ఆరోగ్యం

11:24 - September 20, 2018

హైదరాబాద్ : ప్రేమ వివాహం చేసుకున్నకూతురు, అల్లుడిపై తండ్రి మనోహరాచారి కత్తితో దాడి చేసిన ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మాధవి, సందీప్‌లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మాధవి ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. మాధవి మెడ, ఎడమ చేతి భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయని యశోద ఆస్పత్రి వైద్యలు అన్నారు. మెడ నుంచి మెదడుకు రక్తం అందించే రక్త నాళాలు తెగిపోయాయని తెలిపారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని వివరించారు. ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కూతురు మాధవి, అల్లుడు సందీప్‌లపై ఎర్రగడ్డలో మనోహరాచారి దాడి చేసి కత్తితో నరికాడు.

 

10:58 - September 19, 2018

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం బాగా ఉండాలనే కొన్ని చిట్కాలు..మీ కోసం...

ఉల్లిపాయలను మెత్తగా నూరి ఆ ముద్దను నుదుటి మీద పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల తలనొప్పి నుండి ఉపశమనం పొందుతారు. ఇంగువ జీర్ణశక్తికి ఎంతగానే ఉపయోగపడుతుంది. భోజనం చేసిన అనంతరం చిటికెడు ఇంగువ..చిటికెడు ఉప్పును మజ్జిగలో కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆహారం జీర్ణమవుతుంది. కొద్ది నిమ్మరసంలో కాస్త అల్లం రసం కలుపుకుని తాగి చూడండి. ఇలా చేయడం వల్ల దగ్గు నుండి ఉపశమనం పొందుతుంది. ఇలా రోజుకి రెండు..మూడు సార్లు తాగితే ఫలితం ఉంటుంది.అల్లం ముక్కను నిప్పులో మీద కాల్చి తింటే వికారం తగ్గే అవకాశం ఉంది. మీ కడుపులో నీరు అధికంగావుంటే నిత్యం కొబ్బరినీరు తాగాలి. మహిళలు నిత్యం ద్రాక్ష పండ్లు తీసుకోవాలి. చలినుండి కాపాడుకోవడానికి కలకండలో నిమ్మకాయ పిండుకుని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. 'జంక్ ఫుడ్'కి దూరంగా ఉండాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. పడుకొనే ముందు గోరువెచ్చని పాలు తాగడం మంచింది. ఒక నిర్ధిష్ట వేళలో నిద్రపోవాలి. పెరుగు..నిమ్మరసం..తేనే కలిపిన మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా రాసుకుని అరగంట అనంతరం చల్లటి నీటితో కడుక్కోంటే ముఖంపై పడిన ఎండ ప్రభావం పోతుంది. నేరేడు పండ్లు తినాలి. ఇందులో ఐరన్, కాల్షియం వంటి ఎన్నో మినరల్స్ లభిస్తాయి. డయాబెటిక్ వ్యాధి ఉన్నవారు మొక్కజొన్నలు తినటం మంచిది. మొక్కజొన్నలోని విటమిన్ బి12, ఫోలిక్ ఆమ్లాలు రక్తలేమిని రానివ్వవు. అరటిపండ్లు మిగతా పండ్లు కూరగాయలకంటే ఎక్కువ ఎంజైములు కలిగి తక్కువ క్యాలరీలతో ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

09:41 - September 17, 2018

బేబీ ఆయిల్ కేవలం చిన్న పిల్లలకే ఉపయోగించవచ్చా ? అంటే కాదు..పెద్దలు కూడా ఉపయోగించవచ్చని పలువురు పేర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళల అందాన్ని మెరుగుపరిచేందుకు సహాయ పడుతుందని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. 

