అస్సాం

10:36 - October 22, 2018

అస్సాం : క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ ఓ సంచలనం. ఓ రికార్డుల పుస్తకం. సెంచరీల పుస్తకం. క్రికెటర్స్ అతనో ఇన్ఫిరేషన్. అతన్ని చూసే క్రికెట్ లోకి వచ్చినవారెందరో. సచిన్ అంటే పడి చచ్చిపోయే అభిమానులకు లెక్కలేదు. లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ కు క్రికెట్ వారసుడిగా సచిన్ రికార్డులకు లెక్కలేదు. ఈ నేపథ్యంలో సచిన్ రికార్డులకు చెక్ పెట్టేశాడు మన రోహిత్ శర్మ.

టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గువాహటిలో విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన రోహిత్ 152 పరుగులు చేశాడు. 117 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 15 ఫోర్లు 8 సిక్సర్లతో 150 పైచిలుకు పరుగులు సాధించాడు. తద్వారా వన్డేల్లో ఎక్కువసార్లు 150కిపైగా పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.

 టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 5 సార్లు 150కిపైగా పరుగులు సాధించాడు. రోహిత్ ఆరుసార్లు ఆ ఘనత సాధించి సచిన్ రికార్డును బద్దలుగొట్టాడు. ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ కూడా ఐదుసార్లు 150కిపైగా పరుగులు సాధించాడు. కాగా, వన్డేల్లో రోహిత్ అత్యధిక స్కోరు 264 పరుగులు కావడం విశేషం. మరి సచిన్ ఇటువంటివారికి స్ఫూర్తిగా నిలిచాడు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

17:48 - September 26, 2018

అస్సాం : కాజీరంగా నేషనల్ పార్క్ అస్సాంకే గర్వకారణంగా ఉంటుంది. ఇది అంతరించిపోతున్న ఇండియన్ ఒక కొమ్ము గల ఖడ్గమృగాలకు నిలయంగా ఉంది. సుమారు 429,93 sq కిలో మీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ పార్క్ లో ఖడ్గమృగాల జోలికెళ్లితే కాల్చిపడేస్తారు. మన దేశంలో మాత్రమే కనిపించే ఈ ఖడ్గమృగాలు అధిక సంఖ్యలో కంజిరంగా పార్క్ లోనే వుంటాయి. కాగా ఖడ్గమృగాల కొమ్ము చాలా విలువైనదిగా పేర్కొంటారు. ఆ కొమ్ములో క్యాన్సర్ తో పాటు అనేక రోగాలను కూడా నయం చేసే ఔషధ గుణాలు వుంటాయని నమ్ముతుంటారు. దీంతో ఖడ్గమృగాలు వేటగాళ్ల బారిన పడి వాటి సంఖ్య తగ్గిపోతున్న పరిస్థితి నెలకొంది. దీంతో అస్సాం ప్రభుత్వం ఖడ్గమృగాల పట్ల కఠిన చర్యల్ని తీసుకుంటోంది. ఈ ఖడ్గమృగాల కొమ్ము విదేశాల్లో లక్షల ధర పలుకుతోంది. దీంతో ఖడ్గమృగాల జోలికెళ్లినా..వాటి పరిసరాల్లో అనుమానాస్పదంగా సంచరించినా..ఏమాత్రం అనునించకుండా కాల్చిపడేయాలని  అటవీశాఖ అధికారులు కాల్చిపడేస్తారు. 2016లో ఖడ్గమృగాలను వేటాడే వేటగాళ్ల సంఖ్యకంటే అటవీశాఖ అధికారులు కాల్చిపడేసిన వేటగాళ్ల సంఖ్యే ఎక్కువంగా వుంది అంటే వారు ఎంతటి కఠిన చర్యల్ని అవలంభిస్తున్నారో ఊహించవచ్చు. ఒకప్పుడు వేళ్లమీద లెక్కించగలిగే ఖడ్గమృగాల సంఖ్యల 207కి కంజిరంగా పార్క్ లో 2400లకు పెరిగటం గమనించాల్సిన విషయం. 

