అవిశ్వాసం

12:32 - August 2, 2018

పెద్దపల్లి : రామగుండం మేయర్ అవిశ్వాసం నెగ్గుతారా ? ఓడిపోతారా ? అనే ఉత్కంఠకు తెరపడింది. మేయర్ లక్ష్మీనారాయణపై అవిశ్వాసం నెగ్గింది. దీనితో ఆయన మేయర్ పదవి కోల్పోయారు. మేయర్ కు వ్యతిరేకంగా కార్పొరేటర్లు ఓటు వేశారు. అనంతరం డిప్యూటి మేయర్ పై అవిశ్వాసం కొనసాగనుంది. ఇక మేయర్ పదవి ఎవరు చేజిక్కించుకోవాలనే దానిపై తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. ఇందుకు కాంగ్రెస్..టీఆర్ఎస్ మధ్య ఒక లోపాయికారి ఒప్పందం కుదిరినట్లు సమాచారం. మేయర్ పదవి టీఆర్ఎస్..డిప్యూటి మేయర్ కాంగ్రెస్ కార్పొరేటర్లు తీసుకోవాలనే ఒప్పందం కుదిరినట్లు సమాచారం. విప్ ను ధిక్కరించి ఓటు వేసిన పలువురు కాంగ్రెస్ కార్పొరేటర్లు టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.

ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, మేయర్ లక్ష్మినారాయణ మధ్య కొనసాగిన ఆధిపత్య పోరు అవిశ్వాస తీర్మానానికి తెరలేపింది. కాంగ్రెస్ కార్పొరేటర్లతో అవిశ్వాసం నెగ్గొచ్చని భావించిన ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ వర్గానికి కాంగ్రెస్ అధిష్టానం విప్‌ జారీతో ఝలక్‌ ఇచ్చింది. పరాకాష్టకు చేరింది. తనకు కొరకరాని కొయ్యగా మారిన మేయర్‌ను కొనసాగించడం మంచిది కాదని భావించిన ఎమ్మెల్యే అవిశ్వాస అస్ర్తాన్ని ఎక్కుపెట్టారు. ఇందుకు కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్ల మద్దతు కూడగట్టుకొని కలెక్టర్‌కు తీర్మాన పత్రాన్ని అందచేశారు. టీఆర్ఎస్‌ పార్టీ తమ 13 మంది కార్పొరేటర్లకు తోడు.. మేయర్ లక్ష్మినారాయణతో పాటు మరో 14 మంది స్వతంత్ర కార్పొరేటర్ల మద్థతుతో.. మేయర్ స్థానాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

రామగుండం కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్లు ఉన్నాయి. టీఆర్ఎస్‌కు 13, కాంగ్రెస్‌కు 20, ఇండిపెండెట్లు 15, బీజేపీకి 2 చొప్పున గెలుపొందారు. వీరిలో 9 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లతో పాటు.. 15 మంది ఇండిపెండెంట్లు టీఆర్ఎస్‌ గూటికి చేరారు. కాగా 50 మంది కార్పొరేటర్లలో 39 మంది అవిశ్వాసానికి సిద్దమయ్యారు. కాంగ్రెస్‌లో మిగిలిన 11 మంది కార్పొరేటర్లలో 8 మంది అవిశ్వాసానికి మద్థతునిస్తూ క్యాంపులకు తరలి వెళ్లారు. 

20:26 - July 26, 2018

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంల జర్గే ప్రతి ప్రతి అత్యాచారానికి.. ప్రతి మానభంగానికి.. ప్రతి మహిళా వేదనకు కారకుడు చంద్రబాబునాయుడుగారే అంటున్నది ఎమ్మెల్యే రోజా మేడం.. అసలు ఆయన అనెటోడు లేకపోతె మహిళలంత సుఖసంతోషాలతోని.. పిల్లాపాపలతోని సంతోషంగ బత్కేటోళ్లు అనుకొచ్చింది.. ఇంక చాల జెప్పింది మద్యం దుకాండ్లు బెల్టు షాపుల ముచ్చట్లు.. జర్రంత మనం గూడ అర్సుకునేదున్నది రోజమ్మను పాండ్రిగ..