  • చర్మానికి ఎలాంటి హానీ కలిగించకుండా బేబీ ఆయిల్ తో మేకప్ తొలగించుకోవచ్చు. బేబీ ఆయిల్ ను ముఖానికి రాసిన తర్వాత ఒక పొడి టవల్ తో శుభ్రంగా తుడిచేసుకోవాలి. 
  • పొడి చర్మతత్వం ఉన్నవారు...చర్మం తడిపొడిగా ఉన్నప్పుడు ఈ నూనె రాసుకోవాలి. చర్మానికి తేమ అంది తాజాగా మారుతుంది. 
  • వ్యాక్సింగ్‌ చేయించుకున్నాక దద్దుర్లు రాకుండా ఉండాలంటే కొద్దిగా ఈ నూనె రాసి మర్దన చేస్తే చాలు. చర్మం మృదువుగానూ మారుతుంది.
  • స్నానానికి వెళ్ళే పది నిమిషాల ముందు బేబీ ఆయిల్ ను బాడీకి మసాజ్ చేసుకొన్న తరువాత స్నానం చేసుకుంటే బాగుంటుంది. 
  • కండ్ల కింద నల్లటి వలయాల సమస్య కూడా తీరుతుంది. ఆయిల్‌ని కొద్దిగా తీసుకుని నల్లటి ప్రదేశం వద్ద మర్దన చేయాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేయాలి. 
  • కందిన లేదా కమిలిన చర్మం వద్ద ఆయిల్ ను మసాజ్ గా ఉపయోగించవచ్చు. 

వాతావరణం వల్ల కొందరి పెదాలు రంగు మారడం, పగుళ్లూ, మృతకణాలు లాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. బేబీ ఆయిల్‌ ల్లో కొద్దిగా తేనె, పంచదార కలిపి మృదువుగా రుద్దితే సమస్య పరిష్కారమౌతుంది. 

17:47 - September 4, 2018

రోజు మనం తీసుకునే ఆహారంమీదనే మన ఆరోగ్యం ఆధారపడి వుంటుంది. తేలికగా జీర్ణం అయ్యే ఆహారంతో శరీరం ఉత్సాహంగా తయారవుతుంది. అదే కష్టంగా జీర్ణం అయ్యే ఆహారంతో శరీరం అనారోగ్యాల బారిని పడటమే కాక..మనం తినే ఆహారాన్ని జీర్ణం అయ్యేలా చేసేందుకు మనం శరీరం కష్టపడితే అతి త్వరగా మన శరీరం అలసిపోతుంది. దీంతో పలు ఆరోగ్యం సమస్యలు తలెత్తుతాయి. అందుకే శరీరానికి పుష్కలంగా ప్రొటీన్స్, కాల్షియం, ఐరన్ వంటివి ఎక్కువ మోతాదులో అందాలంటే మొలకలే మెండు అంటున్నారు న్యూట్రీషియన్స్. మరి వారి సలహాలతో మంచి ఆహారం తీసుకుని మన ఆరోగ్యాన్ని పెంచుకోవాలంటే మొలకలతో మేలైన ఆరోగ్యం ఏమిటో తెలుసుకుందాం..

మెులకలు తరచుగా తీసుకోవడం వలన ఆరోగ్యానికి చాలా ఉపయోగాలున్నాయి. జీర్ణశక్తికి పెంచేందుకు మెులకలు బహు చక్కగా ఉపయోగపడతాయి. వీటితో మన శరీరంలో వుండే ఎంజైముల పనితీరు మెరుగుపడుతుంది. రక్తహీనతను తగ్గించుటకు మెులకలు దివ్యౌషధంగా పనిచేస్తాయి. అధిక బరువును తగ్గించటానికి చక్కటి తోడ్పాటును అందిస్తాయి. అంతేకాదు మొలకలు

చెడు కొలెస్ట్రాల్, రక్తపోటుల స్థాయిని క్రమేపీ తగ్గిస్తాయి. క్యాన్సర్ వ్యాధుల నుండి కాపాడుతాయి. ముఖ్యంగా కంటి చూపును మెరుగుపరచుటకు మంచిగా దోహదపడుతాయి. వీటిల్లో రోగనిరోధక శక్తిని పెంచే గుణం అధికంగా ఉంది. మెులకల్లో విటమిన్ కె, సి, ఎ, ఐరన్, క్యాల్షియం, మినరల్స్, జింక్, కాపర్, మెగ్నిషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. మెులకలను తరచుగా ఆహారంలో చేర్చుకుంటే రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. దీంతో మన ఆరోగ్యం చక్కగా వుంటుంది. 