 

11:13 - September 12, 2018

గౌహటి: అస్సాంలోని కొక్రాఝర్ ప్రాంతంలో ఈ ఉదయం భారీగా భూమి కంపించింది. దీని ప్రభావం రెక్టార్ స్కేల్ పై 5.5 గా నమోదయ్యింది. భూకంప ప్రభావం బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లోను కనిపించింది. అయితే భూకంపం సృష్టించిన నష్టంపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు పేర్కొన్నారు.

16:54 - August 15, 2017

అస్సాం : రాష్ట్రంలో వరదలు ముంచెత్తుతున్నా...ప్రజలు దేశభక్తిని మాత్రం మరువలేదు. వరద నీటిలో టీచర్లు, విద్యార్థులు 71 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. చుట్టూ మోకాళ్లలోతు నీళ్లున్నా...దాన్ని లెక్క చేయకుండా స్కూలుకు వెళ్లి మువ్వన్నెల జెండాను ఎగరవేసి తమ దేశభక్తిని చాటుకున్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి సెల్యూట్ చేస్తున్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. 

 

 

07:07 - May 27, 2017

ఢిల్లీ : 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయడమే తమ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోది స్పష్టం చేశారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా అస్సాంలో పర్యటించిన మోది... పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన దేశంలోనే అత్యంత పొడవైన ధోలా-సదియా వారధిని ఆయన ప్రారంభించారు.

ఎన్డీయే అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తి ...

కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోది అస్సాంలో పర్యటించారు. దేశంలోనే అత్యంత పొడవైన ధోలా-సదియా వారధిని మోది ప్రారంభించారు.

ఈ వంతెనకు భూపేన్‌ హజారికా పేరు...

ఈ వంతెనకు భూపేన్‌ హజారికా పేరు పెడుతున్నట్లు ప్రధాని ప్రకటించారు. 9 కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెన దేశానికే గర్వకారమని... అసోం, అరుణాచల్‌ రాష్ట్రాల అభివృద్ధిలో ఈ బ్రిడ్జి కీలక పాత్ర పోషిస్తుందని మోది చెప్పారు. ఈ వంతెనతో అస్సాం-అరుణాచల్‌ ప్రదేశ్‌ల మధ్య రోడ్డు ప్రయాణం 165 కి.మీ.మేర తగ్గడమే కాకుండా.. ప్రయాణ సమయం 6 గంటల నుంచి గంటకు తగ్గనుంది. వంతెన నిర్మాణం ఆలస్యానికి కాంగ్రెసే కారణమని మోది ఆరోపించారు. 2004లో వాజ్‌పేయి తిరిగి అధికారంలోకి వస్తే 10 ఏళ్ల క్రితమే వంతెన పూర్తయ్యేదని...ఇప్పుడు ఆయన కలలను సాకారం చేశామని ప్రధాని చెప్పుకొచ్చారు.

ధీమాజీలో భారత వ్యవసాయ పరిశోధనా కేంద్రానికి శంఖుస్థాపన...

అనంతరం ఆయన ధీమాజీలో భారత వ్యవసాయ పరిశోధనా కేంద్రానికి శంఖుస్థాపన చేశారు. 2022 నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నందున రైతుల ఆదాయాన్ని ద్విగుణీకృతం చేయడమే తమ లక్ష్యమని ప్రధాని స్పష్టం చేశారు. వ్యవసాయరంగంలో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి ఆధునిక టెక్నాలజీ ఉపయోగించాలని రైతులకు ఆయన పిలుపునిచ్చారు.

అస్సాంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటై నేటితో ఏడాది పూర్తి...

అస్సాంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటై నేటితో ఏడాది పూర్తి చేసుకుందని ప్రధాని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈశాన్య రాష్ట్రాలు పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మోది పేర్కొన్నారు.

16:57 - May 26, 2017

అస్సాం : 2022 నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నందున రైతుల ఆదాయం రెండింతలు పెరగడమే తమ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. వ్యవసాయరంగంలో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి ఆధునిక టెక్నాలజీ ఉపయోగించాలని రైతులకు ఆయన పిలుపునిచ్చారు. దేశంలో రెండో హరిత విప్లవం రావాల్సిన అవసరం ఉందని మోడీ అభిప్రాయ పడ్డారు. అస్సాంలో ఆగ్రో మెరైన్‌ ప్రాసెసింగ్‌ స్కీమును ప్రారంభించిన మోడీ సభనుద్దేశించి ప్రసంగించారు. తమ మూడేళ్ల పాలనలో రైతుల కోసం ఎన్నో స్కీములు ప్రవేశపెట్టామని మోది చెప్పారు.