సూశిండ్రా.. తెలంగాణ ఇప్పుడు వానకాలంగాదు నడుస్తున్నది.. అవిశ్వాసాల కాలం.. ఎంపీటీలకు మళ్లొక సారి పంటవండిందన్కోరాదుండ్రి.. అయితే బేరం ఎటు గట్టిగ గుదిర్తే అటే ఉర్కుతున్నరు ఎంపీటీసీలు.. వేములవాడ ఎంపీపీ అవిశ్వాసం కాడ ఎంత కథ అయ్యిందో సూడుండ్రి.. ఆఖరి దాక అవిశ్వాసం దిక్కున్న ఒక ఎంపీటీసీ.. ఆఖరి క్షణంల ఫ్లేటు ఫిరాయించిండు..

మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డి గురించి మీకు ఎర్కేగదా..? ఆయన ఇంట్లకెళ్లి ఎల్కబైటికెల్తె గూడ.. అబ్బా ఎంత సుందరమైన ఎల్క అది..? బ్రహ్మండంగ బైటికెళ్లింది అంటడు.. ఆయన నోటికి పొగుడుడు తప్పితె తిట్టుడు రాదు అసొంటాయిన ఒకదిక్కు.. ఇగ అదే మల్కాజ్ గిరికి ఎమ్మెల్యే మొన్నతుపాకులతోని ఫామౌజుల దందాలు జేస్కుంట మీడియాకు దొర్కిన కనకారెడ్డి ఇంకోదిక్కు ఉండంగ.. మల్కాజ్ గిరి జనం దూపకు సస్తున్నరు..

ఇర్వై రెండు రోజుల సంది దీక్షలు జేస్తుంటె మమ్ములను ఎవ్వలు వట్టిచ్చుకుంటలేరు అంటున్నరు మెప్మా ఉద్యోగులు.. వీళ్ల కథగాకపోతె.. పట్టిచ్చుకునే ప్రభుత్వాన్నే గెలిపిచ్చిండ్రా మీరు..? దొంగోడు దోస్కపోయిండు అంటే.. దొంగోడు అంటెనే వాడు దోస్కపోయెటోడు అన్నట్టుగదా..? కేసీఆర్, కవిత న్యాయం జేస్తలేదంటే.. వాళ్లెట్ల జేస్తరు చెప్పుండ్రి పాపం..

ఇంతపెద్ద మియ్యా దేడ్ పైసా దియ్యా అన్నట్టు.. మన ముఖ్యమంత్రి ఏం జెప్తడు.. ఈ అభివృద్ధిని ఎవ్వడు ఆపుతడో సూస్తా అని గర్జిస్తుంటడు.. ఆడ ఆపెటోడు ఎవ్వడుండు.. ఈననే ఆపేస్తడు.. మన సాలార్ జంగ్ మ్యూజియంల గంటకోపారి గడియారంలకు ఒక పొట్టోడొచ్చి గంట గొట్టిపోతడు సూడు.. అగో సేమ్ ముఖ్యమంత్రిగారు గూడ.. ప్రగతి భవన్ల కెళ్లి గడ్కోపారి బైటికొచ్చి అభివృద్ధి ముచ్చట్లు జెప్పి అవుతల వడ్తడు.. కని నిజమేందంటే.. ఇగో ఇది..

బ్బా జంట అంటే సీతారామా చంద్రుల లెక్క ఉండాలే చిల్కా గోర్రెంకల లెక్కుండాలే అంటుంటరు పెద్దలు గని..? ఒక పెద్దమన్షి జేశిన పనితోని.. జంట అంటే వాళ్లు గాదు.. ఇగో వీళ్ల లెక్కుండాలే అని నిరూపించిండు.. నల్పై ఏండ్ల సంది నాతోని కల్చి బత్కిన భార్య క్యాన్సర్ తోని సచ్చిపోయిందని తన భార్య విగ్రహం బెట్టి పూజలు జేస్తున్నడంటే ఇంత గొప్ప ఆదర్శమన్షి ఏడుంటడు చెప్పుండ్రి..

తిరుమల తిరుపతి ఎంకన్నగుడిని ఓ వారం రోజులు మూశేద్దామనుకున్నరుగదా మొన్న.. ఇగ ఒక భక్తునికి భళే ఉపాయం దట్టింది.. మరి గుడి శుద్ది కింద పనులు జేస్తుంటే గర్భగుడిలున్న స్వామివారు అమ్మవారు ఖాళీగుండి ఏం జేస్తరనుకున్నడో ఏమో.. ఒక కొత్త కారుగొన్కపోయి ఇచ్చిండు.. స్వామీ ఇగ మీకిప్పుడు హాలీడే.. అమ్మవారితోని అట్లట్లవొయ్యిరాపోండ్రి అన్నట్టున్నది ఆ డొనేషన్..