11:35 - August 17, 2018

భారతీయ వంటకాలలో   ప్రధాన పాత్ర పచ్చిమిర్చిదే. కూర, పచ్చడి, చారు, సూప్, స్నాక్స్, బజ్జీ ఇలా పచ్చిమిర్చి ఉపయోగాలు ఎన్నో. అసలు పచ్చిమిర్చి లేనిదే స్పైసీ రాదు. స్పైసీ కావాలంటే ఇది వుండాల్సిందే. ఒక్కోసారి కేవలం రూ.10లకే దొరికే మిర్చి మరోసారి 100 అమ్మినా సరే మిర్చి కొనకుండా మానలేం..అసలు మార్కెట్ మిర్చి కొనుగోలు లేని పూర్తవ్వదంటే అతిశయోక్తి కాదు. ఒక విధంగా ఆహార పదార్థాల్లో ఎందెందు చూసినా అందందే పచ్చిమిరప ఉండును అనేంతగా పచ్చిమిర్చి ప్రత్యేకత. ఇది కేవలం స్పైసీని ఇవ్వటమే కాదు..పచ్చిమిర్చిలో ఎన్నో అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయని న్యూట్రిషన్ నిపుణులు కూడా చెబుతున్న మాటలు.

ప్రకృతి మనిషికి ఇచ్చే అన్ని రుచులు..
ప్రకృతి ఇచ్చే వన్నీ మనిషి ఉపయోగపడేవే. అలా లభించేవాటిలో అన్ని రుచులు వుంటాయి. ఒక్కోదానిలో ఒక్కోరుచి వుంటుంది. తీపి, వగరు, చేదు,పులుపు వంటి పలు రుచులలో కారం కూడా ఒకటి. మరి కారం అనగానే మనకు ఏం గుర్తుకొస్తుంది. అంటే మిర్చి అని ఠక్కున చెప్పేస్తాం. అన్ని రుచులు శరీరానికి ఉపయోగపడతాయని అందరికీ తెలుసు. అందుకే మనం ఉగాది పచ్చడిలో షడ్రుచులను మేళవించి తింటుంటాం. మరి అన్ని రుచుల్లో అన్ని వున్నప్పుడు కారంలో కూడా శరీరానికి ఉపయోగపడేవి వుంటాయన్నమాటేకదా!..మరి పచ్చిమిర్చి ఘాటులో మనకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం..

సున్నా కేలరీల మిర్చి..శక్తినిచ్చే మిర్చి ఘాటు..
తింటే నషాళానికి అంటే మిర్చి ఘాటుకు కళ్లు, నోరు జలపాతాలైపోతాయి. ఆ ఘాటుకు శరీరం కొంతసేపు ఆగమాగం అయిపోతుంది. ఊపిరాడనట్లుగా వుంటుంది. కానీ ఈ ఘాటు శరీరానికి మాత్రం మంచి శక్తినిస్తుందంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే రసాయనాలు మన జీవక్రియలను 50 శాతం వేగవంతం చేస్తాయి. దీంతో పచ్చిమిరపకాయలను తిన్న మూడు గంటల పాటు ఈ ప్రభావం ఉంటుంది. మిర్చి తింటే మంట వల్ల చాలావరకూ ఇబ్బంది వుంటుంది. కానీ ఈ మంట శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. పచ్చి మిరపకాయల్లో కేలరీలు సున్నా అనే విషయం అందరికీ తెలియదు. కానీ ఇది మాత్రం నిజం.

మంటలోనే ఉంది మందు..
మిరపకాయలు మంట ఎత్తిస్తాయన్న విషయం తెలుసు కదా. ఈ మంట ఎత్తించే రసాయనమే క్యాప్సేసియన్. ఇది బ్రెయిన్ లోని హైపోదాలమస్ అనే చల్లబరిచే కేంద్రాన్ని ప్రేరేపించడం ద్వారా బాడీ ఉష్ణోగ్రతను పెంచుతుంది.

