అరవింద సమేత

12:41 - September 17, 2018

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ ఈ చిత్రం రూపొందుతుండడంతో భారీ అంచనాలు నెలకొన్నయి. ఈ సినిమాలో పలు విశేషాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. చిత్రంలో ఎన్టీఆర్ సిక్్స ప్యాక్ తో కనిపిస్తుండడం అభిమానులను అలరిస్తోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. హారిక, హాసిని క్రియేషన్్స పతాకంపై ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇప్పటికే సినిమాకు సంబంధించిన పోస్టర్లు విడుదలై అలరిస్తున్నాయి. తాజాగా ఓ లిరిక్ సాంగ్ ను కూడా విడుదల చేశారు. చిత్ర టీజర్ కు విశేష స్పందన కూడా వస్తోంది.కానీ చిత్రం షూటింగ్ దశలో ఉండగానే ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ హఠాన్మరణం చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. సినిమా ఆడియో ఈ నెల 20వ తేదీన జరుగనుంది. కానీ వేడుకలా కాకుండా ఆన్ లైన్ లోనే విడుదల చేయనున్నారు. ఈ విషయం చిత్ర యూనిట్ సోషల్ మాధ్యమం ద్వారా తెలియచేసింది. ‘అరవింద సమేత ఆడియో సెప్టెంబర్ 20న నేరుగా మార్కెట్ లోకి విడుదలవుతోంది. అనంతరం ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తారు’ అని వెల్లడించింది. జగపతిబాబు, సునీల్, నాగబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

12:36 - September 11, 2018

టాలీవుడ్ యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్...మాట మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న అరవింద సేమత సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. సినిమాలో ఎన్టీఆర్ ఆరు పలకలతో కనిపించడం అభిమానులను అలరిస్తోంది. ఎన్టీఆర్ సరసన పూజాహెగ్డే నటిస్తోంది. అక్టోబర్ మాసంలో చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. 
తాజాగా చిత్ర యూనిట్ ఆడియో వేడుకపై దృష్టి పెట్టింది. వేడుకకు ముఖ్యఅతిథులు వారేనంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు రానున్నారని ప్రచారం జరిగింది. గతంలో మహేష్ సినిమాకు ఎన్టీఆర్ వెళ్లిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ కూడా హాజరయ్యే అవకాశం ఉందని టాక్. కానీ తాజాగా మరో టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ వస్తారని పుకార్లు షికారు చేస్తున్నాయి. అరవింద సమేతలో బిగ్ బి కీలక పాత్ర పోషించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఇది నిజమా ? కాదా ? అనేది తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. 

12:37 - September 10, 2018

నందమూరి కుటుంబం ఇప్పుడిప్పుడే కొలుకోంటోంది. హరికృష్ణ హఠాన్మరణం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచిన సంగతి తెలిసిందే. ప్రధానంగా జూ.ఎన్టీఆర్ ను తీవ్రంగా కలిచివేసింది. మనస్సులో ఉన్న బాధను దిగమింగుకుని జూ.ఎన్టీఆర్ షూటింగ్ లలో పాల్గొంటున్నారంట. జూ.ఎన్టీఆర్ 'అరవింద సమేత' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా ఈ షూటింగ్ జరుపుకొంటోంది. పంద్రాగస్టును పురస్కరించుకుని మూవీ టీజర్‌ రిలీజైంది.

టీజర్ లో ఎన్టీఆర్ నటన చూసి అభిమానులు ఫిదా అయిపోయారంట. తాజాగా మరో ప్రచార చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందంట. వినాయక చవితి సందర్భంగా ఈ టీజర్ ను విడుదల చేస్తారని టాక్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీలో జగపతిబాబు, నాగబాబులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు సెప్టెంబర్ 20న ఈ మూవీ ఆడియో విడుదల చేయనున్నారు. ఈ మూవీని దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.

15:19 - August 20, 2018

ఓ స్టార్ హీరో.. స్టార్ డైరక్టర్..ఇంత వరకు మనం చూడని క్రేజీ కాంబినేషన్ ఎప్పుడూ తను టచ్ చేయని కొత్త ఎలిమెంట్ ను టచ్ చేశాడు దర్శకుడు. తనకు అలవాటు అయిన సబ్టెక్స్ ను ఇంకా కొత్తగా చూపించడానికి రెడీ అయ్యాడు హీరో.. రీసెంట్ టీజర్ తో అందరికి క్లారిటీ కూడా ఇచ్చారు. యంగ్ టైగర్ 'ఎన్టీఆర్', మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్ శ్రీనివాస్'.. వీరిద్దరి కాంబినేషన్ లో 'అరవింద సమేత' మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అంతకు మందు కొరటాల శివ డైరక్షన్ లో జనతా గ్యారేజ్ లో సాఫ్ట్ గా చెప్పి.. వినకపోతే హార్డ్ వేరు పరితనం చూపించాడు తారక్.. తరువాత కిందటి ఏడాది బాబి దర్శకత్వంలో వచ్చిన 'జై లవకుశ'లోమూడు పాత్రలలో మూడు వేరియేషన్స్ చూపించి అభిమానుల మతిపోగొట్టాడు యంగ్ టైగర్. దాంతో త్వరలో రాబోయే సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

త్రివిక్రమ్, తారక్ కలయికలో 'అరవింద సమేత' టైటిల్ తో వస్తున్న మూవీ టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ ను తెచ్చుకొంటోంది. త్రివిక్రం మొదటిసారిగా యాక్షన్ సెగ్మెంట్ ను టచ్ చేశాడు. జూనియర్ కు ఈ మూవీస్ కొత్త కాకపోయినా.. త్రివిక్రం డైరక్షన్ లో ఈమూవీ సరికొత్తగా ఉండబోతోందంట. టీజర్ లో ఎన్టీఆర్ చాలా కొత్తగా, హ్యాండ్ సమ్ లుక్ తో ఉన్నారు. స్ట్రాంగ్ సీమ డైలాగ్స్ ను న్యూ మాడిలేషన్ తో చెప్పాడు ఎన్టీఆర్. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ 15నిముషాల పాటు సిక్స్ ప్యాక్ ఎక్స్ పోజ్ చేస్తాడని టాక్ వినిపిస్తుంది. 'టెంపర్' మూవీకి అప్పుడే సిక్స్ ప్యాక్ చేసిన తారక్ ఆ మూవీలో సరిగ్గా ఎక్స్ పోజ్ చేయలేకపోయాడు. ఇక 'అరవింద సమేత'లో యాక్షన్ ఎపిసోడ్స్ ఈ మూవీకి హైలెట్స్ అవ్వనున్నాయట. ఇక చాలా రోజుల తరువాత ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు , జగపతి బాబులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. మరి త్రివిక్రమ్ కు ఈ సినిమా కలిసి వస్తుందా ? లేదా ? అనేది చూడాలి. 

Don't Miss

Subscribe to RSS - అరవింద సమేత