018

రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌పై నిజామాబాద్‌ జిల్లా టీఆర్ఎస్‌ నాయకులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. డి.శ్రీనివాస్‌ సొంతపార్టీలోనే గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్‌కూ ఫిర్యాదు చేశారు. తనపై జిల్లా నేతల ఫిర్యాదు నేపథ్యంలో.. వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించగా.. ఆయనకు సీఎం అపాయింట్‌ లభించలేదు. ఇదే అంశంపై నిర్వహిచిన చర్చా కార్యక్రమలో విశ్లేషకులు వినయ్ కుమార్, కాంగ్రెస్ నేత గోస్ల శ్రీనివాస్, టీఆర్ ఎస్ నేత సత్యనారాయణ గుప్త పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

15:55 - June 10, 2018

విశాఖ : ఫోక్స్‌ వ్యాగన్‌ కంపెనీ నుంచి  ముడుపులు  తీసుకున్నట్టుగా నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటాని వైసీపీ ప్రధాన కార్యదర్శి బొత్స సత్యనారాయణ సవాల్‌ విసిరారు. ఫోక్స్‌ వ్యాగన్‌ ముడుపులు తీసుకొన్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఆరోపణలపు బొత్స తోసిపుచ్చారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలన అంతా అవినీతిమయమని ఆరోపించారు. 

 

17:59 - May 25, 2018

బెంగళూరు : యడ్యూరప్ప ఆరోపణలపై కుమారస్వామి వివరణ ఇచ్చారు. తాము ఎవరినీ ముంచలేదని కుమారస్వామి  అన్నారు. ఇలాంటి పలాయనవాద నేతను తన రాజకీయ జీవితంలో చూడలేదని తెలిపారు. నాటకాలు ఆడేందుకు ఇక్కడ రీహార్సల్ చేసినట్లు ఉందన్నారు. 'నా కుటుంబంపైనా..నా తండ్రిపైనా ఆయన చేసిన వ్యాఖ్యలు బాధాకరం' అని అన్నారు. ఆయన తరహాలో తాను దిగజారనని తెలిపారు. బహుశా యడ్యూరప్పను బీజేపీ నాయకత్వం పట్టించుకున్నట్లు లేదని పేర్కొన్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీని అధికారంలోకి రానివ్వరాదు అని భావించామని చెప్పారు. తాను మలేసియాలో ఆస్తిని కూడబెట్టినట్లు అప్పుడే దుష్ర్పచారం ప్రారంభించారని వాపోయారు. 

11:00 - May 21, 2018

తిరుమల : తిరుమలలో విధుల నుంచి తొలగించబడిన రమణ దీక్షితులు - టీటీడీ మధ్య వివాదం మరింత ముదురుతోంది. శ్రీవారి కైంకర్యాలు, నిత్య నివేదనల్లో అధికారులు, పాలక మండలి జోక్యం పెరిగిపోయిందని రమణదీక్షితులు ఇటీవల ఆరోపించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాలకమండలి.. రమణదీక్షితులకు 65 ఏళ్ల వయోపరిమితితో రిటైర్‌మెంట్‌ ఇచ్చింది. దీంతో రమణదీక్షితులు శ్రీనివాసుని ఆభరణాలు, సంపద పక్కదారి పడుతున్నాయని వరుసగా ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా వందల ఏళ్లనాడి రూబీ వజ్రం స్వామివారి ఖజానా నుంచి మాయం అయిందని ఆయన ఆరోపణలు చేస్తున్నారు.

శ్రీనివాసుని ఆభరణాల భద్రతపై ఆందోళనలు
తిరుమల శ్రీనివాసుని ఆభరణాల భద్రతపై మరోసారి ఆందొళనలు వ్యక్తం అవుతున్నాయి. విధుల నుంచి తప్పించిన తర్వాత పూర్వ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు పలు ఆసక్తి కర విషయాలు వెల్లడిస్తున్నారు. టీటీడీ బోర్డుపై తీవ్రస్థాయిలో అరోపణలు చేస్తున్నారు.