16:42 - July 25, 2018

నిజామాబాద్ : బోధన్ మున్సిపల్ చైర్మన్ ఎల్లయ్యపై 30మంది కౌన్సిలర్లు ఈనెల 4వ తేదీని పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. మున్సిపల్ చైర్మన్ ఎల్లయ్య అభివృద్ధి పనులు చేయకుండా అభివృద్ధిని అడ్డుకుంటున్నారనీ..అవినీతికి పాల్పడుతు నిధులను దుర్వినియోగం చేస్తున్నాడనే ఆరోపణతో 30మంది కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టారు. దీనిపై స్పందించిన కలెక్టర్ అవిశ్వాస తీర్మానంపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అవిశ్వాసం ఎదుర్కొనేక క్రమంలో కోరం లేకపోవటవంతో అవిశ్వాసం వీగిపోయిందని రిటర్నింగ్ అధికారి తెలిపారు. 16మంది కౌన్సిలర్లు ఓటింగ్ కు దూరంగా క్యాంప్ లోనే వుండిపోయారు. దీంతో బలం లేకపోవటంతో ఎల్లయ్యపై అవిశ్వాసం వీగిపోయిన తిరిగి అధికార పార్టీ అభ్యర్థికే చైర్మన్ పదవి దక్కింది. 

11:06 - July 24, 2018

యాదాద్రి భువగిరి : భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్‌పై కౌన్సిలర్లు ఇవాళ అవిశ్వాసం పెట్టనున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్‌ను విధించారు. చైర్‌పర్సన్‌ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని వీడి బీజేపీలో చేరడంతో ఎమ్మెల్యే దీన్ని సవాలుగా తీసుకున్నారు. కొన్ని రోజులగా కౌన్సిలర్లతో క్యాంపు రాజకీయం నిర్వహిస్తూ ఇవాళ అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. మరో వైపు చైర్‌పర్సన్‌ పీఠం చేజారిపోకుండా బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది.

 

11:04 - July 23, 2018

విభజన చట్టం అమలుపై నేడు రాజ్యసభలో స్వల్పకాలిక చర్చ జరుగనుంది. హోంమంత్రి అందుబాటులో లేని కారణంగా చర్చపై సందేహం ఉంది. రాజ్యసభ బిజెనెస్ లోనూ స్వల్ప కాలిక చర్చ అంశం లేదు. రాజ్యసభలో అవిశ్వాసంపై స్వల్పకాలిక చర్చ జరుగుతుందా ? అనే అంశంపై నిర్వహించి చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు నగేష్, కాంగ్రెస్ నేత కార్తీక్ రెడ్డి, వైసీపీ నేత రాజశేఖర్, బీజేపీ నేత ఆర్ డి.విల్సన్, టీడీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పరావు, జనసేన నేత అద్దేపల్లి శ్రీదర్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

09:12 - July 23, 2018

రాజ్యసభలో అవిశ్వాస తీర్మానంపై స్వల్పకాలిక చర్చ జరుగనుంది. రాజ్యసభలో ఓటింగ్ తో కూడిన చర్చ జరగాలని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు లక్ష్మీనారాయణ, వైసీపీ నేత శివశంకర్, బీజేపీ నేత కుమార్, టీడీపీ నేత గన్ని కృష్ణ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

21:26 - July 21, 2018

పార్లమెంట్ల అవిశ్వాసం డ్రామా గెలుపు...ప్రజలను పిచ్చోళ్లను జేశ్న బాబు మోడీ, చంద్రబాబు మీద జేసీ దివాకర్ అవిశ్వాసం..రెండు జాగలళ్ల ఓడిపోయిన చంద్రాలు, ఆటబొమ్మలైతున్న నేరేళ్ల దళిత బాధితులు...కన్నీళ్ల డ్రామా ఆడుతున్న కాంగ్రెస్ పార్టీ, భావ దారిద్ర్యం బత్కుతున్న బహుజనులు...ఎమ్మెల్యే టికెట్ల కోసం నేతల గులాంగిరి, సర్కారు బడిల మేము సద్వలేము...పడిపోయెతందుకు సిద్దమైన పాఠశాల, మీ పిల్లలంత కానిస్టేబుల్ ఉద్యోగాలకు వోండ్రి..
మా బిడ్డెను మాత్రం ఎమ్మెల్యేను జేస్త... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