06:49 - May 26, 2017

హైదరాబాద్ భారత్‌లో అత్యంత పొడవైన బ్రిడ్జిని ప్రధానమంత్రి నరేంద్రమోది అస్సాంలో నేడు ప్రారంభించనున్నారు. 9 కిలోమీటర్ల పొడవైన ఈ బ్రిడ్జిని పూర్తి చేయడానికి మూడేళ్ల సమయం పట్టింది. మన్మోహన్‌ సింగ్‌ హయాంలో ఈ బ్రిడ్జి నిర్మాణానికి శంఖుస్థాపన జరిగింది. దీన్ని ఛాలెంజ్‌గా తీసుకున్న ప్రధాని మోది త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. బ్రహ్మపుత్ర ఉపనది లోహిత్‌ నదిపై ధోలా సదియా బ్రిడ్జిని నిర్మించారు. గౌహతికి 540 కిలోమీటర్ల దూరంలో సదియ వద్ద బ్రిడ్జి ఏర్పాటు చేశారు. ఈ బ్రిడ్జి ప్రారంభంతో అస్సాం-అరుణాచల్‌ ప్రదేశ్‌ల మధ్య ప్రయాణంలో 4 గంటల సమయం ఆదా కానుంది.

16:51 - May 1, 2017

అస్సాం : దేశంలో గోరక్షణ పేరిట హిందుత్వ శక్తుల దాడులు ఆగడం లేదు. తాజాగా అస్సాంలోని నౌగావ్‌ జిల్లాలో గోరక్షణ పేరిట దారుణం జరిగింది. 20 నుంచి 25 ఏళ్లున్న ఇద్దరు యువకులు ఆవులను అక్రమంగా తరలిస్తున్నారన్న ఆరోపణలతో గోరక్షకదళం మూకుమ్మడిగా వారిపై దాడి చేసింది. కిలోమీటర్‌ మేర వారిని తరుముతూ కర్రలతో విచక్షణ రహితంగా గోరక్షకులు కొట్టారు. తీవ్రంగా గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. మృతుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంతవరకు ఎవరినీ అరెస్ట్‌ చేయలేదు. అస్సాంలో గోరక్షణ పేరిట హత్య జరగడం ఇదే తొలిసారి. బిజెపి అధికారం చేపట్టాక ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

16:44 - February 26, 2017

హైదరాబాద్: అసోంలో ఓ ఏనుగు తన చర్యతో అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. జల్‌పాయ్‌ గురి జిల్లాలోని చంప్రమరి వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో... రైల్వే లెవల్ క్రాసింగ్‌ గేట్‌ను తనదైన శైలిలో దాటేసింది. మొదటి గేటును మెడవరకు ఎత్తి పట్టాల మీదకు వచ్చిన ఏనుగు.. రెండో గేటును దాటి వెళ్లింది. ఈ క్రమంలో ఏనుగు ధాటికి గేటు విరిగిపోయింది. దాదాపు 15 నిమిషాల పాటు అక్కడే తచ్చాడిన ఏనుగు.. తరువాత అడవిలోకి వెళ్లిపోయింది.

22:10 - August 5, 2016

దేస్ పూర్ : అస్సాంలోని కోక్రాజార్‌ లో ఉ్రగవాదులు రెచ్చిపోయారు. పట్టణంలోని ఓ మార్కెట్‌ ప్రదేశంలో ఉగ్రవాదులు ఏకే 47 తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కకే మరణించగా 15 మంది తీవ్రగాయాలపాలయ్యారు. అనంతరం భద్రతా బలగాలు రంగంలోకి దిగి ఎదురు కాల్పులు జరపడంతో ఒక ఉగ్రవాది మరణించాడు. ఇదిలా ఉంటే బోడో ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడిన్లు తెలుస్తోంది. ఘటనపై ప్రధాని మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి సోనోవాల్‌ను అడిగి తెలుసుకున్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - అస్సాం