రిటైర్డ్‌ జడ్జితో విచారణ జరిపించాలంటు డిమాండ్‌
స్వామివారి ఆభరణలు, ఇతర విలువైన సంపద మాయం అవుతోందని రమణ దీక్షితులు ఆరోపిస్తున్నారు. శ్రీవారికి రూబీ వజ్రం కనిపించడం లేదని.. ఇటీవల జెనీవా నగరంలో వేలానికి ఉంచిన గులాబీరంగు వజ్రం అదే కావచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. స్వామివారి సంపద మాయం కావడంపై రిటైర్డ్‌ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు.

రమణదీక్షితులు ఆరోపణలను ఖండిస్తున్న అర్చకులు..
అయితే 2001 నుంచి రూబీ వజ్రం కనిపించకుండా పోయిందన్న రమణదీక్షితులు ఆరోపణలను మిగత అర్చకులు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. వాస్తవానికి 2001లో శ్రీవారి ఆభరణాలను టీటీడీకి అప్పగించింది. రమణదీక్షితులేనని.. రూబీ మాయం కావడం మిగతా వారికంటే ఆయనకే ఎక్కువగా తెలిసి ఉంటుందని అంటున్నారు. మరోవైపు రమణ దీక్షితులు ఆరోపణలను టీటీడీ ఈవో ఏకే సింఘాల్‌ ఖండించారు. శ్రీవారి నగలకు సంబంధించి 1952 నుంచి పక్కాగా లెక్కలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం అనుమతిస్తే ఏటా శ్రీవారి ఆభరణాలను భక్తుల కోసం ప్రదర్శించేందుకు ఎలాంటి అభ్యతరం లేదన్నారు. స్వామివారి నివేదనలు, కైంకర్యాలన్నీ ఆగమశాస్త్రయుక్తంగానే జరుగుతున్నాయని ఈవో సింఘాల్‌ చెప్పారు.

కట్టడాలను కూల్చివేస్తున్నారంటు రమణదీక్షితులు ఆరోపణలు
మరోవైపు వేల ఏళ్లనాడి కట్టడాలను అనవసరంగా కూల్చివేశారన్న రమణదీక్షితులు ఆరోపణలపై టీటీడీ వివరాలన్నీ బయటపెట్టింది. పోటు మరమ్మతు పనులతోపాటు వెయ్యికాళ్ల మండపం కూల్చివేతకు.. రమణ దీక్షితులు ఆమోదం తెలిపిన పత్రాలను టీటీడీ విడుదల చేసింది. శ్రీవారి ఆలయ౦లోని వకుళామాత పోటులో... ఎటువంటి తవ్వకాలు జరపలేదని.. కేవలం మరమ్మతులను మాత్రమే చేశామని టీటీడీ స్పష్టం చేసింది.

పరిణామాలు బాధాకరం : అర్చకులు వేణుగోపాల దీక్షితులు
కాగా శ్రీవారి ఆలయ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు బాధాకరమన్నారు టీటీడీ ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు. తిరుమల శ్రీవారి ప్రతిష్ట దెబ్బతీసేలా రమణదీక్షితులు ఆరోపణలు చేశారని అన్నారు. రమణదీక్షితులపై పలు ఆరోపణలు వస్తున్నాయని, ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

11:10 - May 10, 2018

బెంగళూరు : మోడీ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో ఉన్న సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో మోడీ కామెడీ షోలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అమిత్ షా, బీజేపీ నాయకులంతా మాటలు చెబుతున్నారు కానీ పాలన గురించి మాట్లాడకుండా రాహుల్ పై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. మోడీ విధానాలను ప్రజలు వ్యతిరేకిస్తూ తమకు ఓటేస్తారని, తమ ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. తమ కార్యక్రమాలను ప్రజలకు చెప్పడం జరుగుతోందని, అన్ని వర్గాల ప్రజలకు లాభం కలిగేలా తమ పాలన కొనసాగిస్తామన్నారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - ఆరోపణలు