15:46 - July 21, 2018

ఢిల్లీ : ఏపీకి జరిగిన అన్యాయం తెలియజేసేందుకకే అవిశ్వాసం పెట్టామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈమేరకు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మెజారిటీ వర్సెస్ మొరాలిటీకి మధ్య పోరాటం జరిగిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని మోదీ చాలా సార్లు చెప్పారని గుర్తు చేశారు. ఢిల్లీ చిన్నబోయేలా ఏపీ రాజధానిని నిర్మస్తామన్నారని తెలిపారు. 15 ఏళ్ల తర్వాత తాము అవిశ్వాసం పెట్టామని పేర్కొన్నారు. అవిశ్వాసానికి మద్దతు తెలిపిన పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే ఆనాడు బీజేపీతో కలిశామన్నారు. విభజన హామీలు నెరవేర్చాలని 29 సార్లు ఢిల్లీకి వచ్చామని పేర్కొన్నారు. హోదా విషయంలో 14వ ఆర్థిక సంఘం పేరు చెప్పి తప్పుదోవపట్టిస్తున్నారని పేర్కొన్నారు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే బాధ్యత లేదా? నిలదీశారు. ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తున్న రాయితీలు తమకు ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నించారు. 'నాపై మోదీ చేసిన వ్యాఖ్యలు నన్ను బాధించాయి' అని అన్నారు. 

 

17:27 - July 20, 2018

ఢిల్లీ : ప్రతీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రధాని మోడీ హామీ ఏమైందని సీపీఎం ఎంపీ సలీం ప్రశ్నించారు. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. జీఎస్టీ, నోట్ల రద్దుతో రైతులకు ఎక్కువ నష్టం జరిగిందన్నారు. నాలుగేళ్లలో నిత్యవసర వస్తువుల ధరలు పెరిగాయే తప్ప..పేదలకు ఒరిగిందేమీ లేదన్నారు. దేశంలోని మహిళలు, దళితులు, మైనార్టీలకు భద్రత కల్పించలేని దుస్థితిలో ఉన్నామన్నారు. పెద్దనోట్లు రద్దు చేసి నల్లధనాన్ని అరికడతామన్నారు...ఎంత నల్లధనం అరికట్టారో చెప్పమంటే లెక్కలు లేవంటున్నారని పేర్కొన్నారు. 

 

17:10 - July 20, 2018

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో వాడీవేడీ చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా టీఆర్ ఎస్ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రజల అంచనాలకనుగుణంగా మోడీ ప్రభుత్వం పనిచేయడం లేదని అన్నారు. తెలంగాణలోని 7 మండలాలను అక్రమంగా ఏపీలో కలుపుకున్నారని పేర్కొన్నారు. మోడీపై ఒత్తిడి తెచ్చి చంద్రబాబు ఏడు మండలాలను ఏపీలో కలుపుకున్నారని చెప్పారు. విభజన చట్టాన్ని  సవరించి తమ మండలాలు తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రాజెక్టుల కోసం కేంద్రం నిధులు ఇవ్వాలన్నారు. గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ హామీలను కేంద్రం నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు తీరుతో హైకోర్టు విభజన ఆగిపోయిందన్నారు. హైకోర్టులో మెజార్టీ జడ్డీలు ఏపీకి చెందిన వారే ఉన్నారని తెలిపారు. తాగునీటి కోసం నీతి ఆయోగ్ 19 వేల కోట్లు మంజూరు చేసినా ఇప్పటి వరకు విడుదల కాలేదన్నారు. థర్మల్ విద్యుత్ విషయంలో కేంద్రం ఇంకా సాయం చేయాలన్నారు. తెలంగాణ నుంచి హైడల్ ప్రాజెక్టును కూడా లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ములాయంసింగ్.. 
యూపీ లాంటి రాష్ట్రాల్లో బీజేపీకి ఓటేసిన రైతులే తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని ములాయంసింగ్ తెలిపారు. ఈ ప్రభుత్వ చర్యలతో రైతులు, వ్యాపారులు, యువత ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - అవిశ్వాసం