ఆకుకూరలు

20:03 - September 4, 2018

ఆకుకూరల్ని రైతులు పడిస్తుంటారు. లేదా పెరట్లో పెంచుకుని వాటుకుంటుంటాం. మనం రోజు తినే..చూసే అకుకూరలు మనం పెంచకపోయినా..ఏమాత్రం శ్రద్ధ పెట్టకపోయినా అన్ని మొక్కల్లో కలిసిపోయి పెరుగుతుంటాయి. వాటి సంగతి మనకు తెలియదు. అసలు అవి ఆకుకూరలని కూడా మనకు తెలియదు. కొన్ని రకాల ఆకుకూరలు కలుపు మొక్కల్లో మొక్కలుగా పెరుగుతాయనే సంగతి మీకు తెలుసా? ఇలా పెరిగే ప్రతి మొక్కలోనూ ఔషధ, పోషక గుణాలు పుష్కలంగా వున్నాయని పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఈ ఆకు కూరల పంటల పట్ల గ్రామీణ ప్రజల్లో అవగాహన ఉన్నప్పటికీ పట్టణ ప్రజలకు వీటి పేర్లు కూడా చాలావరకూ తెలియవంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఖరీప్‌, రబీ సీజన్లలో పొలాల్లోను, పొలంగట్లు వెంబడి, ఆఖరికి మొక్క మొలవని బీడు భూముల్లోను, గుట్టల్లోను ఇలా వివిధ రకాల ఆకుకూరలు దొరుకుతాయి. వాటిలో ముఖ్యంగా దొగ్గలి, జొన్నచెంచలి, తెల్లగలిజేరు, సన్నపాయిలి, బర్రెపాయిలి, తలావావిలి, ఎలుకచెవికూర, ఎర్రదొగ్గలికూర, గునుగుకూర, తుమ్మికూరలను పాతతరం వారు ఆకుకూరల్లా వండుకు తినేవారు. వీటిల్లో ఆద్భుతమైన పోషకాలు వుండేవని పెద్దగా అవగాహన లేని పెద్దలు చెబుతుండేవారు. ఇప్పుడంటే న్యూట్రిషియనిస్ట్ లు చెబుతున్నారు గానీ పాతకాలంలో ఆనుభవమున్న పెద్దలే పెద్ద న్యూట్రిషియనిస్టులు అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు..మరి మీరేమంటారు? అవును కదా? పెద్దల మాట సద్ధన్నం మూట.

15:57 - February 8, 2018

విజయవాడ : ఏలూరు బిర్లాభవన్ సెంటర్‌ వద్ద జనసేన కార్యకర్తలు ఆకుకూరలు నములుతూ వినూత్నంగా నిరసన చేపట్టారు. ఏపీని మోడీ ప్రభుత్వం విస్మరించడంపై తీవ్రంగా మండిపడ్డారు. మరోవైపు ఏలూరులో అన్నిచోట్ల బంద్‌ కొనసాగుతోంది. స్కూళ్లు, వ్యాపారసంస్థలు మూతపడ్డాయి. జిల్లావ్యాప్తంగా 8 డిపోల్లో 600 బస్సులు నిలిపివేశారు. పలుచోట్ల వామపక్ష, వైసీపీ, కాంగ్రెస్ నేతల్ని పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు.

ఏలూరులో బంద్‌ సంపూర్ణంగా జరుగుతోంది. వ్యాపారస్థులు స్వచ్ఛందంగా బంద్‌ పాటిస్తుండటంతో.. షాపులన్నీ మూతపడ్డాయి. ఏలూరులో బంగారం షాపుల మూతపడటంతో.. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం నిర్మానుష్యంగా మారిపోయింది. అన్ని రాజకీయ పార్టీలు బంద్‌లో పాల్గొనడంతో వ్యాపార సంస్థలు, స్కూళ్లు మూతపడ్డాయి. ఏలూరులో ప్రస్తుత పరిస్థితి తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

12:32 - August 21, 2017

వంటకాలకు రుచి, వాసన రావాలంటే కొతిమీర ఆ వంటల్లో కొతిమీర ఆకు వేయాల్సిందే. చూడడానికి సున్నితంగా, మంచి లేత ఆకుపచ్చని రంగు మంచి వాసనతో ఇట్లే ఆకర్షిస్తుంది కొతిమీర ఆకులు. ప్రతినిత్యం మనం వంటకాలలో వాడే కొతిమీర వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం.