ప్రొస్టేట్ గ్రంధి సమస్యలకు పచ్చిమిర్చితో..
కేవలం వంటకాలకు మాత్రమే కాక శరీరంలో మిర్చి ఘాటులో వుండే యాంటీ ఆక్సిడెంట్లు ఎంతోమేలు చేస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్ నుంచి రక్షణ కల్పిస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ను ఎప్పటికప్పుడు బయటకు పంపించేస్తాయి. దీంతో రక్షణ లభిస్తుంది. ప్రొస్టేట్ గ్రంధి సమస్యలకు పచ్చిమిరపకాయలు మంచి పరిష్కారం.

మిర్చితో గుండె పదిలం..
గుండెకు పచ్చిమిరప సెక్యూరిటీగా పనిచేస్తుందంటే మీరు నమ్ముతారా...? కానీ నమ్మి తీరాల్సిందే. ప్రమాదకర అథెరోస్కెల్ రోసిస్ ను పచ్చిమిర్చి నివారిస్తుంది. రక్తంలో చెడు కొలెస్టరాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయులను తగ్గించడం ద్వారా ధమనుల లోపల కొవ్వు ఏర్పడకుండా పచ్చిమిరపలోని రసాయనాలు అడ్డుకుంటాయి. అంతేకాదు చాలామందికి చిన్న దెబ్బ తగిలినా..లేదా ఒత్తిడి కలిగినా రక్తం గడ్డ కడుతుంటుంది. ఈ రక్తం గడ్డకట్టేందుకు దారితీసే ప్లేట్ లెట్ల సమూహం ఏర్పడకుండా పచ్చిమిర్చి నివారిస్తుంది. దీనివల్ల హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలు రాకుండా జాగ్రత్తపడవచ్చు.

సైనస్ కు మిర్చి ఉపయోగం..
ఆయా కాలాలలో వచ్చే పలు సమస్యల్లో జలుబు ప్రధానంగా వుంటుంది. కొందరు సైనస్ తో బాధపడుతుంటారు. జలుబు, సైనస్ ఉన్న వారికి పచ్చిమిరప మంచి సహజ ఔషధం అంటారు నిపుణులు. మిర్చిలో వుండే క్యాప్సేసియన్ ముక్కు లోపలి శ్లేష్మం మెంబ్రేన్లలను ఉత్తేజపరిచి మెంబ్రేన్లకు రక్త సరఫరా జరిగేలా చూస్తుంది. మెంబ్రేన్ అనే టిష్యూలో శ్లేష్మం ఏర్పడంతో సైనస్ అంటారు. క్యాప్సేసియన్ వల్ల రక్త సరఫరా మంచిగా జరిగి మెంబ్రేన్లలో శ్లేష్మం పల్చబడటంతో సైనస్ సమస్యకు ఉపశమనం కలుగుతుంది. మరి దీన్ని బట్టి చూస్తే..పచ్చిమిర్చి కారాన్నే కాదు ఆరోగ్యంలో కూడా మెండు అని ఒప్పుకుని తీరాల్సిందే కదా!..

06:31 - August 17, 2018

విజయవాడ : వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమీక్షించారు. వైద్యసేవల్లో నూతన పరిశోధనలకు ఏపీ మార్గదర్శకం కావాలని ఆకాంక్షించారు. విశాఖలోని మెడ్‌టెక్‌ వంటి సంస్థలతో నూతన ఆవిష్కరణలకు నాందీ పలకాలన్నారు సీఎం. ఈ సమావేశంలో వైద్యఆరోగ్య ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, సీఎంఓ కార్యదర్శి గిరిజా శంకర్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 