కొత్తిమీరలో పొటాషియం, ఇనుము, విటమిన్ ఎ, కె మరియు C, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం మరియు కాల్షియం అధికంగా ఉన్నాయి. దీనికి ఉన్న ఔషధ లక్షణాల వలన దీనిని ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారు. మనలో జీర్ణక్రియ సజావుగా జరిగేట్లుగా చేస్తాయి. మలబద్ధకాన్ని కూడా నివారిస్తాయి. జీర్ణక్రియకు కావాలిసిన యంజైమ్స్ మరియు రసాల ఉత్పత్తి చేయటంలో సహాయపడతాయి.

కొత్తిమీరలో ఫోలిక్ ఆమ్లం, విటమిన్ సి, విటమిన్ ఎ మరియు బేటా-కెరోటిన్ వంటి అనేక ముఖ్యమైన విటమిన్లు ఉన్నాయి. కొత్తిమీర ఆకులు మరియు ధనియాల్లో మనకు రోజువారీ మధుమేహంతో బాధపడేవారు రోజూ క్రమం తప్పకుండా కొత్తిమీర రసం త్రాగితే మంచిది.

కలుషిత ఆహారం, నీరు వల్ల కలిగే కలరా, టైఫాయిడ్, విరేచనాలు వంటి వ్యాధులు కూడా రోజూ మీరు కొత్తిమీరను ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకుంటే, ఆ వ్యాధులు మీ దరిదాపుల్లోకి కూడా రావు.

దీనిలో ఐరన్ పదార్ధం ఎక్కువగా ఉండటం వలన, ముఖ్యంగా స్త్రీలు కొత్తిమీర ఎక్కువగా తీసుకోవటం చాలా మంచిది. స్త్రీల ఋతుక్రమంలో, వారు రక్తాన్ని కోల్పోతుంటారు. దీనివలన స్త్రీలలో ఐరన్ లోపం ఎక్కువగా ఉంటుంది. స్త్రీలు తీసుకునే ఆహారంలో కొత్తిమీర ఎక్కువగా వాడటం వలన ఈ లోపాన్ని చాలావరకు సరిదిద్దుకోవచ్చు.

కొత్తిమీరవాడకం వలన కండ్లకలక, కళ్ళఎరుపు, దురద మరియు వాపు వంటి వాటికి ఉత్తమ ఉపశమనం కలుగుతుందని పరిశోధనలు చెపుతున్నాయి. కొత్తిమీర తామర, దురద చర్మం, దద్దుర్లు మరియు మంట వంటి వివిధ చర్మ వ్యాధుల ఉపశమనానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఉడికించిన కొత్తిమీర నీటితో పుక్కిలించి ఉమ్మివేయటం వలన నోటిపూత నయమవుతుంది.

ధనియాలు లేదా కొత్తిమీర పేస్ట్ కు కొద్దిగా తేనె, పసుపు కలపండి. ఈ పేస్ట్ ను ముఖానికి మాస్క్ లాగా వేయండి. ఇలా చేయటం వలన ముఖం మీద ఉండే మొటిమలు, ఆక్నే, బ్లాక్ హెడ్స్ వంటివి మటుమాయమవుతాయి.

ఇన్ని ప్రయోజనాలు ఉన్న కొత్తిమీర, ధనియాలను ఎక్కువగా తీసుకున్నందువలన అప్రయోజనాలు కూడా ఉన్నాయండోయి! వీటిని ఎక్కువగా తీసుకుంటే లివర్ లో సమస్యలు మొదలవుతాయి. గర్భిణి స్త్రీలు, పాలిచ్చే తల్లులు కూడా వీటిని తీసుకోకుండా ఉండటమే మంచిది. తీసుకున్నా చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవాలి.

16:21 - April 22, 2017

ఆకుకూరలు..ఆరోగ్యానికి ఎంతో మంచిది..నిత్య ఆహారంలో ఆకు కూరలను భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు దాగుంటాయి. ఆకుకూరల్లో పాలకూర ఒకటి. మహిళలకు పాలకూర వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. మహిళలు తప్పనిసరిగా పాలకూరను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. క్లోరిన్, ప్రోటీన్లు, విటమిన్ ఏ, సిలు, ఖనిజ లవణాలు, కాల్షియంలు లభిస్తాయి.
దీనిని తినడం వల్ల రక్తహీనతకు చెక్ పడుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
దాంతో పాటు అధిక రక్తపోటును తగ్గించి, శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.
పాలకూర రసాన్ని తాగడం వల్ల జుట్టు అందంగా ఉంటుంది. జుట్టు ధృడంగా, పొడవుగా పెరుగుతుంది. వెంట్రుకలకు అవసరమైన పోషకాలు ఇందులో లభిస్తాయి.
శరీరానికి అవసరమైన ఐరన్‌ను పుష్కలంగా అందిస్తుంది. కాల్షియం ఎముకలను బలంగా ఉంచుతుంది.

15:33 - October 25, 2016

ఆకు కూరలలో కెరోటిన్‌ అనే పదార్ధం సమృద్ధిగా ఉం టుంది. శరీరంలో కెరోటిన్‌ విటమిన్‌ 'ఎ'గా మారుతుం ది. విటమిన్‌ 'ఎ' చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కళ్ళకు సరైన చూపును ఇస్తూ రేచీకటి రాకుండ కాపాడుతుంది. ఆకు కూరల్లో తోట కూర ఒకటి. ఈ తోటకూర తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు దాగున్నాయి.
అధిక రక్తపోటుకు చెక్ పెడుతుంది. హైపర్‌టెన్షన్‌తో బాధపడే వాళ్లకు మేలు చేస్తుంది.
రెగ్యులర్ గా తోటకూర తింటే రక్తహీనత నుంచి ఉపశమనం లభిస్తుంది.
బరువు తగ్గాలనుకునే వాళ్లు ఈ ఆకుకూరను భుజించడం ఉత్తమం. పీచుపదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది. దానికి తోడు కొవ్వును తగ్గిస్తుంది.
తోటకూర తక్షణశక్తినివ్వడంలో తోడ్పడుతుంది. కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, పాస్పరస్‌, జింక్‌, కాపర్‌, మాంగనీస్‌, సెలీనియం వంటి ఖనిజాలన్నీ తోటకూరతో లభిస్తాయి. రక్తనాళాల్ని చురుగ్గా ఉంచి.. గుండెకు మేలు చేసే సోడియం, పొటాషియం వంటివీ సమకూరుతాయి.
తోటకూరలోని 'విటమిన్‌ సి' రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. తాజా తోటకూర  ఆకుల్ని మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బుకున్నాక.. తలకు పట్టించుకుంటే మంచిది. ఇలా రెగ్యులర్‌గా చేస్తే జుట్టు రాలదు. మాడు మీద చుండ్రు తగ్గుతుంది.
విటమిన్ల ఖని తోటకూర అని చెప్పవచ్చు. విటమిన్‌ ఎ, సి, డి, ఇ, కె, విటమిన్‌ బి12, బి6 వంటివన్నీ ఒకే కూరలో దొరకడం అరుదు. ఒక్క తోటకూర తింటే చాలు. ఇవన్నీ సమకూరుతాయి.
వంద గ్రాముల తోటకూర తింటే 716 క్యాలరీలశక్తి లభిస్తుంది. కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, పీచు వంటివన్నీ దొరుకుతాయి.