15:09 - August 16, 2018

ఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆరోగ్యం అత్యంత విషమించింది. ఈమేరకు ఎయిమ్స్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. వాజ్‌పేయి ఆరోగ్యం విషమంగానే ఉందని ఎయిమ్స్‌ వైద్యులు ప్రకటించారు. బుధవారం రాత్రి మాదిరిగానే ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తాజాగా విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం వాజ్‌పేయికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. వాజ్‌పేయిని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పరామర్శించారు. ఇక అమిత్‌షా, జేపీ నడ్డా ఆస్పత్రిలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నిన్న వాజ్‌పేయిని పరామర్శించిన ప్రధాని మోదీ... ఇవాళ మరోసారి ఎయిమ్స్ కు వచ్చి వైద్యులను అడిగి వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు వాజ్‌పేయిని పరామర్శించేందుకు పలువురు ప్రముఖులు ఎయిమ్స్‌కు వస్తున్నారు. కాసేపట్లో వాజ్‌పేయిని పరామర్శించేందుకు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రానున్నారు. ఇక వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో బీజేపీ నేతలు పలు కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. మరోవైపు బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు అత్యవసరంగా ఢిల్లీ రావాలని బీజేపీ అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఎయిమ్స్ ఆస్పత్రి వద్ద భారీ భద్రతా ఏర్పాటు చేశారు. మరోవైపు వాజ్ పేయి ఇంటి వద్ద బారీకేడ్లు ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

 

14:54 - August 16, 2018

ఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆరోగ్యంపై ఎయిమ్స్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. వాజ్‌పేయి ఆరోగ్యం విషమంగానే ఉందని ఎయిమ్స్‌ వైద్యులు ప్రకటించారు. బుధవారం రాత్రి మాదిరిగానే ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తాజాగా విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం వాజ్‌పేయికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. వాజ్‌పేయిని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పరామర్శించారు. ఇక అమిత్‌షా, జేపీ నడ్డా ఆస్పత్రిలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నిన్న వాజ్‌పేయిని పరామర్శించిన ప్రధాని మోదీ... ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు వాజ్‌పేయిని పరామర్శించేందుకు పలువురు ప్రముఖులు ఎయిమ్స్‌కు వస్తున్నారు. కాసేపట్లో వాజ్‌పేయిని పరామర్శించేందుకు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రానున్నారు. ఇక వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో బీజేపీ నేతలు పలు కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. మరోవైపు బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు అత్యవసరంగా ఢిల్లీ రావాలని బీజేపీ అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

14:50 - August 16, 2018

ఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆరోగ్యంపై ఎయిమ్స్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. వాజ్‌పేయి ఆరోగ్యం విషమంగానే ఉందని ఎయిమ్స్‌ వైద్యులు ప్రకటించారు. బుధవారం రాత్రి మాదిరిగానే ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తాజాగా విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం వాజ్‌పేయికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. వాజ్‌పేయిని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పరామర్శించారు. ఇక అమిత్‌షా, జేపీ నడ్డా ఆస్పత్రిలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నిన్న వాజ్‌పేయిని పరామర్శించిన ప్రధాని మోదీ... ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు వాజ్‌పేయిని పరామర్శించేందుకు పలువురు ప్రముఖులు ఎయిమ్స్‌కు వస్తున్నారు. కాసేపట్లో వాజ్‌పేయిని పరామర్శించేందుకు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రానున్నారు. ఇక వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో బీజేపీ నేతలు పలు కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. మరోవైపు బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు అత్యవసరంగా ఢిల్లీ రావాలని బీజేపీ అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

21:15 - August 15, 2018

ఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్ పేయి ఆరోగ్యం విషమించింది. మూత్రనాళ ఇన్ఫెక్షన్ తో ఆయన జూన్ లో ఎయిమ్స్ లో చేరారు. 65 రోజులుగా ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. అనారోగ్య కారణంగా 2009 నుంచి వాజ్ పేయి ఇంటికే పరిమితయ్యారు. ఎయిమ్స్ లో వాజ్ పేయిని ప్రముఖులు పరామర్శిస్తున్నారు. సాయంత్రం ప్రధాని మోడీ వాజ్ పేయిని పరామర్శించారు. వైద్యులను అడిగి ఆయన ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

Pages

Don't Miss

Subscribe to RSS - ఆరోగ్యం