07:47 - March 17, 2016

సహజంగా కాయగూరలు ఎలాంటివి తీసుకోవాలో తెలియక తికమకపడుతుంటారు. ఇలాంటి వారు ఈ జాగ్రత్తలు తీసుకున్నటైతే మీ కుటుంబానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా చూసుకోవచ్చు. వంకాయలు వాడిపోకుండా, మరీ గట్టిగా లేదా మరీ మెత్తగా ఉండకుండా చూసుకోవాలి. తొడిమలు ఆకుపచ్చ రంగులో ఉండి తోలు నిగనిగలాడుతూ పుచ్చులు లేకుండా చూడాలి.
బంగాళాదుంపలు గట్టిగా ఉండేలా చూసుకోవాలి. పైపొర తీసినప్పుడు లోపలిభాగం లేత పసుపు పచ్చని రంగులో ఉండాలి. బంగాళా దుంపపైన నల్లటి మచ్చలు లేదా ఆకుపచ్చని మచ్చలు ఉన్నట్లయితే వాటిని పొరపాటున కూడా కొనకూడదు. దుంపలపైన గుంటలు లేకుండా నున్నగా ఉండేవి చూసి కొనాలి.
అల్లం మరీ గట్టిగా లేదా మరీ మెత్తగా లేకుండా ముదురు రంగులో ఉన్న దానిని చూసి ఎంపిక చేసుకోవాలి. అల్లంపై పొర తీసి వాసన చూసి దాని ఘూటును బట్టి కొనాలి.
ఉల్లిపాయలు గట్టిగా ఉన్నవి మాత్రమే కొనాలి. వీటిపై పొరలో తేమ ఉంటే అసలు కొనకూడదు.
బీట్‌రూట్‌ కొనేముందు దాని కింద భాగంలో వేర్లు వున్న వాటిని ఎటువంటి మచ్చలు, రంధ్రాలు లేనివి చూసి కొనాలి.
బెండకాయలను కొనేటప్పుడు లేతవి చూసి కొనుక్కోవాలి. ముదిరినవి కొనకూడదు.
కాలిఫ్లవర్‌ కొనేముందు దాని ఆకులు ఆకుపచ్చని రంగులో వుండేలా చూసుకోవాలి. పచ్చదనం లేని ఆకులున్న వాటిని కొనకూడదు. పువ్వు విడిపోకుండా దగ్గరగా వున్న వాటినే కొనాలి.
ఆకుకూరలు కొనేముందు వాటిపైన తెల్లటి మచ్చలు లేకుండా చూసుకోవాలి. వాటి కాడలు తాజాగా, లేతగా ఉండేటట్లు చూసుకోవాలి.

13:07 - November 24, 2015

ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని న్యూట్రీషన్లు అంటున్నారు. ఆకుకూరల్లోని విటమిన్‌-బీ పాలెట్స్‌ జ్ఞాపకశక్తి, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఇందులోని విటమిన్‌-ఏ కంటిచూపును మెరుగు పరుస్తుంది. గుండె సంబంధిత వ్యాధులకు దారితీసే అమైనో ఆమ్లాలనూ నియంత్రిస్తాయి. ముఖ్యంగా పొన్నగంటి కూరలో ఏ విటమిన్‌ అధికం. దీనిని తింటే రేచీకటి రాదు. శరీరానికి చలువ కూడా. పేగుల్లోకి వెళ్లిన వెంట్రుకలను సైతం కరిగించే శక్తి దీనికుంది. ఇక కూరల్లోగానీ, పచ్చడిగా గానీ పుదీనా తీసుకుంటే మెదడు చురుగ్గా ఉంటుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

ఆహారంలో ఆకుకూరలు...
బరువు తగ్గించడంలో అద్భుతంగా సహాయపడే ఒక రాఫుడ్‌ ఆకుకూరల్లో ఉంటుంది. వీటిలో విటమిన్‌ కె పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరానికి కావలసిన ఐరన్‌ని అందిస్తాయని న్యూట్రీషన్లు అంటున్నారు. ఆకు కూరల్లో క్యాలరీలు, కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ప్రతి రోజూ ఏదో ఒక ఆకు కూర తీసుకునే వారిలో మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పధ్నాలుగు శాతం తగ్గించ వచ్చంటున్నారు. కాబట్టి ఆహారంలో ఆకుకూరలు వారానికి మూడు సార్లు తీసుకుంటూ వుండండి. అలాగే డ్రై ఫ్రూట్స్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఖర్జూరా, బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, చెర్రీ, అంజీరా, పిస్తా, వాల్‌నట్స్‌ లాంటి ఎండు పండ్లలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యంతో పాటు శరీరానికి అదనపు శక్తిని ఇస్తాయి. రుచిగా ఉన్నాయి కదా అని మరీ ఎక్కువ తింటే అజీర్తి, అనారోగ్య సమస్యలు రావొచ్చు. అందుకే రోజుకు రెండు నుంచి నాలుగు డ్రైఫ్రూట్స్‌ మాత్రమే తీసుకోవాలి. నట్స్‌ను తీసుకునే ముందు వాటిని శుభ్రం చేసుకోవడం మంచిది. 

Don't Miss

Subscribe to RSS - ఆకుకూరలు